26, జూన్ 2014, గురువారం

గాలి కారు

గాలిలో తేలినట్టుందే గాలిలో వూగినట్టుందే అని పాడుకుంటూ ఝామ్మున కారేసుకుని ఫుల్లుగా గాలి కొట్టేసుకుని షికారుకెళ్ళే రోజులు త్వరలో రాబోతున్నాయి. వుత్తి గాలి కబుర్లు అని కొట్టి పారేయకండి. పెట్రోలు డీసేలు లేకుండా కేవలం గాలితో నడిచే కారుని మనదేశంలోనే టాటా మోటార్స్ వాళ్లు తయారు చేశారు.అన్నీ అనుకున్నట్టు కుదిరితే ఈ గాలి కారు కొద్ది మాసాల్లోనే రోడ్డెక్కుతుంది. యాభై రూపాయల గాలి కొట్టించుకుంటే చాలు రయ్యిమని వంద కిలో మీటర్లు దూసుకెళ్ళవచ్చు. ఇంతా చేస్తే ఈ కారు ఖరీదు కాస్త అటూ ఇటూగా మూడున్నర లక్షల రూపాయలు. ఈ గాలి కారుకు తాళాలు కూడావుండవు. దీన్ని నడపడానికి ఒక యాక్సిస్ కార్డు ఇస్తారు.

కామెంట్‌లు లేవు: