30, ఆగస్టు 2014, శనివారం

ఆడ తెలివి


'ఆడవాళ్ళ మెదడు చాలా చురుగ్గా పాదరసంలా  పనిచేస్తుందోయ్' అన్నాడు ఏకాంబరం
'అల్లా అని యెల్లా చెప్పగలవు' అడిగాడు లంబోదరం.
'ఇల్లా' అంటూ మొదలెట్టాడు ఏకాంబరం
ఏకాంబరానికి ఆసుపత్రికి వెళ్ళినప్పుడల్లా స్మశాన వైరాగ్యం కలుగుతుంది. ఒకరోజు చావుబతుకుల్లో వున్న దూరపు చుట్టాన్ని చూట్టానికి ఆసుపత్రికి వెళ్ళాడు. ఆ సాయంత్రం భార్యతో అన్నాడు.
'చావు ప్రతివాడికీ తప్పదు. అటువంటప్పుడు ఆసుపత్రిలో అన్ని రకాల గొట్టాలు తగిలించుకుని రేపోమాపో అనే ప్రాణాన్ని కాపాడుకోవడం అవసరమా? నేనయితే అలాటి లైఫ్ సపోర్టింగ్ కనెక్షన్లు తీసేసి హాయిగా ప్రశాంతంగా చనిపోవాలని కోరుకుంటాను'
ఏకాంబరం వాగుడు విని అతగాడి భార్య లేచి వెళ్లి ఇంటర్ నెట్ కనెక్షన్ తొలగించింది. 


Note: Courtesy Cartoonist 

2 కామెంట్‌లు:

hari.S.babu చెప్పారు...

బాగా అయ్యింది, లేకపోతే ఆదవాళ్లతో ఆ సోది మాట్లాదతారా యెవరయినా?

Meraj Fathima చెప్పారు...

ఆడవాళ్ళకు ఎక్కడి కనెక్షన్‌ కట్ చెయ్యాలో బాగా తెలుసు .పాపం భర్త గారు