20, ఏప్రిల్ 2013, శనివారం

జోకులకి కూడా కాపీ రైట్లు వుంటాయా?
“జోకులకి కూడా కాపీ రైట్లు వుంటాయా మాస్టారూ”
“కాపీ రైట్ అంటేనే  కాపీ కొట్టే రైట్ శిష్యా!”

“ఆరంజి పండుకి యాపిల్  పండుకి వున్న తేడా ఏమిటి?”
“ఆరంజి పండు ఆరంజి రంగులో వుంటుంది. యాపిల్ పండు యాపిల్ రంగులో వుండదు”

యాదగిరి కొత్త మొబైల్ ఫోను కొని తెలిసిన వాళ్ల నెంబర్లకు 
ఎస్.ఎం.ఎస్. లు పంపాడు.
“నా ఫోను నెంబర్ మారింది. మునుపు నాది   నోకియా  3310  అయితే ఇప్పుడది నోకియా 6610  గా మారింది. దయచేసి   ఈ నెంబరు మార్పు నోటు చేసుకోండి.”

“డాక్టర్ గారు  ఫుట్ బాల్ ఆడుతున్నట్టు కలలు వస్తున్నాయి”
“అయితే ఈ రాత్రి నిద్రపోయేముందు ఈ మాత్ర వేసుకోండి. సర్దుకుంటుంది”
“రేపటి నుంచి వేసుకుంటా డాక్టర్. ఇవ్వాళే ఫైనల్ మ్యాచ్”

“నేను చనిపోయాననుకో! నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా”
“లేదు. నా చెల్లెలు  దగ్గరకి వెళ్ళి వుంటాను కాని, మళ్ళీ పెళ్లి చేసుకోను. మరి మీ సంగతేమిటి? నేను పోతే మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా?”
“లేదు లేదు. నేనూ  మీ చెల్లెలితోనే వుంటాను”
 
“రాత్రి ఇంట్లో దొంగలు పడ్డారు. ఒక్క టీవీ తప్ప అన్నీ ఎత్తుకెళ్లారు ఇనస్పెక్టర్”
“అదేమిటి టీవీ ఒక్కదాన్ని యెందుకు పట్టుకుపోలేదు”
“దొంగలు వచ్చినప్పుడు నేను టీవీ చూస్తున్నాను”

“ఎందుకలా అంతా పరిగెడుతున్నారు?”
“పరుగు పందెం. గెలిచిన వాళ్లకు మెడల్  ఇస్తారు?”
“గెలిచినవాళ్లకు  మెడల్  ఇస్తారు సరే!  కానీ మిగిలినవాళ్ళెందుకు పరిగెత్తుతున్నట్టు”

“నేను ఒకడిని హత్య చేసాను. ఈ వాక్యాన్ని భవిష్యత్ కాలంలోకి మార్చి చెప్పు”
“నువ్వు జైలుకు వెడతావ్”

“ వెళ్ళు. వెళ్ళి మొక్కలకు నీళ్ళు పొయ్యి”
“వర్షం పడుతున్నట్టుంది”
“అయితే ఏమిటట! గొడుగు తీసుకెళ్ళు”

“నా మొబైల్ బిల్లు యెంత వచ్చిందో చెబుతారా”
“దానికి నా సాయం అక్కరలేదు. మీ మొబైల్ నుంచి  121 డయల్ చేస్తే  మీ కరెంట్ బిల్లు ఎంతో ఏమిటో  మీకు వెంటనే ఎస్.ఎం. ఎస్’ వస్తుంది”
“ఏడిచినట్టే వుంది. నేను అడుగుతోంది నా మొబైల్ బిల్లు సంగతి. కరెంటు బిల్లు కాదు”

“ఆ అమ్మాయికి పుట్ట చెముడులా వుంది”
“ఏం అలా అంటున్నావు”
“ ఇందాక ఆ అమ్మాయిని కలిసి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పా. అలా చెప్పాక కూడా ‘నా చెప్పులు కొత్తవి తెలుసా’ అంటోంది”

“నిన్ను నా  కోర్టులో మళ్ళీ మళ్ళీ  చూస్తున్నాను. మూడో సారి కూడా ముద్దాయిగా కోర్టుకు  రావడానికి నీకు సిగ్గనిపించడం  లేదా”
“యెందుకు సిగ్గు!  మీరు మాత్రం రోజూ కోర్టుకు రావడం లేదా”
 
“రాముడు, బుద్ధుడు, మహమ్మదు ప్రవక్త,  ఏసు క్రీస్తు, గాంధీ -  వీరిలో నీకు కామన్ గా కనిపించే విషయం ఏమిటి”
“అందరూ ప్రభుత్వ సెలవుదినాల్లోనే  పుట్టారు
“మిస్ నిన్న నా మొబైల్ కేమైనా ఫోను చేసారా?”
“లేదే! ఎందుకలా  అడిగారు”
“ఏమీ లేదు నా ఫోన్ లో ఒక మిస్ కాల్ వుంది.”
(ఇవన్నీ నెట్లో విహారం చేస్తున్న ఇంగ్లీష్ జోకులు. ముందే చెప్పినట్టు తెలుగులోకి కాపీ కొట్టే రైట్ కొట్టేశానన్నమాట. మొట్టమొదటిదొక్కటే అచ్చంగా నా సొంతం. పోతే ఇమేజ్ సొంతదారుకు ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు)

6 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...


మీ టపా కి మేము కామెంటు కొట్టిన , మా కామెంటు కి కాపీ రైటు మీకుండునా మాకుండునా ? విశదీకరించుడూ !!


చీర్స్
జిలేబి.

అజ్ఞాత చెప్పారు...

కొందరి కామెంట్లు అతి బోరింగ్, వాటికి కాపీ రైటు కూడానా? కామెంట్ నెత్తిన 10రూ పెట్టి 5రూ అమ్మినా పోవు. వీళ్ళు ఎందుకు విశ్రాతి తీసుకోరా అనిపిస్తుంది.

చీర్స్
బిలేజి

అజ్ఞాత చెప్పారు...

చ చ చ

ఏమండీ బీలేజీ ,

మా కామెంటులకి ఐదు రూపాయల విలువ కూడా లేదా!

ప్చ్ ! కామెంటు పిచ్చి ఎప్పుడు వదులునో మరి !!

చీర్స్
జిలేబి.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Zilebi and @ బిలేజి - నాకొక అనుమానం. కాదు సందేహం - ఇలా అజ్ఞాత అని రాసినప్పుడు వారి అనుమాననివృత్తి చేయాలంటే యే మెయిల్ కు సమాధానం పంపాలి?

అజ్ఞాత చెప్పారు...

అజ్ఞాతలకు కానివ్వండి, జ్ఞాతలకానివ్వండి, మరెవరైనా కానివ్వండి, ఇవ్వాలనుకుంటే ఇక్కడే సమాధానం ఇవ్వవచ్చు. మరీ అమాయకంగా ఇంటికెళ్ళి సమాధానం ఇస్తా అని పట్టుబట్టనవసరం లేదు.
:)

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత - మరి ఇద్దరు ముగ్గురు ఇలా 'అజ్ఞాత' అంటూ ముందుకు వస్తే అప్పుడు ఎవరికి యెలా జవాబు ఇవ్వాలి?