30, జూన్ 2014, సోమవారం

ఐ న్యూస్ న్యూస్ వాచ్


ఈరోజు (30-06-2014) ఉదయం ఏడు గంటలకు ఐ న్యూస్ టీవీ ఛానల్ న్యూస్ వాచ్ ప్రోగ్రాం. ప్రెజెంటర్ విజయ్.


"కృష్ణా జలాలను మళ్ళీ పంచాలని తెలంగాణా రాష్ట్రం డిమాండ్ చేయడం సబబే. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా వున్నప్పుడు కేటాయింపులు అవి. ఒక రాష్ట్రం రెండు కొత్త రాష్ట్రాలుగా విడియినప్పుడు, గతంలో ఏవయినా అన్యాయాలు జరిగి వుంటే సరిదిద్ది మళ్ళీ పంపిణీ చేయాలని కోరడంలో తప్పుపట్టాల్సింది ఏమీ వుండదు"

"మెట్రో వివాదం విషయంలో సంయమనం అవసరం. చారిత్రిక కట్టడాల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యతే. కానీ పాత ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆ ప్రాజెక్ట్ నిర్మాణం సాగుతోంది. పాలకులు మారినప్పుడల్లా ఒప్పందాలను తిరగతోడడం వల్ల భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేటు సంస్థలు జంకే ప్రమాదం వుంది. చారిత్రిక కట్టడాలు కనుమరుగు కాకుండా యెం చేయాలనేది ఉభయులు కూర్చుని మాట్లాడుకోవాలి. అడ్డుకుంటాం అని ఒకరు, అసలు పనులు ఆపేసి వెళ్ళిపోతాం అని మరొకరు భీష్మించుకోవడం సరయిన పద్దతి కాదు. మాల్దీవుల్లో మాలే విమానాశ్రయం ఒప్పందాన్ని అక్కడి  ప్రభుత్వం మారగానే రద్దు చేయడం వల్ల ఎలాటి  వివాదం చెలరేగిందో గమనంలో వుంచుకోవాలి. గత ప్రభుత్వాలు కాసులకు కక్కుర్తి పడి ఒప్పందాలు చేసుకున్నట్టు రుజువయినా, నాణ్యత విషయంలో రాజీ పడ్డట్టు అనుమానం వచ్చినా ఒప్పందం రద్దు చేసుకుంటే తప్పు పట్టేవారు వుండరు"     

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

baga chepparu. your views and comments are always filled with clarity. no clutter. direct to point. well meant. good luck nv reddy

అజ్ఞాత చెప్పారు...

Harish is saying something but their vidyasagar rao is saying someting else. in their own mouthpiece.

http://namasthetelangaana.com/Columnists/VidyasagarRao.aspx?category=1&subCategory=7&ContentId=270939
He says:
అయితే కొత్తగా పంచడానికి ఏమిలేదు. ట్రిబ్యూనలే వివిధ ప్రాజెక్టులకు కేటాయింపులు జరిపింది. తెలంగాణలోని ప్రాజెక్టులకు 278.96టీఎంసీలు లభించాయి. ట్రిబ్యూనల్ తీర్పు వెల్లడి అయ్యాక ప్రభుత్వం కృష్ణా డెల్టాకు బచావత్ ట్రిబ్యూనల్ కేటాయించిన 181.2 టీఎంసీలలో 29 టీఎంసీలను తగ్గించి ఆ నీటిని భీమా (తెలంగాణ)కు 20 టీఎంసీలు, మిగిలిన 9టీఎంసీలను పులిచింతల (కోస్తాంవూధ)కు కేటాయించింది. ఈ రకంగా తెలంగాణ నికర జలాల వాటా 298.96 టీఎంసీలయింది.