26, డిసెంబర్ 2018, బుధవారం

ప్రోటోకాల్ అనేది భగవద్గీత ఏమీ కాదు – భండారు శ్రీనివాసరావు
వచ్చే నెల మొదటి వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జరిపే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు దూరంగా వుండి నిరసన తెలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నట్టు పత్రికల్లో వచ్చింది. ప్రధాని వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్వాగతం పలకడం అనేది ప్రోటోకాల్ విధుల్లో భాగం కావచ్చు. గతంలో దాన్ని పక్కన బెట్టి ముఖ్యమంత్రులు వ్యవహరించిన దాఖలాలు వున్నాయి. ఉదాహరణకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.
కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగా లేని స్తితిలో కూడా ఈ మర్యాదలు పాటించిన ముఖ్యమంత్రులు లేకపోలేదు. వీరిలో అగ్రగణ్యులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నూతన భవనం ప్రారంభానికి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధి వచ్చినప్పుడు రాజీవ్ ప్రసంగిస్తున్నంత సేపూ రామారావు ఆయన చెంతనే నిలబడిపోయారు. అలాగే ప్రధాని శ్రీ పీవీ నరసింహారావుకు భార్యతో కలిసి పాదాలు కడిగారు. ఆయన మర్యాదలు ఆవిధంగా ఉండేవి. రాజకీయంగా విబేధించినప్పుడు ఆ పాత్రలో ఆయన వేరేగా కనబడేవారు.

Image may contain: 1 person, standing

6 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

ఆ ప్రోటోకాల్ విషయం ఏమిటో కానీ భండారు వారి ప్రోటోకాల్ ప్రకారం నలుగురిలో ఒక వ్యక్తిని మాత్రమే "కీర్తిశేషులు"గా పేర్కొనాలి కాబోలు! జయలలిత, రాజీవ్ గాంధి & పీవీ నరసింహారావు గార్ల తక్కువేమిటో ఈయన గారికి "ప్రత్యేక మార్యాద" ఎందుకో గురువు గారే చెప్పాలి.

అజ్ఞాత చెప్పారు...

అడగవయ్య అయ్యగారి ఎక్కువేమిటో

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

శ్రీయుతులు మాదిరిగా కీర్తిశేషులు అనే పదానికి కూడా బహువచనం వుంటే బాగుండేది.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

కీర్తిశేషు”ళ్ళు” అందామా, హ్హ హ్హ హ్హ 😀😀😀 ?

సూర్య చెప్పారు...

నిజానికి మిగతా ముగ్గురంటేనే భండారు వారికి ఎక్కువ ఇష్టం. అందుకే వారు చనిపోయిన విషయాన్ని ఇతను నమ్మట్లేదు.

Jai Gottimukkala చెప్పారు...

@సూర్య:

నిజమేనండోయ్!