5, మార్చి 2014, బుధవారం

నోరి మధురబాబు ఇక లేరునోరి మధురబాబు ఇక లేరంటూ ఈ ఉదయమే దుర్గ ప్రసాద్ నుంచి మెసేజ్. కొద్దికాలంగా అస్వస్తులుగా వుంటున్న శ్రీ మధురబాబుతో మా కుటుంబానికి చాలా సన్నిహిత సాన్నిహిత్యం. అమెరికాలో సుప్రసిద్ధ కేన్సర్ వైద్యులు డాక్టర్ నోరి, శ్రీ మధురబాబు సోదరులు. స్టేట్ బాంక్ జనరల్ మేనేజర్ గా ఆయన పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఆయన ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదట ఏర్పాటు చేసిన నాగార్జున గ్రామీణ బాంక్ కు శ్రీ మధురబాబు మొట్టమొదటి చైర్మన్. అప్పటినుంచి ఆయనతో ఏర్పడ్డ చక్కని పరిచయం ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను.


(కీర్తిశేషులు మధురబాబు)