19, మార్చి 2014, బుధవారం

ఇప్పుడు - అప్పుడు


చూశారా! ఇటీవల రాష్ట్రపతి హైదరాబాదు వచ్చినప్పుడు స్థానిక జర్నలిస్టులను బొలారం లోని రాష్ట్రపతి నిలయంలో కలిశారు. జర్నలిస్టులకు వారికీ మధ్యవున్న 'వేరు బంధం' గమనించారా?గతంలో నేను రేడియోలో పనిచేస్తున్నప్పుడు నాటి రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ అదే భవనంలో విలేకరులను కలుసుకున్నారు. మేమందరం హాయిగా ఆయనతో కరచాలనం చేయగలిగాము.అప్పటికీ ఇప్పటికీ ఇదీ తేడా!