1, జూన్ 2014, ఆదివారం

నమ్మలేని నిజం


నిజాలు ఒక్కోసారి నిజమేనని నమ్మలేనంత  విడ్డూరంగా వుంటాయి.
1990
అంటే సుమారు కొంచెం అటూ ఇటుగా పాతికేళ్ళనాటి ముచ్చట.
ఇద్డరు యువతులు ఢిల్లీ వెళ్ళడానికి లక్నోలో రైలెక్కారు. ఆ మరునాడే మల్ళీ అహమ్మదాబాదు వెళ్ళాలి. రైలు కదిలేముందు ఇద్దరు బడా నేతలు  అదే బోగీలోకి ఎక్కారు. వారితో పాటే బిలబిలమంటూ మరో డజను మంది వారి అనుచరులు కూడా  జొరబడ్డారు. ఆ యువతుల్ని సామాన్లమీద కూర్చోమని వాళ్ల బెర్తుల్ని  దర్జాగా ఆక్రమించుకున్నారు. అంతటితో ఆగారా.  పక్కన ఆడవాళ్ళు వున్నారు అనే సోయ  లేకుండా పెద్ద గొంతుకతో అసభ్య పదజాలంతో  సంభాషణ సాగించారు. వారి ధోరణితో ఆ యువతులు బిక్కచచ్చిపోయారు. ఢిల్లీ చేరేంతవరకు ప్రాణాలు అరచేతబెట్టుకుని ప్రయాణం చేశారు.
మరునాడు రాత్రి ఢిల్లీ నుంచి అహమ్మదాబాదు వెళ్లేందుకు రైలెక్కారు. మళ్ళీ 'మరో' ఇద్దరు నేతలు అదే బోగీలో కనబడ్డారు. రాత్రి అనుభవం ఇంకా  మనసులో పచ్చిగా  వుండిపోవడంతో  యువతుల భయం రెట్టింపు అయింది. అయితే చిత్రం. ఆ కొత్త వారిద్దరూ ఆ ఇద్దరు ఆడవాళ్లని చూడగానే జరిగి సర్దుకు కూర్చుని చోటిచ్చారు. అనుచరగణం కూడా లేకపోవడంతో తరువాత  ప్రయాణం సాఫీగా సాగిపోయింది.
మరునాడు ఉదయం రైలుదిగి ఎవరిదోవనవాళ్లు వెళ్ళబోయేముందు ఒక యువతి డైరీ తెరచి పట్టుకుని ' నేనూ  నా స్నేహితురాలు ఇద్దరం రైల్వేలో ప్రొబేషనరీ అధికారులుగా పనిచేస్తున్నాము. నా పేరు లీనా శర్మ.  శిక్షణ కోసం ఈ ప్రయాణం పెట్టుకున్నాము. మీవంటి వారు తోడుగా వుండడం వల్ల  రాత్రి మా ప్రయాణం ఎలాటి ఇబ్బంది లేకుండా సాగిపోయింది. ధన్యవాదాలు' అంటూ వారి పేర్లు అడిగింది.
వారిలో ఒకతను జవాబు చెప్పాడు.
'నా పేరు  శంకర్ సింగ్ వాఘేలా, ఇతడు నా రాజకీయ సహచరుడు నరేంద్ర మోడీ'
 (ఫేస్ బుక్ కోసం తెలుగులో క్లుప్తీకరించిన ఈ కధనం పూర్తి పాఠం ఈరోజు (01-06-2014)- హిందూ దినపత్రిక 'ఓపెన్ పేజ్' లో వుంది. ఆ పత్రికకి కృతజ్ఞతలు. ప్రస్తుతం రైల్వేలో అత్యున్నత పదవిలో వున్న అనే ఆవిడ రాశారు. నరేంద్ర మోడీ మొదటిసారి ముఖ్యమంత్రి కాకపూర్వమే ఆవిడ సొంత రాష్ట్రం అయిన అస్సాం లో ఒక స్థానిక దినపత్రిక ఈ కధనాన్ని లోనే ప్రచురించింది. షరా మామూలుగా ఇది స్వేచ్చానువాదం)

7 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

శ్రీమోదీగారూ అసభ్యసంభాషణలు చేసారా? లేదా అవి వింటూ వారించకుండా ఉండిపోయారా? ఇది చాలా విచారం కలిగించే వార్త. యోగ్యులు అనిపించుకున్న రాజకీయుల నిజస్వరూపాలు కూదా ఇలా ఉంటాయా!

అజ్ఞాత చెప్పారు...

http://www.thehindu.com/opinion/open-page/a-train-journey-and-two-names-to-remember/article6070562.ece

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@శ్యామలీయం - మొదటి ప్రయాణానికీ, రెండో ప్రయాణానికీ తేడా ఏమిటంటే, రెండో దాంట్లో మోడీ వున్నారు. మొదటి ప్రయాణంలో తారసపడ్డవాళ్ళు షరా మామూలు రాజకీయ నాయకులు.నేను రాయడంలో పొరబాటా లేదా జనాలు చదవడంలో పొరబాటా అర్ధం కావడం లేదు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత - అయితే చివరివరకు చదవలేదన్నమాట. చివర్న రాసింది అదే - (ఫేస్ బుక్ కోసం తెలుగులో క్లుప్తీకరించిన ఈ కధనం పూర్తి పాఠం ఈరోజు (01-06-2014)- హిందూ దినపత్రిక 'ఓపెన్ పేజ్' లో వుంది. ఆ పత్రికకి కృతజ్ఞతలు. ప్రస్తుతం రైల్వేలో అత్యున్నత పదవిలో వున్న లీనా శర్మ అనే ఆవిడ రాశారు. నరేంద్ర మోడీ మొదటిసారి ముఖ్యమంత్రి కాకపూర్వమే ఆవిడ సొంత రాష్ట్రం అయిన అస్సాం లో ఒక స్థానిక దినపత్రిక ఈ కధనాన్ని1995 లోనే ప్రచురించింది. షరా మామూలుగా ఇది స్వేచ్చానువాదం)

అజ్ఞాత చెప్పారు...

Sir
I read u r article completly. I gave that link for Syamaliyam gaaru. Bcs he missed the ponit.

vindubhojanam చెప్పారు...

భండారు శ్రీనివాసరావు గారూ..
మంచి విషయం చెప్పారు.
ధన్యవాదములు.

శ్యామలీయం చెప్పారు...

My mistake Bhandaru garu!
You very clearly wrote
మళ్ళీ 'మరో' ఇద్దరు నేతలు అదే బోగీలో కనబడ్డారు"
You emphasized that there appeared different leaders in the same compartment.

Thanks for clarification.

Also I thank the anonymous commenter for providing me the link for further reading.