26, ఆగస్టు 2013, సోమవారం

చనిపోయి బతకడం

నిజానికిదొక అందమైన వూహ. అందరి విషయంలో ఇది నిజం కాదు.
మిత్రుడు,  సినీ జర్నలిస్టు ఎల్.బాబూరావు చనిపోయి  రోజులు కూడా గడవలేదు. అతడి జ్ఞాపకాలు ఇంకా అందరి మనస్సులో మెదులుతూనే వున్నాయి.  స్నేహితులందరూ రాత్రి ప్రెస్ క్లబ్ లో కలిసి అతడ్ని మరోమారు  సంస్మరించుకున్నారు. పుష్పాంజలి ఘటించి ఆ మంచి మనిషి మంచితనాన్ని గురించి నలుగురూ నాలుగు మంచిమాటలు చెప్పారు. చనిపోయి బతకడం అంటే ఇదేనేమో!ఈ ఆత్మీయ కలయికకు సూత్రధారి మిత్రుడు వేణుగోపాల్, అతడికి  కృతజ్ఞతలు చెప్పుకోకుండా వుండలేము.   

కామెంట్‌లు లేవు: