31, డిసెంబర్ 2018, సోమవారం
Debate on AP CM Chandrababu Naidu Comments on CM KCR | Morning Debate | ...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 TV ఛానల్ లో మార్నింగ్ డిబేట్ చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ సురేష్ (టీడీపీ), శ్రీ రఘునాధబాబు (బీజేపీ), శ్రీ అద్దేపల్లి శ్రీధర్ (జనసేన), శ్రీ నారాయణ స్వామి (వైసీపీ). కార్యక్రమ నిర్వహణ: అశోక్
30, డిసెంబర్ 2018, ఆదివారం
Journalist Time Debate on CM KCR's Return Gift to Chandrababu Naidu | KC...
ఈరోజు ఆదివారం ఉదయం పది నుంచి పదకొండున్నర వరకు మహా న్యూస్ ఛానల్ లో అరవింద్ కొల్లి నిర్వహించిన 'జర్నలిస్ట్ టైం" చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్న ఇతర సీనియర్ జర్నలిస్టులు : శ్రీ విక్రం, శ్రీ సతీష్ కమల్, శ్రీ కే.ఎన్. మూర్తి, శ్రీ పాపారావు,
సీనియర్లకు మంత్రి పదవులు దూరమేనా? | News Scan With Vijay | 30th December...
ప్రతి ఆదివారం మాదిరిగానే ఈరోజు ఉదయం TV 5 Channel Vijay's News Scan చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీమతి ఇందిరా శోభన్ (కాంగ్రెస్), శ్రీ దుర్గాప్రసాద్ (టీడీపీ), శ్రీ సీతారాం నాయక్ (టీఆర్ ఎస్. ఎంపీ)
29, డిసెంబర్ 2018, శనివారం
Discussion | KCR may Announce Telangana Cabinet Members and over Seperat...
ప్రతి శనివారంమాదిరిగానే ఈ ఉదయం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పబ్లిక్ పాయింట్ ముఖాముఖి చర్చాకార్యక్రమంలో నాతోపాటు యాంకర్ పవన్
28, డిసెంబర్ 2018, శుక్రవారం
పేరులో’నేముంది’
“ఆకాశవాణి, జీవన స్రవంతి, ప్రత్యేక వార్తలు, చదువుతున్నది భభండారు శ్రీనివాసరావు.....”
“ఇంటి పేరు అంతగా ఒత్తి పలకాలా ! భండారు అంటే సరిపోతుందిగా!’
నలభయ్ ఏళ్ళ క్రితం రేడియో సహోద్యోగి వ్యాఖ్య.
ఇన్నేళ్ళుగా పరిస్తితి ఏం మారినట్టు లేదు.
అదేమిటో నేనే కాదు చాలామందికి పేరు మీదే కాదు, ఇంటి పేరు మీద కూడా వల్లమాలిన మమకారం. బహుశా వ్యక్తిగత గుర్తింపుకు అది దగ్గరి దారి కావచ్చు. శ్రీనివాసరావులు చాలామంది వుండవచ్చు. భండారు శ్రీనివాసరావులు పెక్కురు వుండకపోవచ్చు. వుంటే ఎడ్వర్డ్ చక్రవర్తుల మాదిరిగా ఎడ్వర్డ్ వన్, టు అని తగిలించుకోవచ్చు.
ఇంతకీ నా ఘోష ఏమిటంటే నేను ప్రతి రోజూ వెళ్ళే టీవీల్లో కానీ, కదాచిత్ గా నా పేరు పడే పేపర్లలో కానీ ఏనాడూ నా పేరును చిత్రవధ చేయకుండా ఒదిలిన దాఖలా లేదు. బందరు శ్రీనివాస్ అనీ, బండారు శ్రీనివాసరావనీ, బండారి శ్రీనివాస్ అనీ ఇలా పలురూపాల్లో నా పేరు దర్శనమిస్తూ వుంటుంది. కొండొకచో ఇందువల్ల కొన్ని తలనొప్పులు కూడా తప్పడం లేదు. నిరుడు ఒక పెద్ద మనిషి ఫోను చేసి వాళ్లకు తెలిసిన వాళ్ళ పిల్లవాడికి మా ఇంజినీరింగు కాలేజీలో సీటు ఇప్పించమని అడిగాడు. ‘నా కాలేజీ ఏమిటి’ అని అడిగితే ‘భలేవారే ప్రతి రోడ్డు మీదా మీ కాలేజీ బస్సులు కనబడుతుంటే మీరు భలే జోకులు వేస్తారే’ అన్నాడు.
అప్పటి నుంచి రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఇంజినీరింగ్ కాలేజీ బస్సును కనిపెట్టి చూడడం మొదలు పెట్టాను. చివరికది దొరికింది. దానిమీద “బండారి శ్రీనివాస్ ఇంజినీరింగ్ కాలేజి’ అని రాసి వుంది.
అదట్లా వుంచితే.....
ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమం గురించి పత్రికల్లో వచ్చింది.
నాఇంటిపేరు ‘షరా మామూలే’ - బండారు అనే వేశారు.
ఏమిచెప్పుదు సంజయా!

The Fourth Estate | YSRCP Vanchana Pai Garjana Deeksha - 27th December 2018
ప్రతి గురువారం మాదిరిగానే రాత్రి సాక్షి టీవీ అమర్స్ "ఫోర్త్ ఎస్టేట్' చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ శివ శంకర్ ( వైసీపీ), శ్రీ గంగాధర్ (కాంగ్రెస్), శ్రీ రఘురాం (బీజేపీ).
26, డిసెంబర్ 2018, బుధవారం
ప్రోటోకాల్ అనేది భగవద్గీత ఏమీ కాదు – భండారు శ్రీనివాసరావు
వచ్చే నెల మొదటి వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జరిపే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు దూరంగా వుండి నిరసన తెలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నట్టు పత్రికల్లో వచ్చింది. ప్రధాని వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్వాగతం పలకడం అనేది ప్రోటోకాల్ విధుల్లో భాగం కావచ్చు. గతంలో దాన్ని పక్కన బెట్టి ముఖ్యమంత్రులు వ్యవహరించిన దాఖలాలు వున్నాయి. ఉదాహరణకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.
కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగా లేని స్తితిలో కూడా ఈ మర్యాదలు పాటించిన ముఖ్యమంత్రులు లేకపోలేదు. వీరిలో అగ్రగణ్యులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నూతన భవనం ప్రారంభానికి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధి వచ్చినప్పుడు రాజీవ్ ప్రసంగిస్తున్నంత సేపూ రామారావు ఆయన చెంతనే నిలబడిపోయారు. అలాగే ప్రధాని శ్రీ పీవీ నరసింహారావుకు భార్యతో కలిసి పాదాలు కడిగారు. ఆయన మర్యాదలు ఆవిధంగా ఉండేవి. రాజకీయంగా విబేధించినప్పుడు ఆ పాత్రలో ఆయన వేరేగా కనబడేవారు.
లేబుళ్లు:
ప్రధాని మోడీ,
సిఎం చంద్రబాబు
25, డిసెంబర్ 2018, మంగళవారం
Discussion | CM Chandrababu Naidu Serious Comments On PM Modi's AP Visit...
ఇది మామూలు షేరింగ్ కాదు. నా సొంత గొడవ కొంత వుంది. నా జీవితంలో మూడో వంతు రాజకీయ నాయకులతో గడిచిపోయింది, వృత్తి రీత్యా. రాజకీయ చర్చల్లో పాల్గొనేటప్పుడు వివిధ రాజకీయ పార్టీల అధికార ప్రతినిధులు కూడా వుంటారు. అలాగే ప్రేక్షకుల్లో సయితం అన్ని పార్టీల వాళ్ళు వుంటారు. నేను చెప్పే విషయాలు కొందరికి నచ్చితే, మరికొందరికి నచ్చక పోవచ్చు. ప్రశ్నని బట్టి జవాబు వుంటుంది. కానీ ప్రతి ఒక్కరికీ తమకు నచ్చినదే నా నోటంట వినాలని వుండడం సహజం. కానీ కుదరదు కదా! అలాంటప్పుడు నేను ఏదో మనసులో పెట్టుకుని కావాలనే అలా మాట్లాడుతున్నానని అనుకోవడం కూడా సహజం. కాబట్టి ఇది మనసులో పెట్టుకుని మా వ్యాఖ్యలను మంచి మనసుతో అర్ధం చేసుకోవాలని మనవి.
KSR Live Show: PM a 'hollow' man who 'spends tonne of money Says Chandra...
ప్రతి మంగళవారం మాదిరిగానే ఈరోజు ఉదయం సాక్షి టీవీ KSR LIVE SHOW చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ ప్రకాశ రెడ్డి, వైసీపీ (అనంతపురం నుంచి), శ్రీ రామచంద్రారెడ్డి (కాంగ్రెస్), శ్రీ విల్సన్ (బీజేపీ), శ్రీ పి. ఎల్. శ్రీనివాస్ ( టీఆర్ ఎస్)

24, డిసెంబర్ 2018, సోమవారం
Discussion | CM Chandrababu Naidu Serious Comments on PM Modi's AP Visit...
సోమవారం రాత్రి ABN Andhra Jyothy న్యూస్ ఛానల్లో కవిత నెల్లుట్ల నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ లంకా దినకర్ (టీడీపీ), శ్రీ అంబటి రామకృష్ణ (కాంగ్రెస్), శ్రీ రఘునాధ బాబు (బీజేపీ).
"మా పనిమనిషికి రాజకీయాలు బొత్తిగా తెలవ్వు. టీవీ చర్చల్లో పాల్గొనే ఆయా పార్టీల ప్రతినిధుల పేర్లు కూడా తెలియవు. అయినా వాళ్ళు మాట్లాడే విషయాన్ని బట్టి వాళ్ళు ఏపార్టీవాళ్ళో చెప్పగలిగేస్థాయికి చేరుకుంది."

Did AP CM Chandrababu Naidu Release Facts in White Paper about Developme...
చెప్పాలనుకుని........ భండారు
శ్రీనివాసరావు
శ్రీనివాసరావు
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP
24 X 7 న్యూస్
ఛానల్ లో Debate With Venkata
Krishna చర్చాకార్యక్రమం. శ్రీ రవిచంద్రారెడ్డి
(కాంగ్రెస్), శ్రీ మాల్యాద్రి (టీడీపీ), శ్రీ సత్యమూర్తి (బీజేపీ), శ్రీ
పార్ధసారధి (జనసేన), శ్రీ కరణం ధర్మశ్రీ (వైసీపీ).

ఇలాంటి టీవీ చర్చల్లో ఎన్నో చెప్పాలని
అనుకుంటాం. సమయాభావం కారణంగా కుదరక పోవచ్చు. అలాగే అడగాలని అనుకుంటారు. పరిమితుల కారణంగా అడక్క
పోవచ్చు. కొంప మునిగేదేమీ వుండదు. తెల్లారి లేస్తే మళ్ళీ ఏదో ఒక టీవీలో ఈ చర్చలు
తప్పవు.
అనుకుంటాం. సమయాభావం కారణంగా కుదరక పోవచ్చు. అలాగే అడగాలని అనుకుంటారు. పరిమితుల కారణంగా అడక్క
పోవచ్చు. కొంప మునిగేదేమీ వుండదు. తెల్లారి లేస్తే మళ్ళీ ఏదో ఒక టీవీలో ఈ చర్చలు
తప్పవు.
ఈరోజు ప్రధానమైన చర్చ టీడీపీ వెలువరించిన
శ్వేత పత్రం.
శ్వేత పత్రం.
గత ఆరేడు నెలలకు పైగా కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాల నడుమ, మరీ చెప్పాలంటే బీజేపీ, టీడీపీ ల నడుమ నిధుల విడుదల, వాటి
జమాఖర్చుల విషయంపై బహిరంగ మాటల పోరాటమే నడుస్తోంది. వచ్చే వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన
దీన్ని పరాకాష్టకు చేర్చింది. హామీల అమలుకు పూనుకోని ప్రధాని రాష్ట్ర పర్యటన వల్ల
రాష్ట్రానికి ఒరిగేది ఏమిటని టీడీపీ ప్రశ్న. అనేక శ్వేత పత్రాల రూపంలో ఈ
ప్రశ్నల్ని సంధించడానికి, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి చర్చకు తెర తీయాలన్నది
చంద్రబాబు సంకల్పం. తానూ ఏది చేసినా దానికి తగు ప్రాచుర్యం కల్పించడంలో ఘనాపాటి
అయిన బాబుకు ఇదేమీ పెద్ద విషయం కాదు. అదికాదు విషయం.

ఇదేదో రెండుపార్టీల మధ్య వ్యవహారం
కాదు. రాష్ట్రానికి చాలా చేశానని కేంద్రం చెబుతోంది. విభజన హామీలు నెరవేర్చడంలో
కేంద్రం పూర్తిగా విఫలం అయిందని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఈ మాటలు జనాలకు
కొత్తేమీ కాదు. వాళ్ళు పదేపదే చెబుతున్నవే.
కాదు. రాష్ట్రానికి చాలా చేశానని కేంద్రం చెబుతోంది. విభజన హామీలు నెరవేర్చడంలో
కేంద్రం పూర్తిగా విఫలం అయిందని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఈ మాటలు జనాలకు
కొత్తేమీ కాదు. వాళ్ళు పదేపదే చెబుతున్నవే.
కేంద్రం ఎంత ఇచ్చింది, రాష్ట్రము ఎంత
ఖర్చు పెట్టింది అనే విషయంలో ఎవరి లెక్కలు వారివి. ఈ శ్వేత పత్రాలు అయినా ఆ
సందేహాలను తీరుస్తాయా అంటే అనుమానమే. మామూలు ప్రకటనలకు శ్వేత పత్రాలకు చాలా తేడా
వుంది. ఇవి సాధికారకం. చెప్పి తప్పించుకోవడానికి వీలు వుండదు.

గత కొంత కాలంగా చెబుతున్న విషయాలనే
చర్విత చరణం మాదిరిగా వీటిలో వల్లె వేస్తె ప్రజలకు సరయిన సమాధానం దొరకదు. కేంద్రం
కూడా శ్వేత పత్రాల రూపంలో జవాబు ఇస్తే సందేహాలు కొంతవరకయినా తీరతాయి.
చర్విత చరణం మాదిరిగా వీటిలో వల్లె వేస్తె ప్రజలకు సరయిన సమాధానం దొరకదు. కేంద్రం
కూడా శ్వేత పత్రాల రూపంలో జవాబు ఇస్తే సందేహాలు కొంతవరకయినా తీరతాయి.
కేంద్ర సాయం లేకుండా రాష్ట్రము
ఇబ్బందుల నుంచి గట్టెక్కడం కష్టం. అందుకోసం ధర్మ పోరాటాలు చంద్రబాబు
కొనసాగిస్తున్నారు. ప్రధాని రాకను పురస్కరించుకుని అఖిలపక్షాన్ని వెంటబెట్టుకుని
ప్రధానమంత్రిని రాష్ట్ర పర్యటనలో కలుసుకుని ఉమ్మడిగా ఒక విజ్ఞాపన పత్రం ఇస్తే
దానికి రాజకీయంగా చాలా బలం వుంటుంది. ఒకవేళ ప్రధాని అప్పాయింట్ మెంటు ఇవ్వకపోతే
అప్పుడు తప్పు అటువైపు వుంటుంది.

ఎన్నికలు గుమ్మం ముందు ఉన్న సమయంలో
పాలకపక్షం ఇటువంటి చొరవ తీసుకుంటుందా, అందుకు ప్రతిపక్షాలు కలిసి వస్తాయా?
పాలకపక్షం ఇటువంటి చొరవ తీసుకుంటుందా, అందుకు ప్రతిపక్షాలు కలిసి వస్తాయా?
అనుమానమే. ఎలాంటి అనుమానం లేకుండా ఈ
జవాబు చెప్పొచ్చు.
జవాబు చెప్పొచ్చు.
ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని
రాజకీయ తుపాను కమ్ముకుని వుంది. ఎన్నికలు అయ్యేంతవరకు ఇది తీరాన్ని దాటదు.
రాజకీయ తుపాను కమ్ముకుని వుంది. ఎన్నికలు అయ్యేంతవరకు ఇది తీరాన్ని దాటదు.
22, డిసెంబర్ 2018, శనివారం
IVR Analysis on Political Biopics | IVR Analysis | Mahaa News
ఎన్టీఆర్ బయో పిక్ ఆడియో రిలీజ్ సందర్భంగా మహా న్యూస్ టీవీ ఛానల్ లో శుక్రవారం రాత్రి Editor's Time With IVR కార్యక్రమంలో IVR అడిగిన ప్రశ్నలకు Phone In లో నేను ఇచ్చిన సమాధానాలు/ అభిప్రాయాలు
Discussion | Congress Legislative Council Merge in TRS Party | Part 1 | ...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పబ్లిక్ పాయింట్ ముఖాముఖి చర్చాకార్యక్రమంలో నాతోపాటు యాంకర్ శ్రీనివాస్
Discussion | Congress Legislative Council Merge in TRS Party | Part 2 | ...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పబ్లిక్ పాయింట్ ముఖాముఖి చర్చాకార్యక్రమంలో నాతోపాటు యాంకర్ శ్రీనివాస్
The Fourth Estate | చంద్రబాబు బీసీలకు వెన్నుపోటు - 20th December 2018
ప్రతి గురువారం మాదిరిగానే మొన్న రాత్రి సాక్షి టీవీ అమర్ ఫోర్త్ ఎస్టేట్' చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ పార్ధసారధి (వైసీపీ), శ్రీ రామకృష్ణయ్య (బీసీ నాయకుడు), శ్రీ అంబటి రామకృష్ణ (కాంగ్రెస్), శ్రీ తిరుపతిరావు (బీజేపీ)
21, డిసెంబర్ 2018, శుక్రవారం
తెలంగాణ ఎన్నికలు ముగియటంతో వేడెక్కుతున్న ఏపీ రాజకీయాలు | Mahaa News | #...
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం మహా న్యూస్ అజిత 'సన్ రైజ్ షో' చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ గొట్టిపాటి రామకృష్ణ ( టీడీపీ), శ్రీ సంజీవరెడ్డి (కాంగ్రెస్) అమరావతి స్టూడియో నుంచి, అలాగే హైదరాబాదు స్టూడియో నుంచి శ్రీ త్రిపురనేని చిట్టిబాబు (బీజేపీ), శ్రీ నాగార్జున (వైసీపీ), శ్రీ శ్రీధర్ (విశ్లేషకులు)
తెలుగుదేశం బీజేపీని ప్రశ్నించడం వలనే ఏపీకి ద్రోహం | Mahaa News | #Sunris...
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం మహా న్యూస్ అజిత 'సన్ రైజ్ షో' చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ గొట్టిపాటి రామకృష్ణ ( టీడీపీ), శ్రీ సంజీవరెడ్డి (కాంగ్రెస్) అమరావతి స్టూడియో నుంచి, అలాగే హైదరాబాదు స్టూడియో నుంచి శ్రీ త్రిపురనేని చిట్టిబాబు (బీజేపీ), శ్రీ నాగార్జున (వైసీపీ), శ్రీ శ్రీధర్ (విశ్లేషకులు)
హోదా కంటే ప్యాకేజీ మేలు అని చంద్రబాబే అన్నారు | Mahaa News | #SunriseShow
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం మహా న్యూస్ అజిత 'సన్ రైజ్ షో' చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ గొట్టిపాటి రామకృష్ణ ( టీడీపీ), శ్రీ సంజీవరెడ్డి (కాంగ్రెస్) అమరావతి స్టూడియో నుంచి, అలాగే హైదరాబాదు స్టూడియో నుంచి శ్రీ త్రిపురనేని చిట్టిబాబు (బీజేపీ), శ్రీ నాగార్జున (వైసీపీ), శ్రీ శ్రీధర్ (విశ్లేషకులు)
మట్టి, నీరు అనే పదాలను వ్యతిరేకిస్తున్నాం | Mahaa News | #SunriseShow
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం మహా న్యూస్ అజిత 'సన్ రైజ్ షో' చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ గొట్టిపాటి రామకృష్ణ ( టీడీపీ), శ్రీ సంజీవరెడ్డి (కాంగ్రెస్) అమరావతి స్టూడియో నుంచి, అలాగే హైదరాబాదు స్టూడియో నుంచి శ్రీ త్రిపురనేని చిట్టిబాబు (బీజేపీ), శ్రీ నాగార్జున (వైసీపీ), శ్రీ శ్రీధర్ (విశ్లేషకులు)
19, డిసెంబర్ 2018, బుధవారం
Problems with VVPats During Elections | Prime Time Debate #2 | Mahaa News
బుధవారం రాత్రి మహా న్యూస్ నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్న జర్నలిస్ట్ శ్రీ కొండయ్య, విశ్లేషకులు శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ కఠారి శ్రీనివాస్. కార్యక్రమ నిర్వాహకులు శ్రీ అరవింద్ కొల్లి.
Voters are always Ready For Elections | Analyst Bandaru Srinivas l Prim...
బుధవారం రాత్రి మహా న్యూస్ నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్న జర్నలిస్ట్ శ్రీ కొండయ్య, విశ్లేషకులు శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ కఠారి శ్రీనివాస్. కార్యక్రమ నిర్వాహకులు శ్రీ అరవింద్ కొల్లి.
మాస్కో అనుభవాలపై రాసిన 'మార్పు చూసిన కళ్ళు' పుస్తకం PDF FORMAT లో kinige లో.
నా మాస్కో అనుభవాలపై నేను రాసిన 'మార్పు చూసిన కళ్ళు' అనే పుస్తకం Free Reading పద్దతిలో 'kinige' లో దొరుకుతోంది.
LINK:
http://kinige.com/book/Marpu+Chusina+Kallu?fbclid=IwAR144dvGs7qUs380DIYvVKc9ljfQ0bLeYVHK_tPbiFacqfzhUAX43bab0VA
18, డిసెంబర్ 2018, మంగళవారం
Debate On Cyclone Phethai | Top Story With Sambasiva Rao | TV5 News
ఒక్కోసారి ఇలా కూడా జరుగుతుందన్న మాట. ఫేస్ బుక్ లో నా పోస్టింగును TV 5 సాంబశివరావు గారు నిన్న రాత్రి తమ కార్యక్రమం టాప్ స్టోరీలో ప్రస్తావించారుట. సంతోషం. వారికి ధన్యవాదాలు

17, డిసెంబర్ 2018, సోమవారం
చెప్పాలని అనుకున్నది, చెప్పలేకపోయిందీ..... భండారు శ్రీనివాసరావు
సోమవారం పొద్దున్న “AP 24 X 7
Debate With Venkata Krishna” చర్చాకార్యక్రమం. ప్రసారం అమరావతి స్టూడియో నుంచి. నేను పాల్గొన్నది హైదరాబాదు
స్టూడియో నుంచి. అక్కడికీ ఇక్కడికీ కొన్ని సెకన్ల టైం తేడా వస్తుంది. ఇదొక సమస్య అయితే,
కార్యక్రమం మొత్తం మీద మాట్లాడే అవకాశం తక్కువగా వుండడం మరో సమస్య.
ఈరోజు అలాగే జరిగింది.
“తుపాను ముప్పు ముంగిట్లో వుంటే
చంద్రబాబు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారాలకోసం వెళ్ళడం ఏమేరకు సబబు?”
సరే ఈ ప్రశ్నకు పార్టీల ప్రతినిధులు
వాళ్ళ పార్టీల వైఖరులకు అనుగుణంగానే సమాధానాలు చెప్పారు.
నేను చెప్పాలని అనుకున్నదీ, పూర్తిగా
చెప్పలేకపోయిందీ ఇదీ.
“ఒక ఇంటికి ఇద్దరు అల్లుళ్ళు. ఒకాయన పండక్కి
అత్తగారింటికి వెళ్ళినప్పుడు అక్కడి యావన్మందికీ యేవో కానుకలు పట్టుకు వెడతాడు.
రెండో ఆయన చేతులు ఊపుకుంటూ వెడతాడు. పొరబాటున ఏ పండక్కి అయినా మొదటాయన బహుమతులు
తీసుకు వెళ్ళడం మరచిపొతే ఆ యావన్మందీ మనసులో గొణుక్కుంటారు. ‘చూసారా ఏమీ తేలేదని’
సన్నాయి నొక్కులు నొక్కుతారు. రెండో ఆయన్ని పల్లెత్తు మాట అనరు.
చంద్రబాబు ఈ రెండో అల్లుడి బాపతు. హుద్
హుద్ తుపాను సమయంలో బస్సులోనే మకాం వేసి, ‘సీఎం అంటే ఇలా వుండాల’ని జనం చేత
అనిపించుకున్నాడు. మరి ఇప్పుడు అలా చేయకుండా వేరే పనుల మీద వేరే రాష్ట్రాలకు వెడితే ‘చూసారా మొహం చాటేశాడు’
అదే జనం అంటారు. ఇది ఆయన చేసిన అలవాటే. చీమ చిటుక్కుమన్నా తక్షణం అక్కడ వాలిపోయి ‘పనిచేసే
ముఖ్యమంత్రి’ అని పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నసమయంలో
ఒరిస్సా తుపాను బాధితులను ఆదుకోవడానికి చంద్రబాబు ప్రదర్శించిన చొరవను జనం మెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ పేరే ముందు కాళ్ళకు బంధం అయింది.
ఆయన ఎక్కడ వున్నా తుపాను పరిస్తితిని
ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారని టీడీపీ ప్రతినిధి సమర్ధించుకోవాల్సి వచ్చింది. ‘తిత్లీ
తుపానప్పుడు జగన్ బాధితులను ఎందుకు పరామర్శించలేదు’ అని టీడీపీ నాయకులు అప్పుడు
చేసిన వ్యాఖ్యలను వైసీపీ వాళ్ళు ఇప్పుడు గుర్తుచేస్తున్నారు.
వెంగళరావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు
దివి సీమ తుపాను సంభవించింది. కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి మండలి వెంకట కృష్ణారావు, అప్పటి జిల్లా
కలెక్టర్ ఏవీఎస్ రెడ్డి మొత్తం బాధ్యతను తమ భుజస్కందాలకు ఎత్తుకున్నారు. సీఎమ్ పర్యవేక్షణ హైదరాబాదుకే పరిమితం. అప్పుడున్న పరిస్తితుల
కారణంగా ప్రాణ నష్టాన్ని పెద్దగా నివారించలేకపోయారు. కానీ తదనంతర పరిణామాలను
కట్టుదిట్టంగా అదుపు చేయగలిగారు. అధికారులు గట్టిగా పనిచేసారు. ఆ క్రెడిట్ మాత్రం ముఖ్యమంత్రి ఖాతాకే చేరింది.
నీళ్ళల్లో రోజుల తరబడి నానిపోయి
చూడడానికే భయంకరంగా ఉన్న శవాలను ముట్టుకోవడానికి కూడా ఎవరూ ధైర్యం చేయని
పరిస్తితుల్లో ఆర్ ఎస్ ఎస్ బృందాలు రంగ
ప్రవేశం చేసి వాటికి అంత్యక్రియలు చేయడం ఆరోజుల్లో ప్రజల ప్రశంసలు పొందింది.
కాబట్టి, ముఖ్యమంత్రులు అనేవాళ్ళు ఇలాంటి
సమయాల్లో పైనుంచి పర్యవేక్షణ చేయాలి కానీ స్వయంగా క్షేత్రస్థాయికి వెడితే ప్రచారం
లభిస్తుందేమో కానీ ఆశించిన ఫలితాలు రావు.
ముఖ్యమంత్రి భోపాల్ వెళ్ళాడా లేక
తుపాను ప్రాంతాలలో బస్సులో మకాం వేసారా అనేది అప్రస్తుతం. ఆ ప్రాంతాల ప్రజలను యెంత
బాగా ఆదుకున్నారు అనేదే ముఖ్యం.
ప్రసారం జరుగుతున్నప్పుడు కూడా
చంద్రబాబు ఆయా జిల్లాల కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు ఇస్తున్నారని
చెప్పారు. ఈ ప్రచారం ముఖ్యమంత్రికి మంచి పేరు తేవచ్చు కానీ, అధికారుల విధులకు అది ఆటంకంగా మారుతుంది. ఈ విషయం చంద్రబాబు ఎంత
త్వరగా గుర్తిస్తే అంత మంచిది.
Debate on RSS to Find an Alternative to Modi ...? | The Debate with Venk...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 న్యూస్ ఛానల్ "Debate With Venkata Krishna" చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ రామచంద్రారెడ్డి (కాంగ్రెస్), శ్రీ గొట్టిపాటి రామకృష్ణ (టీడీపీ), శ్రీ గౌతం రెడ్డి (వైసీపీ), శ్రీ రఘురాం (బీజేపీ)
Debate on YS Jagan Comments on AP CM over TRS Alliance | The Debate With...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 న్యూస్ ఛానల్ "Debate With Venkata Krishna" చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ రామచంద్రారెడ్డి (కాంగ్రెస్), శ్రీ గొట్టిపాటి రామకృష్ణ (టీడీపీ), శ్రీ గౌతం రెడ్డి (వైసీపీ), శ్రీ రఘురాం (బీజేపీ)
Debate on Govt Reaction on Pethai Cyclone | The Debate with Venkata Kris...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 న్యూస్ ఛానల్ "Debate With Venkata Krishna" చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ రామచంద్రారెడ్డి (కాంగ్రెస్), శ్రీ గొట్టిపాటి రామకృష్ణ (టీడీపీ), శ్రీ గౌతం రెడ్డి (వైసీపీ), శ్రీ రఘురాం (బీజేపీ)
16, డిసెంబర్ 2018, ఆదివారం
మేం సినిమాలు తీస్తూనే ఉంటాం.. వాళ్ళు చూస్తూనే ఉంటారు | Prakash Rao Comme...
ప్రతి ఆదివారం మాదిరిగానే ఈ ఉదయం విజయ్ నారాయణ్ TV 5 News Scan చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ ప్రకాష్ రెడ్డి (బీజేపీ), శ్రీ క్రిషాంక్ (కాంగ్రెస్), శ్రీ తెలంగాణా ప్రకాష్ (టీఆర్ఎస్)
లవ్ శాల్యూట్!
డిసెంబరు 16, 1971.
47 సంవత్సరాలు నాలాంటి మనిషితో కాపురం
అంటే ఆవిడకి ఎంత ఓపిక వుండివుండాలి. ఉండబట్టే భరించింది.
థాంక్స్ చెప్పకూడదు. చెబితే, ముళ్ళపూడి
వారి భాషలో, వాడు ‘మొగుడు ముండావాడు’ ఎలా
అవుతాడు చెప్పండి.
మా కాపురానికి ఈ రోజుతో నలభయ్ ఏడేళ్ళు. మా ప్రేమ వివాహం కాలపరీక్షను తట్టుకుని నిలిచిందని కాలరు ఎగరేయొచ్చేమో.
సుఖంగా పెరిగి
కష్టాలు పంచుకోవడం ఎంత కష్టమన్నది కష్టాల్లో పుట్టి కష్టాల్లో పెరిగిన వారికి ఓ
పట్టాన అర్ధం కాదు. అందుకే నన్ను కట్టుకుని మా ఆవిడ పడ్డ కష్టాలు నాకెన్నడూ
తెలవదు. తెలిసినా అది ఆమె బాధ్యత అనుకున్నాను, బాధ్యతారాహిత్యానికి
నిలువెత్తు ఉదాహరణ అయిన నేను.
నా కారణంగా కష్టాలు పడ్డా, కన్నసంతానం మాత్రం మా ఆవిడను ఆరుపదులు దాటిన వయస్సులో సుఖపెడుతూనే వున్నారు. నా వల్ల ఆమెకు జరిగిన మేలు ఇదొక్కటేనేమో!.
నా కారణంగా కష్టాలు పడ్డా, కన్నసంతానం మాత్రం మా ఆవిడను ఆరుపదులు దాటిన వయస్సులో సుఖపెడుతూనే వున్నారు. నా వల్ల ఆమెకు జరిగిన మేలు ఇదొక్కటేనేమో!.
“జర్నలిష్టుని
ప్రపంచం భరిస్తుంది. ఆదరిస్తుంది. అభిమానిస్తుంది. కాని అతగాడిని భరించడం
ఎంత కష్టమో తెలిసేది ఆ జర్నలిష్ట్ భార్యకి మాత్రమే”
లేబుళ్లు:
లవ్ శాల్యూట్!,
Wedding Anniversary
15, డిసెంబర్ 2018, శనివారం
ఒంటరిపోరులో విజేత కేసీఆర్ – భండారు శ్రీనివాసరావు
కేసీఆర్ ఒక్కడూ ఒక పక్క. ఇతర
పార్టీలన్నీ మరో పక్క.
ఇలా మోహరించి జరిగిన తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో చివరకు కేసీఆరే గెలిచారు. ఆయన అనుకున్నది సాధించారు.
ఏ రకంగా చూసినా, ఏ కోణం నుంచి
పరిశీలించినా, ఏ విధంగా విశ్లేషించినా ఆయనకిది గొప్ప వ్యక్తిగత విజయం. సందేహం
లేదు.
ఒకరా ఇద్దరా! రాష్ట్ర స్థాయిలోనే కాదు,
జాతీయస్థాయి నాయకులు కూడా నవజాత తెలంగాణా అసెంబ్లీకి జరిగిన తొలి ఎన్నికల
ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నారు. బహిరంగ సభల్లో ప్రసంగించారు. మూలమలుపు
సమావేశాల్లో మాట్లాడారు. రోడ్డు షోలల్లో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, యూపీయే చైర్ పర్సన్
సోనియాగాంధీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధి, పొరుగు రాష్ట్రం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, టీడీపీ
తెలంగాణా శాఖకు చెందిన అతిరధులు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్, అనేకమంది కేంద్రమంత్రులు, ఇతర
రాష్ట్రాల కేబినెట్ మంత్రులు, కొత్తగా బీజేపీలో చేరిన స్వామి పరిపూర్ణానంద ఇత్యాదయః
ఈ జాబితాలో వున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అధిష్టాన దేవతలు అనేకులు రోజుల తరబడి హైదరాబాదులో మకాం వేసి ప్రచార
కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించారు. మరోపక్క టీఆర్ఎస్ అధ్యక్షుడు కే.
చంద్రశేఖరరావు సుడిగాలి పర్యటనలు జరిపి రికార్డు స్థాయిలో అనేక బహిరంగ సభల్లో
అలుపెరగకుండా ప్రసంగించారు. ఆయనకు బాసటగా
మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు నిలిచి పార్టీ ప్రచార బాధ్యతలను తాము పోటీ చేసే
నియోజక వర్గాలకు ఆవలకూడా నెత్తికెత్తుకున్నారు.
అరివీర భయంకరంగా సాగిన ఈ ప్రచార
పర్వంలో ఆయా పార్టీల నాయకుల ప్రసంగాల
తీరు, వాడిన పదజాలం, వాటికి ఉన్న పదును, అది పుట్టించిన వేడి ఇవన్నీ గమనించిన
వారికి ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయా లేదా
అనే సందేహం కలిగిన మాట నిజం.
ప్రచారం ఉధృతంగా సాగినా, నాయకులు కట్టు
తప్పినట్టు కానవచ్చినా, ప్రజలు మాత్రం ప్రశాంతచిత్తులుగా వ్యవహరించి తమ
ప్రజాస్వామిక కర్తవ్యాన్ని సరైన రీతిలో నిర్వర్తించారు.
పోలింగుకు కొద్దిరోజుల ముందుగా మరో
రాజకీయ జాణతనానికి తెరలేచింది. సర్వేరాయుళ్ళు రంగ ప్రవేశం చేసారు. వారి వారి
అంచనాలతో వాళ్ళు, వాటిపై ఊహాగానాలతో మీడియా, ఉభయులు కలిసి ఊహించిన దానికి భిన్నంగా ఏదో జరగబోతోంది అనే
అభిప్రాయాన్ని అటు రాజకీయ పార్టీలలో, సామాన్యజనంలో కల్పించడంలో సఫలీకృతులయ్యారు.
దీనితో ఎవరి అంచనాలను వారికి అనుగుణంగా సవరించుకున్నారు. ఎవరి వ్యూహాలను వారు
తదనుగుణంగా మార్చుకున్నారు. ఫలితంగా ఎత్తులు, పైఎత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలతో
కూడిన మానసిక యుద్ధానికి రంగం సిద్ధం అయింది. పోలింగు ఘడియకు కొద్ది ముందు వరకు
ఇది సాగింది. వంద స్థానాలకు తగ్గవు అంటూ కేసీఆర్ ఆదిలో చెప్పిన మాటనే పలుమార్లు
పునరుద్ఘాటించారు. వైరి పక్షం అందుకు ప్రతిగా తమదే పై చేయి కాబోతోంది అంటూ
ప్రచారాన్ని ఉధృతం చేసింది. ఈ ప్రచారాలు రాజకీయ పార్టీలకు ఏమేరకు లాభించాయో
చెప్పలేము కానీ, బెట్టింగురాయుళ్ళు మాత్రం చెలరేగిపోయారు. పందేల మొత్తం వేలకోట్ల
రూపాయలకు చేరిందని వార్తలు గుప్పుమన్నాయి. ఫలితాలు వెలువడిన తర్వాత పందేలు కాసిన
వాళ్ళలో చాలామంది అదే స్థాయిలో నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. అది వేరే విషయం.
కాకపొతే, ఈ ఎక్జిట్ పోల్స్ వెనుక ‘పందేల’
వ్యాపారవ్యూహం దాగి ఉందేమో అనే అనుమానం మాత్రం సర్వత్రా వ్యాపించింది.
ఈ నేపధ్యంలో జరిగిన ఎన్నికల్లో ఏ
పక్షానికాపక్షం తమదే విజయం అనే నమ్మకాన్ని
గుండెల్లో నింపుకుంది. విజయం తధ్యం అనే విశ్వాసం వున్నా మరో పక్క అనుకున్నది
జరగదేమో అనే శంక కూడా పార్టీలకు పట్టుకుంది. ఈ గుంజాటనల నడుమ పోలింగు పూర్తయింది.
అయినా మోహరించిన పారావారాలు విశ్రాంతి
తీసుకోలేదు. ఫలితం గురించిన తమ ఊహాగానాలను తామే
నమ్ముతూ వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళే పనికి పూనుకున్నాయి. ఈ
ప్రయత్నాలకు ఎక్జిట్ పోల్స్ సహకరించాయి. వీటివల్ల ఏమీ లాభం లేదని తెలిసినా, ఈవీఎంలలో
నిక్షిప్తమయిన ప్రజాతీర్పు మారదని తెలిసినా పంధా మారలేదు.
ఈ ఎన్నికల్లో జరగకూడనివి చాలా జరిగాయి.
డబ్బు పంపిణీ విచ్చలవిడిగా సాగింది. మద్యం ఏరులై పారింది. వీటిల్లో ప్రమేయం లేని
పార్టీలేదేమో. అందుకే గుంభనగా సర్దుకున్నారు కాబోలు.
కాంగ్రెస్ టీడీపీ కలయికతో ఒక కూటమి
ఏర్పాటు, దానికి దన్నుగా చంద్రబాబు ప్రచారం వివాదాంశాలుగా మారాయి. తెలంగాణా
సెంటిమెంటు రగిలించడానికి ఇవి సమిధలుగా మారాయనే వాదం తెర మీదకు వచ్చింది. పట్టణ
ప్రాంతాలలో కొంత ప్రభావం వుండిఉండవచ్చు కానీ పల్లెప్రాంతాల ఓటర్లు మాత్రం కేసీఆర్
ప్రభుత్వానికి సానుకూలంగా ఓటు చేసారనే అనుకోవాలి. ఆయన మొదటినుంచీ చెబుతూ
వచ్చినట్టు ప్రభుత్వం మొదలు పెట్టిన పలు సంక్షేమ, అభివృద్ధి పధకాలే ప్రజలను ఆ
వైపుగా మళ్ళించాయని అనుకోవాలి.
పదకొండో తేదీన ఫలితాలు వెలువడ్డాయి.
కొన్ని సర్వేలకు పూర్తి విరుద్ధంగా, మరి కొన్ని సర్వేలకు ఒకింత దగ్గరగా వచ్చాయి.
వీటితో నిమిత్తం లేకుండా కేసీఆర్ మొదటి నుంచీ చెబుతూ వచ్చిన అంకెలకు సరిపోలుతూ ఫలితాలు
రావడం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. పాలక పక్షానికి చెందిన నలుగురు
సీనియర్ మంత్రులతో పాటు అసెంబ్లీ స్పీకర్ సయితం
ఓటమిపాలవగా, కాంగ్రెస్ పార్టీలో ధిగ్గనాధీరులు పలువురు పరాజయం పాలవడం ఓ
విశేషం. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచి తదనంతర
కాలంలో టీఆర్ఎస్ లో చేరిన పలువురు నాయకులు ఈసారి ఎన్నికల్లో భారీ మెజార్టీలతో
విజయం సాధించడం వల్ల వారి పార్టీ మార్పిళ్ళకు ప్రజామోదం లభించిందని చెప్పుకోవడానికి
అవకాశం దొరికింది. ఎన్నికల్లో గెలిచిన ఎనభై ఎనిమిదిమంది టీఆర్ఎస్ అభ్యర్ధులతో పాటు
గెలుపొందిన మరో ఇద్దరు ఇండిపెండెంట్లు అధికార పార్టీలో చేరడానికి ఉద్యుక్తులు అయిన
కారణంగా అధికార పార్టీ సంఖ్యాబలం తొంభయికి చేరినట్టవుతుంది. ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్
ఇస్తానని కేసీఆర్ చేసిన వ్యాఖ్య మీడియాలో పలు చర్చలకు దారి తీసింది.
క్రితంసారికన్నా అధికంగా, మూడింట
రెండువంతులు బలం సొంతంగా సమకూర్చుకున్న విజయదరహాసంతో కేసీఆర్, గురువారం మధ్యాన్నం రాజభవన్
లో నిరాడంబరంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్రానికి రెండో పర్యాయం
ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్, కేసీఆర్ తోపాటు
గతంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేసి రెవెన్యూ శాఖ నిర్వహించిన మహమూద్ అలీ చేత కూడా
ప్రమాణం చేయించారు. అత్యధిక మంత్రుల చేత ప్రమాణ స్వీకారాలు చేయించే విషయంలో లోగడ ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ గా పనిచేసిన కేసీ అబ్రహాం రికార్డును
నరసింహన్ అధిగమించారని అనుకోవచ్చు.
మహమూద్ ఆలీకి హోం శాఖను
కేటాయిస్తున్నట్టు అధికార ప్రకటన కూడా వెనువెంటనే వెలువడింది. వారంరోజుల్లో
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను కొత్త ప్రభుత్వం విడుదల చేయాల్సివున్నందున కేసీఆర్ ఒక్కరే ప్రమాణస్వీకారం చేయడానికి
కారణంగా చెబుతున్నారు.
గత ముఖ్యమంత్రుల మాదిరిగా మీడియాను
దగ్గరకు రానివ్వరనే పేరున్న కేసీఆర్ తో పత్రికల వాళ్లకు ఓ సౌలభ్యం కూడా వుంది.
కలిసినప్పుడు తన మనసులోని విషయాలను మాయామర్మం లేకుండా వారితో పంచుకుంటారు. అదే
సమయంలో తాను భవిష్యత్తులో ఏమి చేయబోతున్నదీ కూడా ముందస్తుగానే చెప్పేస్తారు.
అదే జరిగింది. త్వరలో జాతీయ పార్టీని
ఏర్పాటు చేసి అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్
కూటములు కాకుండా మరో కూటమి ఏర్పాటుకు
అడుగులు వేయబోతున్నట్టు వెల్లడించారు. ఇది పాత విషయమే అయినా పునరుద్ఘాటించడం గమనార్హం.
రోజు తిరక్కముందే కేటీఆర్ ను టీఆర్ఎస్
పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంటుగా నియమించారు. జాతీయ రాజకీయాలపై మరింత దృష్టి
పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. అధ్యతన భావిలో టీఆర్ఎస్
పార్టీలో చోటు చేసుకోబోతున్న పరిణామాలకు దీన్ని ఒక సంకేతంగా పరిశీలకులు అంచనా
వేస్తున్నారు.
విజయం ఆత్మస్థైర్యాన్ని
ఇనుమడింపచేయడంతో పాటు బాధ్యతను కూడా
పెంచుతుంది. పైపెచ్చు ఇటువంటి అపూర్వ ఘన విజయాల వల్ల ఎదుర్కోవాల్సిన సవాళ్లు కూడా
పెరుగుతాయి.
ఇప్పుడు ముఖ్యమంత్రి గారి గుమ్మం ఎదుట ఎదురు
చూస్తూ కనిపించేది పదవులు కోరుతూ వచ్చే
ఆశావహులే కాదు, ప్రజలకిచ్చిన ఎన్నో మాటలను అనుక్షణం గుర్తు చేసే సవాళ్లు కూడా.
కేసీఆర్ ఒక పార్టీని స్థాపించి దాన్ని
విజయతీరాలకు చేర్చారు.
కేసీఆర్ ఒక గమ్యాన్ని నిర్దేశించుకుని
తెలంగాణా స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు.
కేసీఆర్ ఒక పరిపాలకుడిగా లక్ష్యాలను నిర్ణయించుకుని
మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ వంటి భారీ ప్రాజెక్టులకు ఒక స్వరూపం కల్పించారు.
ఆయనలో ఒక రాజకీయ నాయకుడు వున్నాడు.
ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటూ, బాధ్యతలను సరయిన వారికి అప్పగించడం ద్వారా
సరిగ్గా తాను కోరుకున్న విధంగా ఫలితాలను సాధించే ధీమంతం ఆయన సొంతం.
ఇప్పుడు బంగారు తెలంగాణా బంతి ఆయన
కోర్టులోనే వుంది. తెలంగాణా ఓటర్లు కేవలం ఆయన్ని మాత్రమే నమ్మి బంగారు పళ్ళెంలో
పెట్టి మరీ అధికారం అప్పగించారు.
ప్రస్తుతం ఆ బక్కపలచటి మనిషి భుజాలపై
ఎవ్వరూ అంచనా వేయలేనంత, కంటికి కనపడని
భారం వుంది.
ఎప్పటి మాదిరిగానే ఆయన ఈ కర్తవ్య
నిర్వహణలో సఫలం కాగలరని ఆశిద్దాం.
వారికి మనఃపూర్వక అభినందనలు.
NOTE: Courtesy Image Owner
లేబుళ్లు:
తెలంగాణా ఎన్నికల్లో కేసీఆర్ ఘన విజయం
Discussion on KTR to take oath as Telangana CM ? | Public Point
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పబ్లిక్ పాయింటు ముఖాముఖి చర్చాకార్యక్రమంలో ......నాతోపాటు యాంకర్ పవన్.
Discussion on Supreme Court Rafale Deal Verdict | BJP vs Congress | Publ...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పబ్లిక్ పాయింటు ముఖాముఖి చర్చాకార్యక్రమంలో ......నాతోపాటు యాంకర్ పవన్.
14, డిసెంబర్ 2018, శుక్రవారం
From starting to till now TRS all schemes success | #SunriseShow
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం మహా న్యూస్ 'అజిత సన్ రైజ్ షో' చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ సురేందర్ రెడ్డి (టీఆర్ఎస్), శ్రీ క్రిషాంక్ (కాంగ్రెస్).
If Congress win in elections, who will take charge as CM ? | #SunriseShow
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం మహా న్యూస్ 'అజిత సన్ రైజ్ షో' చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ సురేందర్ రెడ్డి (టీఆర్ఎస్), శ్రీ క్రిషాంక్ (కాంగ్రెస్).
Is BJP aim is to defeat Congress vote bank ? | #SunriseShow
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం మహా న్యూస్ 'అజిత సన్ రైజ్ షో' చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ సురేందర్ రెడ్డి (టీఆర్ఎస్), శ్రీ క్రిషాంక్ (కాంగ్రెస్).
The Fourth Estate | ఏపీని కాపాడాలంటున్న మేధావులు|| Save Andhra Pradesh |...
ప్రతి గురువారం మాదిరిగానే సాక్షి టీవీ 'అమర్' ఫోర్త్ ఎస్టేట్ చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ అంబటి రామకృష్ణ (కాంగ్రెస్), శ్రీ నారాయణ స్వామి (వైసీపీ), శ్రీ ఆంజనేయ రెడ్డి (బీజేపీ, నెల్లూరు నుంచి)
10, డిసెంబర్ 2018, సోమవారం
Debate on Who to See MIM and BJP Alliance in Telangana ...? | The Debate...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 వెంకట కృష్ణ నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ గోవింద రెడ్డి (వైసీపీ), శ్రీ పీ ఎల్ శ్రీనివాస్ ( టీఆర్ ఎస్), శ్రీ రామచంద్రారెడ్డి (కాంగ్రెస్), శ్రీ గొట్టిపాటి రామకృష్ణ (టీడీపీ, అమరావతి బూంచి), శ్రీ చిన్నారెడ్డి (కాంగ్రెస్), శ్రీ ప్రకాష్ రెడ్డి (బీజేపీ, ఫోన్ లైన్లో).
Who is Next CM in Telangana ...? | If Hung Arise in Telangana ...? | The...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 వెంకట కృష్ణ నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ గోవింద రెడ్డి (వైసీపీ), శ్రీ పీ ఎల్ శ్రీనివాస్ ( టీఆర్ ఎస్), శ్రీ రామచంద్రారెడ్డి (కాంగ్రెస్), శ్రీ గొట్టిపాటి రామకృష్ణ (టీడీపీ, అమరావతి బూంచి), శ్రీ చిన్నారెడ్డి (కాంగ్రెస్), శ్రీ ప్రకాష్ రెడ్డి (బీజేపీ, ఫోన్ లైన్లో).
