ఏకాంబరం ఆఫీసులో వున్నప్పుడు సెల్ మోగింది.
'ఏమండీ ఏకాంబరం గారేనా మాట్లాడేది' ఒక ఆడ గొంతు
పలకరించింది.
'అవునండీ. ఇంతకీ ఎవరండీ మీరు' ఏకాంబరం ఆసక్తిగా
అడిగాడు.
'నా పిల్లల్లో ఒకరి తండ్రి మీరు. అని మా రికార్డుల్లో
వుంది. అతడి విషయం చెప్పడానికే ఫోను చేస్తున్నాను'
ఏకాంబరం గుండెల్లో పిడుగు పడింది. 'ఒక్క నిమిషం'
అంటూ ఆఫీసు బయటకు వచ్చి అడిగాడు.
'మీరు వాసంతి కాదుకదా'
'-----------'
'అయితే తప్పకుండా మాధురి అయివుంటారు'
'నాపేరు అది కాదండీ, నేను మీ అబ్బాయి ...'
'ఆగండాగండి కొంపతీసి మీరు వైజాగులో మేమున్నప్పుడు
మా పక్కింట్లో వున్న వరూధిని అయి వుంటారు'
'కాదు కాదు నేను..'
'ఇప్పుడు గుర్తొస్తోంది. ఢిల్లీ టూరు మీద
వచ్చినప్పుడు హోటల్లో పరిచయమైంది - ఆ ఆ - వైదేహి కదా మీ పేరు'
'నాపేరు వైదేహి కాదు, వరూధిని కాదు, మాధురి
వాసంతిని అంతకన్నా కాదు. నేను మీ అబ్బాయి క్లాసు టీచర్ని. క్లాసులోవున్న నలభై
మందిలో మీ వాడొక్కడే అన్నిట్లో సున్నా. ఒకసారి స్కూలుకు రండి మాట్లాడాలి'
(నెట్లో ఒక మిత్రుడు పోస్ట్ చేసిన ఇంగ్లీష్ జోక్కి
స్వేచ్చానువాదం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి