15, జులై 2014, మంగళవారం

భార్యలకి మాత్రమే కానీ భర్తలు నిశ్చింతగా చదవొచ్చు

ఆవిళ్ళూ (ఆవిడలూ అన్నమాట) ఇనుకోండి ఈ మాట
(భార్యలకి మాత్రమే కానీ భర్తలు నిశ్చింతగా చదవొచ్చు)
'కలం పోయింది అనుకోండి ఏం చేస్తాం. కొత్త కలం కొనుక్కుంటాం. అదే పెన్ను క్యాప్ పోయిందనుకోండి, క్యాప్ కొనుక్కుందామనుకున్నా దొరకదు కదా! ఆ క్యాప్ లాంటి వారే మన మొగుళ్ళు. ఇక్కడ 'మన' అంటే రాయల్ మన. అంతే కాని అపార్ధాలు గట్రా చేసుకోకూడదు. అంచేత మొగుళ్ళు అనేవారు పెన్ను క్యాపుల్లాంటి వాళ్ళన్నమాట. వాళ్లకి రిప్లేస్ మెంటులు వుండవు. మరోసారి అంచేత అమ్మళ్ళూ!  మీ మీ మొగుళ్ళ ఫోటోలను మీమీ  మొబైల్ ఫోన్లలో స్క్రీన్ సేవర్ గా పెట్టుకోండి. దీనివల్ల రెండు లాభాలు. ఒకటి మీ మొగుడు గారు ఎప్పుడూ మీ గుప్పిట్లో వుంటారు. రెండోది ఏదన్నా సమస్య ఎదురయినప్పుడు ఆయన ఫోటోను ఓసారి తేరిపారచూడండి. 'ఓస్ ఇంతేనా! ఇంత పెద్ద సమస్యను ఇంట్లో పెట్టుకుని హ్యాండిల్ చేస్తున్నదాన్ని,  నాకిదో సమస్యా!  అనుకోండి. అంతే! యెంత పెద్ద సమస్య అయినా సరే  చిటికెలో సాల్వ్ చేసుకోగలుగుతారు.
మరో విషయం.
ఇది ఇంగ్లీష్ లో చెప్పుకుంటేనే బాగుంటుంది.
'Living with husband is a part of living.......but living with the same husband for years is art of living'
నిజానికి ఈ విషయం ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. నూటికి నూరుమంది భార్యలకి పక్కాగా తెలిసిందే ఇది.

గమనిక: నవ్వొచ్చినా నవ్వుకున్నా నా ఖాతాలో వేయండి. ఎందుకంటే తెనిగించడం మినహా నాకు ఇందులో ఎలాటి పూచీ లేదు. విషయం కాస్త అటూఇటూ అయితే మాత్రం  వింజమూరి వెంకట అప్పారావు గారున్నారు కదా,  ఇలాటివన్నీ పోస్ట్ చేస్తుంటారు. మీమీ   అక్షింతలన్నీ ఆయన పద్దులో వేయండి.

1 వ్యాఖ్య:

శ్యామలీయం చెప్పారు...

ఎలాగూ‌ పందిట్లో పెళ్ళికొడుకు మీద వేసిన అక్షతలు కాసినికాసిని దారితప్పి పురోహితులవారిమీద పడిపోతూ ఉంటాయి కదా? అలాగే వింజమూరి వెంకట అప్పారావు గారిమీద వేసేద్దాం అనుకున్నా పాపం కొన్ని అక్షతలూ మీ‌ నెత్తినా పడతాయి కాబట్టి తస్మాత్ జాగ్రత జాగ్రత.

ముగుళ్ళు పెన్ను కేప్‌ల వంటీ వారూ, వాళ్ళకి రిప్లేస్‌మెంత్లు ఉండవూ అనేస్తున్నారూ, మీ‌ ఉద్దేశం ఏంటీ? అన్యాపదేశంగా పెళ్ళాలకు రిప్లేస్‌మెంట్ గ్యారంటీ అని సెలవిసున్నారా? స్త్రీవాదులూ, స్త్రీవాదులూ! ఇలారండీ, ఇక్కడో మంచి పాయింటుందీ!

పైగా ఈయనెవరో మొగుళ్ళు ఇంట్లో ఉన్న పెద్దసమస్యలూ హిహీహీ‌ అంటూ సెలవిచ్చేస్తున్నారు గమనించండి! పురుషవాదులూ వాళ్ళ సమర్థకులూ అందరూ ముఖ్యంగా ఇది గమనించాలి.

పైగా ఇవన్నీ నవ్వుకునే విషయాలా? ఇంకా స్త్రీవాదులూ, పురుషవాదులూ రావటం లేదేంటీ?

ఉండండి అందర్నీ పిలుచుకు వస్తాను.