26, జూన్ 2014, గురువారం

బాధ కాదు కాదు భయం వేస్తోంది


ఈరోజు (26-06-2014) మహా టీవీ లో న్యూస్ అండ్ వ్యూస్. యాంఖర్ స్వాతి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాల నడుమ తీవ్రం అవుతున్న వివాదాలు, వాటిపై నాయకుల వ్యాఖ్యలు విన్నప్పుడు , వాటిపై చర్చిస్తున్నప్పుడు బాధ వేసింది. మధ్యలో కాలర్లు ఫోన్ ఇన్ లో మాట్లాడుతూ వ్యక్తం చేసిన అభిప్రాయాలు వింటున్నప్పుడు నిజం చెప్పొద్దూ భయం వేసింది. రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. రెండింటిలో పూర్తి సంఖ్యాబలం కలిగిన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కొత్తగా పురుడు పోసుకున్న రెండు కొత్త రాష్ట్రాలను మొత్తం దేశంలో అగ్రగామి రాష్ట్రాలుగా తీర్చిదిద్దుతామని రెండు ర్రాస్త్రాల ముఖ్యమంత్రులు ప్రకటించినప్పుడు 'పరవాలేదు మంచి రోజులు రాబోతున్నాయి' అన్న ఆనందం ఇంత తొందరగా ఆవిరి అయిపోతుందని అనుకోలేదు. రాజకీయ నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా కొంపలు మునగవు. కానీ వారి మాటలతో జనం రెచ్చిపోతేనే అసలు సమస్య. ఏదైనా వివాదం వచ్చినప్పుడు పూర్తిగా ఒక వాదననే సమర్ధించడం అంటే సమస్యను మరింత జటిలం చేయడమే. ముళ్లు మరింత బిగిసిపోకముందే నాయకులు కళ్ళు తెరవాలి. కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి. దానివల్ల సమస్య పరిష్కారం కాకపోయినా రెండు ప్రాంతాల ప్రజల నడుమ వాతావరణం తేలిక పడుతుంది. విజ్ఞతతో కూడిన సంయమనం నేటి అవసరం.  నచ్చినా నచ్చకపోయినా రెండు ప్రాంతాల ముఖ్యమంత్రులకు నాది ఇదే విజ్ఞప్తి.

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Well said.

శ్యామలీయం చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
శ్యామలీయం చెప్పారు...

రాజకీయ నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా కొంపలు మునగవు. కానీ వారి మాటలతో జనం రెచ్చిపోతేనే అసలు సమస్య.

భండారువారూ, ఇంత అమాయకంగా మాట్లాడుతే ఎట్లా?

జనం రెచ్చిపోవాలనే కదా నాయకులుగ చెలామణీ అయ్యేవారు రెచ్చగొట్టే ప్రకటనలు చేసేది? అసలు సమస్య ప్రజలు రెచ్చిపోవటం కాదు. అలా ప్రజలు రెచ్చిపోయేలా కొందరు స్వార్థపరులు మాట్లాడటం. యథారాజా తథాప్రజా అన్నారు గదా.

దేశప్రయోజనాలకన్నా స్వప్రయోజనాలకే పెద్దపీటవేసే సంకుచితమనస్కులైన కొందరి చేతుల్లో అదికారాలు ఇరుక్కుపోవటం అనేది ప్రమాదకరం. అది మనం గుర్తించాలి.

ప్రజలకు ఈ నాయకులను మార్చే అవకాశం ఐదేళ్ళకోసారి కాని రాదు. కాని జనాన్ని ఏమార్చే అవకాశం ఈ నాయకమ్మన్యులకు ప్రతిరోజూ వస్తుంది!

hari.S.babu చెప్పారు...

నేను మనం 105గురి లా ఉండాలి అని ఒక మంచి మాత చెప్పబోతే అసలు ధర్మరాజు మాటనీ, తద్వారా వేదవ్యాసుడ్నీ కవిత్రయాన్నీ కూడా తప్పు పట్తే వాళ్ళు సామ్రస్యానికి పెద్ద పీత వేస్తారని యెలా నమ్మాలి?

వారు కోరుకున్నది ప్రత్యేక అస్తిత్వం, అస్తిత్వం నిరూపణ కావాలంటే పోటీ పడి గెలవాలి.వాళ్ళు పతీదానిలోనూ ప్రాంతంగా పోటీ పడుతుంటే ఆంధ్రావాళ్ళు మాత్రమే మనందరం తెలుగువాళ్ళం అని మురుసుకుంటూ ఉండాలా?

ఈ యాభై యేళ్ళుగా చేస్తున్నట్టు చూసీ చూడనట్టుగానో, అంత ప్రమాదం యేమీ జరగదులే అని మనకి మనమే సర్ది చెప్పుకోవడం వల్లనే ఇప్పటి స్థితి వచ్చింది, ఇక ముందు కూడా ఇదే అమాయకత్వం ప్రదర్శిస్తే మన ప్రాంతపు భవిష్యత్తు మనల్ని క్షమించదు.వాళ్ళెప్పుడో ముసుగులు విప్పేశారు.మనం కూడా విప్పెయ్యాలి వీలయినంత తొందరగా!