17, ఏప్రిల్ 2013, బుధవారం

జ్ఞానపీఠంపై రావూరి భరద్వాజ

రావూరి భరద్వాజ గారు  ఇంత పొడవు గడ్డం  పెంచనప్పుడే కాదు అసలు గడ్డం ఏదీ లేనప్పుడు కూడా నాకు తెలుసు. రేడియోలో పనిచేస్తున్నప్పుడు విలక్షణ వ్యక్తిత్వం కలిగిన ఈ మహా రచయితతో సన్నిహిత పరిచయం వుండేది. నా చిన్నతనంలోనే ఆయన రాసిన 'పాకుడురాళ్ళు' నవల సీరియల్ గా వస్తున్న రోజుల్లోనే నన్నెంతో ఆకర్షించింది. తరువాతి కాలంలో భరద్వాజ గారితో ఆకాశవాణిలో కలసిపనిచేసే మరో అదృష్టం లభించింది. జ్ఞానపీఠం అవార్డ్ ఆయన స్థాయికి చిన్నదని చెప్పను కాని ఆలస్యంగా వచ్చిందని మాత్రం చెప్పగలను. మా గురువుగారికి మనఃపూర్వక అభినందనలు - భండారు శ్రీనివాసరావు (17-04-2013)

3 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

రావూరివారికి రావలసినదే యీ పురస్కారం.
కానీ యిట ఆలస్యంగానా అని కొంచెం బాధ యే మూలో.
వారికి మనఃపూర్వక అభినందనలు.

Saahitya Abhimaani చెప్పారు...

అద్భుతమైన వార్త చెప్పారు శ్రీనివాస రావుగారూ. ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

కన్నడ సాహిత్యంలొ ఇప్పటి వరకు 8 ఙాన పీఠాలు వచ్చాయి. ఇంతకుముందు గెలుచుకున్న వారు చాలా మంది సజీవంగా ఉన్నారు. వారెవ్వరు, వెరే కవికి ఙాన పీఠ పురస్కారం ఇస్తాం అంటే వ్యతిరేకించరు. మా తోటి కవికి ఇవ్వండి అని నిక్కచ్చిగా చెప్తారు. తెలుగులో మన పరిస్తితి గురించి ఒక్ పెద్ద కవి ఈ విషయంపై స్వయంగా వాపొవడం నెను విన్నాను.

పోనీలెండి, ఇన్నాళ్ళకు మనకు కూడా ముచ్చటగా మూడో పురస్కారం దక్కింది.