31, ఆగస్టు 2013, శనివారం

మనసు మాట్లాడుతుందా? యేమో?


భార్యాభర్తల నడుమ మాటలు తక్కువ అనే అపకీర్తి సమాజంలో వుంది. ఇందులో నిజమెంతో తెలవదు.
మొన్న ఖమ్మం ఓ పెళ్ళికి వెళ్ళి వచ్చాం. గాలి మార్పో, నీటి  మార్పో తెలియదు. తనకు ఒకటే రొంప. ‘ జలుబు వెలగని బలుబు’ అన్నారు ముళ్లపూడి వారు.
ఈరోజు అంటే ఈ రాత్రి ఓ రాత్రివేళ చూస్తే తను పక్కనలేదు. లేచి చూస్తే పూజగదిలో ఓ దుప్పటి కప్పుకుని పడుకుని వుంది.
పొద్దున్నే నేను ఓ ఛానల్ కు వెళ్ళాలి. పక్కన పడుకుంటే జలుబు అంటుకుంటుందేమో అని ఆలోచించి ఈ పని చేసి వుంటుంది.
మనసుతో మాట్లాడ్డం అంటే ఇదేనేమో! 



(31-08-2013)

పత్రికాస్వేచ్చకు సరికొత్త భాష్యాలు - భండారు శ్రీనివాసరావు



అవి ఎమర్జెన్సీ రోజులు.

హైదరాబాద్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తవిభాగంలో నేను కొత్తగా అడుగుపెట్టాను.



 
పత్రికా స్వేచ్చ పట్ల అపరితమయిన గౌరవాభిమానాలతో జర్నలిజం ను వృత్తిగా స్వీకరించిన నా స్నేహితుడొకరు ఒక ప్రముఖ దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. రేడియోలో పనిచేసే నాకు వృత్తిపరమయిన స్వతంత్రం లేదనే భావన అతనిది. సర్కారు జర్నలిస్టుగా ముద్రవేసి నన్ను ఆట పట్టించడం అతగాడికో అలవాటుగా మారింది. దీనికి ఎప్పుడో ఒకప్పుడు అడ్డుకట్ట వేయాలనే తలంపులో వున్న నేను - ఒక రోజు అతడిని బాహాటంగా సవాలు చేసాను. నాకో వార్త చెప్పు. అది యధాతధంగా సాయంత్రం రేడియో వార్తల్లో వస్తుందో రాదో చూద్దాము. అలాగే నేను చెప్పిన వార్త రేపు ఉదయం నీ పేపరులో వస్తే నీకు స్వేచ్చవుందని ఒప్పుకుంటాను.’ 

పత్రికా స్వేచ్చపట్ల అపారమయిన గౌరవం వున్న నా స్నేహితుడు నేను విసిరిన సవాలుని స్వీకరించాడు. ఫలితం గురించి చెప్పాల్సిన పని లేదు. అతను పంపిన వార్తకు అతడి పేపర్లో అతీగతీ లేదు. నేను ఫోనులో చెప్పిన వార్త అదే సాయంత్రం ప్రాంతీయ వార్తల్లో ప్రసారమయింది. అప్పటినుంచి ఇప్పటివరకు మా స్నేహ బంధం కొనసాగుతూ వచ్చింది కానీ ఆతను ఎప్పుడు పత్రికా స్వేచ్చ గురించిన ప్రసక్తి నా వద్ద తీసుకురాలేదు. 

ఈ ఒక్క చిన్న ఉదాహరణతో పత్రికా స్వేచ్చకు భాష్యం చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. కానీ ఈ స్వేచ్చ అనేది జర్నలిష్టులకన్నా వారు పనిచేసే పత్రికల యాజమాన్యాలు ఎక్కువగా అనుభవిస్తున్నాయని అభిప్రాయపడడంలో తప్పులేదేమో. 

నా ఈ అభిప్రాయం బలపడడానికి యిటీవల జరిగిన మరో సంఘటన దోహదం చేసింది.
ఆకాశవాణి, దూరదర్శన్ వార్తా విభాగాలలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేసి పదవీ విరమణ అనంతరం అడిగిన పత్రికలవారికి వారు అడిగిన అంశాలపై నా అనుభవాలను జతచేసి వ్యాసాలు రాసే పనిని ఒక పనిగా పెట్టుకున్నాను. ఈ పత్రికలు కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా చిన్న పత్రికలు. కానీ వాటి సంపాదకులు ఎవ్వరు కూడా నేను రాసిన అంశాలతో ఏకీభవించినా, ఏకీభవించకపోయినా - ఏనాడూ ఒక చిన్నవాక్యాన్ని సయితం ఎడిట్చేయలేదు. రాసినవి రాసినట్టు ప్రచురిస్తూ వస్తున్నాయి. పేరుకు చిన్న పత్రికలయినా పెద్దమనసుతో పత్రికా స్వేచ్చకుపెద్ద పీట వేస్తున్నాయి. ఈ నేపధ్యంలో - బాగా ప్రాచుర్యంలో వున్న ఒక పెద్ద దినపత్రిక సంపాదక వర్గం వారు  ఫోను చేసి ఒక అంశంపై ఆర్టికిల్ అడిగి మరీ రా యించుకున్నారు. వారు అడిగిన వ్యవధిలోనే పంపడం జరిగింది కానీ ఆ వ్యాసం మాత్రం వెలుగు చూడలేదు. కారణం కూడా వారే సెలవిచ్చారు. నేను పంపిన ఆర్టికిల్ లోని విషయం వారి ఎడిటోరియల్ పాలసీకి అనుగుణంగాలేదట. అందుకే ప్రచురించలేదట.
నార్ల గారు, నండూరి రామమోహనరావు గారు, పురాణం సుబ్రమణ్యశర్మ గారు మొదలయిన ఉద్దండ జర్నలిస్టులు సంపాదకులుగావున్నప్పుడు వారి పత్రికలలో ఉపసంపాదకుడిగా పనిచేసిన అనుభవం నాకున్నది. ఆకాశవాణిలో విలేకరిగా ఉద్యోగం రావడానికి ఈ అనుభవమే అక్కరకు వచ్చింది. తెలుగు జర్నలిజానికి పునాది రాళ్లుగా నిలిచిన వీరెవ్వరు - ఎడిటోరియల్ పాలసీఅంటే ముందు పేర్కొన్న పత్రిక వైఖరి మాదిరిగా వుంటుందని వుంటుందని ఎప్పుడు చెప్పలేదు. ఆ పాలసీ అనేది కేవలం పత్రిక రాసే సంపాదకీయాలకు మాత్రమే  పరిమితం కావాలి కాని, . పత్రికలో పడే ప్రతి వార్తా, ప్రతి వ్యాసం ఆ పత్రికా విధానానికి అనువుగా వుండాలని పట్టుబడితే ఇక పత్రికా స్వేచ్చకు అర్ధమేముంటుంది

ఓ నలభయ్ ఏళ్ళ క్రితం నిజంగా జరిగిన ఒక ఉదంతంతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను.
ఒకానొక ప్రముఖ దినపత్రిక సమాజంలో నైతిక విలువలు భ్రష్టు పట్టిపోతున్నాయని తన సంపాదకీయాలలో గగ్గోలు పెడుతుండేది. ఒక రోజు ఆ సంపాదకుడికి ఒక లేఖ వచ్చింది. అందులో ఇలావుంది

అయ్యా! సమాజం పట్ల, ఆ సమాజంలో లుప్తమవుతూవున్న నైతిక విలువలపట్ల మీకున్న ఆవేదన మెచ్చదగినదిగావుంది. 

అయితే మీకు తెలియని విషయం ఒకటుంది. మీ పత్రిక ఆఫీసు ఎదురుగా ఓ చాయ్ దుకాణం వుంది. పావలా మనది కాదనుకుని అరకప్పు టీ తాగిస్తే అరకాలం వార్త మీ పేపర్లో రాసే సిబ్బంది ఆ దుకాణంలో ఎప్పుడు సిద్దంగా వుంటారు. సమాజం సంగతి సరే! ముందు మీ ఇల్లు చక్కపెట్టుకోండి

30, ఆగస్టు 2013, శుక్రవారం

ధన్యవాదాలు - THANKS


Thanks to everybody. My above blog crossed ONE LAKH SEVENTY FIVE THOUSAND HITS.

నా ఈ  బ్లాగ్ హిట్స్ అక్షరాలా లక్షా డెబ్బై అయిదువేలు దాటాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ విషయంలో  మీరు అందిస్తూ వచ్చిన ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.

 -  భండారు శ్రీనివాసరావు (30-08-2013)

కారు వాడకపోతే డాలరు దిగొస్తుంది (ట)


మీ దగ్గర వున్న ఓ పది నోటు తీసిచూడండి. 'ఇది తీసుకువచ్చిన వాడికి పది రూపాయలు ఇస్తాన'ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకంతో కూడిన హామీ (ఒక రకంగా చెప్పాలంటే ప్రామిసరీ నోటు) కనబడుతుంది. సాంకేతిక అంశాలను అంత క్లుప్తంగా వివరించడం సాధ్యం కాకపోవచ్చు కాని పది రూపాయలకు బదులు అంతే విలువకలిగిన బంగారం ఇస్తామన్న హామీ అన్నమాట.
అంటే భారత దేశం ఆర్ధిక వ్యవస్థ బంగారం నిల్వలపై  ఆధారపడివుందనుకోవాలి. మరి ఈ కారు గొడవ  యేమిటి అన్న అనుమానం రావచ్చు.
ఒక డెబ్బయ్యేళ్ల  క్రితం  వరకు అమెరికా కూడా తన డాలరు విలువను బంగారం నిల్వల ప్రాతిపదికగా లెక్కకట్టేది. పెట్రోలు కూడా బంగారం మాదిరిగా ప్రియమైనది(మన దేశంలో బంగారం మరో రకంగా ప్రియమైనది అనుకోండి) అన్న జ్ఞానోదయం ముందు కలిగిన దేశం  కనుక  అమెరికా  ముందు జాగ్రత్త పడి  పెట్రోలు ఉత్పత్తి చేసే మధ్య ప్రాచ్య దేశాలతో ఒక వొప్పందం కుదుర్చుకుంది. అదేమిటంటే వాళ్లు పెట్రోలు ఏ దేశాలకు అమ్మినా డాలర్లలోనే అమ్మాలి. ఏవిటి దీనివల్ల వాళ్లకు లాభం? ఓ ఉదాహరణ చెప్పుకుందాం.
మన పెట్రోలియం మంత్రిగారు చమురు కొనుగోళ్ళ కోసం ఓ మధ్య ప్రాచ్య దేశానికి వెళ్ళారనుకుందాం. కాని వాళ్లు మన మన కరెన్సీ వొప్పుకోరు. డాలర్లు కావాలంటారు. అప్పుడు మన మంత్రి గారు డాలర్లకోసం అమెరికా వైపు చూస్తారు. వాళ్ల సొమ్మేం పోయింది. టకటకా తెల్లకాగితంపై (కరెన్సీ ముద్రణకు వాడే కాగితమే కావచ్చు)  డాలర్లు ప్రింటు చేసి మనకు ఇస్తారు.
ఈవిధంగా వచ్చిన డాలర్లతో మనం పెట్రోలు కొనుగోలు చేస్తాం.
ఇక్కడో తిరకాసు వుంది. 'మాకీ డాలర్లు అక్కరలేదు, తిరిగి  ఇచ్చేస్తాం తీసుకోండి’ అంటే అమెరికా రిజర్వ్ బ్యాంక్ వొప్పుకోదు. డాలర్ల బదులు మాకు బంగారం ఇవ్వండి అంటే ఆ దేశం ఎంతమాత్రం అంగీకరించదు.  'డాలర్ బదులు తిరిగి ఏదయినా ఇస్తామని హామీ ఏమైనా ఇచ్చామా చెప్పండి' అని ఎదురు ప్రశ్న వేస్తారు.  మన కరెన్సీ మీద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ హామీ లాగా వాళ్ల డాలర్ మీద అలాటి పూచీకత్తు ఏమీ వుండదు. అందుకే డాలర్లు ముద్రించాలంటే తగిన బంగారం నిల్వలు వున్నాయా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఆ దేశానికి వున్నట్టు  లేదు. మరయితే, తాను కొనుగోలు చేసే పెట్రోలుకు  అమెరికా అయా దేశాలకు చెల్లింపులు ఏ కరెన్సీలో చేస్తుందనే అనుమానం రావచ్చు.   
వాళ్లకు ఇక్కడ ఓ సౌలభ్యం వుంది. ఆ దేశాల రాజులనండి, సుల్తానులనండి తమ ఆస్తులను సామ్రాజ్యాలను కాపాడడం కోసం అమెరికాకు డబ్బులు చెల్లించాలి. అలాగే ఆయా దేశాల్లో అమెరికా నిర్మించిన రహదారులు మొదలయిన నిర్మాణాలకు అయిన ఖర్చు తాలూకు చెల్లింపులతో పెట్రోలు చెల్లింపులు సరి.   
సరే! అది వాళ్ల ఏర్పాటు.  మన సమస్య అమెరికా డాలర్లు. ఆ డాలర్ల ముద్రణకు అమెరికా ఉపయోగించే తెల్ల కాగితం విలువా, మన బంగారం నిల్వల విలువా సమానం అనుకోవాలేమో.
అంటే ఏమిటన్న మాట. మనం పెట్రోలు దిగుమతులపై పెట్టే ఖర్చు తగ్గించుకోగలిగితే డాలర్ విలువ మన రూపాయి మారకం విలువతో పోల్చినప్పుడు తగ్గుతుందన్న మాట. అంటే మరో ఏమిటన్న మాట. మనం కనుక ఒక్క మాట మీద నిలబడి ఓ వారం రోజుల పాటు కార్లను రోడ్లకు దూరంగా వుంచి వాటికి విశ్రాంతి ఇవ్వగలిగితే  చాలు కొండెక్కి కూర్చున్న డాలరు దానంతట అదే  దిగివస్తుందని సూతుడు శౌనకాది మునులకు చెప్పగా వారిలో ఒకడు మన నెటిజెన్ల చెవిన వేయడం,   ఆంగ్లంలో వున్న ఆ విషయాలనన్నింటినీ కుదించి  ఇలా  తెలుగులోకి అనువదించి రాయడమైనది. మంగళం మహత్. శ్రీ శ్రీ శ్రీ.

 (30-08-2013)

న్యూస్ యాంఖర్లూ జాగ్రత్త సుమీ!



Popular news anchor Arnab Goswami was rendered speechless for a good 30 nanoseconds (the highest record till date) after he received a letter signed by The Nation in which she clarified that she has never demanded any answers and urged Arnab to desist from doing so in her name. Here are excerpts from the letter:
Dear Mr. Goswami,
Hope you and your vocal cords are fine. You must be wondering why on earth I would write a letter to you.
I want to categorically state through this letter that I do not demand as many answers as you claim during prime time day in and day out. Indeed, if I were to really start demanding answers to the multitude of issues that my 1.2 billion citizens have to grapple with, I would face a heart-attack and collapse.
The fact is I take most issues  - whether it is environmental degradation, gut-wrenching inequality, rampant and unconscionable corruption – in my stride. So when I came to know that a gentleman called Mr. Pareshan, a human rights activist from Mumbai, had filed a case accusing me of being the main reason behind your conducting debates in News Hour, I decided that enough is enough.
Enough is enough because it is disturbing that Mr. Pareshan has filed a case accusing me of being the main cause of noise pollution not only on earth but also in space – when an astronaut from the International Space Station said that he could hear someone yelling “The Nation wants to know !” between 9-10.30 PM IST. He perceives me to be a bigger culprit than you for demanding answers to irrelevant questions and making you ask them on my behalf.
It is not fair, Mr. Goswami. It is not fair to say that a Nation that never asked a single question all these years and let corruption flourish is now shown to be asking questions and that too through you!
Who has given you the right to use my name, Mr. Goswami? 
This time, the Nation (er…well.. really) demands an answer from you.
Regards,
The Nation

P.S : Kindly reply to this letter rather than making it a topic for a NewsHour discussion.

ఎంతో బాధతో, ఆవేదనతో ఈ నాలుగు మాటలు రాస్తున్నాను.


కేంద్రంలో సమాచార ప్రసార శాఖల మంత్రిగా జైపాల్ రెడ్డి గారు నాడు ఆకాశవాణి, దూరదర్శన్ లను ప్రభుత్వ ఆజమాయిషీ నుంచి తొలగించి  ప్రత్యేక ప్రతిపత్తితో కూడిన ‘ప్రసార భారతి ‘ సంస్థను ఏర్పాటు చేసినప్పుడు సంతోషించిన ప్రజాస్వామ్య ప్రియుల్లో నేనూ ఒకడిని. కానీ, ఈ రోజు ఉదయం (30-08-2013) దూరదర్శన్ సప్తగిరి ఛానల్ లో ‘న్యూస్ అండ్ వ్యూస్’ అనే ఇంగ్లీష్ పేరు కలిగిన తెలుగు కార్యక్రమాన్ని చూసినప్పుడు ఆ సంస్థలో పనిచేసిన ఒక ఉద్యోగిగా సిగ్గుతో తల దించుకున్నాను.
చర్చలో  పాల్గొంటున్న  రాజకీయ పార్టీల ప్రతినిధులిద్దరు - బహిరంగంగా, బాహాటంగా. నిస్సిగ్గుగా – “ముయ్యి, నువ్వు  మూస్కో, నోరు ముయ్యి,  నువ్వు నోరు మూస్కో’ అంటూ ఒకరిపై ఒకరు రెచ్చిపోయి మాట్లాడుతుంటే ఆ దృశ్యాలను చూడాల్సిన దయనీయమైన  పరిస్తితి దూరదర్శన్ వీక్షకులది కావడం ఎంతటి దురదృష్టం.

ఇదా దూరదర్శన్ కు  జనం కోరుకున్న ప్రత్యేక ప్రతిపత్తి. ఇదా ప్రజలు ఆశించిన స్వేచ్ఛ. రేటింగులతో నిమిత్తం లేని ప్రసార మాధ్యమం  కూడా ఈవిధమైన చౌకబారు విధానాలను అవలంబించడం ఎంతవరకు సమర్ధనీయం. వార్తల సేకరణలో, ప్రసారంలో స్వేచ్చను ఎవరూ తప్పుపట్టరు. కానీ, ప్రజాధనంతో నిర్వహించే సంస్థల్లో ఈరకమైన వైఖరి యెంతవరకు సబబో దూరదర్శన్ అధికారులే ఆలోచించుకోవాలి? స్వేచ్ఛకు సయితం హద్దులు వుంటాయన్న వాస్తవాన్ని గమనంలో వుంచుకోవాలి. – భండారు శ్రీనివాసరావు               

28, ఆగస్టు 2013, బుధవారం

విభజనపై విచికిత్స

రాష్ట్ర విభజన అంశంపై  ఈరోజు (28-08-2013) ఆంధ్య జ్యోతి దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురించిన నా వ్యాసం. - భండారు శ్రీనివాసరావు 


విభజన – విచికిత్స (As published in today’s Andhra Jyothy, Edit Page)భండారు శ్రీనివాసరావు


రాష్ట్ర విభజన అనివార్యం. ఆ నిర్ణయంలో మార్పువుండదు. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. అది మినహా వేరే ఏవైనా విషయాలుంటే చెప్పండి. అవి కూడా ఆంటోనీ కమిటీతోఅని కాంగ్రెస్ అధినాయకత్వం తమను కలుసుకుని తమ గోడు వెళ్ళబోసుకోవాలని వచ్చిన సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులతో కుండ బద్దలు కొట్టినట్టు చెబుతోందని భోగట్టా.
ఈ నేపధ్యంలో అంశాలను సమీక్షించుకుంటే కొన్ని విషయాలు బోధపడతాయి. నిర్ణయం అమలుచేసే వ్యవధానం, ఎన్నికలు ముంగిట్లో వున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి వుందా అన్న అనుమానాలు పక్కకి పెట్టిచూస్తే, కాసేపు ఆ పార్టీ చిత్తశుద్ధి పట్ల వున్న సందేహాలను కూడా పక్కకి నెట్టి  చూస్తే, కనబడే రాజకీయ చిత్రం అంత ఆశాజనకంగా లేదనే చెప్పాలి.
విభజన నిర్ణయం తిరుగులేనిదని అంటున్నారు. అటువంటప్పుడు మళ్ళీ కమిటీల మీద కమిటీలు వేస్తూ పోవడాన్ని యెలా అర్ధం చేసుకోవాలి. విభజన విషయంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పాతుకునిపోయివున్న భయ సందేహాలను ఈ కమిటీ తీర్చగలుగుతుందా. వినడం తప్ప వేరే నిర్ణయం తీసుకోలేని ఈ కమిటీ ఏర్పాటు కేవలం కాలయాపన కోసమే అని ఎవరైనా అంటే తప్పు పట్టాల్సింది ఏముంటుంది.
పార్టీ అధినేత్రి సోనియా గాంధి ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపకల్పన చేసిన ఆహార భద్రత బిల్లు లోక్ సభ ఆమోదం పొందేలా చూడగలిగినప్పుడు, అదే వేగంతో నలుగురినీ సంప్రదించి ఒక ఆమోద యోగ్యమైన పరిష్కారంతో విభజన బిల్లు తయారు చేసి ఆమోదింప చేయడానికి వున్న అడ్డంకులు ఏమిటి?  మీనమేషాలు లెక్కిస్తూ రోజులు దొర్లించడం వల్ల ఇరు ప్రాంతాల ప్రజల్లో రాజుకుంటున్న విద్వేషాలు మరింత ప్రజ్వరిల్లడం మినహా సాధించేది ఏముంటుంది?
మాటల ఈటెలు విసురుకుంటున్న రాజకీయ నాయకులకు వచ్చేది పోయేది ఏమీ వుండదు. విద్వేషాలు మరింత ముదిరితే బాధ పడేది ఇరు ప్రాంతాల ప్రజలే. ఈరోజు ఒక పార్టీలో వున్న నాయకుడు పట్టుమని పదికాలాలపాటు అదే పార్టీలో వుంటాడన్న నమ్మకం   ఆ పార్టీలకే లేదు.  ఇక అలాటి  వాళ్లని నమ్ముకుని ఆవేశకావేశాలకు దిగడం అంత తెలివితక్కువతనం మరోటి వుండదు.
మరో విషయం. తెలంగాణాని కోరుకుంటున్న వాళ్ళపై ఇప్పుడు పెద్ద బాధ్యత వుంది. కోరుకుంటున్నకల సాకారమయ్యే  సంకేతాలు కనబడుతున్న దశలో ఈ బాధ్యత మరింత పెరుగుతుంది. అందరూ సంయమనం పాటించాల్సిన అవసరం వున్నప్పటికీ, లక్ష్యానికి చేరువైన సమయంలో కటువైన వ్యాఖ్యలు చేయకుండా సంభాలించుకోవాల్సిన అవసరం తెలంగాణావాదులపై ఎక్కువగా వుంటుంది. పరిస్థితులు విషమంగా తయారవడం వల్ల ఆ సాకు చూపి తప్పించుకునే అవకాశం అధికార పార్టీకి ఇవ్వకూడదు. విభజన విషయంలో సీమాంధ్ర ప్రజలకు వున్న సందేహాలను తేలిక పరచి మాట్లాడ్డం తగ్గించాలి. వాటిని నివృత్తి చేసే పనికి నడుం కట్టాలి. మీకేం భయం లేదు, మీ రక్షణకు మాదీ పూచీఅని టీవీ చర్చల్లో పాల్గొనేవాళ్లు సయితం హామీలు గుప్పించడం విడ్డూరంగా వుంది. ఆ పని చేయాల్సింది, అలాటి హామీలు ఇవ్వాల్సింది అధికారంలో వున్నవాళ్ళు. ఆ హామీల అమలుకు సత్వరం ఒక నిర్దిష్టమైన యంత్రాంగం ఏర్పాటు చేసినప్పుడే వాటిపట్ల ప్రజలకు విశ్వసనీయత కలుగుతుంది.            
విభజన తప్పదు అని గట్టిగా నిర్ణయించుకున్నప్పుడు అది చేతల్లో కూడా కనబడాలి. కానీ ఆ దిక్కుగా అడుగులు పడుతున్న సూచనలు కానరావడంలేదు, కేవలం మొక్కుబడి ప్రకటనలు తప్ప.
కాంగ్రెస్ పార్టీ కానీ, మిగిలిన రాజకీయ పార్టీలు కానీ, తమ స్వప్రయోజనాలను పక్కనబెట్టి ప్రజల ప్రయోజనాలను కాపాడుతాయా అన్నదే ఈ నాటి ప్రధాన  ప్రశ్న. ఈ ప్రశ్నకు సరైన జవాబు అన్వేషించడంలో పార్టీలు విఫలం అయితే భవిష్యత్ తరాలు మాత్రమే కాదు వర్తమానతరం వారు కూడా వాటిని క్షమించరు.
(27-08-2013)





27, ఆగస్టు 2013, మంగళవారం

రాష్ట్ర విభజన - ఓ ఆప్త వాక్యం



“రాష్ట్ర విభజన అనివార్యం. ఆ నిర్ణయంలో మార్పువుండదు. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. అది మినహా వేరే ఏవైనా విషయాలుంటే చెప్పండి. అవి కూడా ఆంటోనీ కమిటీతో” అని కాంగ్రెస్ అధినాయకత్వం తమను కలుసుకుని తమ గోడు వెళ్ళబోసుకోవాలని వచ్చిన సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులతో కుండ బద్దలు కొట్టినట్టు చెబుతోందని భోగట్టా.
ఈ నేపధ్యంలో అంశాలను సమీక్షించుకుంటే కొన్ని విషయాలు బోధపడతాయి. నిర్ణయం అమలుచేసే వ్యవధానం, ఎన్నికలు ముంగిట్లో వున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి వుందా అన్న అనుమానాలు పక్కకి పెట్టిచూస్తే, కాసేపు ఆ పార్టీ చిత్తశుద్ధి పట్ల వున్న సందేహాలను కూడా పక్కకి నెట్టి  చూస్తే, కనబడే రాజకీయ చిత్రం అంత ఆశాజనకంగా లేదనే చెప్పాలి.
విభజన నిర్ణయం తిరుగులేనిదని అంటున్నారు. అటువంటప్పుడు మళ్ళీ కమిటీల మీద కమిటీలు వేస్తూ పోవడాన్ని యెలా అర్ధం చేసుకోవాలి. విభజన విషయంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పాతుకునిపోయివున్న భయ సందేహాలను ఈ కమిటీ తీర్చగలుగుతుందా. వినడం తప్ప వేరే నిర్ణయం తీసుకోలేని ఈ కమిటీ ఏర్పాటు కేవలం కాలయాపన కోసమే అని ఎవరైనా అంటే తప్పు పట్టాల్సింది ఏముంటుంది.
పార్టీ అధినేత్రి సోనియా గాంధి ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపకల్పన చేసిన ఆహార భద్రత బిల్లు లోక్ సభ ఆమోదం పొందేలా చూడగలిగినప్పుడు, అదే వేగంతో నలుగురినీ సంప్రదించి ఒక ఆమోద యోగ్యమైన పరిష్కారంతో విభజన బిల్లు తయారు చేసి ఆమోదింప చేయడానికి వున్న అడ్డంకులు ఏమిటి?  మీనమేషాలు లెక్కిస్తూ రోజులు దొర్లించడం వల్ల ఇరు ప్రాంతాల ప్రజల్లో రాజుకుంటున్న విద్వేషాలు మరింత ప్రజ్వరిల్లడం మినహా సాధించేది ఏముంటుంది?
మాటల ఈటెలు విసురుకుంటున్న రాజకీయ నాయకులకు వచ్చేది పోయేది ఏమీ వుండదు. విద్వేషాలు మరింత ముదిరితే బాధ పడేది ఇరు ప్రాంతాల ప్రజలే. ఈరోజు ఒక పార్టీలో వున్న నాయకుడు పట్టుమని పదికాలాలపాటు అదే పార్టీలో వుంటాడన్న నమ్మకం   ఆ పార్టీలకే లేదు.  ఇక అలాటి  వాళ్లని నమ్ముకుని ఆవేశకావేశాలకు దిగడం అంత తెలివితక్కువతనం మరోటి వుండదు.
మరో విషయం. తెలంగాణాని కోరుకుంటున్న వాళ్ళపై ఇప్పుడు పెద్ద బాధ్యత వుంది. కోరుకుంటున్నకల సాకారమయ్యే  సంకేతాలు కనబడుతున్న దశలో ఈ బాధ్యత మరింత పెరుగుతుంది. అందరూ సంయమనం పాటించాల్సిన అవసరం వున్నప్పటికీ, లక్ష్యానికి చేరువైన సమయంలో కటువైన వ్యాఖ్యలు చేయకుండా సంభాలించుకోవాల్సిన అవసరం తెలంగాణావాదులపై ఎక్కువగా వుంటుంది. పరిస్థితులు విషమంగా తయారవడం వల్ల ఆ సాకు చూపి తప్పించుకునే అవకాశం అధికార పార్టీకి ఇవ్వకూడదు. విభజన విషయంలో సీమాంధ్ర ప్రజలకు వున్న సందేహాలను తేలిక పరచి మాట్లాడ్డం తగ్గించాలి. వాటిని నివృత్తి చేసే పనికి నడుం కట్టాలి. ‘మీకేం భయం లేదు, మీ రక్షణకు మాదీ పూచీ’ అని టీవీ చర్చల్లో పాల్గొనేవాళ్లు సయితం హామీలు గుప్పించడం విడ్డూరంగా వుంది. ఆ పని చేయాల్సింది, అలాటి హామీలు ఇవ్వాల్సింది అధికారంలో వున్నవాళ్ళు. ఆ హామీల అమలుకు సత్వరం ఒక నిర్దిష్టమైన యంత్రాంగం ఏర్పాటు చేసినప్పుడే వాటిపట్ల ప్రజలకు విశ్వసనీయత కలుగుతుంది.            
విభజన తప్పదు అని గట్టిగా నిర్ణయించుకున్నప్పుడు అది చేతల్లో కూడా కనబడాలి. కానీ ఆ దిక్కుగా అడుగులు పడుతున్న సూచనలు కానరావడంలేదు, కేవలం మొక్కుబడి ప్రకటనలు తప్ప.
కాంగ్రెస్ పార్టీ కానీ, మిగిలిన రాజకీయ పార్టీలు కానీ, తమ స్వప్రయోజనాలను పక్కనబెట్టి ప్రజల ప్రయోజనాలను కాపాడుతాయా అన్నదే ఈ నాటి ప్రధాన  ప్రశ్న. ఈ ప్రశ్నకు సరైన జవాబు అన్వేషించడంలో పార్టీలు విఫలం అయితే భవిష్యత్ తరాలు మాత్రమే కాదు వర్తమానతరం వారు కూడా వాటిని క్షమించరు.
(ప్రజలను, ఉద్యోగులను, స్నేహితులను, చుట్టపక్కాలను సైతం విడదీస్తున్న ఈ ‘విభజన’ అంశంపై, ఏమి రాసినా అర్ధం చేసుకునేవారికన్నా అపార్ధం చేసుకునేవారే ఎక్కువ వుంటారని చాలా రోజులుగా ఈ అంశంపై ‘కలం’ మెదపడం లేదు. కానీ ఎప్పుడో ఒకప్పుడు చెప్పక తప్పదు అనుకున్నప్పుడు చెబితే మంచిదని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను)

(27-08-2013)

26, ఆగస్టు 2013, సోమవారం

పండిత సంవాదం



ఒకానొక కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్ పోస్టుకు ప్రకటన వెలువడినప్పుడు,కరీంనగరులో కళాశాలలో పనిచేస్తున్న మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు దరఖాస్తు చేసుకొన్నారు.ఇంటర్వ్యూ రోజున విశ్వవిద్యాలయం  తెలుగు శాఖాధిపతిఅభ్యర్థి విశ్వనాథ వారికి ప్రశ్నలు సంధించడం ప్రారంభించారు. 
తెలుగు శాఖాధిపతి : నీ పేరు?
విశ్వనాథ వారు :  ("నన్నే గుర్తించ లేదాపైగా ఏక వచన ప్రయోగమా ?" అని కోపం వచ్చినా తమాయించుకొని... ) విశ్వనాథ సత్యనారాయణ.
తెలుగు శాఖాధిపతి : ఏమేం కావ్యాలు వ్రాసావు?
విశ్వనాథ వారు : ( పేరు చెప్పాక కూడా అటువంటి ప్రశ్న వేసేసరికి పట్ట లేని కోపంతో ... ) నేనేం కావ్యాలువ్రాసానో కూడా తెలియకుండానే ఇక్కడ ’తెలుగు శాఖాధిపతి’ ఎలా అయ్యావురానీలాంటి వాడు ఉన్నంతకాలం  విశ్వవిద్యాలయం మెట్లపై అడుగిడను” ( అంటూ కోపంగా వెళ్ళిపోయారు.)
తరువాత విశ్వనాథ వారు  విశ్వవిద్యాలయంలోను ’ప్రొఫెసర్’ మెట్టెక్కలేక పోవడం  దురదృష్టం
చాలా ఏళ్ళ తరువాత  విషయం విశ్వనాథ వారు కూడ స్వయంగా వ్రాసుకొన్నారు.

శ్రీ విశ్వనాధ సత్యనారాయణ 

కొసమెరుపు :

విశ్వనాథ వారు  విషయాన్ని బయటపెట్టాకరిటైరైన  తెలుగు శాఖాధిపతిని ఒక సాహిత్యాభిమాని " ఇదినిజమేనా? " అని అడిగాడుదానికి  సాహితీమూర్తి సమాధానం 
“ఆయన మహాకవి అని నాకు తెలుసుకాని ఇంటర్వ్యూలలో పరీక్షకుడు తనకు సమాధానాలు తెలిసి కూడాఅభ్యర్థిని ప్రశ్నిస్తాడని ఆయనకు తెలియదు."


ఆయన ఆనాటి  తెలుగు శాఖాధిపతి - ఆచార్య బిరుదురాజు రామరాజు గారు.
సేకరణఆచార్య ఫణీంద్ర

మన రూపాయికి వాస్తు దోషమా?


1

Social network users are trading jokes about the state of the rupee with the dedicated regularity of business channels rolling out doom-and-gloom headlines on the economy.




“The dollar is on an escalator and the rupee is on a ventilator” goes one witticism.

“I heard the rupee is falling, please tell me where I can collect it?”, one network user wants to know.

“Finally it has happened…After decades, beer is now cheaper than petrol! There will be a new slogan: Just Drink, Don’t Drive!” and “A kg of onions can now be bought at the Dollar Store.”

Faking News, a local takeoff on the satirical American website The Onion, had the headline: “India is ready to talk to dollar to strengthen rupee-dollar relationship.”

Everybody has something to say about the falling rupee and rising prices of petrol and onions, from stand-up comedians on Twitter (Tanmay Bhat: I think if the Chinese knew how bad the rupee was doing, they’d leave Arunachal Pradesh alone). Jokes using Hindi movie and song references flooded Facebook accounts and mailboxes, such as a fake news item about the third part of the Hindi movie Race, saying, “Race 3: Who will reach hundred first, dollar, petrol or onion?”

Cartoonist Hemant Morparia, who has done a series of cartoons in the tabloid Mumbai Mirror on the economic crisis, said humour thrives in crisis situations. “One of the cartoons I did was on the rupee heading into a dustbin in which there is also Manmohan Singh’s PhD in Economics,” he said. “All non-lethal yet stressful situations that are life-threatening lend themselves to humour. Amateur comics yet to be discovered are producing a lot of the jokes, such as the one about the dollar being on an escalator and the rupee on a ventilator. The more, the merrier.”

From policy paralysis to political unwillingness to push reforms, experts have a range of reasons for the rupee’s alarming decline. One of the most interesting theories put out is that it is the symbol of rupee which is responsible for the bloodbath. According to a report published on

Washingtonpost.com, Vaastu shastra experts in the country say that the rupee symbol debuted on an inauspicious day and the horizontal line across the symbol appears to “slit the throat” of the currency.

Celebrity astrologer Bejan Daruwalla disagreed that the problems lay with the rupee’s design. He said, in all seriousness, the bloodletting would cease from November. “From November, the position of Jupiter, the planet of good luck and fat money comes in the chart of India very strongly,” he said over the phone. “The rupee will improve against the dollar and so will the share market. There is nothing to panic. The prime minister, whom I like very much, is under the influence of Saturn and Saturn itself means slow growth, delay, scams coming out and rupee getting weaker day by day against the US dollar. Even the PM’s stars will improve from November.”

Meanwhile, the man who designed the rupee symbol, Udaya Kumar Dharmalingam, was unperturbed. “Things were different at the time I designed the rupee symbol and things are different now,” he said in a phone interview. “I don’t think I’m the right person to comment on economic affairs—I’m a designer. If you ask me about the design, I can tell you,” said Kumar, who teaches visual communications at the Indian Institute of Technology (IIT) in Guwahati. He added, “I do hope things change for the better.” (26-08-2013)

Show less

పెళ్ళంటే – పెళ్ళంటే బాజాలు, భజంత్రీలు

పెళ్ళంటే బంధు మిత్రుల సమాగమాలు, పాత పరిచయాల పునః సమీక్షలు (తిరగమోతలు) కూడా.  ఈరోజు ఆదివారం  షరా మామూలు పనులకు స్వస్తి చెప్పి పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు వీటితో బిజీ బిజీ.
ఉదయం మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో తమిళనాడు  గవర్నర్ రోశయ్య గారి మనుమరాలు ఐశ్వర్య  పెళ్లి. ఆ తరువాత కాసేపటికే కూకట్ పల్లి లో మాస్కో స్నేహితుడి  కుమారుడి పెళ్లి వుండడం చేతా, వీ ఐ పీల పెళ్ళిళ్ళలో రాకపోకలు (ట్రాఫిక్) కాస్త కష్టం అన్న ఎరుక, అనుభవం రెండూ  వుండడం చేతా,  కాస్త ముందుగా మాదాపూర్ వివాహానికి వెళ్లాను. అది కొంత కలసి వచ్చింది. రోశయ్యగారు ఒక ప్రత్యేక ఎంక్లోజర్ లో కూర్చుని అప్పుడే బ్రేక్ ఫాస్ట్ మొదలు పెట్టబోతున్నారు. నన్ను చూడగానే నాకు  కూడా ఉపాహారం తెమ్మని పురమాయించారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి గారు,  మాజీ మంత్రి సత్యనారాయణరాజు గారు అక్కడే వున్నారు. ఆ తరువాత రోశయ్యగారు పెళ్లి వేదికపైకి వెళ్ళగానే సీనియర్ జర్నలిస్టు మిత్రుడు శ్రీ వల్లీశ్వర్ తో కలసి అనేకమందిని కలుసుకునే అవకాశం కలిగింది.  ఈమధ్య కాలంలో వ్యక్తిగతంగా కలవడానికి వీలుపడని వారు ఎందరో అక్కడ కలిశారు. శ్రీయుతులు వెంకయ్యనాయుడు గారు,  డాక్టర్ దగ్గుబాటి వేంకటేశ్వర రావుగారు, (సత్యం) రామలింగరాజుగారు, హెచ్ జే దొరగారు, డాక్టర్ మల్లు రవి గారు  ఇలా అనేకమంది.
తదుపరి మాస్కో మిత్రుడు కమాండర్ దాసరి గారి పెద్దబ్బాయి పెళ్లి, సత్యనారాయణ వ్రతం కూకట్ పల్లిలో. జలవాయువిహార్ కమ్యూనిటీ హాల్ లో లంచ్. మాస్కోలో కలిసిమెలిసి తిరిగిన కుటుంబాలన్నీ అక్కడ కలిశాయి.
ఆ తరువాత నిజాంపేట్ లో ఓ గృహప్రవేశం. 1980లో చిక్కడపల్లిలో కలిసివున్న కేవీ రావు దంపతుల కూతురు స్మిత,  అల్లుడు వాసుదేవ శాస్త్రి ముచ్చటగా కట్టుకున్న ఇల్లు. పొందికగా వుంది. నాటి చతుర్ముఖ పారాయణం బ్యాచ్ కలిసింది. సంతోషమనిపించింది.
కింది ఫోటోలో: మాస్కో టీమ్ 


కుర్చీల్లో కూర్చున్న వాళ్లు : ఎడమనుంచి:  త్రిలోచన రమణ, రమా పరకాల, నిర్మల అంటే మా ఆవిడ, విశాల. నిలుచున్నవాళ్ళు : కేవీ రమణ, పరకాల సుధీర్, భండారు శ్రీనివాసరావు అనగా నేను, దాసరి రాము, శ్రీధర్ కుమార్

(25-08-2013)

పలుకే బంగారమాయెరా!


Srinivasulu Bhattaram గారని నాకొక ఇంటర్ నెట్ మిత్రులు వున్నారు. చక్కని రాయసకాడు. సున్నితమైన హాస్యం ఆయన రచనల్లో చిప్పిల్లుతూ వుంటుంది. ఆయన  నాలాగే ‘బాపూ రమణల’ వీరాభిమాని. బాపూ గారితో వ్యక్తిగత సన్నిహిత పరిచయం వున్న అదృష్టవంతులు కూడా.  ఆయన ఇంటిపేరు తెలుగులో ఎలారాస్తే యేమో అని యధాతధంగా ఇంగ్లీష్ లోనే ఇవ్వాల్సివస్తోంది. బాపూ గారి గురించి ఆయన ఒక మెయిల్ పంపారు. బాపూ అభిమానులందరూ చదవాల్సిన  విషయాలు అందులో  వున్నాయి.  కానీ శ్రీనివాసులు  గారికి ఓ అలవాటు. ఆయన అన్నీ పీడీఎఫ్ ఫార్మాట్ లోనే పంపుతారు. అంచేత మూడే మూడు పంక్తులు, వారి అనుమతి వుంటుందనే విశ్వాసంతో,  కింద ఇస్తున్నాను.



       

“నిన్న (25-08-2013) మాటీవీలో ప్రసారమయిన ఫిలిం ఫేర్ అవార్డ్ ఫంక్షన్లో బాపు గారికి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ ఇవ్వడం చూసాను. దర్శకుడు రాఘవేంద్రరావు ఆయనకు అవార్డ్ అందచేసారు. అవార్డ్ ఇచ్చాక ...యాంకర్స్ ఆనవాయితీగా బాపుగారిని కొన్ని మాటలు చెప్పమన్నారు. ఆయన చెప్పిన మాటలు....అక్షరాలా ....’కొన్ని మాటలు....’ “
(26-08-2013)