9, డిసెంబర్ 2018, ఆదివారం
Journalist Time | Senior journalists about missing voters votes | Mahaa ...
ఈరోజు ఆదివారం మధ్యాన్నం మహా న్యూస్ అరవింద్ కొల్లి నిర్వహించిన జర్నలిస్ట్ టైం ప్రత్యేక చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్న ఇతర జర్నలిస్టులు : శ్రీ వీరయ్య (సంపాదకులు), శ్రీ కే. వేణుగోపాల్ (సీనియర్ జర్నలిస్ట్), శ్రీ విక్రం (సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్), శ్రీ దుర్గం రవీందర్ (సీనియర్ జర్నలిస్ట్), శ్రీ దేవరకొండ కాళిదాస్ ( సంపాదకులు)
ఏపీలో నాలుగు స్తంభాలాట..! | News Scan Debate With Vijay | TV5 News
ప్రతి ఆదివారం మాదిరిగానే ఈరోజు ఉదయం టీవీ 5 ఛానల్ విజయ్ న్యూస్ స్కాన్ చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ రఘునాధ బాబు (బీజేపీ), శ్రీ కంభంపాటి రామ్మోహన రావు (టీడీపీ), శ్రీ కరణం ధర్మశ్రీ
Journalists Bandari Srinivas and Telakapalli Ravi on drop in voting perc...
ఓటింగు శాతం తగ్గుదలపై TV 9 చర్చలో నాతోపాటు శ్రీ తెలకపల్లి రవి, శ్రీ మురళీకృష్ణ
పూర్తయిన ఒక ప్రజాస్వామ్య క్రతువు – భండారు శ్రీనివాసరావు
(Published in SURYA daily on 09-12-2018, SUNDAY)
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. శీతాకాలంలో చలిమంటలు భుగభుగ రేపిన రాజకీయ పారావారాలు సేదతీరుతున్నాయి. జరిగిన ప్రచార ఉధృతితో పోల్చుకుంటే పోలింగు ప్రశాంతంగా జరిగిందనే చెప్పాలి. అంటే రాజకీయులకంటే ఓటర్లే ఎక్కువ సహనశీలురని అనుకోవాలి.
ప్రజాతీర్పు సీళ్లు వేసిన ఈవీఎంలలో భద్రంగా వుంది. ఎల్లుండికల్లా ప్రజలు ఎవరి పక్షమో తేలిపోతుంది.
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత జరిగిన మొట్ట మొదటి ఎన్నికలు ఇవి. ప్రతిసారి మాదిరిగానే అన్ని రాజకీయ పక్షాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడాయి. నిజం చెప్పాలంటే సర్వశక్తులు ఒడ్డాయి. ఎన్ని నిబంధనలు వున్నా, ఎంతటి నిఘా వున్నా ధనం పంపిణీ విచ్చలవిడిగా జరిగింది. మద్యం ఏరులై పారింది. పట్టుకున్న డబ్బు అనేక కోట్లు అని లెక్క తేలింది. పట్టుపడనిది ఇంకెంత అనేది అంచనాలకే అందడం లేదు. ఇందులో ఎవరో ఒకరిని వేలెత్తి చూపే పని లేదు. అనునిత్యం ప్రవచనాలు వల్లించే వారందరూ ఈ ప్రలోభాల ప్రహసనంలో పాత్రధారులు కావడం ఓ విషాదం.
ఓటర్లను తమవైపు ఆకర్షించడానికి పార్టీలు వెయ్యని ఎత్తులు లేవు. దిగజారని లోతులు లేవు. బహిరంగ సభలు, రోడ్డు షోలకు ఎంతఖర్చు అయిందో అని వాటిని చూసిన సామాన్యుడి గుండె గుభేల్ అంటోంది కానీ పార్టీలకి చీమ కుట్టినట్టయినా లేదు. ఆయా పార్టీల అధినాయకులు హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాలను వెనుకటి కాలంలో దొరలు కచ్చడపు ఎడ్లబళ్ళు వాడినట్టు లెక్కలేకుండా వాడారు. కొన్ని పార్టీలు దిన పత్రికల్లో పూర్తి పేజి ప్రకటనలు వరసగా కొన్ని రోజులపాటు ఇచ్చి అది పత్రికో, పార్టీ కరపత్రమో తెలియకుండా చేసాయి. ఇక టీవీల్లో రకరకాల దృశ్యాలతో కూడిన ప్రకటనలతో ఓటర్లను ఆకట్టుకునే ఠక్కుటమార, గజకర్ణ, గోకర్ణ విద్యలు ప్రదర్శించాయి. ఇవన్నీ చూసిన తర్వాత కూడా అభ్యర్ధులు, ఆయా పార్టీలు తమకు నిర్దేశించిన వ్యయపరిమితి లోపలనే ఖర్చు చేశామని ఎన్నికల సంఘానికి సమర్పించే అఫిడవిట్లు కేవలం జనాల కళ్ళకు కట్టే గంతలే అనుకోవాలి.
ఇక ఈ ప్రచారంలో కొందరు నేతలు వాడిన భాష కంపరం కలిగించేదిగా వుంటే, మరి కొందరు ప్రత్యర్ధులపై చేసిన ఆరోపణలు వాస్తవాలకు ఆమడ దూరంలో వున్నాయి. ఒకప్పుడు శత్రువులుగా వుండి ఆపద్ధర్మానికి మిత్రులు అయిన వాళ్ళు, ప్రచ్చన్నంగా మిత్రులుగా ఉంటూ పైకి మాత్రం పరుష పదజాలాలతో కడిగి గాలించేవాళ్ళు ఇలా తమదయినా రీతిలో ప్రజలను అయోమయంలోకి నెట్టే ప్రయత్నాలు ఈసారి ప్రచారంలో అలుపు లేకుండా సాగాయి. ఎన్నికల ప్రణాలికల్లో పొందు పరచిన హామీలు కూడా ఒకదాన్ని మించి మరొకటి వేలం పాటలను తలపించాయి.
తెలంగాణా ప్రాంతంలో జరిగిన పోలింగులో ప్రత్యేక ఆకర్షణ ఒకటుంది. ఒక రకంగా అది రికార్డు కూడా.
కొన్ని దశాబ్దాలుగా ‘బ్యాలెట్ వద్దు, బులెట్ ముద్దు’ అంటూ విప్లవ గీతాలతో ప్రజలను ‘కిర్రెక్కించిన’ గద్దర్ మహాశయులు ఈసారి పోలింగు కేంద్రానికి వచ్చి ఓటు వేసి వెళ్ళడం మీడియాకు మంచి ముడి సరుకుగా మారింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఈసారి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చాలా చక్కగా, పకడ్బందీగా చేసింది. వికలాంగులకు చక్రాల కుర్చీలు ఏర్పాటు చేయడం మొదలయిన చర్యలు ప్రజల మన్ననలు పొందాయి. పోలింగు కేంద్రాలకు వెళ్లి ఓటు వేసిన వాళ్ళు అక్కడి ఏర్పాట్లను, కల్పించిన సదుపాయాలను మెచ్చుకుంటున్నారు. అయితే, ‘తాళము వేసితిని, గొళ్ళెము మరచితిని’ తరహాలో ఓటర్ల పేర్లు జాబితాల్లో లేకుండా గల్లంతు కావడం చాలామందిని నిరాశ పరచింది. కొందరయితే ఆగ్రహం పట్టలేకపోయారు. చేతిలో ఓటరు గుర్తింపు కార్డు వున్నా, జాబితాలో పేరు లేకపోవడం వల్ల ఓటుహక్కు వినియోగించుకోలేని పరిస్తితిని వారు జీర్ణించుకోలేకపోయారు. ఇటువంటి అతి ముఖ్యమైన అంశం పట్ల అశ్రద్ధ చూపారనే అపప్రధను సంబంధిత అధికారులు మోయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఆ ఇబ్బందిని కొంతవరకు అర్ధం చేసుకోవచ్చు. కానీ వేల సంఖ్యలో ఓటర్ల పేర్లు గల్లంతు కావడాన్ని ఎవరూ సమర్ధించరు. ఇది ఖచ్చితంగా ఎన్నికల సంఘం తప్పిదంగానే ఎంచాల్సి వుంటుంది. ఓట్లు గల్లంతు అయినట్టు స్వయంగా ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ కూడా అంగీకరించారు. అందుకు మన్నించాలని కోరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి ఓటర్ల జాబితాను ఎటువంటి స్ఖాలిత్యాలు లేకుండా సవరించగలిగితే ఈ క్షమాపణలకు అర్ధం వుంటుంది.
ఇది ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశం. ఓటర్లకు సంబంధించిన మరో అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రత్యేకించి నగర, పట్టణ ప్రాంతాల్లో పోలింగు శాతం నానాటికి తీసికట్టు చందంగా తయారవుతోంది. సమాజం పట్ల వ్యక్తులకు ఉండాల్సిన బాధ్యతలు గురించీ, పౌరధర్మాలు గురించీ సామాజిక మాధ్యమాల్లో అనునిత్యం ప్రవచనాలు గుప్పించే బుద్ధి జీవులు, ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఇచ్చిన ప్రత్యేక సెలవును పూర్తిగా దుర్వినియోగం చేసుకున్నారు. పోలింగుకు వెళ్ళకుండా మొహం చాటేయడం నిజంగా గర్హనీయం. ఇచ్చిన సెలవు దినాన్ని సరదాగా గడపడానికి తప్ప ఒక విద్యుక్త ధర్మ నిర్వహణకోసం కల్పించిన వెసులుబాటుగా వారికి అనిపించకపోవడం శోచనీయం.
‘ఇంట్లో చేసుకోవాల్సిన పనులు ఎన్నో వున్నాయి. ముందు ఓటు వేసి ఆ తర్వాతే ఆ పనుల సంగతి చూసుకుంటాను’ అని చంకలో పసిపిల్లను పెట్టుకుని విలేకరులతో చెబుతున్న ఓ సామాన్య గృహిణి మాటలను టీవీల్లో విని అయినా పోలింగుకు వెళ్లకపోవడం ఏ లెక్కన చూసినా క్షమార్హం కాదు.
ఇక ఈ ఎన్నికల్లో రాజకీయ కోణాన్ని చూస్తే....
తెలంగాణా అసెంబ్లీకి జరిగిన ఎన్నికలకు జాతీయ స్థాయిలో ప్రాముఖ్యం రావడానికి ఓ కారణం వుంది.
మరో ఆరు నెలలలోపే సార్వత్రిక ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా యూపీఏను బలమైన ప్రత్యామ్నాయంగా రూపొందించడానికి తెలుగుదేశం నాయకుడు చంద్రబాబునాయుడు తెలంగాణా ఎన్నికలను ఒక ప్రయోగశాలగా ఎంపిక చేసుకున్నట్టు కానవస్తుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఫలించిన వ్యూహాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడం కోసమే చంద్రబాబు కాంగ్రెస్ తో జత కట్టడం జరిగింది. తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించినంతవరకు ఇది అనూహ్య పరిణామమే. వచ్చేఏడాది మొదట్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికలలో ఎదురీదాల్సిన పరిస్తితి వుందన్న వాస్తవం తెలియని రాజకీయ నాయకుడు కాదాయన. తెలంగాణాకు ముందస్తు ఎన్నికలు జరగడం కూడా చంద్రబాబుకు కలిసి వచ్చింది. లేని పక్షంలో తెలంగాణా ప్రాంతంలో ఇంత ఉధృతంగా, రోజుల తరబడి ప్రచారం చేయగలిగే సావకాశం ఆయనకు దొరికేది కాదు. తెలంగాణాలో ప్రజాకూటమిని గెలిపించుకోగలిగితే ఆ విజయం తాలూకు సానుకూల ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఓటర్లపై పడుతుందని, తద్వారా తమ పార్టీ విజయావకాశాలు మెరుగుపడతాయని ఆయన నమ్మకం. దాదాపు ఇదే అభిప్రాయంతో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ ప్రయోగానికి పచ్చజెండా చూపి ప్రజాకూటమిలో భాగస్వామి అయింది. ఆ పార్టీ దృష్టి సహజంగా జాతీయ రాజకీయాలపైన వుంటుంది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి కూడా తెలంగాణాలో ప్రజాకూటమి గెలుపు ఆవశ్యకం. ఈ ప్రయోగం విజయవంతం అయితే దాని ప్రభావం రానున్న సార్వత్రిక ఎన్నికల మీద ఉంటుందని, మోడీని గద్దె దించాలనే తమ లక్ష్యసాధనకు ఉపకరిస్తుందని ఆయన యోచనగా అనుకోవచ్చు. అటు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుకు, ఇటు జాతీయ స్థాయిలో రాహుల్ కు ఈ కలయిక ప్రయోజనకారి కాగలదన్న నమ్మకమే ఉప్పూనిప్పూ లాంటి వారిద్దరినీ ఒక దగ్గరకు చేర్చింది. తెలంగాణాలో ఎన్నికల్లో పొత్తులో భాగంగా జరిగిన సీట్ల సర్డుబాట్లలో తెలుగుదేశం పార్టీ ఒకింత తగ్గి వ్యవహరించడానికి కూడా ఇదే కారణం.
సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడి ప్రతిఫలించినట్టు తెలంగాణా ఎన్నికల ఫలితం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద తప్పనిసరిగా ఉంటుందనే విశ్వాసంతో చంద్రబాబు, జాతీయ స్థాయిలో కలిసిరాగలదని రాహుల్, ఇరువురూ ఇంతటి విస్తృత స్థాయిలో ప్రచారంలో పాల్గొనడానికి కారణమని అనుకోవచ్చు.
ఇక తెలంగాణా ఎన్నికల్లో భారీ ప్రచారానికి నోచుకున్న అంశం మరోటుంది. ప్రీ పోల్, ఎక్జిట్ పోల్ పేరిట వివిధ సంస్థలు నిర్వహించిన ఒపీనియన్ పోల్స్.
అభిప్రాయ సేకరణ పేరుతొ సాగుతున్న ఈ తతంగం ఒక్కోసారి పార్టీలకు, అభ్యర్ధులకు తలనొప్పిగా మారుతోంది. పలానా పార్టీకి విజయావకాశాలు వున్నాయంటూ పోలింగుకు ముందే ప్రీ పోల్ సర్వే పేరుతొ వెలువడే సర్వేలు క్రమేణా తమ ప్రామాణికతను కోల్పోతున్నాయని చెప్పక తప్పదు. ఈ రకమైన ప్రీ పోల్ సర్వేల ద్వారా తటస్థ ఓటర్లను తమవైపు మొగ్గేలా చేసుకోవడానికి కొంతవరకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయనే భ్రమతో కొందరు అభ్యర్ధులు, పార్టీలు లక్షలాది రూపాయలు వీటి మీద వెచ్చిస్తున్నారనే విషయం కూడా సత్యదూరం కాదు.
అలాగే ఎక్జిట్ పోల్ సర్వేలు. ఒక్కసారి పోలింగు పూర్తయిన తర్వాత వెలువడే ఈసర్వేలకు, అభ్యర్ధుల జాతకాలను మార్చే శక్తి ఉండని మాట నిజమే. అయినా వీటి కోసం లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయనే బలమయిన అభిప్రాయం జనంలో వుంది. దీనికి కారణం పార్టీలు, అభ్యర్ధుల జయాపజయాల మీద జరుగుతున్న బెట్టింగులు అని కొందరు చెబుతున్నారు. పోలింగు తేదీకి, ఓట్ల లెక్కింపు తేదీకి నడుమ ఉన్నవ్యవధానంలో ఈ బెట్టింగులు తారాస్థాయికి చేరుకుంటాయని, వాటికి ఈ ఎక్జిట్ పోల్స్ ఒక ప్రాతిపదికను ఏర్పరుస్తాయని వారంటారు. ఇందులో నిజమెంతో నిర్దారించేవాళ్ళు లేరు. అయితే, నిజమేనేమో అని సందేహించడానికి మాత్రం కొంత ప్రాతిపదిక ఉన్న మాట కూడా నిజం. కోళ్ళ పందేలు, క్రికెట్ బెట్టింగులు చట్ట రీత్యాశిక్షార్హమైన నేరాలు అయినప్పుడు ఈ ఎక్జిట్ పోల్స్ వెనుక దాగున్న మర్మం ఏమిటో వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఎన్నికల రంగంలో నిలబడే అభ్యర్ధులు పెట్టే ఖర్చుకు దీటుగా ఈ బెట్టింగులు సాగుతాయనే వదంతులు విచ్చల విడిగా వినబడుతున్నప్పుడు ఈ అంశంపై ఓ కన్నేయడం సంబంధిత అధికారుల ప్రధమ కర్తవ్యమ్.
లేబుళ్లు:
ముగిసిన తెలంగాణా ఎన్నికలు
8, డిసెంబర్ 2018, శనివారం
Jayaprakash Narayan Analysis on Exit Polls Survey | The Debate with VK |...
వివిధ ఎక్జిట్ పోల్స్ సర్వే ఫలితాలపై ఏపీ చానల్ లో వెంకట కృష్ణ నిర్వహించిన శుక్రవారం రాత్రి నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతొ పాటు పాల్గొన్న వాళ్ళు: శ్రీ జయప్రకాష్ నారాయణ, శ్రీ ఎస్. వీరయ్య (ఎడిటర్), శ్రీమతి మాధవి (బీజేపీ)
Discussion on Exit Poll Results | Lagadapati Rajagopal Survey Result | P...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ఏబీఎన్ ఆంధ్రజ్యొతి పబ్లిక్ పాయింట్ ముఖాముఖి చర్చాకార్యక్రమంలో నాతోపాటు యాంకర్ శ్రీనివాస్
7, డిసెంబర్ 2018, శుక్రవారం
ఊహాతీత చర్చలు – భండారు శ్రీనివాసరావు
శుక్రవారం ఉదయం ఏడుగంటలకు మహా న్యూస్ తో మొదలయి, @ న్యూస్
రిపబ్లిక్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 1, టీవీ 9,
ఏపీ 24
X 7 ఛానల్
డిబేట్ తో రాత్రి ఎనిమిదిన్నరకు నా టీవీ సంచారం ముగిసింది. పోలింగు నాడే ఫలితాలు
గురించీ, పోలింగు ముగిసిన తర్వాత సాయంత్రం నుంచి ఎక్జిట్ పోల్స్, ఇలా ఊహాగాన చర్చలు నిరంతరంగా సాగాయి.
మధ్యాహ్న భోజనం మిస్సయినా, మధ్యలో వీలు
చేసుకుని పోలింగు కేంద్రానికి వెళ్లి ఓటు వేయడం మాత్రం మిస్సవలేదు. అదో ఊరట.
ఘడియ తీరిక లేదు, గవ్వ రాబడి లేదు అనే
సామెత నా లాంటి వారిని చూసి పుట్టిందేమో!
5, డిసెంబర్ 2018, బుధవారం
దేవుడిని కాకపోయినా ఓటరుని
1976 నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటూ వస్తున్నాను. అంటే సీనియర్ ఓటర్నే. కానీ నా సీనియారిటీ పోటీ చేస్తున్న అభ్యర్ధులకు తెలిసినట్టు లేదు. అయినా నా ఓటు వల్ల ఉపయోగం లేదనుకున్నారేమో తెలియదు. ఎవ్వరూ మా ఇంటి వైపు కన్నెత్తి చూడలేదు. దానికి బాధ లేదు. ఎలాంటి ఆబ్లిగేషన్ లేకుండా నా ఓటు నాకు నచ్చిన వారికి వేయవచ్చు. టీవీ చర్చల్లో నాతోపాటు పాల్గొనేవాళ్లు ఒకరిద్దరు కూడా మా నియోజకవర్గం నుంచి బరిలో వున్నారు. కలిసినప్పుడు చెప్పాను కూడా. అయినా ఎవరూ ఫోన్ కూడా చేయలేదు. అంతవరకూ అదృష్టవంతుడినే.
ఇంతవరకు ఎవ్వరూ రాకపోయేసరికి, ఆఖరికి ఎలక్షన్ కమిషన్ వాళ్ళిచ్చే చీట్లు కూడా రాకపోయేసరికి అసలు జాబితాలో వున్నానా లేనా అనే సందేహం కలిగి సీఈఓ వెబ్ సైట్ శోధించాను. ఓటయితే వున్నది. పోలింగు కేంద్రం వివరాలు కూడా వున్నాయి. కాకపొతే పదడుగుల దూరంలో ఉన్న కేంద్రం కాకుండా పది ఫర్లాంగుల దూరంలో ఉన్న కేంద్రానికి వెళ్ళాలి. ఆటకు తక్కువ, నడక్కు ఎక్కువ. పరవాలేదు. మాఇంట్లో అందరికీ ఓట్లు వున్నట్టు నా శోధన తెలిపింది.
పొతే, మా అపార్ట్ మెంట్లో మరో డజను ఫ్లాట్లు వున్నాయి. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు వాకబు చేసుకుంటున్నారు, చీట్లు వచ్చాయా లేదా అని. రాలేదు. రాకపోతే పాయె, ఓట్లయితే వున్నాయి.
అదే పది వేలు.
చిత్రం ఏమిటంటే మా ఏరియాలో ఉన్న అనేక మంది తెలిసిన వాళ్లకు ఫోటోతో ఉన్న ఓటరు చీట్లు వచ్చేసి చాలా రోజులయింది.
4, డిసెంబర్ 2018, మంగళవారం
KSR Live Show | రేవంత్ రెడ్డి ముందస్తు అరెస్ట్ - 4th December 2018
ప్రతి మంగళవారం మాదిరిగానే ఈరోజు ఉదయం సాక్షి టీవీ 'కేఎస్ఆర్ లైవ్ షో' చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీమతి సునీత (టీబీజేపీ), శ్రీ దేవేందర్ రెడ్డి (టీకాంగ్రెస్), శ్రీ నాగేష్ (టీఆర్ఎస్).

CPS pre-poll survey : Public Pulse || Telangana Assembly Elections 2018 ...
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలపై సెంటర్ ఫర్ సెఫాలజి సర్వీస్ సంస్థ వాళ్ళు నిర్వహించిన సర్వే ఫలితాలను సోమవారం రాత్రి TV 9 ఛానల్ ప్రసారం చేసింది. ఈ సందర్భంగా క్లుప్తంగా నిర్వహించిన చర్చలో నాతోపాటు సి పి ఎస్ సంస్థ నిర్వాహకులు శ్రీ వేణుగోపాల్, శ్రీ మురళీకృష్ణ (TV 9) పాల్గొన్నారు.
3, డిసెంబర్ 2018, సోమవారం
Debate on Is Possible 33% Reservation For BC in Legislatures | The Debat...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 టీవీ చానల్ Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీమతి మాధవి (బీజేపీ), శ్రీ శ్రీనివాస్ (టీఆర్ఎస్), శ్రీ రామచంద్రారెడ్డి (కాంగ్రెస్), శ్రీ పట్టాభి (టీడీపీ)
Reasons Behind Jr NTR and Nara Lokesh Not Campaign in Telangana Election...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 టీవీ చానల్ Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీమతి మాధవి (బీజేపీ), శ్రీ శ్రీనివాస్ (టీఆర్ఎస్), శ్రీ రామచంద్రారెడ్డి (కాంగ్రెస్), శ్రీ పట్టాభి (టీడీపీ)
Congress Senior Leader Jairam Ramesh Sensational Comments on Harish Rao ...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 టీవీ చానల్ Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీమతి మాధవి (బీజేపీ), శ్రీ శ్రీనివాస్ (టీఆర్ఎస్), శ్రీ రామచంద్రారెడ్డి (కాంగ్రెస్), శ్రీ పట్టాభి (టీడీపీ)
Why Political Leaders Highlights Settler Topic in Election Campaigns ?|T...
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 టీవీ చానల్ Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీమతి మాధవి (బీజేపీ), శ్రీ శ్రీనివాస్ (టీఆర్ఎస్), శ్రీ రామచంద్రారెడ్డి (కాంగ్రెస్), శ్రీ పట్టాభి (టీడీపీ)
2, డిసెంబర్ 2018, ఆదివారం
News Scan LIVE Debate With Vijay | 2nd December 2018 | TV5News
ప్రతి ఆదివారం మాదిరిగానే ఈరోజు ఉదయం TV 5 Ravipati Vijay's News Scan చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు శ్రీ తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్), శ్రీమతి ఇందిరా శోభన్ (టీకాంగ్రెస్).
1, డిసెంబర్ 2018, శనివారం
బెజవాడ రేడియోకు డెబ్బయ్యేళ్ళు
1936లో అప్పటి ఆంగ్లేయ ప్రభుత్వం, భారత దేశంలో రేడియో వ్యాప్తిని గురించి పరిశీలించడానికి నిపుణులను నియమించింది. అప్పుడు మద్రాసు రాజధానిలో తమిళ జిల్లాలతో పాటు కొన్ని తెలుగు, కన్నడ, మళయాళ జిల్లాలు కూడా కలిసివుండేవి. మద్రాసునుంచి నాలుగు భాషల్లో ప్రసారాలు చేయాలనీ, విజయవాడ నుంచి కానీ, రాజమండ్రి నుంచి కానీ తెలుగు ప్రసారాలు చేయాలని మొదట్లో అనుకున్నారు. కానీ చివరకు తెలుగు కార్యక్రమాలను కూడా మద్రాసు నుంచే ప్రసారం చేయాలని నిర్ణయించారు.
“1947లో దేశం స్వాతంత్రం సాధించేనాటికి, ఆలిండియా రేడియో వ్యవస్థలో ఢిల్లీ, కలకత్తా (కోల్ కతా), బొంబాయి(ముంబై), మద్రాసు(చెన్నై), లక్నో, తిరుచిరాప్పళ్లి (తిరుచి, ట్రిచి)రేడియో కేంద్రాలు మాత్రమే వుండేవి. మద్రాసు నుంచే కాక డెక్కన్ రేడియో నుంచి, మైసూరు నుంచి(చాలా అరుదుగా) తెలుగు ప్రసారాలు జరిగేవి. స్వాతంత్రం వచ్చిన తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సమాచార, ప్రసార శాఖల మంత్రి అయ్యారు. ఆయన పర్యవేక్షణలో దేశంలో రేడియో వ్యాప్తికి కృషి మొదలయింది. 1956 నుంచి ఆలిండియా రేడియో సంస్థను ‘ఆకాశవాణి’గా పేర్కొంటున్నారు.
“1948 అక్టోబర్ 12 నాడు విజయవాడలో రేడియో కేంద్రం మొదలయింది. దీనితో మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి.
డెక్కన్ రేడియో (హైదరాబాదు, ఔరంగాబాదు) రేడియో కేంద్రాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. 1950 ఏప్రిల్ ఒకటో తేదీన హైదరాబాదు రేడియో కేంద్రం ‘ఆలిండియా రేడియో’ వ్యవస్థలో భాగంగా పనిచేయడం ప్రారంభించింది.
“1955 నవంబర్ రెండో తేదీన మొదలయిన బెంగలూరు రేడియో కేంద్రం, 1963 జూన్ లో మొదలయిన పోర్ట్ బ్లేయర్ కేంద్రం కూడా తెలుగులో ప్రసారాలు చేస్తున్నాయి. 1957 అక్టోబర్ మూడో తేదీన మొదలయిన ‘వివిధ భారతి’ ప్రసారాలలో తెలుగు పాటలు రోజూ అరగంట సేపు వేసేవారు. 1969 సెప్టెంబర్ లో ఢిల్లీ, పాట్నా, రాంచీ, సిమ్లా రేడియో కేంద్రాల నుంచి తెలుగు నేర్పే పాఠాలు ప్రారంభించారు. 1991 మార్చి రెండో తేదీన హైదరాబాదు, విజయవాడలలో వాణిజ్య ప్రసారాలు మొదలుపెట్టారు.
“కాలక్రమేణా కడపలోను, విశాఖపట్నంలోను ఆకాశవాణి కేంద్రాలు ఏర్పాటయ్యాయి. స్థానికంగా అంటే జిల్లా స్థాయిలో రేడియో సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో మొదలు పెట్టిన తొలి స్థానిక రేడియో కేంద్రాలలో ఆదిలాబాదు కేంద్రం ఒకటి. వరంగల్లులో 1990 ఫిబ్రవరి 17 వ తేదీనాడు ప్రారంభమైన ఆకాశవాణి కేంద్రం, ఆకాశవాణి వ్యవస్థలో ఏర్పడ్డ నూరవ కేంద్రంగా చరిత్రకెక్కింది. ప్రస్తుతం ఆకాశవాణి వ్యవస్థలో మన రాష్ట్రంలో హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, కడప, ఆదిలాబాదు, కొత్తగూడెం, వరంగల్లు, నిజామాబాదు, తిరుపతి, అనంతపురం, కర్నూలు, మార్కాపురం మొదలైన చోట్ల తెలుగులో కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. మాచెర్ల, కరీంనగర్, సూర్యాపేట మొదలయిన చోట్ల ప్రసార వ్యవస్థలు వున్నాయి. వంద వాట్ల సామర్ధ్యం కలిగిన ట్రాన్స్ మిటర్లను ఒంగోలు, నెల్లూరు, కామారెడ్డి, బాన్స్ వాడ, నంద్యాల, ఆదోని, కాకినాడ మొదలయిన చోట్ల ఏర్పాటు చేశారు”
(ఇతి వార్తాః)
(హైదరాబాదు ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ ఎస్ గోపాల కృష్ణ అందించిన వివరాల ఆధారంగా)
లేబుళ్లు:
బెజవాడ రేడియోకు డెబ్బయ్యేళ్ళు
Discussion on Lagadapati Rajagopal Sensational Survey on Telangana Elect...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ 'పబ్లిక్ పాయింట్' ముఖాముఖి చర్చాకార్యక్రమంలో నాతోపాటు యాంకర్ శ్రీనివాస్

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)