6, నవంబర్ 2021, శనివారం

ఇద్దరు స్నేహితుల హృదయావిష్కరణ – భండారు శ్రీనివాసరావుకొంత పరస్పర డబ్బా అనిపిస్తే తప్పుపట్టాల్సిన పని లేదు. కానీ ఈ ప్రోగ్రాం చేసిన జర్నలిస్ట్ ప్రేమకు అవేవీ పట్టవు. వాళ్ళ నాన్న జ్వాలాలాగే తాను అనుకున్నది అనుకున్నట్టు చేసుకుపోవడమే ఆమెకు తెలుసు.

ఒకరిని గురించి మరొకరు చెప్పడం ద్వారా ఇద్దరు స్నేహితులను పరిచయం చేయాలని అనుకున్నట్టుంది. అలాగే చేసింది. ఈ క్రమంలో కొందరికి  నేను పైన చెప్పిన మాట కొంత నిజమనిపించవచ్చు. చేయగలిగింది లేదు.

జ్వాలా, నాకు మధ్య ఉన్న స్నేహానికి షష్టిపూర్తి దాటింది. ఈ సందర్భంలో మా ఇద్దర్నీ కూర్చోబెట్టి ప్రేమ అనే ప్రేమమాలిని అనే బుంటీ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.

అదేమిటో విచిత్రం. ముసురుపట్టినట్టు ఈరోజు నా పోస్టులు అన్నీ వీడియోలే!   కామెంట్‌లు లేవు: