చేతిలో చెయ్యేసి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చేతిలో చెయ్యేసి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, ఆగస్టు 2024, సోమవారం

చేతిలో చెయ్యేసి


Puget sound అనేది మైళ్ళ పొడవున విస్తరించిన అపారమైన జలరాశి.
 దీని వొడ్డున ఉక్కు తీగెల కంచె యేమిటి? కంచెకు వేసిన ఆ తాళాలు యేమిటి?

మన దేశంలో 
ప్రేయసీ ప్రియులు తమ ప్రేమ వ్యక్తీకరణ కోసం చెట్ల బెరడుల మీద, పాడుపడిన కోట గోడల మీద తమ పేర్లు చెక్కుకుని సంతోష పడినట్టే, ఇక్కడ అమెరికాలో ఇలా ఇనుప కంచెలకి తాళాలు వేసి, తాళం చెవులు ఎక్కడో పారేసి, గుండెల్లో దాచుకున్న తమ ప్రేమ పదిలం అనుకుంటూ  సంతుష్టి పడుతుంటారు (ట).
ఇలా వేసిన తాళాల్లో తుప్పుపట్టిపోయినవి, తాజాగా వేసినవి కూడా కనిపించాయి.
ఇంటికి వచ్చి గూగుల్ ని అడిగితే అమెరికాలో విడాకులు తీసుకునే వారి సంఖ్య 42 శాతం అని చెప్పింది.