7, డిసెంబర్ 2013, శనివారం

నవ్వుకు దిష్టి తగిలింది


నిన్న కాక మొన్న ఏవీఎస్
మళ్ళీ ఈరోజు ధర్మవరపు సుబ్రహ్మణ్యం
ఇలాటి నవ్వులరేడులు అందరూ నవ్వుల్ని మనకు వొదిలేసి నవ్వుకుంటూ అలా వెళ్ళిపోతున్నారు. ఇదొక విషాదం.


సుబ్రహ్మణ్యం గారు తెలియనివాళ్ళు వుండరు. కానీ ఆయనతో మా పరిచయం యెలా జరిగిందో గుర్తులేదు కానీ ఆ పరిచయం అలా పెరిగిపోయి మా కుటుంబాల్లో అందరికీ గుర్తుండి పోయింది. నేనూ జ్వాలా ఆయనతో చేసిన అసంఖ్యాక ‘సాయంకాలక్షేపాలు’ ఇంకా కళ్ళల్లో సుడులు తిరుగుతూనే వున్నాయి. ఆయన సినిమాల్లో చూపించిన హాస్యం చూసి జనమంతా కడుపుబ్బానవ్వుకున్నారు. కానీ హాస్య నటులు తెర మీదే కాదు నలుగురితో కూర్చున్నప్పుడు కూడా నవ్వుల పువ్వులు పూయించగలరని జంధ్యాల, ధర్మవరపు నిరూపించారు.
ఇంత చిన్న వయస్సులోనే అంతటి నవ్వుల చక్రవర్తులు అందరినుంచి సెలవు తీసుకుంటూ వున్నారంటే ఎక్కడో ఏ లోకంలోనో నవ్వులు తక్కువయ్యాయని అనుకోవాలి. అందుకే కాబోలు ఈ అర్ధాంతర, హడావుడి ప్రయాణాలు.
మిత్రుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి నా శ్రద్ధాంజలి
(07-12-2013)

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Yes, I too feel the same, sorry for the death of those good actors who entertained us through these years.

I am afraid as always end of an year takes with it many celebrities and still 25 more days to go.......

May his soul rest in peace!

Saahitya Abhimaani చెప్పారు...

మీ పోస్ట్ చూడంగానే కళ్ళంబడి నీళ్ళు వచ్చేశాయి. అద్భుతమైన నటుడు. ఎంతటి "ఈజ్" తో నటిస్తాడు ఈయన. మహానటులని రకరకాల బిరుదులు తగిలించుకున్న కొమ్ములు తిరిగాయని అనుకుంటున్న వాళ్ళు కూడా ఈయన దగ్గర నటన విషయంలో నేర్చుకోవాలిసినది ఎంతో ఉన్నది. ధర్మవరపు సుబ్రహ్మణ్యంగారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. వారి ఆత్మకు శాంతి కలుగుగాక.

మీరు వ్రాసినట్టుగా తెలుగు నవ్వుకు దిష్టి తగిలింది.