6, అక్టోబర్ 2014, సోమవారం

ముఖ్యమంత్రి గారు ...నిన్న ఆదివారం 'ఈనాడు' చదివారా!


మంచి పనులు చేస్తున్న మంచి మనుషులను వెతుకుతూ దేశాలు తిరగనక్కరలేదు. 'ఈనాడు' యాజమాన్యం ప్రతి ఆదివారం ప్రచురించే 'చిన్న పుస్తకం'లో ఇలాటి పెద్ద మనసున్నవాళ్ళు ప్రతివారం కానవస్తారు.
నిన్న అక్టోబర్ ఐదో తేదీ ఈనాడు చిన్ని పుస్తకంలో 'పేద పిల్లలకోసం పబ్లిక్ స్కూలు' నడుపుతున్న నరేంద్ర మూర్తి గారిని గురించిన సచిత్ర కధనం ప్రచురించారు. అందరూ చదివే వుంటారు కనుక చదవని కొందరికోసం అందులోని విషయాలు కొద్ది కొద్దిగా.'పెళ్ళీ పిల్లలు ఈ వలయంలో చిక్కుకోవడం ఇష్టం లేని మూర్తిగారు, స్వామీ వివేకానంద నుంచి స్పూర్తి పొంది బ్రహ్మచారిగానే మిగిలిపోయారు. 1982లో హైదరాబాదులో ఓ మురికివాడ కాలనీ పిల్లలకోసం ఆయన నెలకొల్పిన   స్కూల్లోని విద్యార్ధులే ఆయన కుటుంబం. నయా పైసా అస్తి లేదు. సొంత ఇల్లు లేదు. పాఠశాలలోనే ఆయన తలదాచుకుంటారు. స్కూల్లో చదువుకునే వాళ్ళందరూ పేదవారి పిల్లలే.

ఆ స్కూల్లో ఫీజులు వుండవు. డొనేషన్లు వుండవు. రిజర్వేషన్లు వుండవు. పుస్తకాలనుంచి మధ్యాహ్న భోజనం  దాకా అన్నీ ఉచితమే. ఇంతవరకు ఒక్క పైసా కోసం కూడా ప్రభుత్వాల ముందు సాగిల పడలేదు.... ఆ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఆ బడిని ఓ గుడిలా చూసుకుంటారు. ఎందుకంటె వాళ్ళ తలితండ్రులు  నిరక్ష రాస్యులు. పొట్టకొస్తే అక్షరం ముక్క లేని వాళ్ళు. రోజు కూలీకి వెడితే కాని పొట్టగడవని పేదవాళ్ళు. చదువనేది పగటికలగా మిగిలిన వాళ్ళు. కాబట్టే తమకు అక్షర భిక్షపెట్టి ప్రయోజకులుగా చేస్తున్న ఆ బడి అంటే వాళ్ళకు అంత భక్తీ, గౌరవం....."     

4 వ్యాఖ్యలు:

sarma చెప్పారు...

ప్రభుత్వాలలో ఉన్న వారెవరికి ఇటువంటివి కనపడవండీ

అజ్ఞాత చెప్పారు...

pakkana most read gadget undhi.. danni maarchi.. most recent vi add cheyandi.. regular gaa visit chesthunna maaku convienent gaa untundhi...

భండారు శ్రీనివాసరావు చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ అజ్ఞాత: mee soochanaku dhanyavaadaalu. raasukutoo povadam tappite ee gadjets vagayiraa yemee teliyadu. ikkadaa aa vishayaalu telisina vaarini adigi meeradigina maarpu cheyadaaniki prayatnam chestaanu.(మీ సూచనకు ధన్యవాదాలు. రాసుకుంటూ పోవడం తప్పితే, ఈ గాడ్జేట్స్త్స్ వగైరా ఏమీ తెలియదు. ఇక్కడ ఆ విషయాలు తెలిసిన వారిని అడిగి మీరడిగిన మార్పు చేయడానికి ప్రయత్నం చేస్తాను. - భండారు శ్రీనివాసరావు