12, ఆగస్టు 2024, సోమవారం

చేతిలో చెయ్యేసి


Puget sound అనేది మైళ్ళ పొడవున విస్తరించిన అపారమైన జలరాశి.
 దీని వొడ్డున ఉక్కు తీగెల కంచె యేమిటి? కంచెకు వేసిన ఆ తాళాలు యేమిటి?

మన దేశంలో 
ప్రేయసీ ప్రియులు తమ ప్రేమ వ్యక్తీకరణ కోసం చెట్ల బెరడుల మీద, పాడుపడిన కోట గోడల మీద తమ పేర్లు చెక్కుకుని సంతోష పడినట్టే, ఇక్కడ అమెరికాలో ఇలా ఇనుప కంచెలకి తాళాలు వేసి, తాళం చెవులు ఎక్కడో పారేసి, గుండెల్లో దాచుకున్న తమ ప్రేమ పదిలం అనుకుంటూ  సంతుష్టి పడుతుంటారు (ట).
ఇలా వేసిన తాళాల్లో తుప్పుపట్టిపోయినవి, తాజాగా వేసినవి కూడా కనిపించాయి.
ఇంటికి వచ్చి గూగుల్ ని అడిగితే అమెరికాలో విడాకులు తీసుకునే వారి సంఖ్య 42 శాతం అని చెప్పింది.

3 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఇక్కడ తాళం వేసిన జంట ఒకవేళ రేపెప్పుడయినా విడిపోతే, పౌరుషంతో మళ్ళీ ఇక్కడికొచ్చి తాళం తీసేద్దామనుకుంటే వీలవదే పాపం 🤔. ఎందుకంటే తాళం చెవిని ఆనాడే విసిరి పారేశారు గా.
పిచ్చివేషాలు.

అజ్ఞాత చెప్పారు...

ఎవరి పిచ్చి వారికి ఆనందం
గతం గతః

తప్పులేదు

అజ్ఞాత చెప్పారు...

No. The beautiful feeling when putting lock as a symbol of love can be understood only by true lovers. Even if any of them part ways later, don't think they will come back to remove it.