23, జూన్ 2014, సోమవారం

చిరు సన్మానాల ఆదివారం


మా మేనకోడలు విజయ భర్త రవి గారికి నగరంలోని చుట్టపక్కాలను అందర్నీ ఒక చోట కలపడం ఒక హాబీ. అలా నిన్న 'అమ్ముమ్మ సంతానం' అని మేమంతా పిలుచుకునే మా అమ్మ కన్న సంతానం అంటే - ఆమె పిల్లలు, వాళ్ల   పిల్లలు ఇలా అందరూ కలిసి ఒక చోట భోంచేయడం అన్నమాట,అలా  అంతా నిన్న ఆదివారం సాయంత్రం  రవి గారింట్లో కలిసాము. ఒక సందర్భం కూడా కలిసివచ్చింది. తెలంగాణా జెన్కో కొత్త చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్  శ్రీ దేవులపల్లి ప్రభాకర రావు గారు, వారి శ్రీమతీ, అలాగే తెలంగాణా కొత్త ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర రావు గారికి సీపీఆర్వొ గా నియమితుడయిన వనం జ్వాలా నరసింహారావు ఆయన శ్రీమతీ కమ్  మా మేనకోడలు అయిన విజయలక్ష్మికి కలిపి పనిలో పనిగా ఓ చిరు సత్కారం ఏర్పాటు చేశారు రవి గారు. రవిగారి ఆతిధ్యానికి మా మేనకోడలు స్వయంగా వొండివార్చిన వంటకాలు అదనపు ఆకర్షణ.  ముఖ్యంగా ఇంట్లోనే పెరుగు చిలికి తీసిన  వెన్న పూసతో   కొత్త ఆవకాయ కారాన్ని వేడి వేడి అన్నంలో కలుపుకు తింటుంటే అహో ఏమి రుచి. 'మిధునం' సినిమాలో పాట గుర్తుకు వచ్చింది. మా అక్కయ్యల  చేతి రుచి ఇలా ఇలవరసగా మా మేనకోడళ్లకు వచ్చింది. అది వాళ్ళను కట్టుకున్నవాళ్ల అదృష్టం.

(Photo Courtesy Divya)


కామెంట్‌లు లేవు: