6, నవంబర్ 2021, శనివారం

జవాబుకు తగ్గ ప్రశ్న- భండారు శ్రీనివాసరావు

 సమాధానంఎలా వుండాలని కోరుకుంటారో ప్రశ్న ఆ విధంగా వుండాలని కార్పొరేట్ గురువులు చెబుతుంటారు.

అందుకో ఉదాహరణే ఈ కధ.
ఏకాంబరం, పీతాంబరం మంచి మిత్రులు.
‘దేవుడ్ని పూజిస్తూ సిగరెట్ తాగొచ్చా’ అన్నది పీతాంబరం అనుమానం. వెళ్లి గుళ్ళో పూజారి ఒంటరిగా వున్నప్పుడు అడిగాడు.
“తప్పు నాయనా! తప్పు. దైవ ప్రార్ధన చేసేటప్పుడు అటువంటి తప్పుడు పనులు ఎంతమాత్రం కూడదు” అన్నాడు పూజారి.
ఆ విషయమే వెళ్లి స్నేహితుడితో చెప్పాడు.
“నువ్వు అలా అడిగుండాల్సింది కాదు’ అన్నాడు పీతాంబరం.
తరువాత పీతాంబరం వెళ్లి మళ్ళీ అదే పూజారిని కలుసుకుని అడిగాడు,“పొగతాగుతూ దైవాన్ని స్మరించుకోవచ్చా!” అని.
“దానికేం నాయనా! నిక్షేపంగా దైవ ప్రార్ధన చేసుకోవచ్చు. సర్వకాల సర్వావస్తలలో దేవుడ్ని స్మరించుకోవడం అవశ్యం అభిలషణీయం”

కామెంట్‌లు లేవు: