17, జూన్ 2014, మంగళవారం

అడవిలో పుస్తకాలు


ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి చదువుకున్నవాడిలా కానవస్తున్నాడా? లేదు కదా!
మరి ఆ పక్కనే చాప మీద అన్ని పుస్తకాలు ఏమిటి.ఇతగాడి పేరు చిన్నతంబి. కానీ ఇతడిది పెద్ద కధే. వయస్సు కూడా చిన్నదేమీ కాదు. 73. కేరళ రాష్ట్రంలో  ఇడుక్కి జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతం. అతడితో కలిపి వూళ్ళో వుండేది పట్టుమని పాతిక కుటుంబాలు. అవి కూడా ఆదివాసీలవి.   చిన్నతంబి భార్య పనిపాటులు చేసుకుంటూ నాలుగు రాళ్ళు సంపాదిస్తుంది. ఇతడేమో చిన్న టీ కొట్టు నడుపుతూ వుంటాడు. పక్కనే చాపమీద పుస్తకాలు. అవికూడా ఆషామాషీ కాలక్షేపం పుస్తకాలు కాదు. చక్కని క్లాసిక్స్. తను చదువుతూ ఇతరుల చేత చదివిస్తుంటాడు. పుస్తకాలను నామ మాత్రపు రుసుముతో అద్దెకు ఇస్తుంటాడు. అలా వచ్చిన వారికి చాయ్ ఫ్రీ.
అసలు కేరళ రాష్ట్రమే చదువుల తల్లి  నిలయం. ఆ దేవాలయంలో  పూజారులు చిన్నతంబి లాంటి పుస్తక ప్రియులు.

కళ్ళు బెట్టి చూస్తే ఈ ప్రపంచంలో చూసి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నోవున్నాయి. కదా!

కామెంట్‌లు లేవు: