30, జూన్ 2014, సోమవారం

హైదరాబాదు మెట్రో రైలు పట్టాలెక్కుతుందా !

జెమినీ న్యూస్ సాయంకాలపు చర్చ     
ఈరోజు (30-06-2014) సాయంత్రం నాలుగున్నర గంటలకు జెమినీ న్యూస్  టీవీ ఛానల్  పబ్లిక్ వాయిస్  ప్రోగ్రాం. ప్రెజెంటర్ హరికిషన్ 


"మెట్రో వివాదం విషయంలో సంయమనం అవసరం. చారిత్రిక కట్టడాల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యతే. కానీ పాత ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆ ప్రాజెక్ట్ నిర్మాణం సాగుతోంది. పాలకులు మారినప్పుడల్లా ఒప్పందాలను తిరగతోడడం వల్ల భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేటు సంస్థలు జంకే ప్రమాదం వుంది. చారిత్రిక కట్టడాలు కనుమరుగు కాకుండా యెం చేయాలనేది ఉభయులు కూర్చుని మాట్లాడుకోవాలి. అడ్డుకుంటాం అని ఒకరు, అసలు పనులు ఆపేసి వెళ్ళిపోతాం అని మరొకరు భీష్మించుకోవడం సరయిన పద్దతి కాదు. మాల్దీవుల్లో మాలే విమానాశ్రయం ఒప్పందాన్ని అక్కడి  ప్రభుత్వం మారగానే రద్దు చేయడం వల్ల ఎలాటి  వివాదం చెలరేగిందో గమనంలో వుంచుకోవాలి. గత ప్రభుత్వాలు కాసులకు కక్కుర్తి పడి ఒప్పందాలు చేసుకున్నట్టు రుజువయినా, నాణ్యత విషయంలో రాజీ పడ్డట్టు అనుమానం వచ్చినా ఒప్పందం రద్దు చేసుకుంటే తప్పు పట్టేవారు వుండరు.

" ఇలాటి విషయాల్లో పాలకుల చిత్తశుద్ధి ప్రధానం. నా బాల్యాన్ని నాకివ్వు అనే హిందీ కవిత గుర్తుకు వస్తోంది. ఓ ఏభయ్ ఖమ్మం నుంచి బస్సులో హైదరాబాదు వస్తున్నప్పుడు కిటికీ చువ్వలు చల్లబడ్డాయి అంటే నగరం పొలిమేరలు చేరినట్టు. వీధులన్నీ శుభ్రంగా కడిగినట్టు వుండేవి. పక్కన పచ్చగా చెట్లు. ఇది ఇలాంటి హైదరాబాదు మళ్ళీ రావాలి, తెస్తాను అంటే జనం బ్రహ్మరధం పడతారు. అలాకాకుండా మైనదిగా పోవడం మంచిదికాదు. చర్చలకు పిలిచి కోరింది చెప్పాలి. వారు కోరుతోంది వినాలి. సమస్య చిటికెలో గాన్, గాయబ్. మాయమయింది. అంతే!'  
అసందర్భం అయినా ప్రస్తావించిన మరో అంశం:
మాస్కోలోని లెనిన్ స్కీ ప్రాస్పెక్త్ (లెనిన్ పేరు పెట్టిన ప్రధాన రహదారి) నిర్మాణ సమయంలోనో, ఆ రోడ్డును వెడల్పుచేసే సమయంలోనో - పాతకాలం నాటి ఒక చర్చి అడ్డం వచ్చిందట. దాన్ని కూలగొట్టడం లేదా కొన్ని లక్షల రూబుళ్ళు ఖర్చు బెట్టి ఆ చర్చి భవనాన్ని పక్కకు జరపడం అనే రెండు ప్రత్యామ్నాయాలు అధికారుల ముందు నిలిచాయి. మతం పొడగిట్టని కమ్యూనిస్ట్ పాలకులకు, ఆ చర్చిని వున్నపలాన పడగొట్టడం చిటికెలో పని.
 అయినా వారు ఆ పని చేయకుండా చర్చి భవనం చుట్టూ కందకం మాదిరిగా తవ్వి- భూగర్భం లోనే దానికింద చక్రాల ఉక్కు పలకను ఉంచి అంగుళం అంగుళం చొప్పున నెమ్మది నెమ్మదిగా ఆ మొత్తం చర్చిని ఏమాత్రం దెబ్బతినకుండా వున్నదాన్ని వున్నట్టుగా దూరంగా జరిపి రోడ్డు పని పూర్తిచేశారని చెప్పుకునేవారు.

ఇది కధ అయినా కాకపోయినా ఇందులోనుంచి నేర్చుకోవాల్సింది ఎంతో వుంది. కదూ!

9 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

సుల్తాన్ బజార్ లాంటి నగర వారసత్వానికి కీలకమయిన ప్రాంతాలలో మెట్రో భూమి కింది నుండి మల్లించాలన్న డిమాండు ఇప్పుడిది కాదు. వ్యాపార వర్గాలు, జైను మతనాయకులతో బాటు హైదరాబాదు నగర సంస్క్రతిని ప్రేమిచే ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో అడుగుతున్న ఈ విషయాన్ని రాజకీయం చేయడం తగదు.

వ్యాపార సమస్థల ప్రయోజనం మాత్రమె చూసుకుంటే సరిపోదు. నిజానికి వారికి నష్టం వచ్చినా అది అత్యల్పం (< 10%) మాత్రమె. అవసరం అయితే ఎంతోకొంత పరిహారం ఇచ్చయినా ఈ సాంస్కృతిక హత్యాకాండను ఆపాలి.

आपके बचपनका शहर भी वापस आसक्ति है अगर खर्च करनेका हिम्मत हम्मे है! అయితే హైటెక్ సిటీ అద్దాలను చూసి మురిసిపోయే వారికి గత వైభవ చిహ్నాల & ఆ సాంస్కృతిక వారసత్వ విలువలు తెలిసేనా? ఎన్ని లక్షల కోట్లు పోసినా కొనలేని జాతి సంపదను ఇప్పటికే వారి అనునాయులకు ధారాదత్తం చేసిన వినాయకులకు తెహ్జీబ్ ఖరీదు పడుతుందా?

శ్యామలీయం చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
శ్యామలీయం చెప్పారు...

గొట్టిముక్కలవారూ,

ఈ హైదరాబాదులో మెట్రోరైలు ప్రాజక్టును నిర్మిస్తున్నది ప్రజాప్రయోజనాలను ఆశించి కాని ఏవో వ్యాపార సమస్థల ప్రయోజనం మాత్రమే ఆశించి అనుకోను. ప్రజాప్రయోజనం ఏమీలేదు అనుకుంటే మెట్రోరైలుప్రాజెక్టును భేషుగ్గా రద్దుచేసి పారెయ్యవచ్చును.

ఈ సందర్భంగా ఒక ఉదంతం గుర్తుకు వస్తోంది. చంద్రబాబునాయుడి హయాంలో ఫ్లైఓవరు నిర్మాణం మొదలైనప్పుడు శ్రీమాన్ రోశయ్యగారు ఒక ముక్క సెలవిచ్చారు. "హైదరాబాదులో ఉన్న ట్రాఫిక్కు ఎంత? దానికి ఫ్లైఓవరు నిర్మాణం అనవసరం. ఇదంతా కేవలం చంద్రబాబు స్వార్థప్రయోజనాలకోసమే" అని. ఆతరువాత ఫ్లైఓవర్ల నిర్మాణంలో కాంగ్రసు తమ స్వార్థప్రయోజనాలను ఎంత బాగా గమనించిందో‌ కాని హఠాత్తుగా ఈ నగరం నిండా బోలెడు ఫ్లైఓవర్లు పుట్టుకు వచ్చాయి కాంగ్రసు హయాం రాగానే!

అలా, ఒక హయాంలో ప్రజా ప్రయోజనం అనుకున్నది మరొక హయాంలో స్వార్తప్రయోజనంగానో -లేదా- అవసరార్థం తద్విలోమంగానో కనిపిస్తే విస్తుపోవలసింది ఈ రాజకీయభారతంలో ఏమీ లేదు.

కాబట్టి ఇప్పుడు తెలంగాణాప్రభుత్వం అత్యంతవిజ్ఞతతో మెట్రోరైలు పేరిటి ఈ సాంస్కృతికహత్యాకాండను ఆపి నగరాన్ని రక్షిస్తే ఎవరూ కాదనరు. కాదనరాదు కూడా.

ట్రాఫిక్ అనేది నరకంకన్నా అద్వాన్నంగా ఉందని గోలచేయటానికి ప్రతిపక్షం కూడా బలంగా లేదు. ఆ కాస్త ప్రతిపక్షాన్నీ నామరూపాలు లేకుందా చేయటమూ జరుగుతుంది త్వరలోనే.

ప్రజలంటారా? జై కొట్టటం మించి మరో మాట మాట్లాడే అనవసరమైన అవకాశం వారికి ఇవ్వవలసిన పనిలేదు బలమైన ప్రభుత్వాలకి.

వీలైనంత వరకు హెచ్చుశాతం ప్రజాధనాన్ని ఈ విధంగా పురాతనసాంస్కృతికనిర్మాణాల పరిరక్షణార్థం ఉపయోగించాలి కాని మెట్రోలూ గిట్రోలూ అంటూ తగలెయ్యటం అనవసరం అని ప్రభుత్వంవారు విశాలదృక్పధంతో ఆలోచించి నిర్ణయిస్తే - వారి చిత్తం, ప్రజల భాగ్యం. తధాస్తు.

అజ్ఞాత చెప్పారు...

"Vaadikantha ichaavu...naa sangathenti " ane konam lone nadustondi samasya.kaabatti parishkarinchukodam kashtam kaademo....sultan bazaaruu, MJmarkettuuu, Secratariattuu etcetc
veetimeda premaa antha nonsense.
evaro peddamanishi cheppinatlu ...annee aardhika maina sambadhaale samasyale...

XYZ gaarlu voppukunnaa ...kokapoyinaa ide nijam.

Surabhi చెప్పారు...

Sir,
Just a question, when you participate in any such discussions, do you ask/ or will you be provided with what is the source for the topic in discussion and how genuine is the source of information. I am asking not just in view of this topic but in general and out of curiosity .
Your writings are very well balanced
Thanks
Surabhi

అజ్ఞాత చెప్పారు...

ఏ కట్టడమూ శాశ్వతం కాదు, వాటికోసం ఏడవడం, మొత్తుకోవడం వృథా. పాతనీరు పోయి కొత్తనీరు వచ్చేస్తుంది. ఇది అన్ని కాలాల్లోనూ జరిగే విషయం. సుల్తాన్ బజారు వందేళ్ళ క్రితం అక్కడ లేదు. మెట్రో రైలుమార్గమూ వందేళ్ల తరవాత ఉండదు. మెట్రో నిర్మాణసంస్థ వ్యాపారసంస్థ అనుకుంటే మరి సుల్తాన్ బజార్ లో ఉన్నవీ వ్యాపారసంస్థలే. వర్తమానం ఎలా గడపాలనేదే మన ఫోకస్ అవ్వాలి.

Jai Gottimukkala చెప్పారు...

@శ్యామలీయం:

హైదరాబాదు లాంటి మహానగరాల ట్రాఫిక్ సమస్యలకు integrated mass transit system ఒక్కటే నిజమయిన పరిష్కారం. ప్రస్తుత మెట్రో ప్రాజెక్టు ఈ పరిష్కార దిశగా కొద్దోగొప్పో మేలు చేస్తుందనే నా నమ్మకం. In spite of the poor integration & lackluster urban planning, it is still a measure in the positive direction.

అలాగే చారిత్రిక వారసత్వాన్ని మరియు సాంస్కృతిక ఆస్తులను కాపాడడం & పునరుజ్జీవించడం కోసం ఒక సమగ్రమయిన పద్దతి కావాలి. అప్పుడప్పుడు నిద్రలేచి ఎవోకొన్ని దుందుడుకు knee jerk actions చేస్తే సరిపోదు.

మన పాలకుల నిర్లక్ష్యం వల్ల నగరం ఎంతో కోల్పోయింది. మరో వెనక్కు తీసుకోలేని తప్పిదం (irreversible blunder) మన కళ్ళ ఎదుట జరుగుతూ ఉంటె దాన్ని ఆపాలని ప్రయత్నం చేయడం మంచిదే. Going forward, preservation and restoration should be integrated into the decision making process.

అజ్ఞాత చెప్పారు...

నిన్న మొన్న కట్టినవేమో కూల్చేస్తున్నారు. వందేళ్ళనాటివి మాత్రం ఉండాలంటారు. మనకెప్పుడూ గతమే తప్ప వర్తమానం వద్దా?

hari.S.babu చెప్పారు...

మా తాత గారి ఇంట్లో నాకు యెన్నో మధురానుభూతులు వున్నాయి.అందరు మరదళ్ళకీ నేను ఒక్కణ్ణే బావని:-) ఇప్పటికీ గుర్తుకొస్తే చాలా హ్యాపీగా వుంటుంది.కానీ ఇప్పుదది లేదు.మా మామయ్యా వళ్ళకి కొత్తగా డాబా కట్టాలనుకుని కూల్చేశారు.నా జ్ఞాపకాల కోసం ఆ పూరింతిని అలాగే వుంచితే మా అమ్మాయి మా మామయ్య కట్టిన డాబాలో కాకుండా పూరి పాకలో గదపాల్సి వచ్చేది.మనిషయినా జాతయినా గతం నుంచి విడివడందే ఆగతం బాగుండదు.

మొదటి నుంచీ ఇదే మీ గోల కదా?! 1956 లో వున్నట్టు వుండాలంటారు,ఆ పాత భవంతుల్ని చూసుకుని మురుస్తారు.

గిర్గ్లానీ గారు మాకు వుద్యోగాల్లో అన్యాయం జరిగిందన్నాడు అంటే వేతికి చూసాను.ఆయన చెప్పింది వుల్లంఘనలు అన్ని జోన్లలోనూ జరిగాయి,అభివృధ్ధి చెందిన ప్రాంతాలకు వెళ్ళగలిగిన వాళ్ళు బాగు పడ్దారు అని.

ఆంధ్రా వాళ్ళు (యెక్కడో కృష్ణా జిల్లా నుంచి) వెళ్ళగలిగినట్టు తెలంగాణా వాళ్ళు (చాలా దగ్గిరే ఉన్న పొరుగు జిల్లాల నుంచి) కూడా వెళ్ళగలిగితే సమస్యే వుండేది కాదు కదా?యెందుకు వెళ్లలేకపోయారు?మీరు వెళ్ళలెకపోవటానికి మేము యెలా కారణ మవుతాము?