అందరూ ఆఫీసుల నుండి వచ్చి బయలు దేరి వెళ్ళేసరికి, బెల్ వ్యూ సిటీ హాల్ పార్కింగ్ లాట్ వందలాది కార్లతో నిండి పోయి ఉంది.
దాంతో పక్క వీధిలో వున్న పెయిడ్ పార్కింగ్ లో కారు పెట్టి తిరిగి వస్తుంటే పేవ్ మెంట్ మీద గుంపులు గుంపులుగా రకరకాల భారతీయ వస్త్ర ధారణతో ఆడా మగ ఉత్సాహంగా నడుస్తూ కనిపించారు. త్రివర్ణ పతాకాలతో సిటీ హాల్ ప్రాంగణం నిండి పోయింది. జాతీయ జెండా కట్టుకుని వెడుతున్న ఒక సిటీ బస్సు కనిపించింది.
వచ్చిన జనం మూడు నాలుగు వేల మంది వుండ వచ్చు. ప్రధాన రహదారిలో ప్రదర్శన. ఆ రోడ్డును కొన్ని గంటల పాటు మూసివేశారు. చాలా మంది సాయుధులు అయిన పోలీసులు వున్నారు కానీ వాహనాలు, పాద చారుల రాకపోకల క్రమబద్ధీకరణకు మాత్రమే పరిమితం అయ్యారు. ఫైర్ సర్వీసు వారు తమ భారీ వాహనాలతో సిద్ధం అయ్యారు. వ్యక్తిగత తనిఖీలు లేవు. అమెరికాలో ప్రవేశించే ముందే ఏ తనిఖీ అయినా. ఒక్కసారి ఆ దేశంలో ప్రవేశించిన తర్వాత మాల్స్, సినిమా హాల్స్ ఎక్కడా ఏవిధమైన చెకింగులు ఉండకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. రోడ్డు దాటేటప్పుడు జాన్ సన్ అనే పోలీసు అధికారి నా చేయి పట్టుకుని దాటించాడు. ఇండియా అంటే సౌతా అని అడిగి, ఓహ్ స్పైసీ అంటూ నవ్వాడు.
మా అబ్బాయి బోయింగ్ లో పనిచేసేటప్పుడు సహోద్యోగి ఇప్పుడు డిప్యూటీ మేయర్. అంత హడావిడిలో కూడా సందీప్ తో తీరిగ్గా మాట్లాడారు. నన్ను పరిచయం చేస్తే భారతీయ పద్ధతిలో చేతులు జోడించి నమస్కారం చేసారు.
రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన వేదికపై ఇండియన్ కాన్సులేట్ ఉన్నతాధికారులు ఆసీనులు అయ్యారు. వేదికపై ఒక పక్కగా కూర్చుని రెండు గంటలు ఆసక్తిగా ప్రదర్శన తిలకించిన వారిలో ఒకరిని మాత్రం నేను గుర్తు పట్ట గలిగాను. ఆయన ఎవరో కాదు, ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్. తరువాత వివిధ రాష్ట్రాల వారు తమ సంస్కృతిని ప్రతిబింబించే వాహనాల ప్రదర్శన జరిగింది. వీటిల్లో తెలంగాణా, ఆంధ్రా లకు చెందినవి కూడా వుండడం సంతోషం కలిగించింది. ప్రదర్శన ముగిసిన తర్వాత వారితో ఫోటోలు దిగాము.
వచ్చిన వారందరికీ స్టార్ బక్స్ వారు తీయటి పానీయాలు అందించారు.
ఇంటికి వెళ్ళే ముందు దగ్గర్లోని ఓ అమెరికన్ రెస్టారెంట్లో భోజనం చేసాము. ఆగష్టు 15 ఇండియన్ రెస్టారెంట్ లకు సెలవు.
మెన్యు కార్డులో కుడి వైపు చూడవద్దు, ఎడమవైపు వున్న వాటిలో మీకు ఇష్టమైనవి ఆర్థర్ చేయండి అనేది మొదటి రోజే మా అబ్బాయి చేసిన సూచన. ఎంత ఖరీదు అనేది పట్టించుకోవద్దు అనేది దాని టీకా తాత్పర్యము.
4 కామెంట్‌లు:
👏👏🇮🇳
భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సభలో బిల్ గేట్స్ వంటి వారు పాల్గొనడం వారి సహృదయత కు నిదర్శనం.
సంప్రదాయ వస్త్ర ధారుల నడుమ మీరు దొరబాబు లాగా ఉన్నారు 👌💐
ఇప్పుడు బాబు గారు అమెరికా cia మాటలు nammi డ్రామాలు చేస్తే టీడీపీ అనే పార్టీ మనుగడ కష్టం లోకేష్ rajakeeya భవితవ్యం బాబు గారే సమాప్తి చేసినట్టు కెసిఆర్ చేసిన తప్పు బాబు చేయడు అనుజంటున్నాం ఒకవేళ ఇది నిజం అయితే పవన్ గారే ap కి అండ
హల్లో జిలేబీ శాస్త్రి
వికట పద్యాల మేస్త్రీ
మాటల్తో చేయకు ఇస్త్రీ
జిలే బాబూభాయి మిస్త్రీ
ఇంతకీ పురుషుడా లేక స్త్రీ ?
కామెంట్‌ను పోస్ట్ చేయండి