31, ఆగస్టు 2014, ఆదివారం

కుంచె కన్నీళ్లు కారుస్తోందిబాపు ఇక లేరు. తెలుగువారి గుండెల్లో కొలువుతీరిన బాపు మరణంతో వారి  గుండెలు బరువెక్కాయి. నిజానికి రమణగారి మరణంతోనే  ఆయన సగం చనిపోయారు. మిగిలింది ఈరోజు పూర్తయింది. బాపు లేకపోయినా బాపు అనే రెండక్షరాలు ఎన్నాళ్ళకూ  చెరిగిపోవు. బాపు రాత ఏనాటికీ చెదిరిపోదు.  బాపు బొమ్మ అందాలు ఎప్పటికీ మాసిపోవు.  కాకపొతే ఇన్నేళ్ళుగా ఆయన  బొమ్మల్ని చూసి కడుపారా నవ్వుకున్న జనాలు, ఆయన మరణవార్త విని కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ ఆదివారం తెలుగు చిత్రపరిశ్రమకు గాడాంధకారం.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

A sad day For every Telugite.May his soul rest in peace.