28, నవంబర్ 2018, బుధవారం
KSR Live Show: మోడీ - కేసీఆర్ మధ్య పేలిన మాటల తూటాలు - 28th November 2018
ఈరోజు బుధవారం ఉదయం సాక్షి KSR Live Show చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ ప్రకాష్ రెడ్డి (టీబీజేపీ), శ్రీ నరేష్ (టీఆర్ఎస్), శ్రీ రామ్మోహన్ రెడ్డి (టీ కాంగ్రెస్)
27, నవంబర్ 2018, మంగళవారం
Discussion on KCR targets Chandrababu in Public Meetings | Telangana | K...
సోమవారం రాత్రి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ నర్సయ్య గౌడ్ (టీఆర్ఎస్ ఎంపీ), శ్రీ కే. రామమోహనరావు (టీడీపీ మాజీ ఎంపీ), శ్రీ శ్రిశాంక్ (టీకాంగ్రెస్). ఏబీఎన్ యాంకర్ : Ms. కవిత
26, నవంబర్ 2018, సోమవారం
Will TRS Get Public Support Day by Day in Telangana? | The Debate with V...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 News Channel The Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ దుర్గాప్రసాద్ ((టీడీపీ), శ్రీ రామచంద్రారెడ్డి (కాంగ్రెస్), శ్రీ పీఎల్ శ్రీనివాస్ (టీఆర్ఎస్). శ్రీ ప్రభాకర్ (బీజేపీ, ఫోన్ లైన్లో)
Why CM KCR Neglecting Akbaruddin Owaisi Comments on CM? | The Debate wit...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 News Channel The Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ దుర్గాప్రసాద్ ((టీడీపీ), శ్రీ రామచంద్రారెడ్డి (కాంగ్రెస్), శ్రీ పీఎల్ శ్రీనివాస్ (టీఆర్ఎస్). శ్రీ ప్రభాకర్ (బీజేపీ, ఫోన్ లైన్లో).
Why CM KCR and Minister KTR Use Lion Dialogues in Election Campaign? | T...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 News Channel The Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ దుర్గాప్రసాద్ ((టీడీపీ), శ్రీ రామచంద్రారెడ్డి (కాంగ్రెస్), శ్రీ పీఎల్ శ్రీనివాస్ (టీఆర్ఎస్). శ్రీ ప్రభాకర్ (బీజేపీ).
25, నవంబర్ 2018, ఆదివారం
సీట్ల కేటాయింపులో ‘వెనుకబడిన’ తరగతులు – భండారు శ్రీనివాసరావు
(PUBLISHED IN ‘SURYA’ TELUGU DAILY ON 25-11-2018, SUNDAY)
నేను ఈ తరగతులకు చెందినవాడిని కాను.
కానీ ఈ మాట చెప్పడానికి నేను వెనుకంజ వేయడం లేదు.
ప్రస్తుతం తెలంగాణాలో జరుగుతున్న
అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా వెనుకబడిన తరగతులకు పూర్తి న్యాయంచేసిన దాఖలా
కనబడడం లేదు. ఎన్నికలకు ముందు ప్రతిసారీ ప్రముఖంగా వినబడే ‘వెనుకబడిన తరగతులు’ అనే
పదం ఎన్నికలు కాగానే మరపున పడడం కొత్త విషయం ఏమీ కాదు. రాజకీయాల్లో కొత్తగా
ప్రవేశించిన ‘గెలుపు గుర్రాలు’ అనే ఓ కొత్త పదం ఈ పాత పదాన్ని మరింత వెనక్కి
నెట్టింది.
ఈ రోజుల్లో అన్ని రాజకీయ పార్టీల
వాళ్ళు నీటి వాలుకు, గాలి వాటానికి అనుగుణంగానే పడవ నడపడం ఒక విధానంగా
మలచుకున్నారు. నాయకులు ఈ విషయం బయటకి చెప్పుకోవడానికి కూడా భేషజం ప్రదర్శించడం
లేదు. పైపెచ్చు ‘మాది రాజకీయ పార్టీ, సత్రాలు, మఠాలు కావు’ అని బాహాటంగానే సన్నాయి
నొక్కులు నొక్కుతున్నారు.
మారిన పరిస్తితులకు అనుగుణంగా పార్టీలు
కూడా ఎంతోకొంత సర్దుబాట్లు చేసుకోవడం అనేది కొత్తేమీ కాదు. ఏం చేసినా, ఏం చెప్పినా
చిట్టచివరకు గెలుపు ఒక్కటే పరమావధి
అయినప్పుడు, ఆ విజయానికి, తద్వారా లభించే అధికారానికి దూరమై భారంగా గడపడం కంటే ఏదో
ఒకటి చేసి నెగ్గడం అనేది ముఖ్యమైపోయింది. సమాజంలోని అన్నివర్గాలకు న్యాయం చేయాలనే
అన్ని పార్టీలకు వుంటుంది. అలా చేయాలంటే ముందు అధికార పీఠం అధిరోహించాలి కదా!
ఇదిగో! ఈ మిషతోనే అన్ని పార్టీలవాళ్ళు ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చే విషయంలో ‘గెలవగలిగిన సత్తా’
ఒక్కటే ప్రధాన అర్హతగా ఎంచుకుని అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నారు. అంచేతే,
సంఖ్యాబలం కలిగివున్న ‘వెనుకబడిన తరగతుల వాళ్ళు, ఇతర బలహీనవర్గాల వాళ్ళు’ ఎన్నికల
పరుగు పందెంలో వెనుకబడిపోతున్నారు. ఎస్సీ,
ఎస్టీలకురాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్ల పుణ్యమా అని వారి వాటా వారికి ఇవ్వక
తప్పని పరిస్తితి. హక్కుగా ఆ అర్హత లేని వెనుకబడిన తరగతుల వాళ్ళు నోరు విప్పలేని
పరిస్తితి. అలా అని రాజకీయ పార్టీలు వెనుకబడిన తరగతులకు అసలు సీట్లు ఇవ్వకుండా
మొహం చాటేయడం లేదు. సరైన అభ్యర్ధులు దొరకని చోట్లా, కాస్త ఆర్ధికంగా
నిలదొక్కుకున్న బీసీ అభ్యర్ధులు లభించిన చోట్లా ఖాళీలను పూరించినట్టు భర్తీ
చేస్తూనే వున్నారు. ఆ పని చేసి మేము ఇతరులకంటే బీసీలకు ఈ విషయంలో ఎక్కువ న్యాయం
చేస్తున్నామని ప్రకటించుకుంటున్నారు.
వచ్చే నెలలో తెలంగాణా నూతన రాష్ట్రంలో
తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొన్న గురువారంతో నామినేషన్ల ఉపసంహరణ
తంతు పూర్తయింది. రాష్ట్రంలోని నూట పందొమ్మిది స్థానాల్లో ఏ పార్టీ అభ్యర్ధులు
ఎక్కడ పోటీ చేస్తున్నారనే విషయంలో ఒక స్పష్టత వచ్చింది.
స్థూలంగా జాబితాలను పరికించినవారికి
మళ్ళీ ఈఎన్నికల్లో కూడా అగ్రవర్ణాలకు అగ్రతాంబూలమే ఇచ్చినట్టు కనబడుతోంది. వారికి
ఇవ్వడాన్ని ఎవ్వరూ తప్పుపట్టరు. బీసీలకి ఈసారయినా జరగాల్సిన న్యాయం జరిగిందా లేదా
అనేదే ప్రశ్న. జరగలేదని చెప్పడానికి పెద్దగా కష్టపడనక్కరలేదు.
ముందు పాలక పక్షం టీఆర్ఎస్ ని
తీసుకుంటే ఆ పార్టీ ఎవ్వరితో పొత్తు లేకుండా మొత్తం నూట పందొమ్మిది స్థానాల్లో
పోటీపడుతోంది. అందులో 26 బీసీలకు కేటాయించింది. కేంద్రంలో పాలక
పక్షం అయిన బీజేపీ, మొత్తం అన్ని స్థానాలకు పోటీచేస్తూ వాటిల్లో 32 స్థానాలు బీసీలకు ఇచ్చింది. మహాకూటమి పొత్తులో భాగంగా
తమకు లభించిన 99 సీట్లకుగాను, కాంగ్రెస్ పార్టీ 24 స్థానాల్లో బీసీ
అభ్యర్ధులను నిలబెట్టింది. 13 సీట్లు లభించిన
తెలుగుదేశం పార్టీ మూడింటిని బీసీలకు వదిలింది. కాగా, టీజేఎస్ తనకు దక్కిన 8 సీట్లలో రెండు
సీట్లలో బీసీ అభ్యర్ధులను ప్రకటించింది. మహాకూటమిలో
మరో భాగస్వామి అయిన సీపీఐకి బీసీల విషయంలో గడ్డు పరీక్ష ఎదురయింది. తన భాగానికి
వచ్చిన మూడు సీట్లలో రెండు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కిందకు పోయాయి. మిగిలింది
ఒక్క జనరల్ సీటు. ఈ ఎన్నికల్లో తలపడుతున్న తమ పార్టీ రాష్ట్ర నాయకుడికి ఆ సీటు
ఇవ్వక తప్పని పరిస్తితి. అదే చేసింది.
పొతే,
మరోకూటమి బీఎల్ఎఫ్ 109 స్థానాల్లో పోటీచేస్తూ ఏకంగా 58
సీట్లలో
బీసీ అభ్యర్ధులను నిలబెట్టింది. ఈ కూటమి బీసీలకు తగిన ప్రాతినిధ్యం
కల్పించిన మాట వాస్తవమే. వారు గెలిచి శాసన
సభలో అడుగు పెట్టగలిగితే చట్ట సభలో వెనుకబడిన తరగతుల ప్రాతినిధ్యం గణనీయంగా
పెరుగుతుంది.
ఇక అగ్రవర్ణాలకు పెద్ద పీట వేసిన
పార్టీల్లో టీఆర్ఎస్ 59 సీట్లతో అగ్రస్థానంలో వుండగా, 50
సీట్లతో బీజేపీ రెండో స్థానంలో, 41 సీట్లతో కాంగ్రెస్ మూడో స్థానంలో వుంది. టీడీపీ తనకు దక్కిన 13 సీట్లలో ఏడింటిని అగ్రవర్ణాలకే
కట్టబెట్టింది. బీఎల్ ఎఫ్ కూటమి తాను పోటీ చేసే 109 స్థానాల్లో 51 సీట్లని అగ్రవర్ణాలకి కేటాయించింది. మిగిలిన పార్టీలు పోటీ చేసే
స్థానాలే రెండంకెల సంఖ్య దాటే పరిస్తితిలేదు కనుక వాటిని పరిగణనలోకి తీసుకోనవసరం
లేదు.
ఆర్ధిక, సామాజిక కోణంలోనే కాదు మొత్తం
మానవ సమాజంలో మానసికంగా బలవంతులయినప్పటికీ, శారీరకంగా బలహీన వర్గం అయిన మహిళలకు ఈసారి
కూడా ఆయా పార్టీలు పెద్దగా ప్రాతినిధ్యం
కల్పించిన దాఖలా కనబడడం లేదు. అన్ని పార్టీలు కలిసి ఆడవారికి ఇచ్చిన సీట్లు 43
అంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇందులో టీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 11, టీడీపీ 1, టీజేఎస్ 1, సీపీఐ 1, బీజేపీ 15, బీఎల్ఎఫ్ 10 స్థానాలు స్త్రీలకు కేటాయించాయి. ఆకాశంలో సగం అనే నినాదాన్ని ప్రకటనలకే సరిపుచ్చినట్టయింది.
అన్ని పార్టీలకి సీట్ల లెక్కలు తేలాయి.
తిరుగుబాటు అభ్యర్ధుల బెడదను లాలించో, బుజ్జగించో చాలావరకు తగ్గించుకున్నాయి.
నామినేషన్ల ఉపసంహరణ గడువు అనంతరం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు కలిపి మొత్తం 1825
మంది బరిలో మిగిలారు. వీరిలో అధికులు
ఇండిపెండెంటు అభ్యర్ధులు.
చూస్తుండగానే పోలింగు ఘడియ దగ్గర
పడుతోంది. ప్రచారానికి మిగిలిన వ్యవధి కూడా కొద్ది రోజుల్లోకి వచ్చింది.
అందరికంటే ముందుగా అభ్యర్ధులను
ప్రకటించిన అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది. కేసీఆర్ బహిరంగ
సభలతో, కేటీఆర్ రోడ్డు షోలతో బిజీగావున్నారు. టిక్కెట్టు విషయంలో భరోసా కలిగిన మహాకూటమి
నాయకులు కూడా వారి వారి నియోజకవర్గాల్లో ప్రచారానికి తెర లేపారు.
యూపీయే చైర్ పర్సన్, కాంగ్రెస్
అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి గత శుక్రవారం నాడు మేడ్చల్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించి తమ ఉపన్యాసాలతో పార్టీ
శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. మహాకూటమిలో తొలుత సీట్ల
సర్దుబాట్ల విషయంలో బయల్పడిన అనేక కీచులాటల కారణంగా ఒకింత మసకబారిన కూటమి నిబద్ధత
నేపధ్యంలో, మేడ్చల్ సభ ఒక ఎనర్జీ టానిక్ లా కూటమి నేతలకు ఊరట కలిగించివుంటుంది.
దుమ్ము రేగినప్పుడు దానిని అణచడానికి నీళ్ళతో కళ్ళాపి చల్లినట్టు ఈ మహాసభ, మహా కూటమిలో ఏర్పడ్డ లుకలుకలను ఒక మేరకు కమ్మేసింది.
సోనియా గాంధి చేసిన క్లుప్త ప్రసంగం హుందాగా సాగింది. తెలంగాణా తానే ఇచ్చినట్టు
గొప్పలకు పోకుండా ఆ ఖ్యాతిని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ
ఖాతాలోకి జమచేస్తూ అటు హుందాతనాన్ని, ఇటు రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించడం ఆమె
ప్రసంగంలో ప్రత్యేక ఆకర్షణ. నిజానికి తెలంగాణ రాష్ట్రము ఇచ్చే విషయంలో నాడు జరిగిన
అనేక మంతనాల్లో రాహుల్ గాంధి కీలక పాత్ర ఏమీ లేదన్న విషయం తెలిసి కూడా పార్టీ
పగ్గాలు మోస్తున్నది రాహుల్ కాబట్టి సోనియా ఆయన పేరును ఈ సందర్భంలో ప్రస్తావించడానికి కారణం
అయివుంటుంది. తన అత్తగారయిన ఇందిరా గాంధి మాదిరిగానే, ‘తల్లి’ సెంటుమెంటు
అస్త్రాన్ని సోనియా ఈ సభలో ప్రయోగించారు.’ తెలంగాణా నా బిడ్డ, కొత్త రాష్ట్రంలో తమ
బంగారు భవిష్యత్తు పట్ల ప్రజలు పెంచుకున్నఆకాంక్షలను నెరవేరుస్తామని చెబుతూనే,
ఇక్కడి పరిస్తితులను చూసి తల్లిగా తాను తల్లడిల్లి పోతున్నానని చెప్పడం సెంటిమెంటు
వ్యూహంలో భాగమే అని పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణా గడ్డపై జరిగిన సభలో ఆంద్ర ప్రదేశ్ కు
ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి వుందని ప్రకటించడం వెనుక రాజకీయ వ్యూహం దాగుందని మరి కొందరు
విశ్లేషిస్తున్నారు. కేంద్రంలో బీజేపీకి ప్రత్యేకించి మోడీ నాయకత్వానికి
వ్యతిరేకంగా రానున్న లోక సభ ఎన్నికల నాటికి కూటమి ఏర్పాటు ప్రయత్నాలను
మెరుగుపరచడానికి బహుశా ఈ ప్రస్తావన చేసి ఉండవచ్చు. తెలంగాణా ఎన్నికల ఫలితాల
ప్రభావం అటు సార్వత్రిక ఎన్నికల మీదా, ఇటు ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల
మీదా పడే అవకాశం ఉన్న రీత్యా ఈ ముందు జాగ్రత్త ప్రకటన చేయడానికి కారణం కావచ్చు. ఏపీకి ప్రత్యేక హోదా
విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధి ఇచ్చిన హామీకి మరింత
ఊతం కల్పిస్తూ యూపీఏ అధినేత్రి సోనియా ఈ మాటలు చెప్పడం వల్ల రానున్న ఏపీ ఎన్నికల్లో తమ పార్టీకి లాభించే వీలుందని
కాంగ్రెస్ వ్యూహకర్తలు భావించి ఉండవచ్చు. అయితే తెలంగాణా ఎన్నికల ప్రచారంలో ఈ
ప్రస్తావన తేవడం టీకాంగ్రెస్ వర్గాలకు మింగుడుపడడం కష్టమే. సోనియా ప్రకటనపై
ఇప్పటికే సోషల్ మీడియాలో తెలంగాణా వాదులు నిరసన వ్యక్తం చేయడం మొదలయింది కూడా.
ఇక అసలు విషయానికి వస్తే, కాంగ్రెస్ అధినాయకులు చాలామంది హస్తిన నుంచి
తరలి వచ్చి హైదరాబాదులోనే మకాం పెట్టారు. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్
గాంధీతో కలిసి టీడీపీ నేషనల్ ప్రెసిడెంట్ చంద్రబాబునాయుడు ఈనెల 28, 29 తేదీల్లో ఖమ్మం, మహబూబ్ నగర్ లలో నిర్వహించే రోడ్డు షోలలో పాల్గొంటారని
మీడియా వార్తలు తెలుపుతున్నాయి.
పొతే, తెలంగాణాలో ఎన్నికల సమరానికి
పార్టీలన్నీ సమాయత్తం అయ్యాయి. దేశంలో ఇరవైతొమ్మిదో రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణా
గడ్డపై మొదటిసారి జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఓటర్లు స్వేచ్చగా ప్రశాంతంగా తమ ఓటు హక్కు వినియోగించుకునే
విధంగా అన్ని పార్టీలు సహకరిస్తే రాజ్యాంగ బద్దమైన విద్యుక్త ధర్మాన్ని పాటించిన గౌరవం వాటికి దక్కుతుంది.
24, నవంబర్ 2018, శనివారం
Discussion on Sonia Gandhi And Rahul Gandhi Medchal Bahiranga Sabha | Pu...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ABN Andhra Jyothy Public Point ముఖాముఖి చర్చాకార్యక్రమంలో యాంకర్ శ్రీ పవన్ దాచరాజుతో నేను....
23, నవంబర్ 2018, శుక్రవారం
Damn Sure TRS Will Definitely Win In Telangana | TRS Ravinder Reddy | #S...
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజుఉదయం మహా న్యూస్ 'అజిత' సన్ రైజ్ షో చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ మానవతా రాయ్ (టీ కాంగ్రెస్), శ్రీ రవీంద్ర రెడ్డి (టీఆర్ఎస్), శ్రీ అద్దేపల్లి శ్రీధర్ (జనసేన)
Telangana Congress Bahiranga Sabha InFluence On Voters | Analyst Bandari...
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజుఉదయం మహా న్యూస్ 'అజిత' సన్ రైజ్ షో చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ మానవతా రాయ్ (టీ కాంగ్రెస్), శ్రీ రవీంద్ర రెడ్డి (టీఆర్ఎస్), శ్రీ అద్దేపల్లి శ్రీధర్ (జనసేన)
20, నవంబర్ 2018, మంగళవారం
Discussion | Manish Kumar Sinha claims suggest illegal CBI intercepts un...
ఈరోజు మంగళవారం రాత్రి ABN Andhra Jyothy చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ కుటుంబరావు ( వైస్ చైర్మన్, ఏపీ ప్రనాలికామండలి, అమరావతి నుంచి), శ్రీ విష్ణువర్ధన రెడ్డి ( వైస్ చైర్మన్, జాతీయ నెహ్రూ యువక కేంద్రం, బీజేపీ, ఢిల్లీ నుంచి), శ్రీ రామశర్మ ( ఏపీ కాంగ్రెస్), ABN యాంఖర్ : రూప.
కదిలిన కందిరీగ తుట్టె – భండారు శ్రీనివాసరావు
(Published in SURYA telugu daily in it’s edit page, SUNDAY, 18-11-18)
“సీబీఐ కి భయపడే మనిషిని కాదు. అది కేంద్ర ప్రభుత్వం అధీనంలో పనిచేసే కీలుబొమ్మ సంస్థ. ఆ బూచిని చూపి బెదిరించాలంటే నాతో కుదరదు. జాగ్రత్త!”
ఈ మాటలు అన్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకుంటే పొరబాటు పడ్డట్టే. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, అచ్చం ఇలాగే కాకపోయినా ఇదే అర్ధం వచ్చేట్టు మాట్లాడారు. అప్పట్లో ఆయన గోద్రా మారణ హోమం వంటి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.
మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత చంద్రబాబునాయుడు కూడా కేంద్రానికి వ్యతిరేకంగా ‘ జాతిని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి’ అంటూ మొదలుపెట్టిన ఉద్యమానికి ఊతం ఇస్తూ ఒకనాడు మోడీ మహాశయులు చెప్పిన మాటలనే తిరిగి వల్లె వేస్తున్నారు.
దీన్నిబట్టి సామాన్యుడికి అర్ధం అయ్యేది ఏమిటంటే కేంద్రంలో అధికారంలో వున్నప్పుడు ఒకరకంగా, లేనప్పుడు మరో రకంగా, కేంద్రంతో రాష్ట్రాల సంబంధాలు బాగున్నప్పుడు ఒక రకంగా, చిట్లిపోయినప్పుడు ఇంకోరకంగా రాజకీయ నాయకులు తమ నాలుకలను మడతవేసి మాట్లాడతారని.
ఈఏడాది మార్చి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త మార్గం పట్టాయి. అప్పటివరకు నాలుగేళ్ళుగా అధికార తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రత్యర్ధి ఒక్క వై ఎస్ ఆర్ సీపీ మాత్రమే. ఇప్పుడు దానికి తోడుగా బీజేపీ కలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీకి మిత్రపక్షం అంటూ లేకుండా పోయింది, అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్ ను మినహాయిస్తే.
1994 చివర్లో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన దాదిగా ఒకేసారి అన్ని వైపుల నుంచి ఎదురయ్యే రాజకీయ ప్రత్యర్ధి శిబిరాలతో పోరాడాల్సి వచ్చిన సందర్భం చంద్రబాబునాయుడుకు ఎదురు కాలేదు. అటు కేంద్రంతో కయ్యం. ఇటు అనుక్షణం కయ్యానికి కాలుదువ్వడానికి అవకాశం కోసం ఎదురు చూసే ప్రధాన ప్రత్యర్ధి వైసీపీ. మరో వైపు చీటికీ మాటికీ చీకాకు పెడుతున్న పవన్ కళ్యాణ్ జనసేన.
2014 లో అధికారంలోకి వచ్చినప్పుడు మిత్రులుగా వున్నవాళ్ళందరూ ఈ నాలుగేళ్ల కాలంలోనే ప్రత్యర్దులుగా రూపాంతరం చెందారు. రాజకీయాల్లో ఇలాంటివి సహజమే అని సరిపుచ్చుకున్నా చంద్రబాబుకు ఇది సరికొత్త అనుభవం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొలి పర్యాయం ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, తదుపరి ఎన్నికల్లో గెలిచి మరోమారు ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబుకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలతో చక్కని సయోధ్య వుండేది. వాజ్ పాయ్ ప్రధానిగా వున్నప్పుడు బాబు మాటకు తిరుగుండేది కాదు. ఢిల్లీ వెళ్ళాల్సిన పనిలేకుండానే కావాల్సిన పనులన్నీ నోటిమాటతో హైదరాబాదు నుంచే చక్కబెట్టుకోగల్గిన పరిస్తితి వుండేది. టీడీపీ వ్యవస్థాపకుడు, ఆ పార్టీ మొదటి ముఖ్యమంత్రి కీర్తిశేషులు ఎన్టీ రామారావుకు కూడా ఈ వైభోగం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా వున్నన్నాళ్ళూ తాను కలలో సయితం వ్యతిరేకిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వుండడం చేత ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వాటిని ఎదుర్కోవడానికి రకరకాల రాజకీయ పోరాటాలు చేయాల్సి వచ్చింది. నేషనల్ ఫ్రంట్ నాయకుడిగా వున్నప్పుడు కేంద్రంలో ఆ కూటమి అధికారంలోకి రాగలిగింది కానీ, దురదృష్టం రాష్ట్రంలో టీడీపీ అధికారానికి దూరం అయ్యింది. దీనికి పూర్తి విరుద్ధ రాజకీయ పరిస్తితులు చంద్రబాబుకు కలిసి వచ్చాయి. తద్వారా జాతీయ స్థాయిలో చక్రం తిప్పగల ప్రతిభావంతుడనే కితాబు ఆయన ఖాతాలో చేరింది.
ఉమ్మడి రాష్ట్రం చివరాఖరు కాలంలో సుమారు తొమ్మిదిన్నరేళ్ళ పాటు అధికారానికి దూరమై, పార్టీని కాపాడుకుకునే క్రమంలో అనేక ఆటుపోట్లు ఎదురుకున్న చంద్రబాబుకు రాష్ట్ర విభజన అంశం కూడా అనుకోకుండా కలిసివచ్చింది. విడివడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో సమర్ధుడని సంపాదించుకున్న మంచి పేరు మరోసారి కలిసివచ్చి మరోమారు ముఖ్యమంత్రి కాగలిగారు. అప్పట్లో దేశ వ్యాప్తంగా వెలుగులు విరజిమ్మిన మోడీ ప్రభావం, అప్పుడే కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి నేరుగా దిగకుండా అందించిన స్నేహహస్తం, ఆయన వ్యక్తిగత ఆకర్షణ, ఇవి సయితం, చేజారిపోతుందేమో అని ఒక దశలో సందేహపడ్డ రాజకీయ అధికారం ఆయన చేతికి అందేలా తోడ్పడిన మాట కూడా నిజం.
రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్తితులు ఊహించలేనంత వేగంతో మారిపోవడం మొదలయింది. కేంద్రంలో కుదురుకున్న భారతీయ జనతా పార్టీ చూపు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పాగా వేయడం వైపు మళ్ళింది. రాష్ట్రంలో దొరికిన అధికారాన్ని పదిలపరచుకుని శాశ్వతం చేసుకునే దిక్కుగా తెలుగుదేశం రాజకీయ వ్యూహాలు మొదలయ్యాయి.
రాజకీయ స్నేహాలకు కూడా ఒక పరిమితి వుంది. అధికారం దక్కేవరకు, స్వప్రయోజానాలు దెబ్బ తిననంతవరకు ఆ స్నేహాలు చెక్కుచెదరకుండా వుంటాయి. అధికారం ఒకసారి చేతికి దొరికిన తర్వాత తామే సర్వంసహా పరిపాలకులు కావాలనే దుగ్ధ మొదలవుతుంది. అది స్నేహానికి చీడ పురుగుగా తయారవుతుంది. మామూలుగా చంద్రబాబు కావాలని ఎవరితో పేచీ పెట్టుకునే మనిషి కాదు. మనసులోనే దాచుకుని అనువయిన సమయం వచ్చినప్పుడు ఎదురుదెబ్బ తీయాలని ఆలోచించే చాణక్య నీతిని వొంటబట్టించుకున్న రాజకీయ దురంధరుడు. అందుకే మొదటి నాలుగేళ్ళు మిన్నకుండిపోయి, కేంద్రమే రాష్ట్రానికి అన్యాయం చేస్తోందనే భావాన్ని ప్రబలనిచ్చి, రాష్ట్ర ప్రయోజనాలకోసమే తాను కేంద్రంపై యుద్ధం చేస్తున్నాడనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించి ఆ తర్వాతనే తన ప్రణాళికను కట్టుదిట్టంగా అమలుచేసినట్టు కానవస్తోంది. అందులో బాగమే ఇప్పుడు తాజాగా రగిలించిన సీబీఐ వివాదం.
సీబీఐ వంటి ఉన్నత దర్యాప్తు సంస్థల పనితీరు మీద సామాన్య జనంలో కంటే రాజకీయ వర్గాలలోనే ఎక్కువ భయసందేహాలు వున్నాయి. ఎందుకంటే దర్యాప్తు సంస్థలను గురించి సామాన్యులు భయపడే అవసరం వుండదు. సమాజంలోని బడాబడా వర్గాల వ్యవహారాలపైనే ఆ సంస్థలు ఓ కన్ను వేసి ఉంచుతాయి. దీనికి తగ్గట్టు రాజకీయ ప్రత్యర్ధులపై సీబీఐ అస్త్రాన్ని కేంద్రంలో అధికారంలో వున్న పార్టీలు ప్రయోగించడం అనేది కొత్త విషయమూ కాదు. ఇది తెలిసిన వాళ్ళు కనుకనే రాజకీయ నాయకులు సీబీఐ ప్రస్తావన వచ్చినప్పుడల్లా అప్పటి తమ రాజకీయ అవసరాలకు తగ్గట్టుగా వ్యాఖ్యానాలు చేస్తుంటారు. దీనికి ఉదాహరణే ముందు ప్రస్తావించిన మోడీ మాటలు, చంద్రబాబు తాజాగా ప్రయోగించిన జీవో అస్త్రం.
ఈ జీవో పై మిశ్రమ స్పందనలు వెలువడుతున్నాయి. ఏపీ లోని రాజకీయ పార్టీలు తమ తాజా విధానాలకు తగ్గట్టుగా విషయాన్ని అన్వయించుకుని భాష్యాలు చెబుతున్నాయి. ఏపీలో సీబీఐకి ‘నో ఎంట్రీ’ అంటూ వెలువడిన వార్తలు సంచలనం సృష్టించాయి. మరి రాష్ట్రాలలో కేంద్ర ఉద్యోగుల అవినీతి కేసులను ఎవరు చూడాలి అనే ప్రశ్నకు ఈ జీవోను సమర్ధిస్తున్న వర్గాలే సమాధానం చెబుతున్నాయి. కేంద్ర సిబ్బంది అవినీతి అక్రమాలు కనిపెట్టే బాధ్యత కేవలం సీబీఐకి మాత్రమే దఖలు పరచినట్టు చట్టంలో ఎక్కడా లేదని, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అవినీతి నిరోధక శాఖ కూడా ఈ పని చేయవచ్చనీ ఆ వర్గాల వాదన. బీజేపీ పాలనలో ఉన్న మహారాష్ట్ర, చత్తీస్ ఘర్, హరియాణా తో సహా పందొమ్మిది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అనుసరిస్తున్న విధానమే అమల్లో వుందని నొక్కిచెబుతున్నారు. మెజారిటీ రాష్ట్రాల్లో వున్న పద్ధతినే ఆంధ్రప్రదేశ్ ఎంచుకున్నప్పుడు అభ్యంతరం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
అయితే ఇన్ని వివరణలు ఇస్తున్న ఈ వర్గాలు జవాబు చెప్పాల్సిన ప్రశ్న ఒకటుంది. అది ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎంచుకున్న సమయం. ఆంధ్రాలో ఇటీవల ఐటీ దాడులు జరిగినప్పుడు, తెలుగుదేశం పార్టీవాళ్లు ఇదే ప్రశ్న లేవనెత్తారు. టీడీపీ ఎన్డీయే తో కలిసివున్నప్పుడు జరగని దాడులు, సంబంధాలు తెగతెంపులు చేసుకున్న తర్వాతనే ఎందుకు జరుగుతున్నాయని వాళ్ళు సంధించిన ప్రశ్న గుర్తుండే వుంటుంది.
సీబీఐ పరిధి గురించి మూడు మాసాల క్రితం సార్వత్రిక అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ కొద్ది రోజుల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకోవడానికి దారి తీసిన పరిస్తితులు ఏమిటన్నది జీవో గురించి సందేహాలు వ్యక్తం చేస్తున్న వాళ్ళు వేస్తున్న ప్రశ్న. వీళ్ళూ వాళ్ళూ చేస్తున్న ఆరోపణలు, వేస్తున్న ప్రశ్నలు రాజకీయ ప్రేరేపితం కాబట్టి దానిమీద చర్చించి ప్రయోజనం వుండదు.
ప్రత్యర్ధుల పీచమణచడానికి, రాజకీయ ప్రయోజనాలను పొందడానికి వాడుకుంటూ తన అధీనంలోని సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందనే వాదన ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. గతంలో యూపీఏ అధికారంలో వున్నప్పుడు ఇదే మాట ప్రతిపక్షం నోట వినబడింది. ఇప్పుడు అదే బాణీ ప్రతిపక్షంగా మారిన మిత్ర పక్షం నుంచి వినబడుతోంది. మళ్ళీ ఎన్నికల్లో పాత్రలు తారుమారయితే ఇదే తంతు కొనసాగుతుంది.
‘ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. దేశాన్ని కాపాడాలి’ అనే నినాదంతో విభేదించేవాళ్ళు ఎవ్వరూ వుండరు. అయితే జనం కాపాడాల్సింది ఈ నినాదాలు ఇస్తున్న నాయకులనా, దేశాన్నా అనే దగ్గరే సందేహాలు పొటమరిస్తున్నాయి. ఎందుకంటే గతంలోకి చూస్తే ఏఒక్క రాజకీయ పార్టీ కూడా అధికారం దఖలు పడిన తర్వాత చెప్పిన మాటని నిలబెట్టుకున్న దాఖలా లేదు.
భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన బాబా సాహెబ్ అంబేద్కర్ వంటి దూరదృష్టి కలిగిన వెనుకటి తరం నేతలు, తమతో ఏమాత్రం పోల్చలేని రాజకీయ నాయకులు తమ తరవాతి తరంలో పుట్టుకొస్తారని ఎంతమాత్రం ఊహించి వుండరు. అంచేతే కేంద్ర, రాష్ట్ర సంబంధాలను నిర్వచించే విషయంలో విశాల దృక్పధాన్ని ప్రదర్శించారు. రాజ్యాంగంలో పొందుపరచిన వ్యవస్థలన్నీ తమ పరిధుల్లో వ్యవహరిస్తూ, ఇతర వ్యవస్థల వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకోబోవు అనే నమ్మకంతో రాజ్యాంగాన్ని తయారు చేసివుంటారు.
ఇప్పుడు పరిస్తితి తద్విరుద్ధంగా ఉంటోంది. అలనాటి ఆ మహా నాయకులు ఆశించిన స్థాయిలో ఈనాటి రాజకీయ నాయకులు లేరన్నది నిర్వివాదాంశం. ప్రజలు తమకు కట్టబెట్టిన అధికారం శాశ్వతం అని భ్రమించేవాళ్ళూ, ఆ భ్రమల్లో కూరుకుపోయి ఆ అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలని ఆరాటపడే వాళ్ళు ఈ రోజు రాజకీయ రంగాన్ని ఏలుతున్నారు. ప్రతిదీ తమ కనుసన్నల్లో, తాము కోరుకున్నట్టు జరగాలని శాసిస్తున్నారు. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రం అనే తేడా లేదు. ఎవరికి వారు తమ అధీనంలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థలను, యంత్రాంగాలను తమ ఇచ్చవచ్చిన రీతిలో అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తమ ప్రయోజనాలకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా భంగం వాటిల్లినా సరే, దాని దుష్ప్రభావాన్ని ఎదుటివారి మీదకు నెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు.
అంతరిక్షంలో వేలాది గ్రహాలు కళ్ళు తిరిగిపోయే వేగంతో తమ నిర్ణీత కక్ష్యల్లో పరిభ్రమిస్తుంటాయని సైన్సు చెబుతుంది. ఏ ఒక్క గ్రహమూ తన నిర్ణీత కక్ష్యను దాటి రావడం అంటూ జరగదు. జరిగితే అది విశ్వ వినాశనమే. అయినా అన్ని గ్రహాలు గతి తప్పకుండా భ్రమిస్తుంటాయి.
రాజ్యాంగ వ్యవస్థలు కూడా అలాగే గతి తప్పకూడదు. తప్పితే రాజ్యాంగానికే ముప్పు. మన ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, అధికారులు అందరూ పదవీ స్వీకార సమయంలో రాజ్యాంగ బద్ధులుగా ఉంటామని ప్రమాణం చేస్తారు. కుర్చీ మీద కూర్చోగానే ఆ ఒట్టు తీసి గట్టున పెడతారు.
‘దేశాన్ని కాపాడాలి, రాజ్యాంగ వ్యవస్తలని పరిరక్షించాలి’ అనే వారు జాతికి మాట ఇవ్వాలి. తమ అధికారంలో ఉన్న వ్యవస్థలని అదే చిత్తశుద్ధితో కాపాడతామని, వాటిలో తమ జోక్యం ఉండదనీ. అలా ఇచ్చిన మాటని త్రికరణ శుద్ధిగా నిలబెట్టుకోవాలి.
ఇది జరగని నాడు ఒక పార్టీ పోయి మరో పార్టీ అధికారంలోకి వస్తుంది. వ్యవస్థలు ఇలాగే అధికారంలో ఉన్నవారికి అణిగిమణిగి పనిచేస్తూనే వుంటాయి. ప్రజల అవస్థలు అలాగే కొనసాగుతుంటాయి.
ఇలా చేసే ఈ ప్రయత్నాలన్నీ తమని మభ్య పెట్టడానికి పన్నే రాజకీయ వ్యూహాల్లో భాగాలని, తమకు ఒరిగేది ఏమీ లేదని ప్రజలు గ్రహించిన నాడు, ఇక సరిదిద్దుకోవడానికి రాజకీయులకు వ్యవధానం మిగలదు.
కాబట్టి రాజకీయం చేసేవాళ్ళు ఒక విషయం గమనంలో పెట్టుకోవాలి.
‘రాజ్యాంగాన్ని మీరు కాపాడండి. ఆ రాజ్యాంగమే మిమ్మల్ని కాపాడుతుంది”
యాదగిరి ముచ్చట్లు – భండారు శ్రీనివాసరావు
పొద్దున్న సాక్షి నుంచి ఇంటికి
వస్తుంటే పాశం యాదగిరి ఫోను.
‘బాగా రాశావు ‘బడు’ ధాతు గురుంచి’
అన్నాడు.
యాదగిరి బాగుంది అన్నాడు అంటే అది ఓ
సర్టిఫికేట్. అతడికి తెలియని సబ్జెక్ట్ లేదు. అన్ని భాషల్లో ప్రావీణ్యం. చాలా
విషయాలు జ్ఞాపకం వుంటాయి. కానీ ఎప్పుడో
కాని కాగితం మీద కలం పెట్టడు. అయితే ఒక సుగుణం వుంది. ఫోను చేసి చాలావాటిని
నాలాంటి వాళ్ళతో పంచుకుంటాడు. ఇక నాకా రోజు రాసుకోవడానికి ముడి సరుకు దొరికినట్టే.
ఇవ్వాళ కూడా పాత కబుర్లు అనేకం
చెప్పాడు. నేను రాసిన నార్లగారి ‘బడు’ ధాతువు ప్రధానాంశం. ‘బడు’ అని రాసేవాడు పెద్ద బడుద్దాయి అని నార్ల చీవాట్లు
పెట్టేవాడట. ఇన్నయ్య గారితో కలిసి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 8 లో వున్న నార్లగారి ‘లుంబిని’ ఇంటికి వెడుతుండేవాడట. ఒకసారి మాటల్లో ఈ బడు
ధాతు గురించిన ప్రస్తావన వస్తే హిందీ ఉర్డూ భాషల్లో కూడా ఈ బడు ధాతువు లేదని
యాదగిరి చెప్పాడు. ‘మై ఖానా ఖాయా హు.’ (అన్నం తిన్నాను) అంటారు కానీ ‘ఖానా మేరే
ద్వారా ఖాయా గయా’ (అన్నం నాచేత తినబడినది)
అనరు అనేది ఉదాహరణగా చెబితే నార్లవారు సంతోషపడి, కుర్రాడివయినా బాగా చెప్పావు అని
మెచ్చుకున్నారట. ఆయన ఎవరికో ఫోను చేసి ఈ బడు ధాతువు వేరే ఏదైనా భారతీయ భాషల్లో
ఉందా అనే విషయం ఆరా తీసారట. ఆర్య, ద్రావిడ భాషల్లో ఎక్కడా లేదని లేదని
సూత్రీకరించారట. ‘ఇదంతా అనువాదకులు తెచ్చిన అబర్ధం. ఇంగ్లీష్ వాడు తను చేసిన
తప్పును కప్పిపుచ్చుకోవడానికి అతితెలివికి పోయి చేసిన పని’ అని అన్నారట. ‘కోహినూరు
వజ్రం ఇండియా నుంచి ఎత్తుకు రాబడినది’ అని
నిజం ఒప్పుకోవడం వారికి ఇష్టం వుండదు.
అందుకే “Kohinoor came from India” (కోహినూర్ ఇండియా నుంచి వచ్చింది)
అంటారు. భగత్ సింగ్ ను ఉరి తీసారు (Bhagath
Singh was hanged) అనకుండా ‘ఉరితీయపడ్డాడు’ అంటారు. నేరాలు చేసేవాళ్ళు సృష్టించిన పద ప్రయోగం ఇది. మోడరన్ ఇంగ్లీష్ లో కూడా ఈ బడు ధాతు నిషిద్దం’
అని నార్లవారు విశదం చేసారని యాదగిరి చెప్పాడు.
లేబుళ్లు:
పాశం యాదగిరి ముచ్చట్లు
KSR Live Show | KCR Criticizes Telangan Mahakutami - 20th November 2018
ఈరోజు ఉదయం సాక్షి టీవీ KSR Live Show చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్న వాళ్ళు: శ్రీమతి పద్మజ (వైసీపీ), శ్రీ ప్రకాష్ రెడ్డి (టీబీజేపీ), శ్రీ విద్యాసాగర్ (టీఆర్ఎస్), శ్రీ కృష్ణ కుమార్ గౌడ్ (టీ కాంగ్రెస్).
19, నవంబర్ 2018, సోమవారం
Why Telangana Parties Neglecting Women In Election Candidates? | The Deb...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 న్యూస్ ఛానల్ "Debate With Venkata Krishna" చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ సివీఎల్ నరసింహారావు ( భార్యా బాధితుల సంఘం, ఫోన్ లైన్లో), శ్రీమతి మాధవి (టీబీజేపీ), శ్రీ తాడూరి శ్రీనివాస్ ( టీఆర్ఎస్), శ్రీమతి యామిని (టీడీపీ), శ్రీ నారాయణ మూర్తి ( వైసీపీ).
Why AP Govt Is Neglecting MLA Chintamaneni Prabhakar Acts On Officers? |...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 న్యూస్ ఛానల్ "Debate With Venkata Krishna" చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ సివీఎల్ నరసింహారావు ( భార్యా బాధితుల సంఘం, ఫోన్ లైన్లో), శ్రీమతి మాధవి (టీబీజేపీ), శ్రీ తాడూరి శ్రీనివాస్ ( టీఆర్ఎస్), శ్రీమతి యామిని (టీడీపీ), శ్రీ నారాయణ మూర్తి ( వైసీపీ).
Is Indian Laws Neglecting Men Problems with Women Laws? | The Debate wit...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 న్యూస్ ఛానల్ "Debate With Venkata Krishna" చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ సివీఎల్ నరసింహారావు ( భార్యా బాధితుల సంఘం, ఫోన్ లైన్లో), శ్రీమతి మాధవి (టీబీజేపీ), శ్రీ తాడూరి శ్రీనివాస్ ( టీఆర్ఎస్), శ్రీమతి యామిని (టీడీపీ), శ్రీ నారాయణ మూర్తి ( వైసీపీ).
18, నవంబర్ 2018, ఆదివారం
పార్టీ టిక్కెట్లు, ఓ జ్ఞాపకం
1999 ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ అసెంబ్లీకి,
పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు రావడంతో ఢిల్లీలో పార్టీ టిక్కెట్ల హడావిడి
అంతాఇంతా కాదు. ఢిల్లీలోని ఏపీ భవన్, హోటళ్ళు పార్టీ టిక్కెట్లు ఆశి౦చేవారితో వారి
మద్దతుదారులతో కిటకిటలాడిపోయాయి. నేనప్పుడు ఏదో పనిమీద వెళ్లి ఢిల్లీ ఏపీ భవన్ లో
వున్నాను. చివరి నిమిషం వరకు పార్టీ అధిష్టానం టిక్కెట్లు ఖరారు చేయకపోవడంతో
అభ్యర్ధులు చాలా టెన్షన్ పడ్డారు. మిగిలిన రాష్ట్రాల అభ్యర్ధులను నిర్ణయించి ఏపీ
వంతు వచ్చేసరికి నామినేషన్ల దాఖలుకు ఆఖరు ఘడియ దగ్గర పడింది. ఎట్టకేలకు అభ్యర్ధుల
ఎంపిక పూర్తయింది. వాళ్ళు హైదరాబాదు వెళ్లి గాంధీ భవన్ లో బీ ఫారాలు తీసుకుని
మళ్ళీ వారి వారి నియోజకవర్గాలకు వెళ్ళాలి. చుట్టుపక్కల అయితే పర్వాలేదు. ఉమ్మడి
రాష్ట్రం కనుక అటు ఆదిలాబాదు నుంచి శ్రీకాకుళం వరకు దూర ప్రయాణాలు చేయాల్సిన
వాళ్ళు మరింత ఉడ్డుగుడుచుకున్నారు. ముందు ఢిల్లీ నుంచి హైదరాబాదు చేరడం పెద్ద
పరీక్షగా మారింది. అందరికీ రిటర్న్ టికెట్స్ వున్నాయి కానీ అవి కన్ఫర్మ్ కావడం
అసాధ్యం. అప్పట్లో ఇప్పట్లా విమాన సౌకర్యాలు లేవు. హైదరాబాదు నేరుగా వెళ్ళే విమాన సర్వీసులు
చాలా తక్కువ. అవన్నీ చాలావరకు బుక్కయిపోయాయి. ఢిల్లీ నుంచి కలకత్తానో, బెంగళూరో,
చెన్నయో వెళ్లి మళ్ళీ కనెక్టింగ్ ఫ్లయిట్ పట్టుకోవాలి. ఎక్కడ లెక్క తప్పినా మొత్తం
అన్నాళ్ళు పడిన శ్రమ వృధానే.
ఆ సమయంలో నాకు తెలిసిన ఒక రాజకీయ
మిత్రుడు ఎయిర్ లైన్స్ లో ఎవరయినా తెలుసా అని నన్ను వాకబు చేసారు. ఆ సమయంలో
ఆంధ్రాలో తుపాను ప్రమాదం వచ్చి పడింది. ఎయిర్ లైన్స్ బుకింగ్ కౌంటర్ లో అడిగితే,
నేను రేడియో విలేకరిని కనుక నా టిక్కెట్టుకు ఇబ్బంది లేదనీ, ఎమర్జెన్సీ కోటాలో కన్ఫర్మ్ చేసి ఇస్తామని
చెప్పారు. కానీ అవసరం ఆయనది కదా!
ఈ మీమాంసలో వున్నప్పుడు నాకు ఒక
వ్యక్తి చటుక్కున గుర్తుకు వచ్చారు. ఆయన నేను మాస్కో రేడియోలో పనిచేసేటప్పుడు
మాస్కోలో ఎయిర్ ఇండియా ఆఫీసులో పెద్ద అధికారిగా వుండేవారు. తరచూ కలుస్తూ వుండేవాళ్ళం.
ఇద్దరం కలిసి ఎయిర్ లైన్స్ ప్రధాన
కార్యాలయానికి వెళ్లాం. ఆయన ఇప్పుడు జనరల్ మేనేజర్ అయ్యారు. బయట పియ్యేని కలిసి నా
ప్రవర చెప్పుకుని ఆయన్ని కలవాలని చెప్పాను. నా మాస్కో పరిచయం గురించి తెలిసిన
తర్వాత ఆ పియ్యే లోపలకు ఫోను చేసి పలానావారిని పంపించమంటారా అని అడిగి, అనుమతి
తీసుకుని ఒక బంట్రోతును ఇచ్చి లోపలకు
పంపారు. పంపేముందు, వచ్చిన విషయం ఏమిటని అడిగితే ఓపెన్
టిక్కెట్టు కన్ఫర్మేషన్ కోసం వచ్చామని
చెప్పాము. ఆ పియ్యే చిరునవ్వు నవ్వి, ‘ఆయన్ని కలిసి ఈ చిన్నపని అడగకండి, అదేదో
నేనే చేసి పెడతానని, అప్పటికప్పుడే ఎవరికో ఫోను చేసి టిక్కెట్లు కన్ఫర్మ్ చేసాడు. వచ్చిన
పని అయిపొయింది కనుక ఆ పియ్యేకి కృతజ్ఞతలు చెప్పి, మాస్కో పెద్దమనిషిని లోపల
కలిసినప్పుడు టిక్కెట్ల విషయం ఎత్తకుండా ఇతరత్రా పిచ్చాపాటీ మాట్లాడి వచ్చేసాము. చాలా
ఏళ్ళ తర్వాత కలిశాను కనుక ఆయన కూడా బాగా
సంతోషపడ్డారు.
ఇక మా మిత్రుడి సంగతి చెప్పక్కర లేదు.
అధిష్టానం ఆఖరు నిమిషంలో పార్టీ టిక్కెట్టు ఇచ్చింది. ఆఖరు నిమిషంలో విమానం
టిక్కెట్టు కన్ఫర్మ్ అయింది.
తరువాత ఆయన తన ప్రతిభతో ఎమ్మెల్యే
అయ్యారు. తదనంతర కాలంలో మంత్రి కూడా
అయ్యారు.
లేబుళ్లు:
ఓ జ్ఞాపకం,
పార్టీ టిక్కెట్లు
చిన్న విజ్ఞప్తి – భండారు శ్రీనివాసరావు
అనేక సంవత్సరాలు అయింది రామాంజనేయ
యుద్ధం సినిమా చూసి. అందులో ఆంజనేయుడు శ్రీరాముడితో వాదం పెట్టుకుంటూ ఒక పద్యం
చదువుతాడు. ఒకప్పుడు కలిసివుండి, ఒకరికొకరు సాయం చేసుకుని ఇప్పుడు విడిపోయి ఒకరిపై
ఒకరు దుమ్మెత్తి పోసుకునే రాజకీయ పార్టీల ప్రతినిధులను చూస్తున్నప్పుడు నాకీ పద్యం
ఎందుకో జ్ఞాపకం వస్తుంది.
నిన్ననో మొన్ననో ఈటీవీ ‘పాడుతా తీయగా’
కార్యక్రమంలో విశ్వనాద్ గారు, బాలూ గార్ల సమక్షంలో ఒక పిల్లపిడుగు ఈ పద్యం పాడుతుంటే చటుక్కున కాగితం తీసుకుని కొంత రాసుకున్నాను.
అయినా కొన్ని గ్యాపులు మిగిలిపోయాయి. మీలో ఎవరికయినా తెలిస్తే దయచేసి పూరించి పూర్తి
పద్యం పంపాలని నా కోరిక.
నేను రాసుకోగలిగినంతవరకు ఆ పద్యం:
ఆంజనేయుడు:
“సీతమ్మ జాడ మీ చెవివేయమైతిమా నాటితో
రామాయణంబు సున్న
“సేతుబంధన మాకు చేతగాదంటిమా
రావణు౦డిందాక రాజ్యమేలు
“మైరావణుని ప్రాణ మర్మంబు తెలపమా
యుద్ధమ్ము లంక అబద్ధమగును
“నిశిరాత్రివేళ సంజీవి తేమైతిమేని
సౌమిత్రి స్వర్గాన సభలుదీర్చు
“ఆలుబిడ్డలు మాకు ప్రాణాలటంచు అపుడు,
ఆనాడు కిష్కిందవీడి రామైతిమేమి..........”
“......... అది మా కోతి లక్షణ౦బు, మా
జాతి లక్షణంబు.... ఇపుడు నేడు ఇటుల చింతించి చింతించి వగచిన వగచిన ఏమి ఫలము?”
పార్టీల పాట్లు..నేతల పోట్లు | News Scan LIVE Debate With Vijay | 18th No...
ప్రతి ఆదివారం మాదిరిగానే ఈ ఉదయం TV 5 Vijay Narayan's News Scan చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ దుర్గాప్రసాద్ (టీటీడీపీ), శ్రీ తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్), శ్రీ ప్రేమేంద్ర రెడ్డి (టీబీజేపీ).
17, నవంబర్ 2018, శనివారం
Discussion | AP Govt Decision On CBI Raids, Blocks CBI Entry, TJS Unhapp...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ABN Andhra Jyothy Public Point ముఖాముఖి చర్చాకార్యక్రమంలో యాంకర్ పవన్ కుమార్ తో నేను.

16, నవంబర్ 2018, శుక్రవారం
LIVE: పొలిటికల్ డిష్యుమ్ డిష్యుమ్ | Telangana Elections 2018 | Top Story...
శుక్రవారం రాత్రి TV 5 TOP STORY చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు శ్రీ రామచంద్రారెడ్డి (టీకాంగ్రెస్), శ్రీ తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్). యాంకర్ Ms. సౌజన్య
The Fourth Estate | Internal Fight in Mahakutami - 15th November 2018
ప్రతి గురువారం రాత్రి మాదిరిగానే సాక్షి టీవీ ఫోర్త్ ఎస్టేట్ చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ అద్దంకి దయాకర్ (టీకాంగ్రెస్, ఢిల్లీ నుంచి), శ్రీ సుధాకర రెడ్డి (టీఆర్ఎస్ ఎమ్మెల్సీ), శ్రీ శ్రీధర్ రెడ్డి (టీబీజేపీ), శ్రీ కిషోర్ (యాంకర్, సాక్షి టీవీ )
TRS Vs Congress: TRS Leader Vasudeva Reddy about Telangana Development |...
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం మహా న్యూస్ 'అజిత' సన్ రైజ్ షో చర్చాకార్యక్రమంలో నాతొ పాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ హర్షవర్ధన్ రెడ్డి (టీకాంగ్రెస్), శ్రీ దీపక్ రెడ్డి (టీటీడీపీ), శ్రీ వాసుదేవరెడ్డి (టీఆర్ ఎస్).
12, నవంబర్ 2018, సోమవారం
Pratidwani | 12th November 2018 | Full Episode | ETV Andhra Pradesh
సోమవారం రాత్రి ETV ప్రతిధ్వని (ఆంధ్రప్రదేశ్, తెలంగాణా) చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ చలసాని శ్రీనివాస్ ( ఆంద్ర మేధావుల ఫోరం), శ్రీ పతకమూరు దామోదర ప్రసాద్ (సీనియర్ జర్నలిస్ట్). యాంకర్: శ్రీ శివప్రసాద్
LIVE - Telangana Political League (TPL) | Top Story with Sambasivarao | ...
సోమవారం రాత్రి TV 5 సాంబశివరావు గారి Top Story చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ కర్నే ప్రభాకర్ (టీఆర్ఎస్), శ్రీ శ్రీధర్ రెడ్డి (బీజేపీ), శ్రీ బెల్లయ్య నాయక్ (కాంగ్రెస్, ఢిల్లీ నుంచి), శ్రీ దుర్గాప్రసాద్ (టీడీపీ, ఫోన్ లైన్లో)
Debate on Reasons Behind YSRCP Not Contest in Telangana Elections | The ...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 న్యూస్ ఛానల్ చర్చాకార్యక్రమం 'The Debate With Venkata Krishna' లో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: పీ.ఎల్. శ్రీనివాస్ (టీఆర్ఎస్), డాక్టర్ తులసిరెడ్డి (కాంగ్రెస్), శ్రీ గొట్టిపాటి రామకృష్ణ ( టీడీపీ), శ్రీ ధర్మశ్రీ ( వై.ఎస్ ఆర్ సి పీ).
11, నవంబర్ 2018, ఆదివారం
News Scan Debate With TV5 Murthy | Telangana Elections 2018 | 11th Novem...
ప్రతి ఆదివారం మాదిరిగానే ఈరోజు ఉదయం TV 5 News Scan LIVE Debate with Murthy చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు శ్రీమతి భవాని రెడ్డి (టీజెఎస్), శ్రీ భానుప్రసాద్ (టీఆర్ ఎస్), శ్రీ అద్దంకి దయాకర్ (కాంగ్రెస్, ఢిల్లీ నుంచి), శ్రీ దుర్గాప్రసాద్ (టీడీపీ, ఫోన్ లైన్లో)
Telangana Congress's strategy worrying TRS | Telangana Elections | Journ...
మహా ప్రయోగం – భండారు శ్రీనివాసరావు
పోటాపోటీ కాటాకుస్తీ మీడియా యుగం
నడుస్తున్న ఈ కాలంలో ఏదైనా టీవీ ఛానల్ కొత్త ప్రయోగానికి పూనుకోవడం నిజంగా సాహసమే.
నడుస్తున్న ఈ కాలంలో ఏదైనా టీవీ ఛానల్ కొత్త ప్రయోగానికి పూనుకోవడం నిజంగా సాహసమే.
మహా టీవీ ఎండీ శ్రీ వంశీ,
ఎక్జిక్యూటివ్ ఎడిటర్ అరవింద్ కొల్లి ఈ ప్రయోగానికి పూనుకోవడానికి ముందే నేను
హితవచనం మాదిరిగా చెప్పాను, ఇదొక సాహసమే అవుతుందని.
ఎక్జిక్యూటివ్ ఎడిటర్ అరవింద్ కొల్లి ఈ ప్రయోగానికి పూనుకోవడానికి ముందే నేను
హితవచనం మాదిరిగా చెప్పాను, ఇదొక సాహసమే అవుతుందని.
వారాంతంలో ఆదివారం నాడు ఏకధాటిగా మూడు
గంటల పాటు గడచినా వారపు ప్రధాన అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధుల ప్రమేయం లేకుండా
కేవలం ఏడెనిమిదిమంది జర్నలిస్టులను కూర్చోబెట్టుకుని చర్చా గోష్టిని నిర్వహించడం
మామూలు విషయం కాదు. జర్నలిస్టులు చెప్పే ప్రవచనాలు, హితవచనాలు ‘రేటింగులు’
రాల్చవు. అయినా సరే ఈ జంట మొండికేసి ముందుకే సాగారు. వారికి మహా టీవీ ప్రయోక్త
అజిత జత కలిశారు.

ఈ త్రయం జయప్రదంగా గత ఆదివారం
మహాటీవీలో ప్రారంభించిన ‘జర్నలిస్ట్ టైం’ తొలి కార్యక్రమంలో నేను కూడా
పాల్గొన్నాను. ద్వితీయ విఘ్నం కాకుండా ఈరోజు కూడా ఆ కార్యక్రమాన్ని ప్రసారం
చేశారు. నాతో పాటు సీనియర్ జర్నలిస్టులు ఎస్. వీరయ్య, కే. వేణుగోపాల్, పటకమూరు
ప్రసాద్, రహమాన్, శ్రీధర్ ధర్మాసనం, షేక్ హసీనా పాల్గొన్నారు.

ఈనాటి మీడియా నిజాయితీగా వార్తలు
ఇవ్వగలుగుతున్నదా అనేది యాదృచ్చికంగా ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
ఇవ్వగలుగుతున్నదా అనేది యాదృచ్చికంగా ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా ఓ చిన్న జ్ఞాపకం.
ఓ పదేళ్ళ నాడు మీడియాలో పెడ ధోరణులపై
ఒక వ్యాసం రాసి ఒక పత్రికకు పంపాను. మీడియాపై విమర్శనాత్మక వ్యాసాన్ని సాటి మీడియా
సంస్థగా ప్రచురించడం సాధ్యం కాదని ఆ పత్రిక సంపాదకుడు చెప్పారు.
ఒక వ్యాసం రాసి ఒక పత్రికకు పంపాను. మీడియాపై విమర్శనాత్మక వ్యాసాన్ని సాటి మీడియా
సంస్థగా ప్రచురించడం సాధ్యం కాదని ఆ పత్రిక సంపాదకుడు చెప్పారు.
ఇది ఎందుకు గుర్తుకు వచ్చిందీ అంటే
ఈరోజు మహా టీవీ చర్చాకార్యక్రమంలో ప్రధానంగా అందరం స్వేచ్చగా చర్చించిన విషయం ఇదే.
ఈరోజు మహా టీవీ చర్చాకార్యక్రమంలో ప్రధానంగా అందరం స్వేచ్చగా చర్చించిన విషయం ఇదే.
నిజంగా సాహసం చేస్తున్నారని అనిపించిన
మాట వాస్తవం.
మాట వాస్తవం.
సంపాదక వర్గం ఇదే విధానం కొనసాగిస్తే
రేటింగుల విషయం చెప్పలేను కాని ఛానల్ పట్ల
వీక్షకుల్లో విశ్వసనీయత పెరుగుతుందని
మాత్రం ఘంటాపధంగా చెప్పగలను.
రేటింగుల విషయం చెప్పలేను కాని ఛానల్ పట్ల
వీక్షకుల్లో విశ్వసనీయత పెరుగుతుందని
మాత్రం ఘంటాపధంగా చెప్పగలను.
10, నవంబర్ 2018, శనివారం
ప్రభుత్వ ధనం
మా పెద్దన్నయ్య భండారు పర్వతాల రావు
గారు ఖమ్మం జిల్లాలో జిల్లా పౌర సంబంధ శాఖ అధికారిగా పనిచేస్తున్న రోజుల్లో అప్పటి
రెవెన్యూ బోర్డు సభ్యుడు, సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి అనంత రామన్ ఖమ్మం దౌరాకు వచ్చారు. రెవెన్యూ
బోర్డు సభ్యుడు అందులోను మొదటి సభ్యుడు అంటే చీఫ్
సెక్రెటరీ తరువాత అంతటి హోదా కలిగిన ఆఫీసరు. ఆ రోజుల్లో ఉన్నతాధికారులు
కూడా రైళ్ళల్లోనే ప్రయాణాలు చేసేవాళ్ళు. అలాగే అనంత రామన్ హైదరాబాదు నుంచి రైల్లో
ఖమ్మం చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ సయ్యద్ హషీం ఆలీ ఆయన్ని రైల్వే స్టేషన్ లో
రిసీవ్ చేసుకుని దగ్గరలోని ప్రభుత్వ అతిధి గృహం హిల్ బంగ్లాలో దిగబెట్టారు. మర్నాడు అధికారిక
సమావేశాలు, సమీక్షలు ముగించుకున్న తర్వాత అనంత రామన్ గారు గుట్ట మీద నరసింహ స్వామి
గుడి చూడాలని వుందని కోరిక వెలిబుచ్చారు. ఆ గుడికి తీసుకువెళ్ళి దర్శనం చేయించే
బాధ్యతను మా అన్నగారికి ఒప్పగించారు. కలెక్టరు గారి జీపులో అనంత రామన్ గారు, తన
వ్యానులో మా అన్నయ్య గుడికి వెళ్లి పూజలు అవీ ముగించుకుని వచ్చారు. హైదరాబాదు రైలెక్కేముందు అనంత రామన్ గారు
కలెక్టర్ గారి చేతిలో కొన్ని నోట్లు పెట్టి చెప్పారు.
‘మీరు జీపు ఇచ్చినన్ను గుడికి పంపారు, సంతోషం. కానీ అది ప్రభుత్వ వాహనం.
కాబట్టి ఈ డబ్బు ప్రభుత్వ ట్రెజరీలో జమ చేయించండి’.
అది విని మా అన్నయ్య కూడా ‘నేను కూడా
గుడికి వ్యానులోనే వెళ్లాను. కాబట్టి నా తరపున కూడా డబ్బు ట్రెజరీలో వేయండి’ అని
కలెక్టర్ గారితో చెప్పారు.
ప్రభుత్వ ధనం అంటే పాముగా పరిగణించే
రోజులవి.
మా అన్నయ్య తరవాత అయిదుగురు
ముఖ్యమంత్రుల దగ్గర పీఆర్వో గా పనిచేసారు. సమాచార శాఖ డైరెక్టర్ అయ్యారు. ఫిలిం
డెవలప్మెంటు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తూ స్వచ్చంద పదవీ విరమణ చేసి శేష
జీవితాన్ని పుట్టపర్తిలో గడపడానికి వెళ్లి అక్కడే ఆకస్మికంగా గుండెపోటుకు గురయి సునాయాస
మరణం పొందారు.
(మా రెండో అన్నయ్య రామచంద్రరావుగారు చెప్పిన విశేషాలు ఆధారంగా)
లేబుళ్లు:
Anantaraman,
Hashim Ali,
IAS BPR
Discussion | CVoter Survey Predicts Mahakutami Will Get Majority | Clash...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ABN Andhra Jyothy Public Point ముఖాముఖి చర్చాకార్యక్రమంలో నాతోపాటు యాంకర్ శ్రీనివాస్
9, నవంబర్ 2018, శుక్రవారం
TRS Considers Congress Main Rival in Telangana #2 | Mahaa News
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం మహా న్యూస్ సన్ రైజ్ షో చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ దుర్గాప్రసాద్ (టీడీపీ), శ్రీ ఉపేందర్ (టీఆర్ఎస్), శ్రీ కత్తి వెంకటస్వామి (ఢిల్లీ నుంచి). యాంఖర్: Ms. అజిత
Central Governance Should Not Be on States and Institutions #4 | Mahaa News
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం మహా న్యూస్ సన్ రైజ్ షో చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ దుర్గాప్రసాద్ (టీడీపీ), శ్రీ ఉపేందర్ (టీఆర్ఎస్), శ్రీ కత్తి వెంకటస్వామి (ఢిల్లీ నుంచి). యాంఖర్: Ms. అజిత
5, నవంబర్ 2018, సోమవారం
TDP Leader Sadineni Yamini Fires on Pawan Kalyan Comments | The Debate w...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 News Channel 'Morning debate with Venkata Krishna' చర్చాకార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న వాళ్ళు : శ్రీ పీఎల్ శ్రీనివాస్ (టీఆర్ఎస్), శ్రీ గోవింద రెడ్డి (వైసీపీ ఎమ్మెల్సీ), శ్రీ రమేష్ నాయుడు (బీజేపీ).
Political Analyst Bhandaru Srinivas Rao Analysis on Pawan Kalyan Words | ...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 News Channel 'Morning debate with Venkata Krishna' చర్చాకార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న వాళ్ళు : శ్రీ పీఎల్ శ్రీనివాస్ (టీఆర్ఎస్), శ్రీ గోవింద రెడ్డి (వైసీపీ ఎమ్మెల్సీ), శ్రీ రమేష్ నాయుడు (బీజేపీ).
4, నవంబర్ 2018, ఆదివారం
Opposition Parties in One Stand Against Sardar Patel Statue | Bhandaru Srinivas Rao ...
మహా న్యూస్ జర్నలిస్ట్స్ టైం
మహా న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ యువకుడు,
కొత్త ప్రయోగాలు చేయాలనే ఆసక్తి వున్న జర్నలిస్ట్. ఆయనకు తోడుగా నిలిచాడు
ఎక్జిక్యూటివ్ ఎడిటర్ అరవింద్ కొల్లి. ఫేస్ బుక్ లో చాలామందికి స్నేహితుడు కూడా.
కొత్త ప్రయోగాలు చేయాలనే ఆసక్తి వున్న జర్నలిస్ట్. ఆయనకు తోడుగా నిలిచాడు
ఎక్జిక్యూటివ్ ఎడిటర్ అరవింద్ కొల్లి. ఫేస్ బుక్ లో చాలామందికి స్నేహితుడు కూడా.
వాళ్లకు ఓ ఆలోచన తట్టింది. వారానికి ఒక
మారు, రాజకీయ ప్రతినిధులు లేకుండా కేవలం పాత్రికేయులను మాత్రమే చర్చలకు పిలిచి ఒక
కార్యక్రమాన్ని నిర్వహించాలని. ఈ ఆలోచన నాతో పంచుకున్నప్పుడు నేను కాస్త
నిర్మొహమాటంగానే చెప్పాను, జర్నలిస్టులు చెప్పే హిత వచనాలు ప్రవచనాల వల్ల రేటింగులు
రావు అని. అయినా వాళ్ళు ధైర్యంగా ముందుకు సాగారు. వారంలో జరిగిన ప్రధాన వార్తాంశాలపై
ప్రజలకు అనేక ప్రశ్నలు ఉదయిస్తుంటాయి. ఇలా జరగడానికి బాధ్యులు ఎవ్వరు? ఎందుకిలా
జరిగింది? కానీ వీటికి జవాబులు దొరకవు.

మహా న్యూస్ టీం ఈ అంశాన్ని పట్టుకుంది.
అవే ప్రశ్నలను సుదీర్ఘ అనుభవం కలిగిన జర్నలిస్టులకు వేసి సమాధానాలు రాబట్టడం ఈ
కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. దీనికి జర్నలిస్ట్ టైం అని పేరు పెట్టారు. ప్రతి
ఆదివారం ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు సుమారు మూడుగంటలు చర్చించాలని సంకల్పం.

ఈరోజు అంకురార్పణ జరిగింది. మహా న్యూస్
ఎండీ శ్రీ వంశీ,ఎక్జిక్యూటివ్ ఎడిటర్ అరవింద్ సంయుక్తంగా కార్యక్రమాన్ని
నిర్వహించారు. ఎనిమిది మంది సీనియర్ జర్నలిస్టులు, ఎనలిస్టులు పాల్గొన్నారు.
ఎండీ శ్రీ వంశీ,ఎక్జిక్యూటివ్ ఎడిటర్ అరవింద్ సంయుక్తంగా కార్యక్రమాన్ని
నిర్వహించారు. ఎనిమిది మంది సీనియర్ జర్నలిస్టులు, ఎనలిస్టులు పాల్గొన్నారు.
శ్రీయుతులు కటారి శ్రీనివాసరావు, కేవీఎస్
సుబ్రహ్మణ్యం (సూర్య ఎడిటర్), వాసిరెడ్డి శ్రీనివాస్ (సీనియర్ జర్నలిస్ట్),
వేణుగోపాల్ (సీనియర్ జర్నలిస్ట్, ప్రజాశక్తి), పాపారావు ( ఆర్ధిక విషయాల
విశ్లేషకులు), జాగర్లమూడి రామకృష్ణ (సీనియర్ జర్నలిస్ట్), Ms. వనజ (ఇండిపెండెంట్ జర్నలిస్ట్), షరామామూలుగా నేనున్నూ వీరిలో ఉన్న
వారమైవున్నాము.

హెచ్చరిక: అరుపులు, విరుపులు ఈ
కార్యక్రమంలో కనబడవు, వినబడవు. ఇక మీ ఇష్టం
కార్యక్రమంలో కనబడవు, వినబడవు. ఇక మీ ఇష్టం
విగ్రహాలు, వివాదాలు – భండారు శ్రీనివాసరావు
(Published in the Edit Page 'SURYA' dated 04-11-18, SUNDAY)
వివాదాల మాట ఎలా వున్నా భారత కీర్తి పతాకను దిగంతాల స్థాయికి చేరుస్తూ
ప్రపంచంలోనే అతి పెద్ద భారీ విగ్రహ ప్రతిష్ట ప్రధాని నరేంద్ర మోడీ
ఆధ్వర్యంలో జరిగింది.
ప్రపంచంలోనే అతి పెద్ద భారీ విగ్రహ ప్రతిష్ట ప్రధాని నరేంద్ర మోడీ
ఆధ్వర్యంలో జరిగింది.
స్వతంత్రం వచ్చిన కొత్తల్లో దేశానికి మొదటి సమస్య స్వదేశీ సంస్థానాల
రూపంలో ఎదురయింది. అప్పటి ఉప ప్రధాని, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్,
దేశ వాప్తంగా ఉన్న దాదాపు ఆరువందల యాభయ్ పైచిలుకు సంస్థానాలను ఇండియన్
యూనియన్ లో విలీనం చేస్తూ తీసుకున్న దృఢ నిర్ణయం ఆ గుజరాత్ నాయకుడిని
ప్రజల దృష్టిలో ఉక్కు మనిషిగా మార్చింది. దేశ సమగ్రతను కాపాడడానికి ఆనాడు
పటేల్ తీసుకున్న చర్యకు గుర్తింపుగా ఈనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయన
జయంతిని సమైక్యతా దినంగా ప్రకటించడమే కాకుండా ఆయన స్పూర్తిని జగజ్జేయమానం
చేస్తూ యావత్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వల్లభాయ్ పటేల్ భారీ
విగ్రహాన్ని గత అక్టోబరు ముప్పయి ఒకటో తేదీన ఆయన జయంతి రోజునే
ఆవిష్కరించి పటేల్ స్మృతికి ఘనమైన నివాళి అర్పించింది. ఇందుకోసం
ఇంచుమించు మూడువేల కోట్ల రూపాయలు వ్యయం చేసినట్టు వార్తలు
తెలుపుతున్నాయి. గుజరాత్ లోని నర్మదా నదిపై గతంలో నిర్మించిన సర్దార్
సరోవర్ డ్యామ్ దగ్గర ప్రతిష్టించిన ఈ విగ్రహం అద్యతన భావిలో ప్రముఖ
పర్యాటక ప్రాంతంగా విలసిల్లగలదని, విదేశీ యాత్రీకులకు ప్రధాన ఆకర్షణగా
మారగలదని భావిస్తున్నారు.

ఈ భారీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కూడా విగ్రహ స్థాయికి తగ్గట్టుగానే,
ఆధునిక సాంకేతిక నైపుణ్యాన్ని చక్కగా వాడుకుంటూ చాలా పెద్దఎత్తున కనుల
పండుగగా జరగడాన్ని ప్రపంచవ్యాప్తంగా భారతీయులు టీవీ ప్రసారాల్లో
తిలకించారు. నాలుగున్నర సంవత్సరాల పాలనాకాలంలో నరేంద్ర మోడీ జాతికి
సమర్పించిన ఈ సమైక్యతా శిల్పం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడంలో
సందేహం లేదు. సర్దార్ పటేల్ వంటి ఒక గొప్ప నాయకుడికి మోడీ ప్రభుత్వం ఈ
స్థాయిలో స్మారక చిహ్నం ఏర్పాటు చేయడాన్ని ప్రతి భారతీయుడు
ఆహ్వానిస్తాడు. గర్వపడతాడు కూడా. అయితే అదే రోజు జరగాల్సిన ఇందిరాగాంధి
వర్ధంతి కార్యక్రమాలు ఈ వేడుకలో మసకకమ్మి పోయాయి. దేశాన్ని సమైక్యంగా
ఉంచడంలో, విదేశీ శక్తులనుంచి పరిరక్షించడంలో ఆవిడ చేసిన సేవలు కూడా
తక్కువేమీ కావు. భారతీయ జనతా పార్టీ నాయకులే గతంలో ఈ విషయంలో ఇందిరను అపర
కాళీ మాతగా కీర్తించిన రోజులు గుర్తున్నవారికి ఇది ఒకింత బాధ కలిగించే
విషయమే.
సరే! ఇదొక ఘట్టం.
ముందే చెప్పినట్టు విగ్రహ ప్రతిష్టాపనతోపాటుగా వివాదాలు, విమర్శలు కూడా
అదే స్థాయిలో చెలరేగాయి. విగ్రహం ప్రతిష్టించిన ప్రాంతంలోని అనేక గిరిజన
గ్రామాల ప్రజలు తాగడానికి గుక్కెడు మంచి నీళ్ళు దొరకని స్తితిలో అల్లాడి
పోతుంటే ఒక విగ్రహం కోసం ఇంతటి భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం సమంజసమా అనే
ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గుజరాత్ కు చెందిన ఒకనాటి కాంగ్రెస్ నాయకుడి
విగ్రహం ఈ స్థాయిలో ఏర్పాటు చేయడానికి అదే గుజరాత్ కు చెందిన ఒక ప్రధాని,
అందులో కాంగ్రెస్ పార్టీని నరనరాన వ్యతిరేకించే భారతీయ జనతా పార్టీకి
చెందిన ప్రధాని మోడీ ఇంతటి అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శించాల్సి
వచ్చిందన్నది ఆ ప్రశ్నల్లో మరోటి. కాంగ్రెస్ పార్టీకి చెందిన తొలితరం
నాయకుడు, స్వతంత్ర భారత దేశానికి మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహరలాల్
నెహ్రూ స్మృతిని ప్రజల మనస్సుల్లో నుంచి రూపుమాపడానికి చేసిన కుటిల
ప్రయత్నం అనే స్థాయి వరకు ఇవి సాగాయి.
సందట్లో సడేమియా అన్నట్టు తెలుగు సోషల్ మీడియాలో మరో వివాదం సుళ్ళు
తిరుగుతోంది. యావత్ భారత సమైక్యతను కోరిన ఒక ప్రజానాయకుడి విగ్రహ
ప్రతిష్టాపన ఫలకంలో కావాలనే దక్షిణాది భాషలను, మరీ ముఖ్యంగా తెలుగు భాషను
చిన్నచూపు చూస్తూ అగౌరవ పరిచారనేది బీజేపీకి కొత్తగా శత్రు పక్షంలో చేరిన
టీడీపీ శ్రేణుల అభియోగం. దీనికి ప్రతిగా ఆ పార్టీ వ్యతిరేక వర్గాలు
ఉవ్వెత్తున లేచి, నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని, తెలుగు ప్రజల కలల నగరం
అమరావతి శంకుస్థాపన ఫలకంలో తెలుగును పూర్తిగా విస్మరించి, ఆంగ్లానికి
పెద్ద పీటవేసిన అలనాటి ఛాయాచిత్రాలను సోషల్ మీడియాలో శరపరంపరగా
గుప్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను దగ్గర నుంచి గమనించేవారికి ఈ
ఖండనముండన పర్వాలు కొత్తేమీ కాదు కనుక, వీటిల్లోని సహేతుకతలను గురించి
ఆలోచించడం అనవసరం. అంచేత అదిక్కడ వదిలేసి అసలు ఈ విగ్రహాల కధాకమామిషు
ఓసారి సింహావలోకనం చేసుకుందాం.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజకీయ నాయకుల విగ్రహాలు ఉభయ తెలుగు
రాష్ట్రాలలో ఏమూలకు పోయినా కానవస్తాయి. ఎవరి మీది అభిమానంతో ఈ విగ్రహాలు
ప్రతిష్టిస్తున్నారో వారి కనీస పోలికలు వాటిల్లో మచ్చుకు కూడా కానరావు.
కొన్నింటిని ప్రతిష్టించి ఆవిష్కరించాల్సిన ముఖ్య అతిధికి తీరుబడి
దొరకలేదనే కారణంతో వాటికి ముసుగుకప్పి నడిబజారులో వొదిలేస్తారు. వారి
భక్తి తాత్పర్యాలు విగ్రహం తాలూకు నాయకుడి మీదో, సమయం దొరకని ప్రస్తుత
నాయకుడి మీదో తెలియక దారినపోయే జనం తలలు పట్టుకుంటూవుంటారు. ఆ విగ్రహాల
కారణంగా ఆదారిన పోయే బాటసారులకు, సాధారణ జనజీవనానికి ఏమైనా అసౌకర్యం
కలుగుతోందా అన్న విషయం కూడా వారికి పట్టకపోవడం మరో దౌర్భాగ్యం.
'విగ్రహారాధన కూడదు' అని ప్రబోధించిన గౌతమ బుద్దుడు జన్మించిన పుణ్య
భూమి మనది. అయినా విగ్రహాలకు మాత్రం ఏమాత్రం కొరత లేదు. విగ్రహాలు
వద్దన్న బుద్దుడి విగ్రహాలే భారీ సైజుల్లో దేశం నలుమూలల్లో కానవస్తాయి.
ఇక ప్రసిద్ధ హిందూ ఆలయాల్లో కొలువై వున్న దేవతా విగ్రహాలు చాలావరకు
స్వయంభూ విగ్రహాలుగా అవతరించాయని చెబుతారు. ఇవి కూడా జన సంచారానికి
దూరంగా అధిక భాగం కొండలు, కోనల్లో వెలిశాయి. కాలక్రమేణా ప్రసిద్ధ
ఆలయాలుగా ప్రాచుర్యం పొందాయి. లౌకిక వ్యవస్థకు పెద్ద పీట వేసిన స్వతంత్ర
భారతంలో ఆయా మత విశ్వాసాలకు తగిన ఆలయాలు అనేకం వున్నాయి. దైవానికి ఒక
రూపం అంటూ లేదని నమ్మే మతాలవారు కూడా విగ్రహాలు లేని ప్రార్ధనా మందిరాలు
అనేకం ఏర్పాటుచేసుకున్నారు. ఈ ఆలయాలను సందర్శించే యాత్రీకుల సంఖ్య సయితం
నానాటికీ బాగా పెరుగుతూ వస్తోంది. రాజకీయాల పుణ్యమా అని గతంలో ఎన్నడూ
లేని విధంగా కుల మతాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. తమ అవసరాలకోసం రాజకీయ
పార్టీలు కూడా ఈ సంస్కృతిని పెంచి పోషిస్తున్నాయి. మతం అనేది ఒక జీవన
విధానంగా రూపుదిద్దుకున్న దేశంలో, ఈనాడు మతం దేశాన్ని ముక్కలుచేసే ప్రతీప
శక్తిగా మారుతూ వస్తోంది. రాజకీయాల రణగొణ ధ్వనుల్లో ఈ సంకేతాల సవ్వడులు
వినరాకుండా పోతున్నాయి.
మత ప్రాతిపదికగా దేవాలయాల్లో వుండే ఈ విగ్రహాలవల్ల జనాలకు కలిగే ఇబ్బంది
ఏమీ లేదు. కానీ రాజకీయ నాయకుల విగ్రహాలు అనేవే ఇటీవలి కాలంలో
వివాదగ్రస్తం అవుతున్నాయి. ఒకప్పుడు మూడుపూలు ఆరుకాయలుగా ప్రాభవం పొంది
మహనీయులుగా, మానవీయులుగా వెలుగొందిన వ్యక్తుల విగ్రహాలు తదనంతర కాలంలో
వారు నడిపిన రాజకీయాలకు కాలం చెల్లగానే, ఆ విగ్రహాలు కూడా చెల్లని
కాసుల్లా తయారవుతున్నాయి. మన దేశంలోనే కాదు ప్రపంచంలో అనేక దేశాల్లో
ఇటువంటి పరిణామాలు పలుచోట్ల చోటు చేసుకున్న సందర్భాలు వున్నాయి. మునుపటి
సోవియట్ యూనియన్ లో, స్టాలిన్ శకంలో ఊరూరా వెలిసిన అయన విగ్రహాలకు
తదనంతర కాలంలో పట్టిన దుస్తితి చరిత్ర రికార్డుల్లో నమోదయివుంది. ఆఖరికి
లెనిన్ మసోలియంలో అయన భొతిక కాయం సరసనే భద్రపరచిన స్టాలిన్ శరీరాన్ని
వెలికి తీసి వేరే చోట ఖననం చేయడం కూడా జరిగింది. కేవలం అధికారాన్ని
అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా రాజకీయాలు చేసిన వాళ్ళకు వర్తమానం మినహా
భవిష్యత్తు ఉండదని చరిత్రచెప్పే పాఠాలు తలకెక్కించుకునే విజ్ఞత
లోపిస్తోంది. కొందరు మరణించిన తరువాత కూడా జీవిస్తారు. కొందర్ని జీవించి
ఉండగానే జ్ఞాపకాల్లో వారి ఆనవాళ్ళు లేకుండా చేస్తారు. రాజకీయానికి జాలీ
దయా వుండవంటారు అందుకే కాబోలు.
మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో 'విగ్రహారాధన' అంబరాన్ని
తాకింది. నాటి గౌతమ బుద్దుని నుంచి మొదలుకుని బడుగు బలహీన వర్గాల
నాయకులు రవిదాస్, నారాయణ గురు, జ్యోతీరావు పూలే, షాహూజీ మహారాజ్,
పెరియార్ రామస్వామి, బాబా సాహెబ్ అంబేద్కర్, బీ.ఎస్.పీ. సంస్థాపకుడు
కాంషీరామ్ విగ్రహాలను కూడా మాయావతి ప్రభుత్వ ఖర్చుతో రాష్ట్రంలోని అనేక
ప్రాంతాలలో నెలకొల్పారు. మరీ విచిత్రం ఏమిటంటే తన విగ్రహాల ఏర్పాటు
పట్లకూడా మాయావతి మక్కువ ప్రదర్శించడం.
ఇక మీరట్ లో అఖిల భారత హిందూ మహాసభ, ఓం శివ మహాకాల్ సేవా సమితి కలిసి
ఏకంగా నాధూరాం గాడ్సే విగ్రహాన్ని ఏర్పాటు చేసాయి. జాతిపిత మహాత్మా
గాంధీని హత్య చేసిన గాడ్సే విగ్రహం దేశంలోనే మొట్టమొదటిది
తెలంగాణా రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాదు ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
కు కూడా రాజధాని. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు
ముఖ్యమంత్రిగా వున్న కాలంలో ఆయనకు ఒక భారీ బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు
చేయాలనే సంకల్పం కలిగింది. హుస్సేన్ సాగర్ సరస్సు మధ్యలో జిబ్రాల్టర్
రాక్ అనే పేరు కలిగిన ఒక రాతి గుట్ట మీద ఆ విగ్రహాన్ని ప్రతిష్టించాలని
సంకల్పించారు. ఇందుకోసం జిబ్రాల్టర్ రాక్ పై పదిహేను అడుగుల ఎత్తులో ఒక
వేదికను నిర్మించారు. భారీ విగ్రహానికి కావాల్సిన ఏకశిలను నల్గొండ
జిల్లాలో భువనగిరి సమీపంలోని రాయ్ గిరి గుట్టలలో స్థపతులు ఎంపికచేసి
విగ్రహ నిర్మాణం మొదలు పెట్టారు. వందలాదిమంది పనివారలు,తోటి శిల్పుల
సాయంతో అయిదేళ్లపాటు శ్రమించి స్థపతి గణపతి ఆ రాతిని తొలిచి యాభై ఎనిమిది
అడుగులు ఎత్తయిన భారీ బుద్ధ విగ్రహాన్ని చెక్కారు. అనేక వ్యయప్రయాసల
అనంతరం మూడువందల యాభై టన్నుల బరువున్న ఆ విగ్రహం సుమారు నలభై మైళ్ళు
ప్రయాణించి హైదరాబాదు చేరుకుంది. విగ్రహ ప్రతిష్టాపనకు అవసరమైన భారీ
క్రేన్లు స్థానికంగా లభ్యం కాకపోవడంతో వాటిని ముంబై నుంచి తెప్పించారు.
ఈలోగా సంభవించిన రాజకీయ పరిణామాల ఫలితంగా విగ్రహ వ్యూహకర్త ఎన్టీ
రామారావు పదవి నుంచి దిగిపోయారు. కొత్త ప్రభుత్వం దీనిపట్ల పెద్ద ఆసక్తి
చూపలేదు. విగ్రహ ప్రతిష్టాపన కాంట్రాక్ట్ తీసుకున్న ఏబీసీ కంపెనీ ఈ పని
పూర్తిచేసే పనికి పూనుకుంది. 1990, మార్చి పదో తేదీన విగ్రహాన్ని
హుస్సేన్ సాగర్ జలాలమీదుగా తరలిస్తుండగా వంద గజాల దూరం దాటకుండానే
ప్రమాదవశాత్తు విగ్రహం నీటిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో పదిమంది
మరణించారు. దానితో బుద్దవిగ్రహ ప్రతిష్టాపన వాయిదా పడింది. కల్మషం ఎరుగని
బుద్ధ భగవానుడు ఆ కల్మష జలాలలో దాదాపు రెండేళ్ళు ఉండిపోయాడు. చిట్టచివరకు
1992 డిసెంబరు ఒకటో తేదీన తధాగతుడు జలసమాధి నుంచి బయటపడి తనకోసం
సిద్ధంగా వుంచిన విశాలమైన వేదికమీద నిటారుగా నిలబడగలిగాడు. 2006 లో
బౌద్ధ గురువు దలై లామా బుద్ధుడి విగ్రహానికి సంప్రోక్షణ నిర్వహించారు.
హైదరాబాదు టాంక్ బండ్ మీద ఎన్టీయార్ హయాములోనే తెలుగువెలుగుల విగ్రహాలు
వెలిశాయి. మొత్తం ముప్పై మూడు విగ్రహాలను ఒకే వరుసలో రాకపోకలకు అంతరాయం
కలగని రీతిలో ఏర్పాటు చేసిన విధానం హర్షణీయం. అనుసరణీయం. అయితే ఆ
విగ్రహాల ఎంపిక వివాద గ్రస్తం అయింది. ఒక ప్రాంతానికి చెందిన గొప్ప
వ్యక్తులను పట్టించుకోలేదన్న విమర్శలు తారాస్థాయికి చేరాయి.
అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో రోడ్ల కూడళ్ళలో కాకుండా రహదారికి ఒక
పక్కగా విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ట్రాఫిక్ అంతరాయాలు
లేకపోవడమే కాకుండా చూపరులకు కంటికి విందు గొలుపుతాయి. అద్భుతమైన శిల్ప
సౌందర్యం ఉట్టిపడే విగ్రహాలు ప్రపంచంలో వివిధనగరాలకు ప్రధాన పర్యాటక
ఆకర్షణలుగా విలసిల్లుతున్నాయి.
విగ్రహాలకు సుదీర్ఘ చరిత్ర వుంది. పాత రాతి యుగం నుంచి విగ్రహారాధన ఏదో
ఒక రూపంలో సాగుతూనే వస్తోంది. అతి పురాతన విగ్రహం ముప్పయి వేల సంవత్సరాల
నాటిదని చరిత్ర కారులు గుర్తించారు. ఇప్పటివరకు ప్రపంచం మొత్తంలో ఎత్తయిన
విగ్రహం, అదీ గౌతమ బుద్దుడి విగ్రహం చైనాలో వుంది. పటేల్ విగ్రహ
ప్రతిష్టాపన దరిమిలా అది రెండో స్థానానికి దిగిపోయింది.

న్యూయార్క్ లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ పర్యాటక ఆకర్షణకు మరో మచ్చు తునక.
లండన్ లో వున్న మైనపు విగ్రహాల మ్యూజియం సంగతి చెప్పక్కరలేదు. అందులో తమ
బొమ్మ చూసుకోవడానికి ఎందరెందరో సెలబ్రిటీలు ఎంతో ముచ్చటపడుతుండడం కద్దు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహావిష్కరణ అనంతరం సోషల్ మీడియాలో అనేక
చిత్ర విచిత్ర వ్యాఖ్యానాలు చోటుచేసుకున్నాయి. ఈనాటి రాజకీయ నాయకులు
అలనాటి పటేల్ వంటి ఉద్దండ నాయకుల కాలిగోటికి కూడా సమానం కారంటూ,
బ్రహ్మాండమయిన పటేల్ విగ్రహం కాలిగోరు చెంత కొందరు నాయకులు లిల్లీపుట్స్
(మరుగుజ్జులు) మాదిరిగా కనిపిస్తున్నారని ఒక కార్టూనిస్ట్ గీసిన చిత్రం
విస్తృత ప్రచారానికి నోచుకుంటోంది.
స్టాట్యూ ఆఫ్ యూనిటీ (సమైక్యతా విగ్రహం) పేరుతొ సర్దార్ పటేల్ విగ్రహ
ప్రతిష్టాపన జరిగిన మరునాటి నుంచే మోడీ వ్యతిరేక రాజకీయ శక్తులు సమైక్య
నినాదాన్ని అందుకోవడం ఒక కొసమెరుపు.

Statue of Unity
3, నవంబర్ 2018, శనివారం
Discussion | CM Chandrababu Speech at Prakasam District and PawanKalyan ...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం టీవీ ఛానల్ పబ్లిక్ పాయింట్ ముఖాముఖి చర్చాకార్యక్రమంలో నాతో పాటు యాంకర్ శ్రీనివాస్
Discussion | CM Chandrababu Speech at Prakasam District and PawanKalyan ...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం టీవీ ఛానల్ పబ్లిక్ పాయింట్ ముఖాముఖి చర్చాకార్యక్రమంలో నాతో పాటు యాంకర్ శ్రీనివాస్
2, నవంబర్ 2018, శుక్రవారం
మార్చుకునేదే అభిప్రాయం – భండారు శ్రీనివాసరావు
మార్చుకునేవాటిని అభిప్రాయాలు అంటారా
గుండెల్లో దాచుకున్న అభిమానాలు అంటారా!
“నాకు బాబు అంటే పడదు, కానీ మోడీ
రాష్ట్రానికి చేసిన అన్యాయం అస్సలు బాగాలేదు, కాబట్టి నేను బాబు అభిమానిగా మారాను”
“నాకు జగన్ అంటే సరిపడదు, కానీ బాబు
నాటకాలు చూసి విసుగెత్తి జగన్ సరయినవాడని ఇప్పుడు అనుకుంటున్నాను”
“నాకు పవన్ మీద మంచి అభిప్రాయం లేదు,
అతనో మంచి సినిమా నటుడు అంతే. రాజకీయాలకు పనికిరాడు అనేది ఇప్పటివరకు నా
ఉద్దేశ్యం. కానీ మారుతున్న పరిస్తితులను గమనించిన తర్వాత నా అభిప్రాయాన్ని
మార్చుకుంటున్నాను”
జనమే ఇలా మారిపోతుంటే వాళ్ళని స్కాచి
వడబోసిన రాజకీయులు సామాన్యులు కాదు కదా! వాళ్ళూ అవసరాలకు అనుగుణంగా అభిప్రాయాలూ,
సిద్ధాంతాలు సూత్రాలు అన్నీ మార్చుకుంటూనే వుంటారు.
ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా!
The Fourth Estate | TDP Alliance with Congress - 1st November 2018
ప్రతి గురువారం మాదిరిగానే రాత్రి సాక్షి టీవీ 'అమర్స్ ఫోర్త్ ఎస్టేట్ ' చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్న వాళ్ళు: శ్రీ పెంటపాటి పుల్లారావు (ఎనలిస్ట్), శ్రీ రామచంద్రారెడ్డి (కాంగ్రెస్), శ్రీ పార్ధసారధి (వైసీపీ), శ్రీ ఆంజనేయ రెడ్డి ( బీజేపీ)
1, నవంబర్ 2018, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)