1, అక్టోబర్ 2014, బుధవారం

ఇదీ భారత్!అయినా 'మేరా భారత్ మహాన్'


ఇక్కడి రాజకీయ నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాలకోసం జనాలను విడతీయాలని చూస్తారు. టెర్రరిస్టులు మాత్రం తమ ఉగ్రవాద చర్యలతో  ప్రజలను సంఘటితం చేస్తారు.
వన్ వే (ఒకే వైపు వాహనాలు వెళ్ళడానికి అనుమతి వున్నదారి) దాటడానికి జనాలు రెండు వైపులా చూసుకుంటూ వెళ్ళాల్సిన పరిస్తితి ఈ దేశంలోనే కనిపిస్తుంది.
ఎవర్ని చూసినా ఏదో హడావిడిలో వున్నట్టు కనిపిస్తారు. కానీ చాలా తక్కువమందే ఆఫీసులకు సకాలంలో చేరుకుంటారు.
వచ్చీరాని ఇంగ్లీష్ లో మాట్లాడండి. అంతా గౌరవంగా చూస్తారు. మాతృభాషలో అనర్ఘలంగా మాట్లాడండి. ఎవ్వరూ పట్టించుకోరు.
ఈ దేశంలో ఎక్కువ మంది భగవద్గీత గురించీ, ఖురాన్ గురించీ చాలా తెలివైన వ్యాఖ్యానాలు చేస్తుంటారు. కానీ వారిలో చాలామంది ఆ రెండింటినీ ఏనాడు చదివిన పాపానపోయుండరు.
ఆడపిల్లల చదువుల మీద కంటే వారి పెళ్ళిళ్ళపై ఎక్కువ ఖర్చు చేసే తలితండ్రులు ఇక్కడే ఎక్కువ కానవస్తారు.
ఆడపిల్ల ఇంటికి దీపం అనే తియ్యటి మాటలు,  గుండెల మీద కుంపటి అనే శాపనార్ధాలు  ఒకే ఇంట్లో వినవచ్చే విచిత్రమైన సంస్కృతి ఇక్కడే కనిపిస్తుంది.
మనం వేసుకునే చెప్పుల్ని ఎయిర్ కండిషన్ షో రూముల్లో కొంటాం. తినే కూరగాయల్ని రోడ్డు పక్కన కొంటాం.
ఆఫీసులో బంట్రోతు ఉద్యోగం చేయడానికి కనీసం ఎనిమిదో తరగతి పాసయి వుండాలి.
దేశాన్ని పాలించే మంత్రులకు మాత్రం ఎలాటి విద్యార్హతలు అవసరం లేదు.
అయినా కానీ, ఇలాటి  అవలక్షణాలు ఎన్నివున్నాకానీ -
మేరా భారత్ మహాన్!


(ఇంగ్లీష్ మెయిల్ కు తెలుగు అనువాదం)
NOTE: Photo Courtesy Image Owner 

2 వ్యాఖ్యలు:

Unknown చెప్పారు...

మేరా భారత్ మహాన్! ఇండియా మెరిసిపోతూంది. సుమారు 90 సంవత్సరాలక్రితం కేథరిన్ మేయో అనే అమెరికన్ జర్నలిస్టు మదర్ ఇండియా అని పుస్తకం వ్రాసింది. ప్రపంచానికి ఒక మురుగు కాలువ అని ఇండియాను వర్ణించింది.భారతీయులు బ్రిటిష్ వారినుండి స్వాతంత్ర్యానికి తగరు అని తేల్చి చెప్పింది. సమస్యలన్నిటికీ మూలం హిందువులని రోగ నిర్ధ్హారణ చేసింది. గాంధీ గారు ఆ పుస్తకాన్ని డ్రెయినేజి పైపుల పరీక్షకురాలి రిపోర్టు అని ఎద్దేవా చేశారు. లజపతిరాయ్ వంటివారు అన్ హాపీ ఇండియా అని సమాధాన రూపమైన పుస్తకం వ్రాసి అమెరికాలో చీకటి కోణాల విషయాలు కూడా ప్రస్తావించారు. నా ఉద్దేశ్యం మీ వ్యాసంలోని పచ్చి నిజాలను ఖండించడం కాదు. చంద్రునికి కళలు ఉన్నట్లే మనదేశంలో అనేక వెలుగులూ, చీకట్లూ ఉన్నాయి. ఇద్దరు చాయివాలాలు దేశాన్ని పరిపాలిస్తున్నారు భారత్ ను మోదీ, తమిళనాడును పన్నీరుసెల్వం. కిలోమీటరుకు ఏడురూపాయల ఖర్చుతో (ఆటోరేటుకు సగంతో)శుక్రగ్రాహనికి మంగళయాన్ నడుపుతాం. ఆంధ్రరాజధానిని సింగపూరు చేస్తె, ముంబాయి, బందరు మధ్య సూయజ్ వంటి కాలువను తవ్వి హైదరాబాదును కూడా నౌకా కేంద్రంగా మరో సింగపూరుగా తీర్చి దిద్దుతాం. కాని ప్రైమరీ పాఠ శాలలు మాత్రం నడపలేం.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ vvs Sarma garu - ప్రైమరీ పాఠశాలలు మాత్రం నడపలేం. ఈ వాక్యం అర్ధవంతం సత్యవంతం.