24, ఏప్రిల్ 2013, బుధవారం

ఆలోచించండి నా ఈ ఆలోచనలో ఏమైనా తప్పుందా!

 ఉదాహరణకు కిందటి ఏడాది రైల్లో టిక్కెట్టు రిజర్వ్ చేసుకుని ఢిల్లీ వెళ్ళి వచ్చామనుకుందాం. ఆరునెలల తరువాత ఆ టిక్కెట్టుపై సర్ చార్జ్ కట్టండని రైల్వే వాళ్లు తాఖీదు పంపితే ఎలావుంటుంది? అలాగే, నిరుడు హోటల్లో భోజనం చేసినదానికీ, సినిమా చూసిన దానికీ ఇప్పుడు సర్ చార్జ్ కట్టండి అంటే ఎలావుంటుంది? గత సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో వాడుకున్న కరెంటుకు సర్ చార్జ్ కట్టాలని టీవీల్లో స్క్రోలింగులు వస్తుంటే మీకేమని అనిపిస్తోంది? న్యాయమూర్తులు ఎవరయినా దీన్ని సూమోటో గా తీసుకుని జనాలకు న్యాయం చేయలేరా?

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఈమనిపిస్తోందా? చెప్తున్నాను వినండి. ప్రజలందర్నీ పిచ్చి వెధవల్ని చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజల మీదా, ఏమీ చేతకాని ప్రజలమీద పీకల్దాకా కోపం వస్తోంది. ఒక మెషీన్ గన్ తీసుకుని ఇలాంటి వెధవలందర్నీ ఎన్నుకున్నందుకూ, వాళ్ళు ఏమి చేస్తే అది నోరుమూసుకు ఒప్పుకుంటున్నందుకూ ప్రజలందర్నీ కాల్చి పారేయాలి అనిపిస్తోంది. అయినా సరే నా ఏమీ చేతకానితనాన్ని చూస్కుని ఏడుపొస్తోంది.

ఈ 'చల్తా హై ' మనస్సు పోయేదాకా మన బతుకులింతే. ఎవడో ఏదో చేస్తారని చూస్తూ కూర్చోడమే. చేతకాని తనానికి వేరే పేర్లు పెట్టుకుని (అహింసా పరమో ధర్మః, సత్యమేవ జయతే లాంటివి) ఇలాగ రోజూ ఏడుస్తూ చావడమే మన భారద్దేశం గొప్పదనం. ఆఖరికి చిన్న దేశం లో కూడా (కేరళా కంటే చిన్న దేశం) తిరుగుబాటు రావచ్చేమో కానీ మనదేశం లో మాత్రం ఇంకో పదివేల మహా యుగాలు గడిచినా రాదు గాక రాదు.

అజ్ఞాత చెప్పారు...

తెలంగాణా నల్లకోటు రౌడీలు రాస్తారోకో, రైలు రోకో లాంటివి చేస్తారేమో. ఓయు విద్యార్థులు చొక్కాలు చింపుకుని రాళ్ళేసి బజారు పడతారేమో వేచి చూద్దాము.

Narsimha Kammadanam చెప్పారు...

ఉచితం...ఉచితం అనగానే కళ్ళు మూసుకుపోయి...వొళ్ళు తెలియకుండా ఎన్నుకున్నందుకు బాగానే జరిగింది.....అయినా బానిసత్వపు బుద్ది భూమి నాకే బుద్ది పోక మళ్ళీ అదే చేతిలొ నలిగిపోవడానికి సిద్దంగా ఉన్న జనాన్ని చూస్తే మొదటి అఙాత మాటలే నావి కొడానూ.....
ఉచితం అని పోయినవారి పేరు మీద పీక్కుతినడానికి సిద్దంగా ఉన్న మరొ రాబందుల గుంపుని చూసి నవ్వుతో కూడిన ఏడుపొస్తుంది........

ఇంత జరుగుతున్నా పార్టీలన్నీ ....అసెంబ్లీ లో కలిసి మెలిసి ఉండడటం చూసి....ఐక్యమత్యం మీద అసహ్యం పుడుతుంది..

అయ్యా 2 వ అఙాత గారూ మీరు కాస్త మెదడు పెట్టి ఆలోచిస్తే మీ కామెంటు ఎంత అసందర్భమో తెలుస్తుంది అయినా సరె సమర్ధిస్తే...ఎంత మొండి వాదనో అనిపిస్తుంది!

అజ్ఞాత చెప్పారు...

న్యాయస్థానాలూ, న్యాయమూర్తులు అమ్ముడుపోతున్న కాలం ఇంకెక్కడి న్యాయమండి?. న్యాయమూర్తులు గుళ్ళూ గోపురాలచుట్టూ తిరుగుతూ పేపర్లలో పబ్లిసిటీ ఇప్పించుకుంటూ వాళ్ళ్ ఆసలైన వృత్తిని వదిలి తెలుగు కోసం ప్రచారం చేస్తుంటే ... ఆ ప్రచారాన్ని మీడియా వాళ్ళు కేష్ చేసుకుంటుంటే పట్టించుకునే న్యాయాధీశుడెవ్వడు?