వాన రాకడ ప్రాణం పోకడ తెలియవని సామెత.
గవర్నమెంటు ఆఫీసుల్లో సిబ్బంది రావడానికీ, తిరిగి
ఇళ్ళకు పోవడానికీ నియమిత సమయాలు వుంటాయి. రావడం సంగతి వాళ్ళ ఇష్టం కానీ పోవడం
మాత్రం ఠంచనుగా టైముకే అని గిట్టని వాళ్ళు అంటుంటారు. కరెంటు కోతల విషయంలో ఇది తిరగబడ్డట్టు
వుంది. తీయడం మాత్రం ఒక నిమిషం అటూఇటూ కాకుండా తీస్తారు. తిరిగి ఇవ్వడం మాత్రం
వాళ్ళ దయా మన ప్రాప్తం.
2 కామెంట్‌లు:
పంక్చుయాలిటీ మీద నేను ఎప్పుడో విన్న ఒక జోక్ గుర్తొస్తోంది.
ఆఫీసుకి ఆలస్యంగా వచ్చి, టైముకి వెళ్ళిపోయే అలవాటున్న ఉద్యోగిని చివరికి నిలదీసి అడుగుతారు.
"ఆలస్యంగా ఎందుకు వస్తున్నావు?"
జవాబు :- "నిదానమే ప్రధానం" అని పెద్దలు చెప్పారండి.
"మరి సాయంత్రం ఠంచనుగా ఎందుకు వెళ్ళిపోతున్నావు?"
జవాబు :- "ఆలస్యం అమృతం విషం" అని కూడా చెప్పారు కదండీ.
మీరన్నట్లు కరెంటు కోత విషయంలో ఇది రివర్సే.
Atleast one way he / she is punctual... Please understand sir... haha ha ha haa....
కామెంట్‌ను పోస్ట్ చేయండి