6, ఆగస్టు 2014, బుధవారం

నా గురించి నలుగురూ ...........3


"మ్యాపు చూస్తున్న రాజీవ్ గాంధీ గభాలున ఆ జీపులో ఎక్కి కూర్చున్నారు. దాంతో రామారావుగారు, వెంగళరావుగారు, సెక్యూరిటీ వాళ్లు జీపు వెనుక ఎక్కారు. నేనూ, సురేందర్ పరిగెత్తుకువెళ్ళి జీపు వెనుక డోరు కడ్డీపై చతికిలపడ్డాము. భద్రాచలం సమీపంలోని అడవుల్లో ప్రయాణం షురూ. ఆ ప్రయాణం యెలా సాగింది, యెలా ముగిసిందీ అన్న ఆసక్తికరమైన సొంత అనుభవాన్ని రేడియోలో సుదీర్ఘకాలం పనిచేసిన భండారు శ్రీనివాసరావు అందిస్తారని 'వార్తల వెనుక కధ' సంపుటం సంపాదకులు, ప్రస్తుతం నమస్తే తెలంగాణా ఎడిటర్ అయిన శ్రీ కట్టా శేఖరరెడ్డి తన ప్రస్తావనలో రాశారు.శ్రీ శేఖరరెడ్డి నా గురించి రాసిన పరిచయ వాక్యాలు:
1971 లో ఆంధ్రజ్యోతి దిన పత్రికలో సబ్ ఎడిటర్ గా పత్రికా జీవితం ప్రారంభం. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగంలో మూడు దశాబ్దాల అనుభవం. నాలుగున్నర ఏళ్ళ పాటు (1987 - 1991 మధ్య) ఆనాటి  సోవియట్ రాజధాని మాస్కోలో,  'రేడియో మాస్కోలో ఉద్యోగం. సోవియట్ కుప్పకూలడానికి దారితీసిన పరిణామాలకు ప్రత్యక్ష సాక్షి. ఆ అనుభవాలను పొందుపరుస్తూ 'మార్పుచూసిన చూసిన కళ్ళు' పుస్తక రచన.  2005 డిసెంబరులో దూరదర్శన్ నుంచి ఉద్యోగ విరమణ. రేడియోలో వారం వారం నిర్వహిచిన జీవన స్రవంతి కార్యక్రమం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆంధ్రజ్యోతిలో అనుదినం రాసిన 'వాక్టూన్లు' కూడా మంచి గుర్తింపు తెచ్చాయి."   

(సుప్రసిద్ధ జర్నలిస్ట్ , హెచ్ .ఎం.టీ.వీ. మాజీ సీ...,  శ్రీ కె. రామచంద్రమూర్తి, నమస్తే తెలంగాణా ఎడిటర్ శ్రీ కట్టా శేఖర్ రెడ్డి  సంపాదకత్వంలో  45 మంది జర్నలిష్టులు రాసిన  అనుభవాలను ఒక సంకలనంగా 'వార్తల వెనుక కధ' అనే పేరుతొ New Media Communications  వారు 2007 లో వెలువరించారు.)

కామెంట్‌లు లేవు: