అమెరికా వచ్చి అప్పుడే నెల అవుతుందా. ఎవరో తోసుకువచ్చినట్టు వచ్చింది నా రెండో పిల్లవాడి ఏడో మాసికం.
ఉదయం మా పెద్దవాడు సందీప్ నన్నూ, కోడల్నీ, పిల్లల్నీ తీసుకుని Bothell లోని హిందూ టెంపుల్ కి తీసుకువెళ్ళాడు. పూజారి హేమంత్ శర్మ వయసులో చాలా చిన్నవాడు. అమెరికా వచ్చి అయిదు నెలలే అయింది. అంతకు ముందు మారిషస్ హిందూ టెంపుల్ లో నాలుగేళ్లు పనిచేశాడు. ప్రకాశం జిల్లా అద్దంకి ప్రాంతం వాడు. గుడికి వెళ్ళే ముందు మిల్ క్రీక్ ప్రాంతంలో వున్న ఆయన ఇంటికి వెళ్ళాము. ఆ కాలనీ చెట్ల గుంపుల నడుమ చాలా పొందికగా వుంది. ఆయన్ను కారులో ఎక్కించుకుని గుడికి వెళ్ళాము. డ్రైవింగ్ లైసెన్స్ రాగానే కారు కొనుక్కుంటానని దారిలో చెప్పారు.
కార్యక్రమాన్ని చాలా నిష్టగా జరిపించారు హేమంత్ శర్మ గారు.
పదకొండేళ్ల క్రితం ఇదే దేవాలయంలో మా అమ్మగారి ఆబ్డీకం పెట్టిన విషయం జ్ఞాపకం చేసుకున్నాము.
నెల రోజుల ముందే మా వాడు పూజారితో మాట్లాడి పెట్టడం, కోడలు భావన ఒకరోజు ముందే ఇండియన్ స్టోర్ నుంచి కావాల్సిన సంభారాలు తెచ్చి సిద్ధం చేయడం ఇవన్నీ, దేశం కాని దేశంలో ఇటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా జరపడానికి సాయపడ్డాయి.
4 కామెంట్లు:
Brahmin Genes :)
ఈ అజ్ఞాత గారి కామెంట్ లోని భావమేమిటి?
ఈ మధ్య ట్విట్టర్ లో ఈ వాక్యం బాగా వైరల్ అయ్యింది. ప్రస్తుత సమాజం లో బ్రాహ్మణులపై ఉన్న వివక్షకు వ్యతిరేకంగా ఒకావిడ ఈ ట్వీట్ చేశారు. ఆవిడకు చాలామంది
సపోర్టు ఇచ్చారు.
గో బ్రాహ్మణేభ్య: శుభమస్తు నిత్యం. లోకా: సమస్తా: సుఖినో భవంతు.
దద్దోజనం :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి