8, మే 2019, బుధవారం

డోల్,డోలీ, డోలా- భండారు శ్రీనివాసరావుకమ్యూనిస్టులు వింటున్నారా!
ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల ఐక్యత అవసరం గురించి అప్పుడప్పుడు ఆ పార్టీల నాయకులే నొక్కి నొక్కాణిస్తుంటారు. దీనిపై జర్నలిస్ట్  మితృడు పాశం యాదగిరి వ్యాఖ్య.
“ఈ రెండు పార్టీలు కలివిడిగా  నడిచినా విడివిడిగా నడిచినా డోలు వాయిద్యం వినబడుతూనే వుంటుంది. పూల వాన కురుస్తూనే వుంటుంది.
“కాకపోతే, కలివిడిగా నడిస్తే డోలు చప్పుళ్ళ నడుమ డోలీ(పల్లకి)లో  ఊరేగింపు. విడివిడిగా నడిస్తే డోలా (పాడె)పై ఊరేగింపు. అంతే తేడా!”
ఇది పూర్తిగా యాదగిరి వ్యాఖ్య. దీనిపై వచ్చే డోల్ చప్పుళ్ళకు (కామెంట్లకు) పూర్తి బాధ్యత ఆయనదే సుమా!

కామెంట్‌లు లేవు: