7, డిసెంబర్ 2018, శుక్రవారం

ఊహాతీత చర్చలు – భండారు శ్రీనివాసరావు


శుక్రవారం ఉదయం  ఏడుగంటలకు మహా న్యూస్ తో మొదలయి, @ న్యూస్ రిపబ్లిక్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 1, టీవీ 9,  ఏపీ 24 X 7  ఛానల్ డిబేట్ తో రాత్రి ఎనిమిదిన్నరకు నా టీవీ  సంచారం ముగిసింది. పోలింగు నాడే ఫలితాలు గురించీ, పోలింగు ముగిసిన తర్వాత సాయంత్రం నుంచి ఎక్జిట్ పోల్స్,  ఇలా  ఊహాగాన చర్చలు నిరంతరంగా  సాగాయి.
మధ్యాహ్న భోజనం మిస్సయినా, మధ్యలో వీలు చేసుకుని పోలింగు కేంద్రానికి వెళ్లి ఓటు వేయడం మాత్రం మిస్సవలేదు. అదో ఊరట.
ఘడియ తీరిక లేదు, గవ్వ రాబడి లేదు అనే సామెత నా లాంటి వారిని చూసి పుట్టిందేమో!

3 కామెంట్‌లు:

సూర్య చెప్పారు...

ఘడియ తీరిక లేదు, గవ్వ రాబడి లేదు
------------
పనికోచ్చే పని చెయ్యకపోతే ఇలానే ఉంటుందేమో అని నా అనుమానం.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@సూర్య : కదా!

శ్యామలీయం చెప్పారు...

"రేపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికలలో ఎదురీదాల్సిన పరిస్థితి ఉందన్న వాస్తవం తెలియని రాజకీయ నాయకుడు కాదు చంద్రబాబునాయుడు. తెలంగాణలో ప్రజాకూటమిని గెలిపించుకోగలిగితే ఆ విజయం తాలూకు సానుకూల ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఓటర్లపై పడుతుందని.. తద్వారా తమ పార్టీ విజయావకాశాలు మెరుగుపడతాయని ఆయన నమ్మకం" అని సీనియర్ జర్నలిస్ట్ భండారు శ్రీనివాసరావు బీబీసీతో పేర్కొన్నారు. (చూడండి https://www.bbc.com/telugu/india-46492875)