16, డిసెంబర్ 2018, ఆదివారం

లవ్ శాల్యూట్!డిసెంబరు 16, 1971.
47 సంవత్సరాలు నాలాంటి మనిషితో కాపురం అంటే ఆవిడకి ఎంత ఓపిక వుండివుండాలి.  ఉండబట్టే భరించింది.
థాంక్స్ చెప్పకూడదు. చెబితే, ముళ్ళపూడి వారి భాషలో, వాడు  ‘మొగుడు ముండావాడు’ ఎలా అవుతాడు చెప్పండి.
మా కాపురానికి ఈ రోజుతో నలభయ్ ఏడేళ్ళు. మా ప్రేమ వివాహం కాలపరీక్షను తట్టుకుని నిలిచిందని కాలరు ఎగరేయొచ్చేమో.
సుఖంగా పెరిగి కష్టాలు పంచుకోవడం ఎంత కష్టమన్నది కష్టాల్లో పుట్టి కష్టాల్లో పెరిగిన వారికి ఓ పట్టాన అర్ధం కాదు. అందుకే నన్ను కట్టుకుని మా ఆవిడ పడ్డ కష్టాలు నాకెన్నడూ తెలవదు. తెలిసినా అది ఆమె బాధ్యత అనుకున్నాను, బాధ్యతారాహిత్యానికి నిలువెత్తు ఉదాహరణ అయిన నేను.
నా కారణంగా కష్టాలు పడ్డా,  కన్నసంతానం మాత్రం మా ఆవిడను ఆరుపదులు దాటిన వయస్సులో సుఖపెడుతూనే వున్నారు. నా వల్ల ఆమెకు జరిగిన మేలు ఇదొక్కటేనేమో!.
“జర్నలిష్టుని ప్రపంచం భరిస్తుంది. ఆదరిస్తుంది.  అభిమానిస్తుంది. కాని అతగాడిని భరించడం ఎంత కష్టమో తెలిసేది ఆ జర్నలిష్ట్ భార్యకి మాత్రమే”


3 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అభినందనలు 🌷🌷.

ఈ ఫొటో తీస్తున్నప్పుడు కూడా ఆ హస్తభూషణం (సెల్ ఫోన్) ఉండాల్సిందేనా ☺?

శుభాకాంక్షలు

నీహారిక చెప్పారు...

Marriage lets you annoy one special person for the rest of your life ...
Never laugh at your wife's choices, you are one of them.

Wishing you a lifetime of love and happiness 🌷🌷🌷🌷🌷🌷.

సూర్య చెప్పారు...

స్టైలండీ స్టైలు! ఆమాత్రం స్టైలు లేకపోతే ముళ్ళపూడి వారి భాషలో "[వద్దు నేను తిట్టను]"ఎలా అవుతారు చెప్పండి!

శుభాకాంక్షలు భండారు గారూ!!