4, నవంబర్ 2018, ఆదివారం

Opposition Parties in One Stand Against Sardar Patel Statue | Bhandaru Srinivas Rao ...
మహా న్యూస్ జర్నలిస్ట్స్ టైం
మహా న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ యువకుడు,
కొత్త ప్రయోగాలు చేయాలనే ఆసక్తి వున్న జర్నలిస్ట్. ఆయనకు తోడుగా నిలిచాడు
ఎక్జిక్యూటివ్ ఎడిటర్ అరవింద్ కొల్లి. ఫేస్ బుక్ లో చాలామందికి స్నేహితుడు కూడా.
వాళ్లకు ఓ ఆలోచన తట్టింది. వారానికి ఒక
మారు, రాజకీయ ప్రతినిధులు లేకుండా కేవలం పాత్రికేయులను మాత్రమే చర్చలకు పిలిచి ఒక
కార్యక్రమాన్ని నిర్వహించాలని. ఈ ఆలోచన నాతో పంచుకున్నప్పుడు నేను కాస్త
నిర్మొహమాటంగానే చెప్పాను, జర్నలిస్టులు చెప్పే హిత వచనాలు ప్రవచనాల వల్ల రేటింగులు
రావు అని. అయినా వాళ్ళు ధైర్యంగా ముందుకు సాగారు. వారంలో జరిగిన ప్రధాన వార్తాంశాలపై
ప్రజలకు అనేక ప్రశ్నలు ఉదయిస్తుంటాయి. ఇలా జరగడానికి బాధ్యులు ఎవ్వరు? ఎందుకిలా
జరిగింది? కానీ వీటికి జవాబులు దొరకవు.
మహా న్యూస్ టీం ఈ అంశాన్ని పట్టుకుంది.
అవే ప్రశ్నలను సుదీర్ఘ అనుభవం కలిగిన జర్నలిస్టులకు వేసి సమాధానాలు రాబట్టడం ఈ
కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. దీనికి జర్నలిస్ట్ టైం అని పేరు పెట్టారు. ప్రతి
ఆదివారం ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు సుమారు మూడుగంటలు చర్చించాలని సంకల్పం.
ఈరోజు అంకురార్పణ జరిగింది. మహా న్యూస్
ఎండీ శ్రీ వంశీ,ఎక్జిక్యూటివ్ ఎడిటర్ అరవింద్ సంయుక్తంగా కార్యక్రమాన్ని
నిర్వహించారు. ఎనిమిది మంది సీనియర్ జర్నలిస్టులు, ఎనలిస్టులు పాల్గొన్నారు.
శ్రీయుతులు కటారి శ్రీనివాసరావు, కేవీఎస్
సుబ్రహ్మణ్యం (సూర్య ఎడిటర్), వాసిరెడ్డి శ్రీనివాస్ (సీనియర్ జర్నలిస్ట్),
వేణుగోపాల్ (సీనియర్ జర్నలిస్ట్, ప్రజాశక్తి), పాపారావు ( ఆర్ధిక విషయాల
విశ్లేషకులు), జాగర్లమూడి రామకృష్ణ (సీనియర్ జర్నలిస్ట్),
Ms. వనజ (ఇండిపెండెంట్ జర్నలిస్ట్), షరామామూలుగా నేనున్నూ వీరిలో ఉన్న
వారమైవున్నాము.
హెచ్చరిక: అరుపులు, విరుపులు ఈ
కార్యక్రమంలో కనబడవు, వినబడవు. ఇక మీ ఇష్టం
    

కామెంట్‌లు లేవు: