6, జులై 2014, ఆదివారం

విరాట రాజ్యంలో వాన


ఈ కధ అందరికీ తెలిసిందే. పాండవులు అజ్ఞాత వాసంలో గడుపుతుంటారు. ఏడాది గడువు పూర్తయ్యేలోగా వారి ఉనికిని కౌరవులు కనుక్కోగలిగితే  మళ్ళీ  మరో ఏడాది అజ్ఞాత వాసం తప్పదు. పాండవులు ఎక్కడ వున్నారో తెలుసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. 'పాండవులు పుణ్యాత్ములు. వారు నడయాడిన చోట సకాలంలో వర్షాలు విస్తారంగా కురుస్తాయి' అని కురుసభలో పెద్దలు సెలవిస్తారు. పాండవ స్తుతితో కూడిన  ఆ మాటలు అట్టే  రుచించకపోయినా, వారిచ్చిన 'క్లూ' మాత్రం కురు సార్వభౌముడికి తెగనచ్చుతుంది.
ఈ కధ యెందుకు గుర్తుకు వచ్చిందంటే ఫేస్ బుక్ లో చూసినా, టీవీ స్క్రోలింగులు చూసినా తొలకరి జల్లులు కురిసి  మట్టి తడిసిన వాసన.


కానీ మేముంటున్న మాదాపూర్ లో మాత్రం చినుకు జాడ లేదు, ఉరుములు మెరుపులు తప్ప.  
పాండవులు కాస్త వీలు చూసుకుని ఇటేమన్నా వస్తారేమో చూడాలి.

3 వ్యాఖ్యలు:

శ్యామలీయం చెప్పారు...

పాండవులు వచ్చి మాదాపూర్‌లో భూమిని కబ్జా చేస్తే తెలంగాణా అధినేతగారు ఒప్పుకోరండీ!

Jai Gottimukkala చెప్పారు...

బాగులు బగీచాలు బంద్ అయినయి. చెరువులు కుంటలు ఎండి పోయినయి. రాళ్ళు రప్పలు ఇరిగిపోయినయి.

మిత్ర పెట్టుబడిదారీ వినాయకుల వికృత భూదాహానికి రియల్ మాఫియా కరాళ నృత్యానికి మధ్య జరుగుతున్న జుగల్బందీ బాగు బహుబాగు.

ప్రకృతిపై ఇంకా ఇలానే దాడి చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించుకోవడం కష్టం కాదు.

hari.S.babu చెప్పారు...

ఋతువులు వాటి ధర్మాన్ని తప్పి పోతున్నా, అక్కడ వోజోనుకు బొక్క పడి చాలా కాలమయిందని తెలిసినా ఇంతకాలం నిష్పూచీగా బతికేశాం.ఇప్పుడు కాక మరీ యెక్కువయింది,బహుశా కళ్ళు తెరిచినా ఫలితం లేని వినాశనం అతి అగ్గిర లోనే వుందేమో?!