29, డిసెంబర్ 2012, శనివారం

లక్ష’వొత్తుల’ నోముకు సహకరించిన అందరికీ ధన్యవాదాలులక్ష’వొత్తుల’ నోముకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు‘భండారు శ్రీనివాసరావు వార్తా వ్యాఖ్య’ అనే ఈ తెలుగు బ్లాగు నేను మొదలు పెట్టినప్పటినుంచి నన్ను ఆదరించి ‘లక్ష వొత్తుల నోము’ (ONE LAKH HITS) పూర్తిచేసుకోవడానికి సహకరించిన మీ అందరికీ  కోటి కోట్ల వందనాలు- అభివందనాలు. అభివందన చందనాలు.
ఈ లక్ష్యం నెరవేరడానికి  కొత్త సంవత్సరం  2013   వరకూ వేచి చూడాల్సివస్తుందేమో అని అనుకున్న మాట కూడా  నిజమే. కానీ, ఆ ఘడియ ఇంకా కొన్ని రోజులు  మిగిలి వుండగానే నేను ఎదురు చూసిన ఆ క్షణం దగ్గర పడడం కేవలం మీ అభిమానం.  ఆదరణ.  అందుకు లేదు సందేహం.
అందుకే,  ఒక్కొక్కరికీ పేరుపేరునా నా ధన్యవాదాలు.
సదసద్విమర్శలతో నన్ను మంచి బాటలో పెట్టిన వారికీ, ప్రోత్సహించి ముందుకు నడిపించినవారికీ ‘ఈ లక్షవొత్తుల నోము’ ఫలితం లభించాలని మనసారా కోరుకుంటూ – నూతన సంవత్సర శుభాకాంక్షలతో – భండారు శ్రీనివాసరావు (29-12-2012)                   

2 కామెంట్‌లు:

durgeswara చెప్పారు...

అభినందనలు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@durgeswara - ధన్యవాదాలు