11, జులై 2022, సోమవారం

ఎంతమంది చదువుతారు? – భండారు శ్రీనివాసరావు

 లక్ష సర్క్యులేషన్ వున్న పత్రికలో మన వ్యాసం అచ్చవుతే ఆ లక్షమందీ దాన్ని చదువుతారు అనుకోవడం ఓ భ్రమ. కాకపొతే ఎక్కువమంది కళ్ళల్లో పడే అవకాశం ఎక్కువ. కాదనను.

నలుగురూ చదవాలనే ఏ రచయిత అయినా కోరుకుంటాడు. అయితే ఆ ‘నలుగురు’ లక్షమంది కావచ్చు, ‘నలుగురే’ కావచ్చు.

ప్రేమలేఖను ఎంతమంది చదువుతారు చెప్పండి. ప్రేయసి ఒక్కరు చదివితే చాలని మురిసిపోతాడు ప్రియుడు.

అందుకే నేను రాసేది ప్రతిదీ ఇటువంటి సాంఘిక మాధ్యమాలలోనే పోస్ట్ చేస్తాను.

నాకిదో ‘తుత్తి’

3 కామెంట్‌లు:

కిశోర్ చెప్పారు...

నమస్కారమండీ.. నేను చదివే తెలుగు బ్లాగులలోకెల్లా నాకు అత్యంత ప్రీతికరమైనది మీ యొక్క బ్లాగు మాత్రమే. ప్రతి రోజూ తప్పని సరిగా చదుతువూ ఉంటాను. మీరన్నట్లు 'ఆ నలుగురు'లో నేను కూడా ఒకడినే.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

కిషోర్ గారికి ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు

bonagiri చెప్పారు...

ఇప్పుడు బ్లాగుల్లో మీలాగ రెగ్యులర్ గా వ్రాసే వారు ఎవరూ లేరు. కాబట్టి మీ బ్లాగుని అంతమంది చదువుతున్నారు.
వ్రాస్తూనే ఉండండి, మేము చదువుతూనే ఉంటాము.