ఇది ఇప్పటి మాట కాదు ఎప్పటి
మాటో.
పారిశ్రామికవేత్త
జె.ఎన్.టాటా ఓసారి జర్మనీ ప్రయాణం పెట్టుకున్నారు. ఓడలో ఫస్ట్ క్లాస్ క్యాబిన్.
ఆయనతో పాటు అనేక గోనే సంచులు. వాటిల్లో దేశంలో వివిధ ప్రాంతాలనుంచి సేకరించి
తెచ్చిన మట్టి. వాటిని జర్మనీలో శాస్త్రవేత్తలకు చూపించి ఇనుము లేదా ఇతర లోహాలు
వుంటే కనుగొని ఆయా ఖనిజాల తవ్వకం
చేపట్టాలన్నది టాటా మహాశయుల ప్రయత్నం.
అదే ఓడలో కింద భాగంలో స్వామీ
వివేకానంద వ్యక్తి ప్రయాణం చేస్తున్నారు.
ఆయన్ని గురించి అప్పటికే కర్ణాకర్ణిగా విన్న టాటా తనకు తానుగా వెళ్ళి స్వామిని
కలుసుకుని పరిచయం చేసుకున్నారు. మాటల్లో తన ప్రయాణం లక్ష్యాన్ని కూడా స్వామికి
వివరించారు.
స్వామి వెలిబుచ్చిన ఓ
అనుమానం టాటాని ఆలోచనలో పడవేసింది. దేశం నుంచి తీసుకు వెళ్ళిన మట్టి నమూనాల్లో
నిజంగా ఖనిజాలు వున్నట్టు కనుగొప్పటికీ, విదేశీ శాస్త్రవేత్తలు నిజాయితీగా ఆ విషయం
తెలియచెప్పకపోవచ్చన్నది స్వామికి కలిగిన సందేహం.
"ఒక పని చేయండి. భారత
దేశంలో మేధావులయిన యువకులకు కొదవ లేదు. దురదృష్టం ఏమిటంటే వారికి సరయిన అవకాశాలు
లేక వారి ప్రజ్ఞాపాటవాలన్నీ నివురుగప్పిన నిప్పులా వుండిపోతున్నాయి. మీరు దేశానికి
తిరిగివచ్చిన తరువాత మైసూరు మహారాజు చామరాజ వడయారును కలవండి. ఆయన బ్రిటిష్
పాలకులకి విధేయుడే. కానీ దేశం అంటే ప్రేమ కలిగినవాడు. చక్కటి పరిశోధనాసంస్థను
ఏర్పాటు చేయడంలో మీకు తోడ్పడుతాడు' అని సలహా ఇచ్చారు.
టాటా
జర్మనీ నుంచి తిరిగి వచ్చిన తరువాత స్వామి వివేకానంద సలహా ప్రకారం వెళ్ళి మైసూరు
మహారాజును కలుసుకున్నారు. పరిశోధనాసంస్థ ఏర్పాటు గురించిన తన ప్రతిపాదన గురించి
చెప్పారు. చామరాజ వడయార్ ఎలాటి సంకోచం వ్యక్తం చేయకుండా వెంటనే 370 ఎకరాల భూమిని సంస్థ
ఏర్పాటుకు కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చారు. అక్కడ ఆవిధంగా ఏర్పాటయిందే దేశంలో తొలి పరిశోధనాసంస్థ
- "The Indian Institute Of
Science". మహానీయుల సంకల్పబలం ఆవిధంగా
వుంటుంది.
1 కామెంట్:
Post baagundi.
కామెంట్‌ను పోస్ట్ చేయండి