9, నవంబర్ 2021, మంగళవారం

2016 నాటి నోట్ల రద్దు ముచ్చట్లు – భండారు శ్రీనివాసరావు

 ఏటీఎంలలో డబ్బులు వస్తున్నాయని కొందరు, రావడం లేదని మరికొందరు వాదించుకొనుచున్నారు. మీరు ఎవరితో ఏకీవభించెదరు ఎడిటర్జీ?”

ఇద్దరితో..”

అదెలా?”

అంటే ఇలా. చెబుతాను ఇనుకో!.....సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. తాము ఒకటి నమ్ముతూ దాన్నే ఇతరులు కూడా నమ్మి తీరాలనే మనస్తత్వం ఇందులో ప్రబలంగా వుండడమే దీనికి కారణం”

మరి ఏది దారి?”

కంటితో చూసి రుజువు చేసుకోవడమే... నిన్న కాక మొన్న మా కజిన్ వాళ్ళు అరకు టూరు వెళ్లివచ్చారు. వాళ్లకు ఎక్కడా ఇబ్బంది కాలేదు. అన్ని ఏటీఎంలు పనిచేస్తూనే వున్నాయి. డబ్బులు దొరుకుతూనే వున్నాయి. అంతే కాదు, చిన్న షాపుల్లో చిన్న వస్తువు కొనుక్కుని రెండువేల నోటు ఇచ్చినా మరో మాట అడగకుండా చిల్లర లెక్కపెట్టి ఇస్తున్నారట. పైగా కొత్త అయిదు వందల నోట్లు పుష్కలంగా దొరుకుతున్నాయట. ఇన్ని ‘ట’ లు వున్నాయని నమ్మను అనబోకు. మా కజిన్ చెప్పింది మరి. అదెప్పుడూ అబద్ధం చెప్పదు. మరి హైదరాబాదులో ఈ గొడవ ఏమిటి? అక్కడ లేని ఇబ్బందులు ఇక్కడ ఎందుకు?”

అది అరకు. ఇది హైదరాబాదు. పెద్ద నగరం. పెద్ద జనాభా. పెద్ద నోట్ల అవసరం ఇక్కడ ఎక్కువ. అందుకే ఇక్కడ కొరత. అందుకే ముందే చెప్పాను, రెండు వాదనలు నిజమే అని. విషయం విడమరచి చెబుతాను విను. ఇప్పుడు ఇక్కడ టైం ఎంత? పగలు పన్నెండు గంటలు. అమెరికాలో వున్న మీ అబ్బాయికి ఫోను చేసి కనుక్కో. రాత్రి పన్నెండు అంటాడు. అదీ నిజమే. ఇదీ నిజమే. అదన్న మాట”

(2nd January 2017)

1 కామెంట్‌:

మార్గయ్య మాల్గుడి చెప్పారు...

డీమానిటైజేషన్.. అన్నది అభివృద్ది చెందుతున్న దేశాల తాలూకు బ్లాక్డ్ మనీ (బ్లాక్ మనీ కాదు).. అనకౌంటెడ్ మనీ.. అనార్గనైజ్డ్ సెక్టార్ లో కుప్పలా పేరుకుపోయిన మనీ.. వగైరాలను వెలికి తేవడం ద్వారా దాన్ని గాడిన పెట్టడానికి.. సాధారణ ప్రజల్లో సైతం ఆర్ధిక చైతన్యంతో కూడిన క్రమశిక్షణ తేవడానికి.. మరికొన్ని ఆర్ధిక (నిగూఢ) ప్రయోజనాలను సాదించడానికి..ఓ గొప్ప సాధనం.. రఘురామరాజన్ ఎందుకలా ఆ చర్యను వ్యతిరేకించాడో ఇప్పటికీ నాకు అర్ధం కాదు.. బహుశా మోదీని మోదీగానే చూడటం వల్ల కావచ్చు.. అందుకే ఏ వ్యక్తికైనా క్రెడిబిలిటీ ముఖ్యమనేది.. అది కోల్పోయిననాడు క్షీరసాగరమధనం కూడా ఒక దుశ్చర్యలాగానే మిగిలిపోతుంది.. పదిమందినీ బొట్టు పెట్టి పిలిచో.. శుభలేఖలు పంచో.. పేరంటం వంటి దాంట్లోనో ప్రకటించేది కాదది.. ఎలా అయితే చెయ్యాలో అలానే చేశాడు మోదీ.. కానీ డీమానిటైజేషన్ ప్రకటన తరువాత మాత్రం పూర్తిగా చేతులెత్తేశాడు.. (ఒక బ్యాంకరుగా సాధికారతతో చేప్పే మాటలివి).. అంతా గందరగోళమే.. సామాన్యులను బురిడీ కొట్టించి మరీ పెద్దలకు సంబంధించిన రద్దు నోట్లను బాజాప్తగా మార్చేశాయి బ్యాంకులు అప్పట్లో.. (ప్రభుత్వ.. ప్రైవేటు అని తేడా లేకుండా)..అంతే కాక దాని తాలూకు (డీమానిటైజేషన్) ఉద్దేశాలు సైతం శంఖకు గురయ్యాయి (తదనంతరం అవి వట్టి శంఖలు మాత్రమే కావని.. పచ్చి మరియు చేదు నిజాలన్న నమ్మకం సర్వత్రా నెలకొనిపోయింది..).. మరో ప్రత్యామ్నాయం లేకను.. ప్రతిపక్ష అనైక్యత వల్లను మరోమారు గెలిస్తే గెలవ్వచ్చును గాక మోదీ.. వాస్తవంగా ఓడిపోయాడాయన.. తనకు రిబ్బన్ కటింగు మాత్రమే వచ్చని డీమానిటైజేషన్ ద్వారా మరోమారు ఋజువు పరిచాడు.. ఓపెన్ ససేం ఒక్కటే వస్తే అంతా అయినట్టేనా.. వీళ్ళనే నిక్కర్ బ్యాచ్ అంటారు.. సినిమాను సగం దాకా తియ్యగలరు.. మిగిలిన సగం ప్రేక్షకుల సహనానికొదిలేస్తారు ఇటువంటివాళ్ళు.. క్లైమాక్స్ సంగతి దేవుడెరుగు అన్నట్టుంటుంది వీళ్ళ వ్యవహార సరళి.. అయితే ఇవన్నీ ప్రక్జన పెట్టి చూస్టే కొన్ని విశేష ప్రయోజనాలు చేకూరాయి జాతికి డీమానిటైజేషన్ ద్వారా.. అవేంటో పరికిద్దాం ఓసారి.. మోదీ అంటే ఏమిటో జాతి అంతటికీ (ఆయనతో సహా) తెలిసిపోయింది.. ఆయన తాలూకు క్రెడిబిలిటీ ఏపాటిదో కూడా అవగతమైపోయింది జాతికి.. ఆకాశాన్నంటే ఆర్ధిక క్రమశిక్షణ అలవడింది జాతికి.. డబ్బు విలువ తెలిసొచ్చింది.. డబ్బును కాగితరూపంలో భద్రపరుచుకోవడం అనే ప్రక్రియకు గండి పడింది.. వీలైనంతమేర అకౌంటబుల్ అవడం షురూ అయ్యింది.. డిజిటల్ విప్లవమంటే ఏమిటో జాతి మొత్తానికి తెలిసి వచ్చింది.. పండిత.. పామరులంతా డిజిటల్ మనీకి అలవాటు పడ్డం మొదలయ్యింది.. దీనికై మోదీ అభినందనీయుడే.. తన ప్రతిష్టను.. పరువును.. పేరును.. అన్నిటినీ ఫణంగా పెట్టి (తన బట్టలు తనే పూర్తిగా విప్పేసుకు) మరీ జాతికింతటి ప్రయోజనాన్ని చేకూర్చిన మోదీని అభినందించకుండా ఉండలేము.. అలాగే ఆయన్ను గాని.. ఆయన చేష్టలను గాని.. ఆయన విధానాలను గాని ఒక్క శాతం కూడా నమ్మలేము.. విశ్వసించలేము.. అసలే అంతంతమాత్రంగా ఉండే ఆయన క్రెడిబిలిటీ పాతాళంలోకి పడిపోయింది.. ఒకరకంగా అదీ ప్రయోజనకారే దేశానికి.. జాతికి.. భీష్మునికో వరముంది.. స్వచ్ఛంద మరణమనేది.. ఆయన తరువాత ఇదిగో ఈయనకు మాత్రమే ఉందది.. మనకు ఇప్పుడు కనిపించేది ఆయన రూపం మాత్రమే.. ఆయన కాదు.. తనకున్న వరాన్ని ఆయనెపుడో వాడేసుకున్నాడు (దుర్వినియోగపరుచుకున్నాడు ).. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డైడ్ అన్నది వెనుకటి మాట..
ఆపరేషన్ సక్సెస్.. డాక్టర్ డైడ్ (బ్రెయిన్ డెడ్) అన్నది నేటి మాట.. దయచేసి ఆ డాక్టరెవరన్న ప్రశ్న వేయకండి..
ఏదో ఎత్తి మరేదో కప్పుకున్నట్టయ్యింది ఆయన పరిస్థితి.. ఆయనెవరని కూడా అడక్కండి..