31, ఆగస్టు 2013, శనివారం

మనసు మాట్లాడుతుందా? యేమో?


భార్యాభర్తల నడుమ మాటలు తక్కువ అనే అపకీర్తి సమాజంలో వుంది. ఇందులో నిజమెంతో తెలవదు.
మొన్న ఖమ్మం ఓ పెళ్ళికి వెళ్ళి వచ్చాం. గాలి మార్పో, నీటి  మార్పో తెలియదు. తనకు ఒకటే రొంప. ‘ జలుబు వెలగని బలుబు’ అన్నారు ముళ్లపూడి వారు.
ఈరోజు అంటే ఈ రాత్రి ఓ రాత్రివేళ చూస్తే తను పక్కనలేదు. లేచి చూస్తే పూజగదిలో ఓ దుప్పటి కప్పుకుని పడుకుని వుంది.
పొద్దున్నే నేను ఓ ఛానల్ కు వెళ్ళాలి. పక్కన పడుకుంటే జలుబు అంటుకుంటుందేమో అని ఆలోచించి ఈ పని చేసి వుంటుంది.
మనసుతో మాట్లాడ్డం అంటే ఇదేనేమో! (31-08-2013)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ఒక్కో సమయంలో వెచ్చటి స్పర్శ,మనసు మాటాడినట్లు మాట చెప్పలేదు