22, నవంబర్ 2021, సోమవారం

మారింది దృశ్యమే, విషయం కాదు

 మిస్టర్ పెళ్ళాం చిత్రంలో ఓ సీను గుర్తుకు వస్తోంది.

వైకుంఠంలో శేషతల్పంపై  విశ్రాంతి తీసుకుంటున్నవిష్ణు మూర్తి రూపంలోని రాజేంద్రప్రసాద్ కు   లక్ష్మీదేవి పాత్రలోని నటి  ఆమని  కాళ్ళు పడుతున్నప్పుడు నారదుడు వస్తాడు. మా ఆడవారి పని ఎప్పుడూ ఇలా మొగుళ్లకు సేవ చేయడమేనా అనే ఆమని అంతరంగాన్ని అర్ధం చేసుకుని, రాజేంద్ర ప్రసాద్ తమ పాత్రల్ని తారుమారు చేస్తాడు.  తాను విశ్రమిస్తుంటే  ఎంచక్కా మొగుడు కాళ్ళు పడుతున్న దృశ్యం ఊహించుకుని మురిసిపోతున్న లక్ష్మీదేవి, అసలు మారిన సీను చూసి నిర్ఘాంత పోతుంది. మళ్ళీ మునుపటి సీనే రిపీట్. విష్ణుమూర్తి అలానే పడుకునే ఉంటాడు. లక్ష్మీదేవి కాళ్ళు పడుతూనే వుంటుంది.

బాపూ రమణలు హాస్యస్పోరకంగా  సృష్టించిన విష్ణు మాయ ఇది.

సీను మారినట్టు అనిపిస్తుంది కానీ విషయం మారదు.  

22=11=2021

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

మీరు ఎంత నో అని చెప్పినా , మీ తక్కెడ ఒక పార్టీ వైపు కొంచెం మొగ్గుతుంది . అది ఎందుకో మీరు ఎప్పటికైనా చెప్తారేమో అని చిన్న ఆశ , ( కాదు పెద్ద ఆశ ) .