16, ఏప్రిల్ 2014, బుధవారం

ప్రముఖ అందాల సినీ తార ఇలా చెబుతున్నారు

వార్త :
"పలానా చోట ఒక పార్టీ అభ్యర్దినీ, మరో చోట మరో పార్టీ అభ్యర్దినీ, ఇంకో చోట ఇంకో పార్టీ అభ్యర్దినీ బలపరుస్తాను" టీవీ స్క్రోలింగుల్లో  సినీ నటుడు పవన్ కళ్యాణ్


వ్యాఖ్య :  
ప్రముఖ అందాల సినీ తార ఇలా చెబుతున్నారు
"నేను నా ముఖ సౌందర్యం కోసం లక్స్  టాయిలెట్ సబ్బుని వాడతాను.
"హస్త లావణ్యం కోసం హమామ్ సబ్బుని వాడతాను.
"పాద సౌకుమార్యం కోసం మార్గో సబ్బుని వాడతాను
"మీరూ నాలాగే రకరకాల సబ్బులని రోజూ వాడి చూడండి"  

1 వ్యాఖ్య:

Jai Gottimukkala చెప్పారు...

మన ప్రేక్షకులు కూడా కొంతవరకు ఇంతేనండీ. బాలయ్య గావుకేకలకు ఒకసారి చప్పట్లు కొడితే వేరే బొమ్మలో పవన్ కళ్యాణ్ వెకిలి వేషాలకు ఈలలేసారు (లోక్సత్తా చిహ్నం ఈల కాదండీ బాబూ). జూనియరు పిచ్చిగంతులకు వంత పాడిన ప్రజలే మాస్ మహారాజా చెత్త ఫైటింగులకు వెర్రెత్తి పోయారు.

యథా ప్రేక్షక తధా నట అని ఊరికే అన్నారా?