5, డిసెంబర్ 2018, బుధవారం

దేవుడిని కాకపోయినా ఓటరుని

1976 నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటూ వస్తున్నాను. అంటే సీనియర్ ఓటర్నే. కానీ నా సీనియారిటీ పోటీ చేస్తున్న అభ్యర్ధులకు తెలిసినట్టు లేదు. అయినా నా ఓటు వల్ల ఉపయోగం లేదనుకున్నారేమో తెలియదు. ఎవ్వరూ మా ఇంటి వైపు కన్నెత్తి చూడలేదు. దానికి బాధ లేదు. ఎలాంటి ఆబ్లిగేషన్ లేకుండా నా ఓటు నాకు నచ్చిన వారికి వేయవచ్చు. టీవీ చర్చల్లో నాతోపాటు పాల్గొనేవాళ్లు ఒకరిద్దరు కూడా మా నియోజకవర్గం నుంచి బరిలో వున్నారు. కలిసినప్పుడు చెప్పాను కూడా. అయినా ఎవరూ ఫోన్ కూడా చేయలేదు. అంతవరకూ అదృష్టవంతుడినే.
ఇంతవరకు ఎవ్వరూ రాకపోయేసరికి, ఆఖరికి ఎలక్షన్ కమిషన్ వాళ్ళిచ్చే చీట్లు కూడా రాకపోయేసరికి అసలు జాబితాలో వున్నానా లేనా అనే సందేహం కలిగి సీఈఓ వెబ్ సైట్ శోధించాను. ఓటయితే వున్నది. పోలింగు కేంద్రం వివరాలు కూడా వున్నాయి. కాకపొతే పదడుగుల దూరంలో ఉన్న కేంద్రం కాకుండా పది ఫర్లాంగుల దూరంలో ఉన్న కేంద్రానికి వెళ్ళాలి. ఆటకు తక్కువ, నడక్కు ఎక్కువ. పరవాలేదు. మాఇంట్లో అందరికీ ఓట్లు వున్నట్టు నా శోధన తెలిపింది.
పొతే, మా అపార్ట్ మెంట్లో మరో డజను ఫ్లాట్లు వున్నాయి. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు వాకబు చేసుకుంటున్నారు, చీట్లు వచ్చాయా లేదా అని. రాలేదు. రాకపోతే పాయె, ఓట్లయితే వున్నాయి.
అదే పది వేలు.
చిత్రం ఏమిటంటే మా ఏరియాలో ఉన్న అనేక మంది తెలిసిన వాళ్లకు ఫోటోతో ఉన్న ఓటరు చీట్లు వచ్చేసి చాలా రోజులయింది.

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మీ జింతాత చర్చలతోని వాల్లకు మైండ్ బ్లాక్ అయ్యిందన్నట్టు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత: ఇలా అజ్ఞాత అని కామెంట్లు పెట్టేమీరు ఈ ప్రపంచం మొత్తంలో అత్యంత పిరికిపంద అయినా అయ్యుండాలి. లేదా చాలా తెలివయిన ఘటమైనా అయ్యుండాలి. నా లెక్కలో మీరు మొదటి రకమే. సందేహం లేదు.

సూర్య చెప్పారు...

మీరు అసలే ప్రపంచంలో పరిచయం అక్కర్లేని మీడియా వ్యక్తి. మీ ఇంటికోచ్చి రెండువేలో మూడువేలో ఇస్తే...అది పేపర్లో టీవీల్లో వస్తే... అనవసరంగా అంత రిస్కెందుకని అభ్యర్థులు ఎవరూ రాలేదేమో!!

అజ్ఞాత చెప్పారు...

పనికిమాలిన చర్చలు విమర్శిస్తే తప్పేముంది. పేరులో నేముంది. తెలుసుకొని మీకు ఏమి ఉపయోగం.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

@సూర్య
// “మీ ఇంటికొచ్చి రెండువేలో మూడువేలో ఇస్తే ...అది పేపర్లో టీవీల్లో వస్తే... “ //

మీరు భలేవారే సూర్య గారూ 🙂. అలా ఎన్నికల డబ్బు ఇవ్వడానికొచ్చే వ్యక్తి “కెమేరామన్ గంగతో ...” అన్నట్లు వస్తాడా ఏమిటి 😀?

సూర్య చెప్పారు...

వస్తే గంగ తో వస్తాడు. లేకపోతే ప్రతిపక్షపు మంగ రహస్యంగా షూట్ చేస్తుంది!