6, నవంబర్ 2021, శనివారం

రాయడం నాకో వ్యసనం ఓ వ్యాపకం - భండారు శ్రీనివాసరావు


కానీ ఆ రాసిన వాటిలో ఒకటి ఇలా నాలుగు చెరగులా పాకుతుందని అనుకోలేదు. మహా న్యూస్ ఎండీ శ్రీ వంశీ ఈరోజు అంటే శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు నన్ను స్టూడియోకి ఆహ్వానించి ఈ అంశంపైన గంట ప్రోగ్రాం చేశారు. అనేక వెబ్ ఛానల్స్ నా దగ్గర ఇంటర్వ్యూలు తీసుకున్నాయి. ఇవేమీ నాకు కొత్తకావు. కానీ నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వ్యాసాన్ని చదివి దానిమీద ఇంటర్వ్యూ చేయడం ఇదే మొదటిసారి. ఇది కేవలం నా వ్యాసానికి ప్రేరణ ఇచ్చిన జస్టిస్  చంద్రు గొప్పతనం. నాదేమీ లేదు.నిమిత్తమాత్రుడిని.

మహా  న్యూస్ ఛానల్. సుమన్ టీవీల యాజమాన్యాలకు కృతజ్ఞతలు.

కామెంట్‌లు లేవు: