25, డిసెంబర్ 2012, మంగళవారం

లయ సుమాలులయ సుమాలుదీపము వలసిందెప్పుడు
తిమిరమునందే
విజ్ఞాని ముందు నిలచిన
అజ్ఞాని నోరు బందే

కలలు పొర్లు కనులు నడుపు
కాలు ముళ్లమీదే
తలలు మార్చువాని సలహా
మంచికెపుడు కాదే

ఇత్తడి బంగారమనే
వానిదె ఈ లోకం
పుత్తడి పూర్ణల బ్రతుకె  
రిత్త కడుపు శోకం

-కీర్తిశేషులు భండారు పర్వతాలరావు (ఫిబ్రవరి,1956)

కామెంట్‌లు లేవు: