31, మే 2019, శుక్రవారం
Journalist Srinivas Analysis On AP CM YS Jagan Swearing In Ceremony |#iv...
గురువారం రాత్రి మహా న్యూస్ ఎడిటర్స్ టైం కార్యక్రమంలో ఐ. వెంకట్రావు గారితో నా ముఖాముఖి
చంద్రబాబు టెక్నికల్ గా, లీగల్ గా దొరకాకపోతే జగన్ ఏంచేస్తారు ?| Hot Topic...
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం టీవీ ఛానల్ లో శ్రీ సాయి నిర్వహించిన Hot Topic With Journalist Sai చర్చాకార్యక్రమంలో నాతొ పాటు పాల్గొన్నవాళ్ళు శ్రీమతి సుజాత (వైసీపీ), శ్రీ బీ.వీ. రాం (టీడీపీ), శ్రీ శివ (బీజేపీ), శ్రీ కిరణ్ కుమార్ (జనసేన)
అవినీతి రహిత పాలన ఆంధ్రలో జగన్ తో సాధ్యమా ? | Hot Topic with journalist Sai
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం టీవీ ఛానల్ లో శ్రీ సాయి నిర్వహించిన Hot Topic With Journalist Sai చర్చాకార్యక్రమంలో నాతొ పాటు పాల్గొన్నవాళ్ళు శ్రీమతి సుజాత (వైసీపీ), శ్రీ బీ.వీ. రాం (టీడీపీ), శ్రీ శివ (బీజేపీ), శ్రీ కిరణ్ కుమార్ (జనసేన)
రాజకీయ నాయకుల చేతుల్లో ప్రభుత్వ అధికారులు బలౌతున్నారా ? | Hot Topic with...
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం టీవీ ఛానల్ లో శ్రీ సాయి నిర్వహించిన Hot Topic With Journalist Sai చర్చాకార్యక్రమంలో నాతొ పాటు పాల్గొన్నవాళ్ళు శ్రీమతి సుజాత (వైసీపీ), శ్రీ బీ.వీ. రాం (టీడీపీ), శ్రీ శివ (బీజేపీ), శ్రీ కిరణ్ కుమార్ (జనసేన)
జగన్ రివర్స్ టెండెరింగ్ వల్ల ఎవరి కొంపమునగబోతుంది ?| Hot Topic with jour...
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం టీవీ ఛానల్ లో శ్రీ సాయి నిర్వహించిన Hot Topic With Journalist Sai చర్చాకార్యక్రమంలో నాతొ పాటు పాల్గొన్నవాళ్ళు శ్రీమతి సుజాత (వైసీపీ), శ్రీ బీ.వీ. రాం (టీడీపీ), శ్రీ శివ (బీజేపీ), శ్రీ కిరణ్ కుమార్ (జనసేన)
AP New CM YS Jagan Will Fulfill All Promises? |#IVR Analysis | Mahaa News
గురువారం రాత్రి మహా న్యూస్ ఎడిటర్స్ టైం కార్యక్రమంలో ఐ. వెంకట్రావు గారితో నా ముఖాముఖి
YS Jagan Strong Warning To Yellow Media His Swearing In Ceremony |#IVR A...
గురువారం రాత్రి మహా న్యూస్ ఎడిటర్స్ టైం కార్యక్రమంలో ఐ. వెంకట్రావు గారితో నా ముఖాముఖి
29, మే 2019, బుధవారం
Live - జగన్ కేబినెట్లో యువకులకు పెద్దపీట || YS Jagan Cabinet || YCP Min...
బుధవారం రాత్రి Bharath Today టీవీ ఛానల్లో రఘునందన్ నిర్వహించిన విశ్లేషణ కార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవారు: శ్రీ విజయ సారధి
కనులు లేవని నీవు కలత పడవలదు
....అంటూ అతడు పాడుతుంటే ఘంటసాల
మాస్టారే పాడుతున్న అనుభూతి కలిగింది.
పేరు మాధవ. వయసులో చిన్నవాడే. చక్కని
స్వరం అతడికి భగవంతుడు ఇచ్చిన వరం. పుట్టుకతోనే చూపులేకపోవడం ఆయనే ఇచ్చిన శాపం.
ఆత్మవిశ్వాసం తనకు తానుగా అతడు పెంచుకున్న భాగ్యం.
నిజం! అతడిప్పుడు భాగ్యవంతుడు. ప్రపంచం
నలుమూలలా అతడిని అభిమానించే వాళ్ళు కోకొల్లలుగా వున్నారు.
దీనికి కారణం రవి శంకర్ అనే ఓ మనసున్న మనిషి. ఆయన కంట పడడం మాధవ చేసుకున్న అదృష్టం.
1999 నుంచీ రవి శంకర్ తెలుగు వన్ అనే ఒక
వెబ్ సంస్థను హైదరాబాదులో స్థాపించి, పెంచి పోషించి పెద్ద చేస్తూ వస్తున్నారు. ఆ సంస్తలో అనేక విభాగాలు
వున్నాయి. అందులో రేడియో ఒకటి. భారత దేశంలోనే కాకుండా అనేక ఇతర దేశాల్లో స్థిరపడిన
తెలుగువాళ్ళు వాటిని ఆసక్తిగా వింటుంటారు. అందుకే పేరుకు తగ్గట్టే అది ఇప్పుడు
నెంబర్ వన్.
కంటి చూపు లేకపోయినా శ్రావ్యమయిన స్వరం
కలిగిన మాధవ్ రవి శంకర్ సంస్థలో
పనిచేస్తున్నాడు. మాధవ్ స్వర విన్యాసాలకు ఇప్పుడదొక నిలయం.
గమ్యం లేని జీవితం అనుకున్న మాధవ్
చివరికి సరయిన చోటికే చేరుకున్నాడు.
అనుకోకుండా ఈరోజు తెలుగు వన్
స్టూడియోకి వెళ్ళిన నాకు మాధవ్ పరిచయం కలిగింది.
27, మే 2019, సోమవారం
Debate on YS Jagan Comments on AP Special Status | The Debate | AP24x7
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X7 టీవీ ఛానల్ లో యాంకర్ గోపి నిర్వహించిన BIG DEBATE చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ చందు సాంబశివరావు (టీడీపీ), శ్రీ షేక్ బాజీ (బీజేపీ), శ్రీ శంకర్ (వైసీపీ).
25, మే 2019, శనివారం
ఏపీలో చాలా ముందుగానే నిర్ణయం అయిన ప్రజా తీర్పు – భండారు శ్రీనివాసరావు
2014 లో జగన్ మోహన రెడ్డి అధికారానికి అడుగు
దూరంలో ఆగితే, 2019 లో చంద్రబాబు నాయుడు అధికార పీఠానికి
ఆమడ దూరంలో ఆగిపోవడం ప్రజాస్వామ్యంలో ఉన్న చమత్కారం అనిపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 90 లక్షల పైచిలుకు పొదుపు సంఘాల మహిళలకు, సుమారు 46 లక్షల మంది రైతులకు తెలుగు దేశం ప్రభుత్వం ఎన్నికలకు కొద్ది
రోజులముందే కోట్లాది రూపాయలు నగదు బదిలీ చేసింది.
‘పసుపు కుంకుమ పేరుతొ లక్షలాది మంది ఆ మహిళలకు ఒక్కొక్కరికి పదేసి వేల రూపాయల చొప్పున
రాష్ట్ర ప్రభుత్వం వారి వారి ఖాతాల్లో జమ చేసింది. అలాగే అన్ని లక్షలమంది రైతులకు
మొదటి విడతగా ‘అన్నదాతా సుఖీభవ’ పధకం కింద
ఒక్కొక్కరికి నాలుగువేల రూపాయల చొప్పున విడుదల చేసి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో
వేసింది.
ఈ మొత్తమూ తక్కువది కాదు, ఆ సంఖ్యా
తక్కువ కాదు. పైగా వారందరూ ఓటర్లు.
అంచేత వారందరిలో కనీసం మెజారిటీ
మహిళలు, రైతులు ప్రభుత్వానికి కృతజ్ఞత కింద ఓట్లు వేస్తే తమ విజయానికి ధోకా ఉండదని టీడీపీ అధినాయకత్వం యోచన.
ఆ పార్టీ భావించినట్టుగానే ఏప్రిల్
పదకొండు పోలింగు రోజున అధిక సంఖ్యలో పోలింగు కేంద్రాలకు తరలి వచ్చారు. కొన్ని
చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఇళ్ళకు మళ్ళారు. ఆ తరుణంలో ఓటుహక్కు వినియోగించుకోండి
అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీవీల ద్వారా పలుమార్లు విజ్ఞప్తి చేసారు.
తిరిగొచ్చిన మహిళలు అర్ధరాత్రి వరకు ఓపికగా వేచి వుండి ఓట్లు వేసి మరీ వెళ్ళారు. ఈ
పరిణామం సహజంగానే తెలుగు దేశం శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. చేజారిపోతున్నది అని
మొదట సందేహించిన విజయం మళ్ళీ తమ వొడిలో పడుతోంది అనే నమ్మకాన్ని కలిగించింది. కానీ
వారికి కానీ, వేరే ఎవ్వరికీ అంటే సర్వే సంస్థలకు కానీ తెలియని విషయం ఒకటుంది. అదేమిటంటే ప్రజలు
అప్పటికే అంటే ప్రభుత్వ తాయిలాలు తమ చేతిలో పడక ముందే ఓటు ఎవరికి వేయాలి అనే
విషయంలో ఒక గట్టి నిర్ధారణకు వచ్చారన్న సంగతి. మండలం పాటు సుదీర్ఘ నిరీక్షణ అనంతరం
మే ఇరవై మూడో తేదీన ఫలితాలు వెలువడిన తర్వాత కానీ జనాల తత్వం పాలక పక్షానికి
బోధపడలేదు. ప్రతిపక్షం వైసీపీకి ఏకపక్షంగా అఖండ విజయాన్ని అందివ్వాలని వారు
ఎంతోకాలంగా కోరుకుంటున్నారు అనే వాస్తవం ఎరుక కాలేదు. జగన్ మోహన రెడ్డికి ఒక
అవకాశం ఇవ్వాలని ముందుగానే ప్రజలు ఒక దృఢ నిర్ణయానికి రాబట్టే ఈ తాయిలాలవల్ల అధిక
ప్రయోజనంపొందిన ప్రాంతాల్లో కూడా పాలక పార్టీ అభ్యర్ధులు ఓటమి పాలయ్యారు. 2014 తో పోలిస్తే ఈసారి మహిళల ఓటింగు శాతం గణనీయంగా పెరిగిన పది
నియోజకవర్గాల్లో సయితం వైసీపీ విజయం సాధించడం ఇందుకు దృష్టాంతం. నిజానికి ఓటర్లను
ఈ విషయంలో మెచ్చుకోవాలి. ప్రభుత్వ ఖజానా నుంచి వేల కోట్ల రూపాయల తాయిలాలు ఉచితంగా పంఛి, బదులుగా వారి నుంచి ఓట్లని ఆశించే ఈ రకమైన క్విడ్ ప్రోఖో పద్దతిని ప్రజలు
అన్నివేళలా హర్షించరని రాజకీయ పార్టీలు తెలుసుకుంటే అది సమాజానికి మంచిది.
సహజంగానే పరాజయానికి పలు కారణాలు
వుంటాయి. కారణాలు ఏమైనా ఇందుకు ప్రధాన బాధ్యత పార్టీ అధినాయకుడిదే అవుతుంది. 2014 లో ప్రజలు ఇచ్చిన అధికారానికి కారణం చంద్రబాబే అన్నది జగమెరిగిన
సత్యం. విడిపోయిన రాష్ట్రానికి ఆయన వంటి సమర్ధుడు, అనుభవం ఉన్న నాయకుడు అవసరమని
భావించి ప్రజలు పట్టం కట్టారు. ఆ విజయానికి ఆయన కారణం అయినప్పుడు ఇప్పటి ఈ
అపజయానికి కూడా ఆయనే బాధ్యత వహించడం హేతుబద్ధంగా వుంటుంది. గతంలో జయాపజయాలకు తనదే
బాధ్యత అని కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి నాటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి
చెప్పిన విషయం గమనార్హం.
అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అధికార
దర్పం, నిధుల దుర్వినియోగం వంటి అనేక
ఇతరేతర కారణాలు వున్నా చంద్రబాబు వ్యవహార శైలి పట్ల కూడా ప్రజల్లో ఒకరకమైన ఏవగింపు
కలగడం ప్రస్తుత టీడీపీ ఘోర పరాజయానికి మరో ప్రధాన కారణం. అతి ముఖ్యమైన అంశాలపై తరచుగా
విధానాలు, వైఖరులు మార్చుకుంటూ వాటిని ప్రజలు కూడా ఆమోదించాలని, సమర్దించాలని
కోరుకోవడం జనంలో అధిక సంఖ్యాకులకు నచ్చలేదు. ప్రధానంగా ఆంద్ర ప్రదేశ్ కు ప్రత్యేక
హోదా, ప్రత్యేక ప్యాకేజి వంటి కీలక అంశాలలో ఆయన అనుసరించిన రెండు నాలుకల ధోరణిని జనం
హరాయించుకోలేక పోయారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ముఖ్యంగా ప్రధాన మంత్రి
నరేంద్ర మోడీతో ఆయన గిల్లికజ్జాలకు దిగి, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ పేరుతొ ఎన్డీయే
కూటమి నుంచి వైదొలగడం తొందరపాటు చర్య కాగలదని అప్పట్లో చంద్రబాబు అనుకుని వుండరు. ‘మీరు
జగన్ మోహన రెడ్డి ట్రాపులో (వలలో) పడుతున్నారంటూ ఆ నాడు ప్రధాని మోడీ అన్నమాట ఇక్కడ ప్రస్తావించడం
సముచితంగా వుంటుంది.
ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత
తనకున్న సుదీర్ఘ అనుభవంతో, రాజకీయ పరిచయాలతో కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని చంద్రబాబు
తలపోయడం మరో పొరబాటు. మోడీ వ్యతిరేక కూటమిని కూడగట్టే క్రమంలో పార్టీ ఆవిర్భావం
నుంచి టీడీపీకి ప్రబల రాజకీయ శత్రువు అయిన కాంగ్రెస్ పార్టీతో జత కట్టడం అనేది
రాజకీయంగా వేసిన మరో తప్పటడుగు. ఈ మార్పు ఆ పార్టీలోనే చాలా మందికి నచ్చలేదు.
అయినా అధినాయకుడి నిర్ణయాన్ని శిరసావహించారు. ఈ ప్రయోగం తెలంగాణా అసెంబ్లీ
ఎన్నికల్లో ఘోరంగా విఫలం అయిన తర్వాత కూడా చంద్రబాబు తన వైఖరి, విధానం
మార్చుకోలేదు. మోడీ వ్యతిరేక కూటమిని దేశ వ్యాప్తంగా కూడగట్టేందుకు చంద్రబాబు
చేయని ప్రయత్నం లేదు. ఇది సహజంగానే బీజేపీ అగ్రనాయకులకు రుచించలేదు. ఎన్డీయేలో మోడీ
నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారా లేక మోడీ లేని బీజేపీని ఆయన
సమర్ధిస్తున్నారా అనే విషయంలో తీవ్రమైన
అయోమయం నెలకొన్న మాట నిజం.
ప్రాంతీయ పార్టీల అధినేతలను కట్టడి
చేయడానికి అతులిత అధికారాలు, దేశ వ్యాప్తంగా క్షేత్ర స్థాయి కార్యకర్తల బలం, ప్రత్యర్ధులను
నిలువరించడానికి ఎదురులేని వ్యూహ ప్రతి
వ్యూహాలు పన్నగల నైపుణ్యం పుష్కలంగా కలిగిన బీజేపీ అధినాయకత్వాన్ని ఎదురించే క్రమంలో రాష్ట్రంలోని వాస్తవ రాజకీయ స్తితిగతులను పక్కనబెట్టి వ్యవహరించడం టీడీపీ
ప్రధమ వైఫల్యంగా పరిగణించవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత బలీయమైన రాజకీయ శక్తిగా ఉన్న వైసీపీని
విస్మరించి, చాలా బలహీనమైన స్తితిలో ఉన్న బీజేపీని
లక్ష్యంగా చేసుకుని యావత్ శక్తియుక్తులను కేంద్రీకరించడం ఈ ఎన్నికల్లో టీడీపీ పరాజయానికి కారణమైందని చెప్పుకోవచ్చు. కేంద్రంలో
అధికారంలో వున్న నరేంద్ర మోడీ 2019 ఎన్నికల నాటికి బలహీన పడతారనే తప్పుడు
అంచనాలతో, రాష్ట్రానికి ప్రత్యేకహోదా
విషయంలో అప్పటికే నిర్విరామ పోరాటం చేస్తున్న వైసీపీకి ఆ రాజకీయ ప్రయోజనం
లభించకుండా చేయాలనే ఉద్దేశ్యంతో ఎన్డీయేతో తెగతెంపులు చేసుకుని, ప్రత్యేక హోదా
ఉద్యమానికి తానే నాయకుడిని అని ప్రజలను నమ్మించే ప్రయత్నాలు ముమ్మరం చేయడం టీడీపీ వేసిన
తప్పటడుగు.
అయితే, మోడీపై చంద్రబాబు నిర్విరామంగా
సాగించిన పోరాటం యావత్ భారత దృష్టిని ఆకర్షించింది అనడంలో సందేహం లేదు. మీడియా మిత్రుడిగా పేరున్న చంద్రబాబుకు ఈ
ప్రచారం విస్తృతంగా లభించడంలో ఆశ్చర్యం లేదు.
సీపీఐ నాయకుడు నారాయణ అన్నట్టు ‘జగన్ నేల
మీద నిలబడి పోరాటం సాగిస్తే చంద్రబాబు నేలవిడిచి సాము చేశారు’. ఫలితాల్లో ఇది
ప్రస్పుటమైంది.
వివిధ కారణాల వల్ల ఎంతటి మంచి పరిపాలనలో
కూడా జనాలు ఎంతోకొంత అసంతృప్తికి గురవుతుంటారు. ప్రజల్లో ప్రబలె ఈ అసంతృప్తి
అసహనంగా మారి, అసహనం ఆగ్రహంగా పెచ్చరిల్లి, ఆగ్రహం అవధులు ఎరుగని కసిగా రూపొందినప్పుడు
ఎంతటి ప్రభుత్వాలయినా పేకమేడల్లా కుప్ప కూలుతాయి.
ప్రభుత్వ స్థాయిలో అంటే బడా బడా
కాంట్రాక్టర్ల నుంచి బడా నాయకులకు అందే
ముడుపుల విషయంలో కంటే, ప్రభుత్వ కార్యాలయాలలో
ప్రతి చిన్న పనికి తాము అంతోఇంతో చెల్లించుకోవాల్సిన ఆమ్యామ్యాల గురించే ప్రజలు
ఎక్కువగా ఆందోళన చెందుతారు. అలాగే, ఇన్నాళ్ళుగా తమ మధ్యనే ఉంటూ ఏదో ఒక పార్టీ
కార్యకర్తగా కాలినడకన తమ మధ్యనే తిరుగుతూ,
హఠాత్తుగా ఓ రోజు ఖరీదైన కార్లలో తిరిగే
వారిని చూసినప్పుడే సామాన్యులకు అసంతృప్తి కలుగుతుంది. అది ప్రభుత్వాలపై అసహనంగా
మారుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అదే జరిగింది.
ప్రభుత్వంపై కసి పెంచుకున్న ప్రజలు దాన్ని తమ ఓటు ద్వారా తిరస్కరించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకులు తమ
వ్యవహార శైలి కారణంగా అధికారానికి దూరం అయిన సందర్భాలు అనేకం వున్నాయి. అనుభవశాలులు
సయితం ఈ విషయంలో పప్పులో కాలేస్తూ వుంటారు.
‘ప్రజలు గమనిస్తున్నారు’ అని రాజకీయ
నాయకులు తరచుగా చెబుతుంటారు కానీ ఆ విషయాన్ని తామే మరచిపోతుంటారు. పరిపాలన ఎలా వున్నా
నాయకుల వ్యవహార శైలిని మాత్రం సాధారణ ఓటర్లు పరిశీలిస్తూనే వుంటారు.అహాన్ని,
అహంకారాన్ని ఒక మేరకు మాత్రమే వాళ్ళు సరిపెట్టుకుంటారు. శృతి మించిందని అనుకుంటే
తమ దగ్గర సిద్ధంగా వుండే ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగిస్తుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో
నాటి టీడీపీ అధినేత ఎన్టీరామారావు ప్రజోపకరమైన అనేక పధకాలను ప్రవేశ పెట్టారు.
రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పించారు. అయినా కానీ
ఎన్నికల్లో ప్రజలు ఆయన పార్టీని తిరస్కరించడమే కాకుండా కల్వకుర్తి నియోజకవర్గంలో
ఏకంగా ఆయన్నే ఓడించారు. అంతకు ముందు ఏదో చిన్న కారణం చూపి మొత్తం మంత్రివర్గ
సభ్యులను తొలగించి, కొత్త మంత్రులను నియమించకుండా, పరిపాలనను గాలికి వదిలి ఢిల్లీ వెళ్లి అక్కడ రోజుల తరబడి మకాం చేసారు.
ఇలాంటి కొన్ని అహంభావ చర్యలను ప్రజలు హరాయించుకోలేక పోయారు. ఫలితం తదుపరి ఎన్నికల్లో
టీడీపీ ఘోర పరాజయం.
అయితే ఒకటి నిజం.
గెలుపు ఆఖరిది కాదు, ఓటమి మొదటిదీ
కాదు. విజయం తర్వాత మళ్ళీ అపజయం ఎదురుకావచ్చు. ఓటమి అనంతరం తిరిగి విజయం ఒళ్లో
పడొచ్చు.
విజేత న్యాయం (Victor’s Justice) అని ఇంగ్లీషులో అంటుంటారు. యుద్ధానంతరం విజేతలు, పరాజితులకు చెప్పే
న్యాయంలో కొన్ని హెచ్చు తగ్గులు వుంటాయి. యుద్ధ కాలంలో విజేత చేసిన ఆకృత్యాలకు తక్కువ శిక్ష విధిస్తూ,
అదే నేరాలకు పరాజితులకు భారీ శిక్షలు విధిస్తూ చెప్పే తీర్పు లాంటిది అనుకోవచ్చు.
ప్రస్తుతం ఎన్నికల యుద్ధంలో విజేతలు,
పరాజితుల విషయంలో చేసే అభివ్యక్తీకరణలకు కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. సహజంగానే
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వెలువడే సమీక్షల్లో కూడా ఈ మాదిరి అవ్యాజ
అనురాగాలు విజేతలపట్ల తొంగిచూడడం సహజమే.
ఎందుకంటే, విజయం అన్నింటినీ మరిపిస్తుంది.
ఎనిమిది ఎంపీ, ముప్పయి ఒకటి ఎమ్మెల్యే
స్థానాల్లో టీడీపీ ఓడిపోవడానికి కారణం పవన్ అని కొందరు విశ్లేషిస్తున్నారు. ఆ
సీట్లలో వైసీపీకి వచ్చిన మెజారిటీల కంటే జనసేన పార్టీకి పడ్డ ఓట్ల సంఖ్య ఎక్కువ కాబట్టి టీడీపీ ఓటమికి జనసేన కూడా
దోహదపడ్డదని వారి వివరణ. ఒకవేళ అది నిజమే అనుకున్నా, వైసీపీ గెలిచిన 151 స్థానాల్లో
నుంచి ఈ 31
సీట్లను మినహాయించి చూసినా 120 స్థానాలతో జగన్
పార్టీ విజయం తధ్యమని కొందరు ఆ వాదాన్ని పూర్వ పక్షం చేస్తున్నారు. అసలు ఈ ఎన్నికలలోనే
కాదు, మొత్తం ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఆదినుంచీ వివాదాస్పదంగాను,
అనుమానాస్పదంగానూ ఉంటూ వచ్చింది. మార్పుకోసం రాజకీయ రంగంలోకి దిగిన అద్భుత ఆకర్షణ
శక్తి కలిగిన ఆ యువ నటుడు తాను తొలిసారి పోటీ చేసిన రెండు స్థానాలలోనూ పరాజయం పాలుకావడం
విషాదం. భవిష్యత్తులో ఇలా ఇతర రంగాల నుంచి కేవలం తమ వ్యక్తిగత ఆకర్షణను
పెట్టుబడిగా పెట్టుకుని రాజకీయాల్లో దిగేవారికి జనసేన ప్రయోగం ఒక హెచ్చరిక
లాంటిది.
ఒక స్థిరమైన రాజకీయ వైఖరి లేకుండా రాజకీయాల్లో
ప్రవేశిస్తే ప్రజలు ఆదరించరని పవన్ కళ్యాణ్ ఉదంతం మరోసారి స్పష్టం చేస్తోంది.
ఆంధ్రా ఆక్టోపస్ గా ప్రసిద్ధి చెందిన
లగడపాటి రాజగోపాల్ ఇకపై తాను ఎన్నికల ఫలితాలపై సర్వేలు చేయబోనని ప్రకటించారు.
కొద్ది మాసాల క్రితం తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలప్పుడు, తిరిగి తాజాగా ఏపీ ఎన్నికల
సమయంలోను తన సర్వే ఫలితాలు పూర్తిగా తప్పయినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన
పేర్కొన్నారు. దీనివల్ల రాజకీయ పార్టీలు ఏమో కానీ బెట్టింగుల కారణంగా అమాయకులయిన
ప్రజలు నష్టపోయి, సంసారాలు వీధిన పడే ప్రమాదం ఓ మేరకు తగ్గుతుంది.
పొతే, ఈ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి
సాధించిన ఘన విజయాన్ని అంచనా వేయడానికి ఏ కొలమానాలు సరిపోవు. ఎన్ని ఒత్తిళ్ళు
ఎదురయినా, మరిన్ని ఒడిదొడుకులు ఇబ్బంది పెట్టినా, పరిస్తితులు ప్రతికూలించినా,
నలువైపుల నుంచి అన్ని రాజకీయ పార్టీలు కలసి, కలసికట్టుగా తనను, తన పార్టీని ఇబ్బందుల
పలు చేయాలని చూసినా, మీడియాలో సింహభాగం
కట్టు కధలతో, ఊహాగానాలతో ఊదరగొడుతూ ముప్పేట దాడిచేసినా జగన్ మోహనరెడ్డి మాత్రం
ఏమాత్రం చెక్కుచెదరలేదు. పదేళ్ళకు పైగా తాను
సాగిస్తున్న రాజకీయ పోరునుంచి వెనుతిరగలేదు. వెన్ను చూపలేదు. తండ్రి నుంచి
వారసత్వంగా పొందిన ‘మాట తప్పడు, మడమ తిప్పడు’
అనే సూత్రాన్ని అత్యంత నిబద్ధతతో పాటిస్తూ, పాదయాత్రల పేరుతొ వేలాది కిలోమీటర్లు
కాలినడకన తిరిగి, ప్రజల మధ్యనే ఉంటూ, ప్రజల సమస్యలను అనుక్షణం గమనిస్తూ,
అధికారంలోకి వస్తే వాటి పరిష్కారానికి ఏమి చేస్తే బాగుంటుందో ఆలోచిస్తూ దృఢ సంకల్పంతో,
మొక్కవోని స్థైర్యంతో సాహసానికి మారుపేరులా ఓ శిఖరంలా నిలబడ్డ ఆ ధీరోదాత్తుడికి
ప్రజలు సముచిత రీతిన కృతజ్ఞతలు తెలిపారు. నూతన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ఘన
విజయాన్ని గుదిగుచ్చి జగన్ మెడలో హారంగా వేశారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 151 సీట్లను వైసీపీ పార్టీకి కట్టబెట్టారు. ఎలాంటి
ప్రలోభాలు, ఏస్థాయి హామీలు కూడా తమ స్థిర సంకల్పాన్ని
చెదరగొట్టలేవని లోకానికి చాటి చెప్పారు. ఆ విధంగా ప్రజలు చేయాల్సింది
చిత్తశుద్ధితో చేసి చూపారు.
ఇక ఇప్పుడు బంతి జగన్ మోహన రెడ్డి
కోర్టులో వుంది.
గత అయిదేళ్ళ కాలంలో చంద్రబాబు చేసిన
పొరబాట్లు, తప్పిదాలు చేయకుండా వున్నా, లేదా వాటిని జాగ్రత్తగా సరిచేయగలిగినా, ఘన విజయం సిద్ధించిన వెంటనే
విలేకరులతో మాట్లాడుతూ వాగ్దానం చేసినట్టుగా జగన్ మోహనరెడ్డి ఆరు మాసాలలోపే మంచి
ముఖ్యమంత్రి అని ప్రజలచేత అనిపించుకుంటారు.
విజయం వినయాన్ని, అపజయం ఆత్మస్థయిర్యాన్ని పెంచాలని
పెద్దలు చెబుతారు.
జగన్, చంద్రబాబు ఇర్వురూ పెద్దలు
చెప్పిన ఈ మాట చెవినపెడతారని ఆశిద్దాం.
Discussion On AP Assembly Results and Lok Sabha Election Results | Publi...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ABN ANDHRA JYOTHY PUBLIC POINT ముఖాముఖి చర్చాకార్యక్రమంలో యాంఖర్ పవన్ కుమార్ తో నేను....
22, మే 2019, బుధవారం
Special Discussion Over Non-BJP Parties Strategies After Exit Poll Resul...
మంగళవారం రాత్రి ABN Andhra Jyothy ఛానల్ Special discussion లో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ సంజీవరెడ్డి (కాంగ్రెస్), శ్రీ మాల్యాద్రి (టీడీపీ), శ్రీ విల్సన్ (బీజేపీ). యాంకర్: రూప.

21, మే 2019, మంగళవారం
Senior Journalist Bandaru Srinivas Counters To Lagadapati Survey Report ...
ఎక్జిట్ పోల్ ఫలితాలపై మిర్రర్ టీవీ వెబ్ ఛానల్ ఇంటర్వ్యూలో యాంకర్ నిరుపమతో ముఖాముఖి
Who is Next AP CM? Next PM? Sr Journalist Bhandaru Srinivasa Rao on Exit...
ఎక్జిట్ పోల్స్ ఫలితాలపై తెలుగు పాపులర్ టీవీలో ముఖాముఖి చర్చ. కార్యక్రమ నిర్వాహకులు పవన్ కుమార్, నేను.
KSR Live Show: వీవీ ప్యాట్‌లన్నీ లెక్కించాలి.. చంద్రబాబు డిమాండ్..! - 1...
ప్రతి మంగళవారం మాదిరిగానే ఈరోజు ఉదయం సాక్షి KSR LIVE SHOW చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ సమ్మారావు (టీఆర్ ఎస్), శ్రీమతి సీతారత్నకుమారి (బీజేపీ), శ్రీరవి చంద్రారెడ్డి (వైసీపీ), శ్రీ మహేష్ (కాంగ్రెస్)
Time To Ask Live - Modi's Mania || Opposition Has Failed In 2019 Polls ....
సోమవారం రాత్రి భారత్ టుడే న్యూస్ ఛానల్ లో శ్రీ సాయి నిర్వహించిన Time To Ask చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ నగేష్ కుమార్ (హిందూ పత్రిక మాజీ రెసిడెంట్ ఎడిటర్ ), శ్రీ ఎల్.వీ.కే. రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్)
20, మే 2019, సోమవారం
Did Exit Polls Predict Public Pulse or Leaders Opinions? | The Debate wi...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈ ఉదయం AP 24 X 7 News Channel లో The Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ చందు సాంబశివరావు (టీడీపీ), శ్రీ తులసి రెడ్డి (కాంగ్రెస్), శ్రీ రవికుమార్ ( సెఫాలజిస్ట్), శ్రీ రాజశేఖరరెడ్డి (వైసీపీ), శ్రీ రఘురాం (బీజేపీ)
19, మే 2019, ఆదివారం
అందరి లక్ష్యం అదే.. | News Scan Debate With Vijay | 19th May 2019 | TV5News
ప్రతి ఆదివారం మాదిరిగానే ఈరోజు ఉదయం Tv 5 Vijay Narayan's NEWS SCAN Live Debate చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ విల్సన్ (బీజేపీ), శ్రీ గొట్టిపాటి రామకృష్ణ (టీడీపీ), శ్రీ తులసి రెడ్డి (కాంగ్రెస్).
16, మే 2019, గురువారం
14, మే 2019, మంగళవారం
KSR Live Show: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. 4 సర్వేలు చేయించాం.. - 14th M...
ప్రతి మంగళవారం మాదిరిగానే ఈరోజు ఉదయం సాక్షి టీవీ KSR LIVE SHOW చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ సత్యమూర్తి (బీజేపీ), శ్రీ విద్యాసాగర్ (టీఆర్ ఎస్), శ్రీ రామచంద్రారెడ్డి (కాంగ్రెస్), శ్రీ నారాయణ మూర్తి (వైసీపీ)
13, మే 2019, సోమవారం
Who Are The Accusers for Serial Road Incidents? | The Debate | AP24x7
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 TV ఛానల్ లో సీనియర్ యాంకర్ గోపి నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ సాయి కృష్ణ (బీజేపీ), శ్రీ బ్రహ్మం చౌదరి (టీడీపీ), శ్రీ అంబటి రామకృష్ణ( కాంగ్రెస్), శ్రీ రాజీవ్ గాంధి (వైసీపీ)
Will YS Jagan Supports Rahul Gandhi After Elections? | The Debate | AP24x7
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 TV ఛానల్ లో సీనియర్ యాంకర్ గోపి నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ సాయి కృష్ణ (బీజేపీ), శ్రీ బ్రహ్మం చౌదరి (టీడీపీ), శ్రీ అంబటి రామకృష్ణ( కాంగ్రెస్), శ్రీ రాజీవ్ గాంధి (వైసీపీ)
11, మే 2019, శనివారం
‘టైమ్’ బాంబ్
(Published in SURYA telugu daily on 12-05-2019, SUNDAY)
దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న దశలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందిన టైమ్ మేగజైన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి ఒక ముఖపత్రచిత్ర (కవర్ పేజి) కధనాన్ని ప్రచురించింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న దశలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందిన టైమ్ మేగజైన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి ఒక ముఖపత్రచిత్ర (కవర్ పేజి) కధనాన్ని ప్రచురించింది.
అనేక దేశాల అధినాయకులు, ప్రత్యేకించి
వర్ధమాన దేశాల నాయకులు ఈ పత్రికలో తమ గురించి కధనాలు రావాలని ఉవ్విళ్ళూరుతుంటారు.
అందులోను కవర్ పేజి కధనం అంటే మాటలా! దాని తీరే వేరు.
టైమ్ పత్రిక ప్రచురించిన ఈ కధనంతో
కూడిన సంచిక మరో ఏడెనిమిది రోజుల్లో చదువరుల చేతుల్లోకి వస్తుంది. అయితే, ఈలోగానే ఈ కధనం గురించిన అనేక సంచలన కధనాలు భారతీయ
భాషల్లో వెలువడే అనేక దినపత్రికల్లో ఇప్పటికే వచ్చేశాయి.
ఒక కధనానికి పత్రికలు లేదా మీడియా
పెట్టే శీర్షికలు ఒక్కోసారి దానికి సంచలనతత్వాన్ని అద్దుతుంటాయి. అలాంటిదే టైమ్
పత్రిక పెట్టిన ఒక శీర్షిక ‘ ఇండియాస్
డివైడర్ ఇన్ చీఫ్’. అంటే ‘భారత దేశపు విభజన సారధి’ అని అర్ధం చెప్పుకోవచ్చు.
ప్రముఖ జర్నలిస్ట్ ఆతిష్ తసీర్ మోడీ
గురించి ఈ వ్యాసం రాసారు. ప్రధాని మోడీని, అయన విధానాలను తూర్పారబట్టే రీతిలో ఈ
కధనం సాగింది.
2014 లో సగటు భారతీయ ఓటర్లకు ఉజ్వల
భవిష్యత్తుపై అంతులేని ఆశలు రేకెత్తిస్తూ అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఇప్పుడు
ఒక సగటు రాజకీయ నేతగా మిగిలిపోయారన్నది ఆ వ్యాస సారాంశం. ఒకప్పటి ఆశావహ దృక్పధం మోడీలోఇప్పుడు
కొరవడిందన్నది ఆ వ్యాస రచయిత అభిప్రాయం.
‘సమాజంలోని విబేధాలు నాడు అంటే 2014
లో మోడీ విజయానికి దోహదం చేశాయి. వాటిని
సద్వినియోగం చేసుకుంటూ మోడీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఈ ఎన్నికలలో కూడా
అవే పరిస్తితులను భరిస్తూ తనకు ఓటేయాలని ఆయన ప్రజలను కోరుతున్నారు. గతంలో మోడీ
చెప్పిన విషయాలు ఇవే. హిందూ పూర్వ వైభవం, దక్షిణ కొరియా మోడల్ అభివృద్ధి ఈ రెండింటితో ఉజ్వల భవిష్యత్ నినాదం అప్పుడు
కలిసివచ్చింది. కానీ అయిదేళ్ళ కాలం గడిచిపోయిన తర్వాత ఆయనిప్పుడు ఎన్నికల హామీలను
నిలబెట్టుకోలేని సగటు రాజకీయ నాయకుడిగా మిగిలిపోయారు’ అని తసీర్ వ్యాఖ్యానించారు.
మోడీపై తసీర్ అక్షర దాడి ఇంకా ఇలా కొనసాగింది.
‘ప్రధానమంత్రిగా మోడీ తీసుకున్న చర్యలు
దేశంలో విద్వేషపూరిత మతపరమైన జాతీయ వాదాన్ని పెంచి పోషించడానికి తోడ్పడ్డాయి. మోడీ
అయిదేళ్ళ పాలనలో దేశంలోని నిమ్న కులాలవారు, ముస్లిములు, క్రైస్తవులు వంటి
అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళు ఉదారవాదుల నుంచి దాడులు ఎదుర్కుంటున్నారని ఆయన
ఆరోపించారు.
‘గత ఎన్నికల సందర్భంగా మోడీ ప్రవచించిన
ఆర్ధిక విధానాలు అద్భుతాలు సృష్టించడం మాట అలా వుంచి అందులో ఏవీ వాస్తవ రూపం
ధరించలేదు. అందరికీ అభివృద్ధి అనే ఆనాడు ఇచ్చిన నినాదం ఇప్పుడు ఆచూకీ లేకుండా
పోయింది. పైగా, ప్రజల నడుమ తీవ్ర విబేధాలు
నెలకొన్న పరిస్తితిని ఆయనే తెచ్చారు’ అన్నారు తసీర్.
అంతేకాదు, ఆ వ్యాసకర్త తసీర్ ప్రధాని మోడీపై తన విమర్శల పరంపర కొనసాగిస్తూ, ‘భారత్
మరో అయిదేళ్ళ పాటు మోడీ ప్రభుత్వాన్ని భరించగలదా’ అనే సందేహంతో కూడిన ప్రశ్నను
సంధించారు.
ఇది కొంత ఇబ్బందికరమైన అంశమే
అయినప్పటికీ మోడీ అభిమానులకు ఊరట కలిగించే విషయం ఒకటుంది. అదేమిటంటే మరో అయిదేళ్ళు
నరేంద్ర మోడీ పరిపాలన దేశానికి తప్పదనే నిగూడార్ధం ఇందులో దాగుంది.
కేవలం మోడీని విమర్శించడానికి,
దుమ్మెత్తి పోయడానికి మాత్రమే ఉద్దేశించలేదని అనుకోవాలనో లేదా సమతుల్యం చేయాలనో
తెలియదు కానీ రచయిత మోడీకి సంబంధించి కొన్ని ఉపశమన వాక్యాలను కూడా జొప్పించారు.
బలహీన ప్రతిపక్షం వుండడం మోడీ అదృష్టం,
మోడీని ఓడించడం తప్ప వీరికి మరో అజెండా
లేదని ఆయన తేల్చేశారు. వారసత్వ సిద్ధాంతాలు మినహాయిస్తే కాంగ్రెస్ పార్టీ దేశ
ప్రజలకు కొత్తగా ఇచ్చేది ఏమీ లేదని అన్నారు. ప్రతిపక్ష కూటమిని సిద్ధాంత సారూప్యత
లోపించిన బలహీన కూటమిగా అభివర్ణించారు.
కాకపోతే, ఇదే సంచికలో మోడీని
శ్లాఘిస్తూ, ఆకాశానికి ఎత్తేస్తూ మరో వ్యాసం ప్రచురించారు. బహుశా సమన్యాయం చేయడానికి టైమ్ పత్రిక సంపాదక వర్గం ఈ
విధానాన్ని ఎంచుకుని ఉండవచ్చు.
ఈరెండో వ్యాసాన్ని యూరేసియా గ్రూపు
అధ్యక్షుడు ఇయాన్ బ్రెమర్ రాసారు.
భారత దేశంలో ఆర్ధిక సంస్కరణలు
కొనసాగాలంటే అందుకు మోడీనే సరైన వ్యక్తి అని ఆయన అభివర్ణించారు.
‘భారత్ లో ఆర్ధిక సంస్కరణలను మరింత
ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం వుంది. దేశంలోని ఇతర రాజకీయ పార్టీల నేతలతో
పోలిస్తే సమర్ధవంతంగా ఈ సంస్కరణలను అమలు చేసే సామర్ధ్యం మోడీకి మాత్రమే వుంది. అయన హయాం లోనే భారత దేశానికి చైనా,
అమెరికా, జపాన్ వంటి దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగు పడ్డాయి. దేశంలో
కోట్లాదిమంది ప్రజల జీవితాలు మెరుగుపడడానికి మోడీ విధానాలే కారణం. ఆధార్ వంటి
వ్యవస్థల విస్తరణపై మోడీ ప్రభుత్వం దృష్టి సారించిన ఫలితంగా ప్రభుత్వ నిధుల
దుర్వినియోగానికి అడ్డకట్ట పడింది’ అని బ్రెమర్ మోడీని కొనియాడారు.
‘ప్రత్యర్ధిపై ఆధిపత్యం చెలాయించే
తత్వం మోడీది’ అని అయన కుండ బద్దలు కొట్టారు. అయితే, అదే సమయంలో దేశంలో అవసరమైన
సంస్కరణలు చేపట్టే విషయంలో మోడీకి మంచి పేరు వుంది. దీటైన ప్రత్యామ్నాయం లేకపోవడం ఆయన పాలిట వరంలా మారింది’ అని బ్రెమర్
అభిప్రాయపడ్డారు.
సహజంగానే టైమ్ పత్రిక కధనాలు దేశంలో
ముఖ్యంగా మీడియాలో పలు చర్చలకు ముడి సరుకుగా మారింది. అందులో ఎన్నికల వేళాయే! మోడీ
అనుకూలురు, ప్రతికూలురు ఈ కధనాలను తమకు అనువైన రీతిలో భాష్యం చెప్పుకుని విశ్లేషణలను
వండి వార్చారు.
‘టైమ్ పత్రిక విశ్లేషణ అక్షర సత్యం,
మోడీ ప్రభలు మసకబారుతున్నాయి’ అంటున్నారు మోడీ వ్యతిరేకులు.
‘టైమ్ పత్రికా మజాకా! ఈ దేశానికి మోడీ
తప్ప వేరు గత్యంతరం లేదని ఆ పత్రిక రాసిందంటే ఇక దానికి తిరుగులేదు’ అంటున్నారు
మోడీ అనుకూలురు.
మాయాబజార్ సినిమాలో ప్రియదర్శిని పేటిక
సన్నివేశం గుర్తుంది కదా! ఎవరి మనసులో బొమ్మ వారికి కనిపిస్తుంది.
నిన్ననో మొన్ననో ఓ టీవీ చర్చలో తెలుగుదేశం
ప్రతినిధి, బీజేపీ ప్రతినిధుల నడుమ సాగిన సంభాషణను ఈ సందర్భంలో పేర్కొనడం సముచితంగా వుంటుంది.
‘తెలుగు మీడియా కళ్ళతో చూస్తే
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్తితులు ఒకరకంగా కానవస్తాయి’ బీజేపీ ప్రతినిధి వ్యాఖ్య.
‘జాతీయ మీడియా కళ్ళతో చూడండి, దేశంలో స్తితిగతులు
మరో రకంగా కనిపిస్తాయి’ అనేది టీడీపీ ప్రతినిధి ప్రతి వ్యాఖ్య.
పార్టీల విధానాల వద్దకు వచ్చేసరికి
పరస్పరం విబెధించుకునే ఈ రెండు పార్టీల ప్రతినిధులు మీడియా విషయంలో ఈ రకమైన
అభిప్రాయాలతో వుండడం ఒక రకంగా మంచి పరిణామం కాదు. రాజకీయ పార్టీలు మీడియాను
ఎక్కడికక్కడ తమకు అనుకూలంగా మార్చుకుని
వ్యవహరిస్తున్నాయి అనే అభిప్రాయం విస్తరించడం స్వతంత్ర మీడియాకు అంత క్షేమకరం
కాదు. (EOM)
మీడియా ఆత్మశోధన – భండారు శ్రీనివాసరావు
సూటిగా....సుతిమెత్తగా....
అంజయ్యగారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు పత్రికలవారిపట్ల ప్రత్యేక అభిమానం ప్రదర్శించేవారనేది బహిరంగ సత్యం. పత్రికల యజమానులే కాకుండా అనుదినం వార్తలు సేకరించే సాధారణ విలేకరులతో కూడా ఆయన సంబంధాలు ఆదరణ పూర్వకంగా ఉండేవి. చక్కటి తెలంగాణా పలుకుబడితో కూడిన ఆయన మాటలు వినసొంపుగా ఉండేవి. సునిశితమయిన హాస్యంతో అంజయ్యగారు చేసే వ్యాఖ్యలు, విలేకరులకు వండివార్చిన 'సిద్దాన్నం' మాదిరిగా వార్తల ముడిసరుకుగా మారిపోయేవి. మరునాడు పత్రికల్లో తను చెప్పిన విషయాలను చదువుకుని 'ఇంత చక్కగా మాట్లాడానా' అని అమాయకంగా మురిసిపోయేవారు. ఆ రోజుల్లో తెలుగు పత్రికారంగంలోకి దూసుకువచ్చిన ఒక దినపత్రిక మాత్రం, కొత్త బాణీ కనిపెట్టి అంజయ్యగారి భాషను యధాతధంగా ప్రచురించడం మొదలుపెట్టింది. అందుకు ఆయన నొచ్చుకున్న దాఖలాలు లేవు కానీ, ఆ పత్రిక తీరు ముఖ్య మంత్రి స్తాయికి తగినట్టుగా లేదని జర్నలిష్టు వర్గాలలోనే కొందరు గుస గుసలాడుకున్న మాట నిజం. వున్నది వున్నట్టు రాయడంతోపాటు, అన్నది అన్నట్టు రాసే పత్రికా సంప్రదాయానికి అప్పుడే బీజం పడినట్టువుంది.
రాష్ట్ర రాజకీయ యవనికపై తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో, అప్పటివరకు వార్తలకోసం కాంగ్రెస్ పార్టీ వర్గ రాజకీయాలపై ఆధారపడిన పత్రికలకు కొత్త వనరు దొరికినట్టయింది.
ఏరోజుకారోజు పత్రికలలో వచ్చిన వార్తలను పరిశీలించి అదే రోజు మధ్యాన్నం ఒక పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే, రెండో పార్టీ అదే రోజు సాయంత్రం పెట్టేది. ఒకరి కామెంట్లు మరొకరికి చేరవేసే బాధ్యతను అత్యుత్సాహం కలిగిన కొందరు విలేకరులు భుజానికి ఎత్తుకునేవారు. ఇందులో వారికి ఏవో స్వార్ధ ప్రయోజనాలు వున్నాయని సందేహించనక్కర లేదు. వార్తకు వార్త తెగులు అన్నట్టు ఏదో కొత్త వార్త పట్టుకెళ్లాలన్నదే వాళ్ళ ఆరాటం. దీన్ని ఆయా రాజకీయ పార్టీలు సద్వినియోగం చేసుకునేవి. ఈ క్రమంలో సంబంధ అనుబంధాలు క్రమేపీ బలపడేవి. తాము చెప్పదలచుకున్న మాటలను తమనోటితో కాకుండా, తాము బయటపడకుండా, తమ చేతికి మసి అంటకుండా పత్రికలలో ప్రచురింపచేసుకునే విధానం రూపుదిద్దుకుంది. ఒక వార్త పత్రికల్లో వచ్చేలా చేసి, అదే వార్తను మర్నాడు తామే ఖండించేలా వీలుకల్పించే ఈ నూతన వొరవడి, రాజకీయ ప్రత్యర్ధుల పీచమణచడానికి కొందరికి బాగా ఉపయోగపడుతూ వచ్చింది. ఈ పరిణామ క్రమమే తదనంతరకాలంలో వార్తల స్తానంలో వార్తా కధనాల ఆవిర్భావానికి మార్గం వేసింది.
నూతన ఆర్ధిక సంస్కరణల అమలుతో అన్ని రంగాలలోమాదిరిగానే పత్రికారంగంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. పత్రికల ముద్రణలో రంగు, హంగులు పెరిగిపోయాయి. పెద్ద స్తాయిలో పెట్టుబడులు ప్రవహించాయి. ప్రైవేటు టీవీ ఛానళ్ళ ప్రవేశంతో జర్నలిజం రంగానికి 'గ్లామరు' తోడయింది. సిబ్బంది జీతభత్యాలు కలలో ఊహించలేనంతగా పెరిగిపోయాయి. ఆహ్వానించదగిన ఈ పరిణామాలన్నీ పవిత్రమయిన పత్రికా రంగంలో స్వార్ధశక్తులు చొరబడడానికి కొంతమేరకు తోడ్పడ్డాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగల అమోఘమయిన శక్తి యుక్తులున్న ఈ రంగంపై రాజకీయుల కన్ను పడడంలో ఆశ్చర్య పడాల్సినది ఏమీ లేదు. అలాగే, రాజకీయ నిర్ణయాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బడా పారిశ్రామికవేత్తలు కూడా ఈ రంగాన్ని ఎంచుకోవడంలో వింతేమీ లేదు. ఈ రెండు బలవత్తర శక్తులూ మీడియాను తమ కనుసన్నల్లో ఉంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల పర్యవసానంగానే నిప్పుకు చెదలంటుకున్నాయని చెప్పాలి.
మీడియా విశ్వసనీయతపై ఇన్నాళ్ళుగా కదలాడుతున్న నీలినీడలు ఇటీవలి కాలంలో కారుమబ్బులుగా మారి ఒక పెద్ద ప్రశ్నను మీడియా ముందుకు తెచ్చాయి.
మంచికో చెడుకో మీడియాపై ఒక చర్చ మొదలయింది. పత్రికలంటే పన్నెత్తి మాట్లాడడానికి జంకే వాళ్ళందరూ ఈ నాడు మీడియా నీతీ నిజాయితీలను గురించి నిలదీస్తున్నారు. నిరాధార వార్తలను ప్రసారం చేసే టీవీ ఛానళ్ళ నిగ్గుతేల్చాలని నిగ్గదీస్తున్నారు. బాధ్యతతో మెలగాలనీ, నిజానిజాలను ప్రసారానికి ముందే నిర్దారించుకోవాలనీ నీతి బోధలు చేస్తున్నారు. ఒకరికి దిశానిర్దేశనం చేయాల్సిన మీడియా, ఒకరితో చెప్పించుకోవాల్సిన దుస్తితిలో పడిపోయింది.
వీటికి తోడు అవినీతి ఆరోపణలు, బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాలూ వెలుగులోకి వచ్చి అసలే మసకబారుతున్న మీడియా విశ్వసనీయతను మరింత ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.
అందుకే, మీడియా ఆత్మ శోధన చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇతరుల తప్పులు ఎన్నడంతో సరిపుచ్చుకోక, తమ దగ్గర తప్పు ఎక్కడ జరుగుతున్నదో, ఎలా జరుగుతున్నదో తెలుసుకుని దిద్దుబాటు చర్యలు మొదలుబెట్టుకోవాలి. పత్రికల్లో, మీడియాలో వస్తున్న వార్తలపై, వార్తాకధనాలపై చదువరులనుంచి, వీక్షకులనుంచి విమర్శలు, అభిప్రాయాలు స్వీకరించి సరయినవాటిపై స్పందించి భేషజాలకు పోకుండా తగు మార్పులు చేసుకోవాలి. రేటింగులలో పోటీ తగ్గించుకుని నవ్యత్వంతో కూడిన కార్యక్రమాల రూపకల్పనలో పోటీ పెంచుకోవాలి. సొంత కట్టుబాట్లు, స్వీయ నియంత్రణ ఏర్పాటు చేసుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్తలో మిగిలిన అన్ని స్తంభాలు శిధిలమవుతున్నప్పుడు సరిదిద్దడానికి నేనున్నానంటూ మీడియా సన్నద్ధంగా నిలబడాలి. పూర్వ వైభవాన్నీ, వెనుకటి ఔన్నత్యాన్నీ, విలువలతో కూడిన పత్రికా సంప్రదాయాలనూ పునరుద్ధరించుకోవాలి.
కానీ, ఈ పోటాపోటీ కాటా కుస్తీ యుగంలో ఇది నెరవేరే కలేనా?
Discussion | Time Magazine Cover on Modi With Controversial Headline | P...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ABN Andhra Jyothy టీవీ న్యూస్ ఛానల్ లో యాంకర్ శ్రీనివాస్ నిర్వహించిన Public Point ముఖాముఖి చర్చాకార్యక్రమంలో .....
10, మే 2019, శుక్రవారం
చంద్రబాబు వెస్ట్ బెంగాల్ పర్యటనలో చేసిన వ్యాఖ్యల సారాంశమేంటి ? Hot Topic...
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం Prime Nine Hot Topic With Journalist Sai చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ అజయ్ శర్మ( జనసేన), శ్రీ రవిబాబు(వైసీపీ), శ్రీ వేల్పూరి శ్రీనివాస్ ( టీడీపీ)
టీవీ9 రవి ప్రకాష్ పై హీరో శివాజీ పెట్టిన కేసు వెనక రహస్యమేంటి ? | Hot To...
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం Prime Nine Hot Topic With Journalist Sai చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ అజయ్ శర్మ( జనసేన), శ్రీ రవిబాబు(వైసీపీ), శ్రీ వేల్పూరి శ్రీనివాస్ ( టీడీపీ)
Chandrababu met Rahul Gandhi over VVPAT slip counting | The Fourth Estat...
ప్రతి గురువారం మాదిరిగానే సాక్షి టీవీ లో అమర్ దేవులపల్లి 'ఫోర్త్ ఎస్టేట్' చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ జీ.వీ. వెంకటరెడ్డి (కాంగ్రెస్), శ్రీ రాజశేఖర్ (వైసీపీ), శ్రీ లక్ష్మీపతి రాజా (బీజేపీ)
News Talk|Discussion With Senior Journalist Bhandaru Srinivas Rao |09-05...
ప్రతి గురువారం మాదిరిగా స్నేహ టీవీ న్యూస్ టాక్ ముఖాముఖి చర్చాకార్యక్రమంలో ......
8, మే 2019, బుధవారం
డోల్,డోలీ, డోలా- భండారు శ్రీనివాసరావు
కమ్యూనిస్టులు వింటున్నారా!
ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల ఐక్యత అవసరం
గురించి అప్పుడప్పుడు ఆ పార్టీల నాయకులే నొక్కి నొక్కాణిస్తుంటారు. దీనిపై
జర్నలిస్ట్ మితృడు పాశం యాదగిరి వ్యాఖ్య.
“ఈ రెండు పార్టీలు కలివిడిగా నడిచినా విడివిడిగా నడిచినా డోలు వాయిద్యం వినబడుతూనే
వుంటుంది. పూల వాన కురుస్తూనే వుంటుంది.
“కాకపోతే, కలివిడిగా నడిస్తే డోలు
చప్పుళ్ళ నడుమ డోలీ(పల్లకి)లో ఊరేగింపు. విడివిడిగా
నడిస్తే డోలా (పాడె)పై ఊరేగింపు. అంతే తేడా!”
ఇది పూర్తిగా యాదగిరి వ్యాఖ్య. దీనిపై
వచ్చే డోల్ చప్పుళ్ళకు (కామెంట్లకు) పూర్తి బాధ్యత ఆయనదే సుమా!
లేబుళ్లు:
డోలా- వామపక్షాల ఐక్యత,
డోలీ,
డోల్
7, మే 2019, మంగళవారం
6, మే 2019, సోమవారం
Why AP Leaders and Officers Neglecting Public Drinking Water Problems? |...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 న్యూస్ ఛానల్ లో యాంకర్ గోపి నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ సత్యమూర్తి (బీజేపే), శ్రీ సంజీవ రెడ్డి (కాంగ్రెస్), శ్రీ సురేష్ (టీడీపీ), శ్రీ రాజీవ్ (వైసీపీ)
Did PM Narendra Modi Try To Increase Conflicts Between AP and Telangana?...
ప్రతి
సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24
X 7 న్యూస్ ఛానల్ లో యాంకర్ గోపి నిర్వహించిన
చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ సత్యమూర్తి (బీజేపే), శ్రీ
సంజీవ రెడ్డి (కాంగ్రెస్), శ్రీ సురేష్ (టీడీపీ), శ్రీ రాజీవ్ (వైసీపీ)
5, మే 2019, ఆదివారం
విలన్లు కుట్రలు పన్నితే.. ఓటర్లలో కసి పెరిగిందా? | News Scan Debate With...
ప్రతి ఆదివారం మాదిరిగానే ఈరోజు ఉదయం TV 5 News Scan Debate With Vijay చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ కుటుంబ రావు, (టీడీపీ), శ్రీ విష్ణువర్ధన రెడ్డి (బీజేపీ)
4, మే 2019, శనివారం
Live - Time To Ask | Political Heat In Andhra Pradesh After Complete Ele...
శుక్రవారం రాత్రి భారత్ టుడే టీవీ ఛానల్లో శ్రీ సాయి నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ ఆంజనేయులు (బీజేపీ, గుంటూరు నుంచి) శ్రీ మాల్యాద్రి (టీడీపీ, విజయవాడ నుంచి) శ్రీ కృష్ణారెడ్డి (వైసీపీ)
Discussion | CM Chandrababu to hold Cabinet meeting in Next week, Angry ...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ABN ANDHRA JYOTHI PUBLIC POINT ముఖాముఖి చర్చాకార్యక్రమంలో యాంకర్ శ్రీనివాస్ తో నేను.
3, మే 2019, శుక్రవారం
ఎందుకు ఈ ప్రభుత్వాలు పిల్లల జీవితాలతో చెలగాటం అడుతున్నాయి? | Hot Topic ...
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం PRIME 9 NEWS TV CHANNEL జర్నలిస్ట్ సాయి నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ రాం రెడ్డి (బీజేపీ), శ్రీ శ్రీనివాసరెడ్డి (టీఆర్ ఎస్), శ్రీమతి రమాదేవి (జనసేన), శ్రీమతి చండీ ప్రియ (టీడీపీ), శ్రీ జాన్ వెస్లీ (వైసీపీ).
ఇంత జరిగాక కూడా, 10th పరీక్షా ఫలితాల్లో తప్పని తప్పులు | Hot Topic With ...
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం PRIME 9 NEWS TV CHANNEL జర్నలిస్ట్ సాయి నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ రాం రెడ్డి (బీజేపీ), శ్రీ శ్రీనివాసరెడ్డి (టీఆర్ ఎస్), శ్రీమతి రమాదేవి (జనసేన), శ్రీమతి చండీ ప్రియ (టీడీపీ), శ్రీ జాన్ వెస్లీ (వైసీపీ).
నాయకులు, నమ్మకాలు, అంచనాలు, వాస్తవాలు
2014 లో ఏం జరిగింది? 2019 లో ఏం జరుగుతుంది?
‘ఏదో జరుగుతోంది. కానీ ఏం జరుగుతున్నదో అర్ధం కావడం లేదు’ అంటాడు ఓ తెలుగు సినిమాలో జూనియర్ విలన్.
అలా వుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం.
జరిగిన దాన్ని బట్టి జరగబోయేది ఊహించి చెప్పడానికి వీలుంది కాని అదే నిజమని ఖచ్చితంగా చెప్పే వీలు మాత్రం లేదు. అందుకే జరిగినదాన్ని బట్టి జరిగేది అంచనా వేసి చెప్పే ఊహాగానాల పరంపర అవిచ్చిన్నంగా అక్కడ కొనసాగుతోంది.
పోలింగుకు, ఓట్ల లెక్కింపుకు నడుమ దాదాపు నలభయ్ రోజులకు పైగా వున్న వ్యవధానం ఇందుకు ప్రధాన కారణం. మే ఇరవై మూడో తేదీ తర్వాత అసలు విషయం తేలేలోగా ఎవరికి వారు జయాపజయాలు గురించి ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకుంటున్నారు. అధికార తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పటికే ఒకసారి ఎన్నికల్లో పోటీచేసిన తన పార్టీ అభ్యర్ధులతోను, పార్టీకి చెందిన ఇతర నాయకులతోనూ ఒకపర్యాయం సమాలోచనలు జరిపి తమ పార్టీ గెలుపు గురించి భరోసా ఇచ్చారు. మళ్ళీ మరోమారు పార్లమెంటునియోజక వర్గాల వారీగా అభ్యర్ధులు అందరితోను సమీక్షలు జరపాలనే ఓ సుదీర్ఘకార్యక్రమానికి రూపకల్పన చేశారు. ప్రధాన ప్రత్యర్ధి వై ఎస్ జగన్ మోహన రెడ్డి మాత్రం విజయం మీద విశ్వాసంతో సమీక్షల వంటి కార్యక్రమల జోలికి పోకుండా కుటుంబంతో కలిసి విదేశీ యాత్రకు వెళ్ళారు.
సరే! మీడియాలో మాత్రం అనునిత్యం ఈ రెండు పార్టీల ప్రతినిధుల మధ్య ఏదో ఒక విషయంలో చర్చలు, ఘర్షణలు తప్పడం లేదు. ఈలోగా సోషల్ మీడియాలో ఎన్నికల ఫలితాలు గురించి గంటకో సర్వే, పూటకో అంచనా వెలువడుతున్నాయి. మళ్ళీ వాటిమీద వ్యాఖ్యానాలు. తిరిగి వాటిమీద వ్యాఖ్యలు. ఇలా ఆ మాధ్యమంలో అలుపెరుగని అంచనాల దుమారం చెలరేగుతోంది. ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలియని అయోమయం. ఎక్కడోఅక్కడ నలుగురు కలిస్తే చాలు, ఏపీలో ఏం జరుగుతుందనేది మొదటి ప్రశ్నగా మారింది. పత్రికారంగానికి చెందిన మనిషి కనబడితే ఈ ప్రశ్నల పరంపర మరింతగా కొనసాగుతుంది. చెప్పేందుకు ఏమీ లేకపోవడం వల్లనో, ఏం చెబితే ఏం కొంప మునుగుతుందో అనే భయం చేతనో, ఏదీ ఇదమిద్ధంగా తెలియకపోవడం వల్లనో, ప్రస్తుతానికి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటే పోలా అనే ఆలోచన వల్లనో ఏమో కాని మొత్తం మీద ఒక జవాబు సిద్ధం చేసి పెట్టుకోవాల్సి వస్తోంది.
‘పరిస్తితి టైట్ గా వుంది. కొంచెం ఆ పార్టీకి మొగ్గు ఉండొచ్చు. కానీ చివరి వరకు చెప్పలేం, ఏమైనా జరగొచ్చు’. ఇలా అన్నమాట.
ఈ గోడమీది పిల్లివాటం బాపతు జవాబులకు తోడు ఆయా రాజకీయ పార్టీల వీరాభిమానులు అపరిమితమైన ఆత్మవిశ్వాసంతో ప్రకటిస్తున్న ఫలితాల అంచనాలు కొండొకచో వినోదాన్ని కూడా పంచుతున్నాయి.
ఈ నేపధ్యంలో పదిమంది పదిరకాలుగా చెప్పుకుంటున్నారు. పల్లెల్లో రచ్చబండ కబుర్లను పోలివుండే ఆ మాటల సమాహారమే ఇది. కాకపోతే ఇది సర్వే కాదు, ఊహాగానం అంతకంటే కాదు. అన్నీ జరిగినవే. అన్నీ నిజాలే అని ఆ మాటలు చెప్పేవాళ్ళు చెబుతారు. పైగా ఏదీ ఊహాగానం కాదంటారు. వీటిలో వాళ్ళు విన్నవి కొన్ని. మరికొన్ని కన్నవి.
సినిమా వారికి, రాజకీయ నాయకులకు కొన్ని నమ్మకాల మీద నమ్మకం జాస్తి.
ప్రసిద్ధ తెలుగు సినిమా నిర్మాత ఒకరు తను కొత్త చిత్రం నిర్మించిన ప్రతిసారీ తిరుపతికి వెళ్లి వస్తాడు. ఆయన తీసిన సినిమాల్లో సింహభాగం సూపర్ డూపర్ హిట్టు అయ్యాయి. కొన్ని బాక్సాఫీసు వద్ద బోలాపడ్డాయి. దెబ్బతిన్న ఆ సినిమాల విడుదల ముందు కూడా ఆయన తిరుపతి వెళ్లి పూజలు చేశారు. అయినా సరే, ఆయన నమ్మకం కించిత్తు కూడా మారలేదు. అది ఆయన నమ్మకం. ఆ నమ్మకంతోటే ఆయన ప్రతి సినిమా విడుదలకు ముందు తప్పనిసరిగా వెంకన్న దర్శనం చేసుకుంటారు.
ఆ సినిమా రంగం నుంచే రాజకీయ రంగ ప్రవేశం చేసిన నందమూరి తారక రామారావు కూడా ఎన్నికల సమయంలో ఒక విధానాన్ని అనుసరిస్తూ వచ్చారు. ఎన్నికల ప్రచారాన్ని తిరుపతి నుంచి మొదలు పెట్టి మళ్ళీ తిరుపతిలో ముగించడం టీడీపీ అధినేత రామారావుకు ఆనవాయితీ.
ఈసారిజరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కూడా ప్రచారాన్ని తిరుపతి నుంచే మొదలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసారు. కానీ తిరుపతిలో ముగించలేకపోయారు. ప్రచారగడువు గుంటూరు జిల్లాలో ఉండగానే ముగిసిపోయింది. తిరుపతి వెళ్లలేకపోయారు. ఆయన తలచుకుంటే ఆ రాత్రి హెలికాప్టర్ లో ఆ పుణ్యక్షేత్రానికి వెళ్లి ఆ రాత్రి అక్కడ బస చేయగలిగేవారు. కానీ అలా జరగలేదు. వెళ్లి వుంటే బాగుండేదేమో అనేది ఒక తెలుగు దేశం పార్టీ నాయకుడి మనసులోని మాట. ఆయన నమ్మకాలు ఆయనవి. వెళ్ళలేదు కాబట్టి కిందటి మాదిరిగా ఫలితం రాదేమో అనే శంకతో కూడిన నమ్మకం అన్నమాట.
2014 ఎన్నికల సమయంలో కూడా ఇప్పటిమాదిరిగానే వారాల తరబడి ఫలితాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్తితి. అప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన రెడ్డి కుటుంబంతో కలిసి హిమాచల్ ప్రదేశ్ (సిమ్లా) విహార యాత్రకు వెళ్ళారు. ఈ సారి చంద్రబాబు నాయుడు కొద్ది రోజులే అయినా కుటుంబ సభ్యులతో కలిసి అదే రాష్ట్రంలో (సిమ్లా) మూడు రోజులపాటు వేసవి విడిది చేసి సేద తీరారు. ఇలాంటి విషయాలలో మూఢనమ్మకాలు పెంచుకున్న టీడీపీ నాయకులకు మళ్ళీ ఓ అనుమానం. అప్పటి మాదిరిగానే జరుగుతుందేమో అనే భయం. అప్పుడు సిమ్లా వెళ్ళిన జగన్ కు సానుకూల ఫలితం రాలేదు కనుక అదే ఇప్పుడు తమ విషయంలో జరుగుతుందేమో అని మనసు మూలల్లో అలజడి.
మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు స్టేట్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ గా పనిచేసి విశ్రాంత జీవనం గడుపుతున్నారు. ఆయనకు రాజకీయాలు అంటే ఆసక్తి. ఈ మధ్య మాటల మధ్యలో తన అనుభవం ఒకటి చెప్పారు. అది ఆయన మాటల్లోనే.
“2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం తధ్యం అనే దాదాపు అన్ని సర్వేలు జోస్యం చెప్పాయి. సీఎన్ఎన్ ఐబీఎన్ అనే ప్రముఖ టీవీ ఛానల్ కూడా ఓ ప్రసిద్ధ సంస్థ చేత సర్వే చేయించింది. ఆ ఫలితం కూడా వైసీపీకి అనుకూలంగా వచ్చింది. ఈలోగా న్యాయస్థానం ఆదేశాల మేరకు నవ్యాంధ్ర ప్రదేశ్ లోని మునిసిపాలిటీలకు, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నందున ఫలితాలను మాత్రం ఆ ఎన్నికల పోలింగు పూర్తయిన తర్వాతనే ప్రకటించాలని కోర్టు షరతు విధించింది. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల నాటికి టీడీపీకి బీజేపీతో పొత్తుకానీ, జనసేనతో అవగాహన కానీ లేవు. పార్టీ ప్రాతిపదికన జరిగిన ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా విజయం సాధించింది. అయితే ఆ విషయం అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎవరికీ తెలవదు. అసెంబ్లీ పోలింగు పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఫలితాలు ప్రకటించడం జరిగింది.
సీఎన్ఎన్ ఐబీఎన్ టీవీ ఛానల్ కు ఆ సమయంలో ప్రధాన సంపాదకుడిగా వున్న రాజదీప్ సర్దేశాయ్ తాము జరిపిన సర్వేపై నిర్వహిస్తున్న చర్చలో ఈ విషయాన్ని ప్రస్తావించారు కూడా. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సర్వే ఫలితాలకు భిన్నంగా వచ్చే అవకాశం లేదా అని సర్వే జరిపిన సంస్థ ముఖ్యుడిని ప్రత్యక్ష ప్రసారంలో నేరుగా అడిగారు. అంటే అసెంబ్లీ ఫలితాలు టీడీపీకి అనుకూలంగా మారే వీలు లేదా అన్నది ఆయన మనసులోని మాట కావచ్చు. సర్దేశాయ్ వ్యక్తం చేసిన సందేహాన్ని నివృత్తి చేస్తూ ఆ సెఫాలజిస్ట్ ఆనాడు చెప్పిన మాటలు నాకు బాగా జ్ఞాపకం వున్నాయి. ఆయన ఇలా అన్నారు.
“స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సాధించిన విజయం కళ్ళముందు కనబడుతున్న మాట వాస్తవమే. కాదనను. కానీ మా సర్వే నిజం అవుతుందనే అనుకుంటున్నాను. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీ విజయం సాధిస్తుందనేది నా గట్టి నమ్మకం’ (While the empirical evidence of local body elections is against YCP, still my gut feeling is Jagan will come to power.)
కానీ చివరికి జరిగింది ఏమిటి? ఆ ఎన్నికల్లో టీడీపీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సర్వేలో చెప్పిన ఫలితానికి భిన్నంగా జరిగింది.
అది ఆ రిటైర్డ్ బ్యాంకు అధికారి అనుభవం.
నమ్మకాల విషయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ది ఒక విలక్షణమైన తత్వం. తాను నమ్మడమే కాదు, ఇతరులను నమ్మమని కూడా చెబుతారు. అమరావతి నిర్మాణం విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కొన్ని వాస్తు సలహాలు ఇచ్చారని కొన్నేళ్ళ క్రితం పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది కూడా.
నిరుడు చివర్లో జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ స్వయంగా వెళ్లి త్రిదండి చినజీయర్ స్వాముల దర్శనం చేసుకుని వారి ఆశీస్సులు తీసుకున్నారు. నామినేషన్ వేయడానికి ముందు కూడా ఒక దేవాలయానికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకున్న తర్వాతనే ఆయన మిగిలిన పనులు పూర్తిచేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి కూడా అలాగే చేసారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు నామినేషన్ వేసేముందు అక్కడికి ముప్పయి కిలోమీటర్ల దూరంలోని కోనాయ్ పల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఫలితాలు చూసిన తర్వాత, ఈ నమ్మకాలు కేసీఆర్ కి కలిసివస్తున్నట్టే అనుకోవాలి. ఆ ఎన్నికలో కేసీఆర్ తన సమీప ప్రత్యర్ధిపై యాభయ్ వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొండమే కాకుండా అసెంబ్లీలోని 119 స్థానాల్లో 88 సీట్లు గెలిచి వరసగా రెండోమారు తెలంగాణాలో టీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు.
ఈ సారి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సయితం కేసీఆర్ బాటనే అనుసరించినట్టు అనుకోవాలి. పాదయాత్ర ముగింపులో నేరుగా తిరుపతి వెళ్లి, పాదరక్షలు లేకుండా మెట్ల మార్గంలో నడిచి వెళ్లి తిరుమల చేరుకుని ఏడుకొండల వెంకన్న స్వామి దర్శనం చేసుకున్న విషయం, విశాఖ శారదా పీఠాధిపతిని దర్శించి ఆయన ఆశీర్వాదాలు పొందిన వైనం ఇందుకు సాక్ష్యం. అలాగే చిన జియ్యర్ స్వామిని ఆయన ఆశ్రమంలో దర్శించుకుని ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కానీ, వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన రెడ్డి కానీ కేవలం ఇటువంటి నమ్మకాలపైనే పూర్తిగా ఆధారపడి ఎన్నికల వైతరణి దాటే ప్రయత్నం చేసారని చెప్పలేం. వారు తమ తమ పార్టీ నాయకులుగా సమస్త శక్తియుక్తులను ధారపోసి ఎన్నికల్లో విజయం సాధించే కృషి చేసారు. అలాగే కొత్తగా ఎన్నికల రంగ ప్రవేశం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా.
వయసు మీద పడుతున్నా చంద్రబాబునాయుడు ఏమాత్రం సంకోచించకుండా తన కంటే వయసులో చిన్నవారయిన రాజకీయ ప్రత్యర్ధులకు తీసిపోకుండా ఒంటి చేత్తో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్తా కర్మా క్రియా సమస్తం ఆయనే అన్నట్టుగా ప్రచారభారాన్ని తన భుజస్కందాలకు ఎత్తుకున్నారు.
ఇక వైసీపీ అధినేత జగన్ మోహన రెడ్డి సంగతి చెప్పక్కర లేదు. ఈ తడవ ఎన్నికలతో ఆయన రాజకీయంగా పూర్తిగా రాటుతేలినట్టే అని అనుకోవచ్చు. ఏ కొద్ది కాలమో మినహాయిస్తే, గత ఎన్నికల నుంచి ఈ ఎన్నికల వరకు ఆయన పాదయాత్ర పేరుతోనో, మరో పేరుతోనో ప్రజల మధ్యనే ఎక్కువ కాలం గడిపారు.
సినీ రంగానికి చెందినవారు ఎండ కన్నెరుగని సుకుమార జీవులని ప్రతీతి. ఇందుకు భిన్నంగా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ సయితం ఎన్నికల ప్రచారంలో అలుపెరుగకుండా పాల్గొన్నారు.
మానవ ప్రయత్నానికి దైవకృప తోడవుతే మంచి ఫలితాలు వస్తాయని పెద్దలు చెబుతారు. చూడాలి ఎవరి రాత ఎలా వుందో!! (EOM)

అంచనాలు,
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు,
నమ్మకాలూ,
నాయకులు,
వాస్తవాలు
2, మే 2019, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)