25, డిసెంబర్ 2018, మంగళవారం

Discussion | CM Chandrababu Naidu Serious Comments On PM Modi's AP Visit...ఇది మామూలు షేరింగ్ కాదు. నా సొంత గొడవ కొంత వుంది. నా జీవితంలో మూడో వంతు రాజకీయ నాయకులతో గడిచిపోయింది, వృత్తి రీత్యా.  రాజకీయ  చర్చల్లో పాల్గొనేటప్పుడు వివిధ రాజకీయ పార్టీల అధికార ప్రతినిధులు కూడా వుంటారు. అలాగే ప్రేక్షకుల్లో సయితం అన్ని పార్టీల వాళ్ళు వుంటారు. నేను చెప్పే విషయాలు కొందరికి నచ్చితే, మరికొందరికి నచ్చక పోవచ్చు. ప్రశ్నని బట్టి జవాబు వుంటుంది. కానీ ప్రతి ఒక్కరికీ తమకు నచ్చినదే నా నోటంట వినాలని వుండడం సహజం. కానీ కుదరదు కదా! అలాంటప్పుడు నేను ఏదో మనసులో పెట్టుకుని కావాలనే అలా మాట్లాడుతున్నానని అనుకోవడం కూడా సహజం. కాబట్టి ఇది మనసులో పెట్టుకుని మా వ్యాఖ్యలను మంచి మనసుతో అర్ధం చేసుకోవాలని మనవి.

కామెంట్‌లు లేవు: