ఈరోజు తొలి వెలుగు రేఖలు విచ్చుకుంటూవుంటే, నా కంటి ముందు మరో వెలుగు కనబడింది. కనబడడమే కాదు నాతో మాట్లాడింది కూడా.
‘నా పొరబాటో, నీ గ్రహపాటో తెలియదు. మొత్తం మీద 78 దాటుతున్నావు. నువ్వు అడగకుండానే నీకో అపూర్వమైన వరం ఇవ్వాలని అనిపించి వచ్చాను. అయితే ఓ షరతు. దానికి ఒప్పుకుంటేనే సుమా!’
‘.............’
‘చెబుతా విను. ఇక నుంచయినా నువ్వు ఆనందంగా వుండు. ఇతరులని సంతోషంగా ఉంచు. ఇలా చేస్తే నేనిచ్చే వరమేమిటో తెలుసా? సంతృప్తి. ఇంగ్లీషులో కంటెంట్ మెంట్ అంటారుట. అది సాధిస్తే, ఇక నాకిది కావాలి, అది కావాలి అని నన్ను ఎప్పుడూ సాధించవు. ఇలా తెల్లవారకుండానే వచ్చి నీకు వరాలు ఇచ్చే పని నాకూ వుండదు. తెలిసిందా! డెబ్బయి ఎనిమిదేళ్లు వచ్చిన తర్వాత కూడా తెలియకపోతే నీ ఖర్మ. వస్తా!’
4 కామెంట్‌లు:
బ్లాగ్జ్యోతిష్కుల వారి పోస్టులా వుందండోయ్ భండారు వారు :)
శుభాకాంక్షలతో
చీర్స్
బిలేజి :)
జన్మదిన శుభాకాంక్షలు శ్రీనివాసరావు గారూ 💐.
ఔను. అయితే గుగ్గురువు గారి ఉపదేశం రివర్స్ లో ఉంటుంది. గద్దించే రైట్స్ ఆయనకే ఉంటాయి.
Happy birthday sir.
Happy birthday శ్రీనివాసరావు గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి